కార్న్వాల్: సాధారణంగా జాలర్లు సముద్రంలో వేటకు వెళ్తుంటారు. ఒక్కోసారి వారి వలకు అరుదైన జీవులు చిక్కుకుంటాయి. అలాంటి సంఘటన జరిగినప్పుడు జాలరులు చాలా అదృష్టంగా భావిస్తారు. ఒకవేళ అలాంటి జీవులు వారి వలలో చిక్కుకుంటే ఆ వేటగాడి ఆనందానికి అవధులే ఉండవు. అయితే, ఇలాంటి ఘటనే కార్న్వాల్ సముద్ర తీరం వెంబడి ఉన్న సముద్రంలో చోటుచేసుకుంది. డైలీ మెయిల్ రిపోర్ట్ ప్రకారం, 25 ఏళ్ల వయసున్న టామ్ ఒక రోజు లాంబోర్న్ తీరం వెంబడి సముద్రంలో వేటకోసం వెళ్లాడు.
రోజులాగే ఏదో చేపలో, రోయ్యలో.. ఏవో జీవులు పడతాయనుకున్నాడు టామ్. కానీ, ఆ రోజు టామ్ తనవలలో పడిన జీవిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ జీవిని అంతకు ముందేప్పుడు చూడలేదు. అదోపెద్ద ఎండ్రకాయ. నీలి రంగులో ఉంది. చాలా పెద్దదిగా కూడా ఉంది. కాసేపు దాన్ని పరీక్షగా చూశాడు. అయితే, ఇంటికి తీసుకెళ్లటానికి కుదరక పోవడంతో దాన్ని తిరిగి సముద్రంలో వదిలేయాలని టామ్ అనుకున్నాడు. నీటిలోకి ఎండ్రకాయను వదలే ముందు దాన్ని పట్టుకున్నట్లు గుర్తుగా కొన్ని ఫోటోలు తీసుకున్నాడు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఆ తర్వాత దాన్ని తిరిగి సముద్రంలోకి విడిచిపెట్టాశాడు.
అయితే, కొన్నిరోజులకు టామ్ ఈ ఫోటోలను కార్న్‌వాల్‌లోని నేషనల్ లోబ్ట్సర్ విభాగానికి పంపించాడు. ఈ చిత్రాలను చూసిన వారు ఇది చాలా అరుదైనదని, కొన్నిరకాల జన్యువైవిధ్యాల వలన భిన్న రంగులను కల్గిఉంటుందని తెలిపారు. సాధారణంగా 20 లక్షల జీవుల్లో ఒకటి మాత్రమే ఇలాంటి అరుదైన వైవిధ్యాన్ని కల్గి ఉంటుందని పేర్కొన్నారు. ఇది, దాని జీవితకాలమంతా పెరుగుతునే ఉంటుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment