Goldfish
-
12 కిలోల ‘బంగారు’ తీగ
కాజీపేట: వరంగల్ నగరం కాజీపేట 62వ డివిజన్ సోమిడి శివారులోని మాటు చెరువులో 12 కిలోలకు పైగా బరువు ఉన్న బంగారు తీగ చేప దొరికింది. సోమవారం ఉదయం మత్స్యకారులు చేపలు పడుతుండగా అధిక బరువు, కడుపు నిండా చెనతో ఉన్న ఈ బంగారు తీగ వలకు చిక్కింది. ఈ చేపను సంఘం అధ్యక్షుడు రఘురాంతోపాటు సభ్యులు పంచుకున్నారు. ఇంతపెద్ద చేప వలలో పడడం ఇది మొదటిసారి అని మత్స్యకారులు తెలిపారు. -
ఇదెక్కడి విచిత్రం..! అలవోకగా కారును నడిపేస్తోన్న చేప..!
అవును..! మీరు చూసింది..నిజమే..! అలవోకగా ఒక గోల్డ్‌ఫిష్ కారును పద్దతిగా నడిపింది. అయితే ఇక్కడ నడిపింది మాత్రం నిజమైనా కారు కాదండోయ్..! అది ఒక రోబోటిక్ కారు..! అసలు నీటిలో ఉండే చేప ఈ రోబోటిక్ కారును ఎలా నడిపిందంనే విషయాల గురించి తెలుసుకుందాం..! జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేయడంలో భాగంగా ఇజ్రాయెల్‌లో నెగెవ్‌లోని బెన్ గురియన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గోల్డ్‌ఫిష్ సహాయంతో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందుకోసం ప్రత్యేకంగా రోబోటిక్ కారును రూపొందించారు. ఈ రోబోటిక్ కారుకు ఫిష్ ఆపరేటెడ్ వెహికల్(FOV)ను ఏర్పాటు చేశారు. ఈ రోబోటిక్ కారు ప్లాట్‌ఫాంపై వాటర్‌ట్యాంక్‌ను ఏర్పాటుచేయగా...ట్యాంక్‌లోని గోల్డ్ ఫిష్ కదలికల ఆధారంగా కారు ముందుకు, వెనక్కి కదిలింది. ఈ ప్రయోగంలో భాగంగా గోల్డ్ ఫిష్ నావిగేషన్ సామర్థ్యాలను, జంతువుల ప్రవర్తనను ఈ ప్రయోగంతో శాస్త్రవేత్తలు గ్రహించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన విషయాలను గత నెలలో బిహేవియరల్ బ్రెయిన్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురించారు. గోల్డ్ ఫిష్ నావిగేట్ చేస్తోన్న వీడియో బెన్-గురియన్ యూనివర్సిటీ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. లక్ష్యం అదే..! జీవావరణంలో వివిధ జాతులు మెదడు నిర్మాణంతో సంబంధం లేకుండా జంతు రాజ్యంలో అన్నింటీకి సార్వత్రిక లక్షణాలు ఉన్నాయనే విషయాన్ని అన్వేషించడానికి శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. గోల్డ్‌ఫిష్ నావిగేషన్ ఎబిలిటీస్‌లో తన సామర్థ్యాలను శాస్త్రవేత్తలు గుర్తించడానికి చాలా సులువైంది. కాగా నావిగేషన్ సామర్థ్యాలను, ఇతర అంశాలను మరింత స్టడీ చేసేందుకుగాను గోల్డ్ ఫిష్కి మరికొన్ని రోజుల శిక్షణను ఇవ్వనున్నారు. చదవండి: అశ్లీల, మార్ఫింగ్ వీడియోల కథ కంచికి! ఇకపై అలాంటివి చూడలేరు -
ఇలాంటి చేపను ఎప్పుడైనా చూశారా..?
బైరెడ్డిపల్లె (చిత్తూరు జిల్లా): బంగారు వర్ణంలో నిగనిగా మెరిసే చేప చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లె మండలంలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మండలంలోని లక్కనపల్లె చెరువుకు వస్తోన్న వరదనీటికి చేపలు ఎదురీదుతుండగా స్థానికులు గుర్తించి వలవిసిరారు. అందులో 7 కిలోల బరువున్న బంగారు తీగ జాతికి చెందిన చేప చిక్కింది. ఇది పేరుకు తగ్గట్టు బంగారు వర్ణంలో ఉండడంతో స్థానికులు ఆసక్తిగా గమనించారు. ఇవీ చదవండి: రుషికొండ తీరంలో డాల్ఫిన్ల సందడి ఆధిపత్య పోరు: ‘టీడీపీ’లో ‘పిల్లి’ మొగ్గలు -
9 కిలోల ‘బంగారం’!
కురవి: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తిర్మలాపురం గ్రామంలోని చెరువులో మంగళవారం మత్య్సకారులు చేపలు పట్టారు. ఈ సందర్భంగా ఓ మత్స్యకారుడి వలలో తొమ్మిది కేజీల బరువున్న బంగారు వర్ణంలోని చేప పడింది. బంగారు తీగ రకానికి చెందిన ఈ చేప పూర్తిగా బంగారం రంగులో మెరిసిపోతుండగా, అదే గ్రామానికి చెందిన కల్లెపు కృష్ణ దీన్ని కొనుగోలు చేశారు. ఈ రకానికి చెందిన చేపలు అక్కడక్కడా బంగారు రంగుతో ఉండడం సహజమే అయినా, ఈ చెరువులో ఇంత పెద్ద చేప లభించడం ఇదే మొదటిసారని జాలరులు తెలిపారు. -
చిన్నారి చేతికి చిక్కిన భారీ బంగారు చేప!
పదేళ్ల పాప భారీ పసిడి చేపను ఒడిసి పట్టింది. అంతేకాదు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌కు చెందిన లొయిస్ చివలర్స్(10) అనే బాలిక యూకేలో అతిపెద్ద బంగారు చేప(గోల్డ్ ఫిష్)ను పట్టిన చిన్నారిగా ఘనత కెక్కింది. డాజెన్హామ్లోని ఛేజ్ లేక్స్‌లో 2.4 కిలోల బరువు, 13 అంగుళాల పొడవున్న బంగారు చేపను ఆమె పట్టింది. తండ్రితో కలిసి చేపలు పట్టడానికి వెళ్లి ఏకంగా రికార్డు సృష్టించింది. 2010లో డొర్సెట్లోని పూలె లేక్‌లో స్కూల్ పిల్లాడు నిక్ రిచర్డ్స్ సృష్టించిన రికార్డును లొయిస్ బద్దలు కొట్టింది. దాదాపు కిలోన్నర బరువున్న బంగారు చేపను పట్టి అప్పట్లో రిచర్డ్స్ రికార్డు సృష్టించాడు. లొయిస్ నాలుగేళ్ల వయసు నుంచే చేపలు పట్టడం నేర్చుకుంది. గతంలో ఓసారి ఆమె రెండు కిలోల చేపను పట్టుకుంది. తాజాగా యూకేలో అతిపెద్ద బంగారు చేపను పట్టి రికార్డుకెక్కింది. చేప బరువు తూచి, దాంతో ఫొటోలు తీసుకున్న తర్వాత గోల్డ్ ఫిష్‌ను మళ్లీ కొలనులో వదిలేసింది. లొయిస్ తండ్రి గ్యారీ కూడా 14 కిలోల బరువున్న చేపను పట్టి తన రికార్డును మరింత మెరుగు పరుచుకున్నాడు. తాము ఇంటికి తిరిగొచ్చిన తర్వాతే లొయిస్ రికార్డు గురించి తెలిసిందని గ్యారీ సంతోషంగా చెప్పారు. చేపలు పట్టడమంటే తన కూతురికి ఎంతో ఇష్టమని తెలిపారు. సాధారణంగా గోల్డ్ ఫిష్‌లను ఇళ్లలోని అక్వేరియం, గార్డన్ పాండ్స్‌లో పెంచుతుంటారు. గండు చేప జాతిలో తక్కువ సంఖ్యలో ఉండే గోల్డ్ ఫిష్‌ను లాటిన్లో 'కారాసియస్ అరాటస్ అరాటస్'గా పేర్కొంటారు. బంగారు చేప 2 నుంచి 18 అంగులాల వరకు పెరుగుతుంది. 40 ఏళ్ల వరకు జీవిస్తుంది. -
ఆల్కహాల్ వల్లే మనుగడ
లండన్: గడ్డ కట్టిన నదుల్లో గోల్డ్ ఫిష్ ఏ విధంగా మను గడ సాధిస్తోందన్న ప్రశ్నకు యూనివర్సిటీ ఆఫ్ ఓస్లో, యూనివర్సిటీ ఆఫ్ లివర్ పూల్ శాస్త్రవేత్తల బృందం సమాధానం కనుగొంది. సాధారణంగా గడ్డ కట్టిన నదుల్లో ఆక్సిజన్ లభించకపోవటం వల్ల వెన్నెముక గల జీవాలు వెంటనే మరణిస్తాయి. కానీ గోల్డ్ ఫిష్, క్రూసియన్ కార్ప్ చేపలు మాత్రం 5 నెలలు జీవి స్తాయి. గోల్డ్ ఫిష్, క్రూసియన్ కార్ప్ శరీరంలో రెండు సెట్ల ఎంజైములు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మొదటి ఎంజైమ్ ఇతర జీవుల్లో పనిచేసే మాదిరిగానే పనిచేస్తుంది. రెండో సెట్ మాత్రం ఆక్సిజన్ లేనప్పుడు లాక్టిక్ యాసిడ్‌ను ఇథనాల్‌గా మార్చి మొప్పలు ద్వారా బయటకు పంపుతా యి. ఇలా చేయటం వల్ల వాటి శరీరంలో లాక్టిక్ యాసిడ్ అధికంగా ఉత్పత్తి కాకుండా ఉంటుంది. ఇది 80లక్షల ఏళ్ల క్రితమే గోల్డ్ ఫిష్‌లో చోటు చేసుకుంది. -
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ @ 250 డాలర్లు..
సాధారణంగా మన ఇళ్లలో పెంచుకుంటున్న పెంపుడు జంతువులను మన ఇంటి మనుషుల్లాగే ప్రేమిస్తాం.. వాటికేమైనా జబ్బు చేస్తే మన సొంత పిల్లలకు రోగం చేసినంతగా బాధ పడుతాం.. వెంటనే వాటిని చికిత్స కోసం వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం.. సరిగ్గా అలాగే చేసింది ఇంగ్లండ్‌లోని ఓ కుటుంబం.. అయితే ఇక్కడ జబ్బు చేసింది ఏ కుక్కకో.. పిల్లికో అయితే కాదు... ఒక బంగారు చేప (గోల్డ్ ఫిష్)కు. ఆ గోల్డ్ ఫిష్ వయసు 20 ఏళ్లు. దాని శరీరం లోపలఒక ట్యూమర్ (గడ్డ) ఉన్నట్లు సదరు కుటుంబం గమనించింది. వెంటనే ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఫాయే బేతేల్ వద్దకు తీసుకెళ్లారు. సుమారు 30 నిమిషాల పాటు డాక్టర్ సర్జరీ నిర్వహించి అతి కష్టం మీద ఆ ట్యూమర్‌ను వెలికి తీసి ఆ చేపను కాపాడారు. చేపకు అనస్థీసియా ఇచ్చి శస్త్ర చికిత్స నిర్వహించినట్లు ఆపరేషన్ అనంతరం డాక్టర్ చెప్పారు. చేప ఎంతో చిన్నది కావడంతో ఆపరేషన్ చేయడం ఎంతో కష్టతరమైందని ఆమె తెలిపారు. ప్రస్తుతం చేప ఆరోగ్యం నిలకడగా ఉందని, తన ఇంట్లో ఆనందంగా ఈత కొడుతోందని పేర్కొన్నారు. ఆ చేప వయసు ఆ యజమాని పిల్లల వయసు కంటే ఎక్కువ కావడం గమనార్హం. అందుకే ఆ చేప అంటే ఆ యజమానికి ఎనలేని ప్రేమ.. ఇంతకీ ఆ ఆపరేషన్‌కు అయిన ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల రెండు వందల యాభై డాలర్లు(సుమారు రూ. 17 వేలు). -
చేప మింగి.. ఫైన్ కక్కాడు!
లండన్: గోల్డ్‌ఫిష్ (ఓ రకమైన చిన్న చేప)ను మింగినందుకు అలెగ్జాండర్ మాకీ(21) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు లండన్ కోర్టు జరిమానా విధించింది. గతేడాది అక్టోబర్‌లో టావిస్టాక్ జరిగిన గూస్ ఫెయిర్ ఓ పోటీలో విజేతగా నిలిచిన గోల్డ్‌ఫిష్‌ను మాకీ చప్పున మింగేశాడు. ఆ దృశ్యాన్ని రికార్డు చేసిన వీడియో ఫేస్బుక్లో ఇటీవల ప్రత్యక్షమైంది. ఈ ఉదంతంపై ‘రాయల్ సొసైటీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ’(ఆర్ఎస్పీసీఏ) బ్రిటిష్ కోర్టులో ఫిర్యాదు చేసింది. అతని కడుపులోనే ఆ చేప ఊపిరాడక చనిపోయినట్లు ఆర్ఎస్పీసీఏ తన నివేదికలో కోర్టుకు తెలిపింది. విచారణ జరిపిన కోర్టు మాకీకు 752 పౌండ్లు(సుమారు రూ.75వేలు) జరిమానా విధించి. అంతేకాకకుండా అతడు ఐదేళ్లు తన వద్ద చేపలు ఉంచుకోకుండా నిషేధం విధించింది.