మలేషియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఎంహెచ్ 370 విమానం 2014 మార్చి 8న మిస్సయ్యింది. ఆ విమానం ఆచూకీ కోసం గాలించినా... కనిపించకపోయేసరికి కూలిపోయిందనే నిర్ధారణకు వచ్చారు అధికారులు. ఐతే ఇప్పుడూ ఆ విమానం కూలిందా? ఉద్దేశ్వపూర్వకంగా కూల్చేశారా అను పలు అనుమానాలు తలెత్తేలా ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు ఆ విమానంలో సుమారు 239 మంది ప్రయాణికులతో మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తుండగా..ఆ విమానం ఆచూకీ కానరాకుండా పోయింది.
దీంతో అప్పటి నుంచి ఆ విమానం మిస్సింగ్ మిస్టరీని చేధించే పనిలో పడ్డారు నిపుణులు. ఆ విమానానికి సంబంధించిన శకలాలను వెతికే పలు ప్రయత్నాలు చేశారు. ఆ బోయింగ్ 777 విమానం శకలాలు మడగాస్కన్ మత్స్యకారులకు లభించాయి. 2017లో వచ్చిన ఉష్ణమండల తుపాను ఫెర్నాండో నేపథ్యంలో మడగాస్కన్ సముద్ర తీరానికి విమాన శకలాలు కొట్టుకు రావడంతో టాటాలీ అనే మత్స్యకారుడు ఆ శిధిలాల భాగాన్ని గుర్తించినట్లు బ్రిటిష్ ఇంజనీర్ రిచర్డ్ గ్రాండ్ ఫ్రే చెబుతున్నారు.
అతను నుంచి సేకరించిన శకలాల ఆధారంగా... ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని సముద్రంలోకి కూల్చివేసినట్లు విమాన శకలాలను గాలించే నిపుణుడు అమెరికన్ బ్లెయిన్ గిబ్సన్, బ్రిటిష్ ఇంజనీర్ రిచర్డ్ గాడ్ ఫ్రే చెబుతున్నారు. అందుకు సాక్ష్యం ఆ మత్స్యాకారుడి వద్ద ఉన్న ల్యాండింగ్ బోర్డు గేర్‌ని చూస్తే తెలుస్తుందంటున్నారు ఆ నిపుణులు. ఎందుకంటే క్రాష్ అయినప్పుడు.. విమానాన్ని వీలైనంతగా మునిగిపోయేలా చేసేలా.. ల్యాండింగ్ బోర్డు గేర్‌ని పొడిగించిన విధానమే అసలైన ఎవిడెన్స్ అని చెప్పారు.
ఎందుకంటే ల్యాండింగ్ సమయంలో ఏ పైలెట్ సాధారణంగా ల్యాండింగ్ గేర్‌ను తగ్గించరు. విమానం ముక్కలుగా విరిగిపోయే ప్రమాదం ఉండటమే గాక నీటిలో సులభంగా మునిగిపోతుంది. ప్రయాణికులు ఎవరు ప్రాణాలతో బయటపడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని నిపుణులు గిబ్సన్, ఇంజనీర్ రిచర్డ్ గాడ్ ఫ్రే చెబుతున్నారు.
(చదవండి: చైనాకు ఎదరు తిరిగితే అంతే...ఆ యువతి ఇంకా నిర్బంధంలోనే..)
Comments
Please login to add a commentAdd a comment