ఆల్కహాల్ వల్లే మనుగడ
లండన్: గడ్డ కట్టిన నదుల్లో గోల్డ్ ఫిష్ ఏ విధంగా మను గడ సాధిస్తోందన్న ప్రశ్నకు యూనివర్సిటీ ఆఫ్ ఓస్లో, యూనివర్సిటీ ఆఫ్ లివర్ పూల్ శాస్త్రవేత్తల బృందం సమాధానం కనుగొంది. సాధారణంగా గడ్డ కట్టిన నదుల్లో ఆక్సిజన్ లభించకపోవటం వల్ల వెన్నెముక గల జీవాలు వెంటనే మరణిస్తాయి. కానీ గోల్డ్ ఫిష్, క్రూసియన్ కార్ప్ చేపలు మాత్రం 5 నెలలు జీవి స్తాయి. గోల్డ్ ఫిష్, క్రూసియన్ కార్ప్ శరీరంలో రెండు సెట్ల ఎంజైములు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మొదటి ఎంజైమ్ ఇతర జీవుల్లో పనిచేసే మాదిరిగానే పనిచేస్తుంది.
రెండో సెట్ మాత్రం ఆక్సిజన్ లేనప్పుడు లాక్టిక్ యాసిడ్‌ను ఇథనాల్‌గా మార్చి మొప్పలు ద్వారా బయటకు పంపుతా యి. ఇలా చేయటం వల్ల వాటి శరీరంలో లాక్టిక్ యాసిడ్ అధికంగా ఉత్పత్తి కాకుండా ఉంటుంది. ఇది 80లక్షల ఏళ్ల క్రితమే గోల్డ్ ఫిష్‌లో చోటు చేసుకుంది.