
కొంతమంది చేసే పనులు అత్యంత హేయమైనవిగా ఉంటాయి. అసలు స్వతహాగా వాళ్లు మంచి వాళ్లైనప్పటికీ వారి జోలికి వచ్చిన లేక వారి సంబంధించిన వస్తువులు పోయినప్పుడు అపరిచితుడిలా మారిపోయి అత్యంత ధారుణానికి వడిగడుతుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ఎంత ధారుణమైన పని చేశాడో చూడండి.
(చదవండి: పారా సెయిలింగ్ మళ్లీ ఫెయిల్ !... ఇద్దరు మహిళలకు చేదు అనుభవం!!)
అసలు విషయంలోకెళ్లితే....మొబైల్ ఫోన్ దొంగిలించాడనే ఆరోపణతో ఒక మత్స్యకారుడిని తోటి మత్స్యకారుల బృందం చేపల వేట బోటుకు తలకిందులుగా వేలాడదీసి దాడి చేసింది. అయితే ఈ ఘటన బందూర్‌లోని మంగళూరు ఫిషింగ్ హార్బర్‌లో లంగరు వేసిన ఫిషింగ్ బోట్‌లో చోటు చేసుకుంది. అంతేకాదు దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తిపై మత్స్యకారుల బృందం దాడి చేసిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పైగా మత్స్యకారులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు సెల్‌ఫోన్‌ను దొంగిలించాడనే ఆరోపణతో దాడి చేసిన మత్స్యకారుడిని వైలా శీనుగా గుర్తించి అరెస్టు చేశాం అని చెప్పారు. అతేకాదు ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
(చదవండి: పంజాబ్ కోర్టు కాంప్లెక్స్‌లో పేలుడు)
Comments
Please login to add a commentAdd a comment