ఇదెక్కడి విచిత్రం..! అలవోకగా కారును నడిపేస్తోన్న చేప..! | Scientists Teach Goldfish How To Drive Robotic Car To Study Navigational Abilities | Sakshi
Sakshi News home page

ఇదెక్కడి విచిత్రం..! అలవోకగా కారును నడిపేస్తోన్న చేప..!

Published Thu, Jan 13 2022 6:21 PM | Last Updated on Thu, Jan 13 2022 6:46 PM

Scientists Teach Goldfish How To Drive Robotic Car To Study Navigational Abilities - Sakshi

అవును..! మీరు చూసింది..నిజమే..! అలవోకగా ఒక గోల్డ్‌ఫిష్‌ కారును పద్దతిగా నడిపింది. అయితే ఇక్కడ నడిపింది మాత్రం నిజమైనా కారు కాదండోయ్‌..! అది ఒక రోబోటిక్‌ కారు..! అసలు నీటిలో ఉండే చేప ఈ రోబోటిక్‌ కారును ఎలా నడిపిందంనే విషయాల గురించి తెలుసుకుందాం..!

జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేయడంలో భాగంగా ఇజ్రాయెల్‌లో నెగెవ్‌లోని బెన్‌ గురియన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గోల్డ్‌ఫిష్‌ సహాయంతో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.  ఇందుకోసం ప్రత్యేకంగా రోబోటిక్ కారును రూపొందించారు. ఈ రోబోటిక్‌ కారుకు ఫిష్‌ ఆపరేటెడ్‌ వెహికల్‌(FOV)ను ఏర్పాటు చేశారు. ఈ రోబోటిక్‌ కారు ప్లాట్‌ఫాంపై వాటర్‌ట్యాంక్‌ను ఏర్పాటుచేయగా...ట్యాంక్‌లోని గోల్డ్ ఫిష్ కదలికల ఆధారంగా కారు ముందుకు, వెనక్కి కదిలింది. ఈ ప్రయోగంలో భాగంగా గోల్డ్‌ ఫిష్‌ నావిగేషన్‌ సామర్థ్యాలను, జంతువుల ప్రవర్తనను ఈ ప్రయోగంతో శాస్త్రవేత్తలు గ్రహించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన విషయాలను గత నెలలో బిహేవియరల్ బ్రెయిన్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురించారు. గోల్డ్ ఫిష్ నావిగేట్ చేస్తోన్న వీడియో బెన్-గురియన్ యూనివర్సిటీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. 

లక్ష్యం అదే..!
జీవావరణంలో వివిధ జాతులు మెదడు నిర్మాణంతో సంబంధం లేకుండా జంతు రాజ్యంలో అన్నింటీకి సార్వత్రిక లక్షణాలు ఉన్నాయనే విషయాన్ని అన్వేషించడానికి శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. గోల్డ్‌ఫిష్‌ నావిగేషన్‌ ఎబిలిటీస్‌లో తన సామర్థ్యాలను శాస్త్రవేత్తలు గుర్తించడానికి చాలా సులువైంది. కాగా నావిగేషన్‌ సామర్థ్యాలను, ఇతర అంశాలను మరింత స్టడీ చేసేందుకుగాను గోల్డ్ ఫిష్‌కి మరికొన్ని రోజుల శిక్షణను ఇవ్వనున్నారు. 



చదవండి: అశ్లీల, మార్ఫింగ్‌ వీడియోల కథ కంచికి! ఇకపై అలాంటివి చూడలేరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement