4 కళ్ల నల్లని చారల చేప... చూసేందుకు జనం పరుగులు! | Suckermouth Catfish Found From A River In Bihar | Sakshi
Sakshi News home page

వింత చేపను చూసేందుకు జనం పరుగులు

Published Mon, Sep 11 2023 11:34 AM | Last Updated on Mon, Sep 11 2023 11:54 AM

suckermouth catfish found from a river - Sakshi

బీహార్‌లోని బెతియా జిల్లాలో మత్స్యకారుల వలకు విచిత్రమైన చేప చిక్కింది. ఆ చేపను చూసేందుకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. బెతియా జిల్లాలలోని లాకఢ్‌ గ్రామంలోని మత్స్యకారుల చేతికి ఈ చేప చిక్కింది. గ్రామానికి సమీపంలో ప్రవహిస్తున్న నదిలో వల వేసినప్పుడు వారికి ఈ చేప చిక్కింది. తొలిసారి చూసినప్పుడు ఈ చేప విమానం మాదిరిగా కనిపిస్తుంది. ఈ చేప నల్లని చారలను కలిగివుంది. దానికి నాలుగు కళ్లు ఉన్నాయి. ఈ చేపను సకెర్‌మౌత్‌ క్యాట్‌ఫిష్‌ అని అంటారు. ఈ తరహా చేపలు సాధారణంగా అమెరికాలో ప్రవహించే నదులలో కనిపిస్తాయి. 

వింతగా కనిపిస్తున్న ఈ చేపను చూసేందుకు సమీపగ్రామ ప్రజలు తరలివస్తున్నారు. కాగా ఈ తరహా చేపలు ఇతర చేపల గుడ్లను తినేస్తుంటాయి. ఫలితంగా ఈ చేపలు ఇతర చేపల మనుగడకు ముప్పుగా భావిస్తున్నారు. గ్రామానికి చెందిన వీరేంద్ర చౌదరి ఇక్కడికి సమీపంలోని నదిలో ఇటువంటి రెండు చేపలను పట్టుకున్నారు. 

ఈ చేపలను వీరేంద్ర చౌదరి తన ఇంటిలో సురక్షితంగా ఉంచారు. ఈ విషయాన్ని స్థానికులు సంబంధిత అధికారులకు తెలియజేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఈ చేపను అందం కోసం జనం ఇంటిలోని ఫిఫ్‌ అక్వేరియంలలో ఉంచుతారు. అయితే ఎవరో ఇటువంటి చేపలను నదిలో విడిచిపెట్టి ఉంటారు. ఫలితంగా ఈ చేపలు మరింత వృద్ధి చెంది, గండక్‌, కోసీ గంగా నదులలో కనిపిస్తున్నాయి. అయితే నదిలో ఈ చేపలు ఉండటం పలు జలచరాలకు ముప్పు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రపతి సుప్రీంకోర్టు మెట్లు ఎందుకు ఎక్కారు? కేసు పూర్వపరాలేమిటి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement