
కాజీపేట: వరంగల్ నగరం కాజీపేట 62వ డివిజన్ సోమిడి శివారులోని మాటు చెరువులో 12 కిలోలకు పైగా బరువు ఉన్న బంగారు తీగ చేప దొరికింది. సోమవారం ఉదయం మత్స్యకారులు చేపలు పడుతుండగా అధిక బరువు, కడుపు నిండా చెనతో ఉన్న ఈ బంగారు తీగ వలకు చిక్కింది. ఈ చేపను సంఘం అధ్యక్షుడు రఘురాంతోపాటు సభ్యులు పంచుకున్నారు. ఇంతపెద్ద చేప వలలో పడడం ఇది మొదటిసారి అని మత్స్యకారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment