9 కిలోల ‘బంగారం’! | Mahabubabad Fisherman Caught 9Kg Goldfish | Sakshi
Sakshi News home page

9 కిలోల ‘బంగారం’!

Published Wed, Mar 3 2021 11:45 AM | Last Updated on Wed, Mar 3 2021 12:02 PM

Mahabubabad Fisherman Caught 9Kg Goldfish - Sakshi

కురవి: మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం తిర్మలాపురం గ్రామంలోని చెరువులో మంగళవారం మత్య్సకారులు చేపలు పట్టారు. ఈ సందర్భంగా ఓ మత్స్యకారుడి వలలో తొమ్మిది కేజీల బరువున్న బంగారు వర్ణంలోని చేప పడింది. బంగారు తీగ రకానికి చెందిన ఈ చేప పూర్తిగా బంగారం రంగులో మెరిసిపోతుండగా, అదే గ్రామానికి చెందిన కల్లెపు కృష్ణ దీన్ని కొనుగోలు చేశారు. ఈ రకానికి చెందిన చేపలు అక్కడక్కడా బంగారు రంగుతో ఉండడం సహజమే అయినా, ఈ చెరువులో ఇంత పెద్ద చేప లభించడం ఇదే మొదటిసారని జాలరులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement