ఉలవపాడుబీచ్‌కు కొట్టుకొచ్చిన బోటు | The boat was swept to the ulavapadu beach | Sakshi
Sakshi News home page

ఉలవపాడుబీచ్‌కు కొట్టుకొచ్చిన బోటు

Published Mon, Nov 9 2015 3:59 PM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM

The boat was swept to the ulavapadu beach

ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు బీచ్‌కు సోమవారం ఉదయం ఓ బోటు కొట్టుకు వచ్చింది. బోటుపై తమిళ అక్షరాలు ఉండటంతో తమిళనాడుకు చెందినదై ఉంటుందని భావిస్తున్నారు. తీరానికి బోటు వచ్చిన సమయానికి అందులో ఎవరూ లేరు. బోటును గమనించిన మత్స్యకారులు తీర ప్రాంత అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు బోటు ఎవరిదై ఉంటుంది.. బంగాళా ఖాతంలో నెలకొని ఉన్న పరిస్థితుల రీత్యా ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందా అనే కోణంలో విచారణ ప్రారంభించారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement