MH370 flight
-
ఎనిమిదేళ్ల నాటి విమానం మిస్సింగ్ మిస్టరీ.. కూలిందా? కూల్చారా!
మలేషియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఎంహెచ్ 370 విమానం 2014 మార్చి 8న మిస్సయ్యింది. ఆ విమానం ఆచూకీ కోసం గాలించినా... కనిపించకపోయేసరికి కూలిపోయిందనే నిర్ధారణకు వచ్చారు అధికారులు. ఐతే ఇప్పుడూ ఆ విమానం కూలిందా? ఉద్దేశ్వపూర్వకంగా కూల్చేశారా అను పలు అనుమానాలు తలెత్తేలా ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు ఆ విమానంలో సుమారు 239 మంది ప్రయాణికులతో మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తుండగా..ఆ విమానం ఆచూకీ కానరాకుండా పోయింది. దీంతో అప్పటి నుంచి ఆ విమానం మిస్సింగ్ మిస్టరీని చేధించే పనిలో పడ్డారు నిపుణులు. ఆ విమానానికి సంబంధించిన శకలాలను వెతికే పలు ప్రయత్నాలు చేశారు. ఆ బోయింగ్ 777 విమానం శకలాలు మడగాస్కన్ మత్స్యకారులకు లభించాయి. 2017లో వచ్చిన ఉష్ణమండల తుపాను ఫెర్నాండో నేపథ్యంలో మడగాస్కన్ సముద్ర తీరానికి విమాన శకలాలు కొట్టుకు రావడంతో టాటాలీ అనే మత్స్యకారుడు ఆ శిధిలాల భాగాన్ని గుర్తించినట్లు బ్రిటిష్ ఇంజనీర్ రిచర్డ్ గ్రాండ్ ఫ్రే చెబుతున్నారు. అతను నుంచి సేకరించిన శకలాల ఆధారంగా... ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని సముద్రంలోకి కూల్చివేసినట్లు విమాన శకలాలను గాలించే నిపుణుడు అమెరికన్ బ్లెయిన్ గిబ్సన్, బ్రిటిష్ ఇంజనీర్ రిచర్డ్ గాడ్ ఫ్రే చెబుతున్నారు. అందుకు సాక్ష్యం ఆ మత్స్యాకారుడి వద్ద ఉన్న ల్యాండింగ్ బోర్డు గేర్ని చూస్తే తెలుస్తుందంటున్నారు ఆ నిపుణులు. ఎందుకంటే క్రాష్ అయినప్పుడు.. విమానాన్ని వీలైనంతగా మునిగిపోయేలా చేసేలా.. ల్యాండింగ్ బోర్డు గేర్ని పొడిగించిన విధానమే అసలైన ఎవిడెన్స్ అని చెప్పారు. ఎందుకంటే ల్యాండింగ్ సమయంలో ఏ పైలెట్ సాధారణంగా ల్యాండింగ్ గేర్‌ను తగ్గించరు. విమానం ముక్కలుగా విరిగిపోయే ప్రమాదం ఉండటమే గాక నీటిలో సులభంగా మునిగిపోతుంది. ప్రయాణికులు ఎవరు ప్రాణాలతో బయటపడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని నిపుణులు గిబ్సన్, ఇంజనీర్ రిచర్డ్ గాడ్ ఫ్రే చెబుతున్నారు. (చదవండి: చైనాకు ఎదరు తిరిగితే అంతే...ఆ యువతి ఇంకా నిర్బంధంలోనే..) -
ఆ విమానం మిస్సింగ్.. పెద్ద మిస్టరీ
కాన్బెర్రా : మలేషియా ఎంహెచ్ 370 విమానం అదృశ్యం అతి పెద్ద మిస్టరీ అని ఆస్ట్రేలియా అధికారులు పేర్కొన్నారు. ఎంహెచ్370 అదృశ్యంపై దాదాపు మూడున్నర ఏళ్లుగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న ఆస్ట్రేలియా ట్రాన్స్పోర్ట సేఫ్టీ బ్యూరో (ఏటీఎస్బీ) బృందం.. దీనిపై మంగళవారం తుది నివేదకను ప్రభుత్వానికి సమర్పించింది. ఎంహెచ్ 370 ప్రయాణికులు బాధిత కుటుంబాలకు మేం న్యాయం చేయలేకపోయాం.. మమ్మల్ని క్షమించండంటూ.. రీసెర్చ్ ఏటీఎస్బీ ఈ సందర్భంగా ప్రకటించింది. ఆధునిక ప్రపంచంలో ఈ విమాన అదృశ్యం ఎవరూ ఊహించలేనిది అని ఏటీఎస్బీ తెలిపింది. బీజింగ్ నుంచి కౌలాలంపూర్‌కు 2014 మార్చి 8న బయలుదేరిన ఎంహెచ్370 విమానం కొన్నిగంటల్లోనే దిశ మార్చుకుని అదృశ్యమైన విషయం తెలిసిందే. ఎంహెచ్370 అదృశ్యం అనేది విమానయాన చరిత్రలోనే అతి పెద్ద విషాదమని ఏటీఎస్బీ చీఫ్ కమిషనర్ గ్రెగ్ హూడ్ చెప్పారు. ఈ విమానం కోసం నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ ప్రపంచంలోనే అతి పెద్దది.. అయినా బాధిత కుటుంబాలకు మాత్రం న్యాయం చేయలేకపోయాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంహెచ్ 370 అదృశ్యమైన ప్రాంతంగా భావిస్తున్న ఆస్ట్రేలియా పడమటి ప్రాంతంలోని 2,800 కిలోమీటర్ల పరిధిని అణువణువు శోధించామని.. అలాగే సముద్రగర్భంలో లక్షా 20 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో సోనార్ టెక్నాలజీతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు ఆయన చెప్పారు. -
అదృశ్యమైన ఆ విమానం చివరిక్షణాల్లో..!
-
అదృశ్యమైన ఆ విమానం చివరిక్షణాల్లో..!
దాదాపు రెండేళ్ల కిందట హిందూ మహా సముద్రంలో అదృశ్యమైన మలేషియా విమానం ఎంహెచ్ 370 గురించి తాజాగా దర్యాప్తులో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్ 370 విమానం కూలిపోతున్న చివరిక్షణాల్లో దానిని ఎవరూ నియంత్రించలేదని దర్యాప్తు అధికారులు తాజాగా నిర్ధారణకు వచ్చారు. 2014లో గల్లంతైన ఈ విమానానికి సంబంధించి ఇప్పటివరకు లేశమాత్రమైన అవశేషం దొరకలేదు. ఇది ఎక్కడ కూలిపోయిందనే జాడ కూడా లేదు. ఈ నేపథ్యంలో దీని ఆచూకీ గురించి వెతుకుతున్న దర్యాప్తు అధికారులు, నిపుణులు బుధవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సమావేశమయ్యారు. ఇంధనం అయిపోవడంతో ఈ విమానం (బోయింగ్ 777) ఒక్కసారిగా అతివేగంగా పల్టీలు కొడుతూ కూలిపోయిందని, ఈ చివరిక్షణాల్లో పైలట్లు దీనిని నియంత్రించే ప్రయత్నం చేయలేదని దర్యాప్తు అధికారులు చాలాకాలంగా చెప్తున్న సంగతి తెలిసిందే. తాజా సమావేశంలో నిపుణులు, దర్యాప్తు అధికారులు ఈ వాదనను సమర్థిస్తున్నట్టు సంకేతాలు ఇస్తూ ఒక ప్రటకన విడుదల చేశారు. అయితే, ఇటీవల మరికొందరు నిపుణులు మాత్రం ఈ వాదనతో విభేదిస్తున్నారు. చివరిక్షణాల్లో విమానాన్ని నియంత్రించడానికి ప్రయత్నాలు జరిగాయని, ఇవి ఫలించకపోవడంతో మరింత వేగంగా విమానం కూలిపోయి ఉంటుందని వీరు అభిప్రాయపడుతున్నారు. విమానం కూలిపోయిన ప్రదేశం జాడ తెలియకపోవడానికి కారణం.. చివరిక్షణాల్లో ఈ నియంత్రణ చర్యలే కారణం కావొచ్చునని, దీనివల్ల సముద్రం లోతులోకి విమానం కూరుకుపోయి ఉంటుందని వారు అంటున్నారు. అయితే, దర్యాప్తు అధికారులు, నిపుణులు మాత్రం విమానం చివరిక్షణాల్లో చాలావేగంగా కూలి పడిపోయిందని, దీనిని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు జరిగినట్టు కనిపించడం లేదని శాటిలైట్ సమాచారం ఆధారంగా విశ్లేషించామని పేర్కొన్నారు. 2014 మార్చి 8న 239 మందితో బీజింగ్ నుంచి కౌలాలంపూర్ బయలుదేరిన ఎంహెచ్ 370 విమానం అకస్మాత్తుగా అదృశ్యమై.. ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయిన సంగతి తెలిసిందే. -
విమాన ఆచూకీ కోసం స్పీడ్ పెంచిన మలేసియా
కౌలాలంపూర్: గతేడాది మార్చిలో అదృశ్యమైన ఎమ్హెచ్ 370 విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అందుకోసం నాలుగు నౌకలు రంగంలోకి దింపినట్లు మలేసియా రవాణా శాఖ మంత్రి లియోవ్ టియాంగో లాయి గురువారం వెల్లడించారు. విమానం ఆదృశ్యమైన ప్రాంతం... దక్షిణ బంగాళఖాతంలో నౌకలు అణువణువు శోధన చేస్తున్నాయని తెలిపారు. ఓ నౌక మంగళవారమే గల్లంతైన విమానాన్ని శోధించేందుకు రంగంలోకి దిగిందని పేర్కొన్నారు. అయితే ఎమ్హెచ్ 370 అదృశ్యమై దాదాపు ఏడాది కావస్తున్న ఇప్పటి వరకు ఆచూకీ కనుగొనక పోవడంపై సదరు విమాన ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మలేసియా ప్రభుత్వంపై ఇప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న సంగతి తెలిసిందే. ఎమ్హెచ్ 370 విమానం కోసం ప్రార్థన చేస్తున్నాం అనే అక్షరాలు గల ఏరుపు రంగు టీ షర్ట్ ధరించి.. తెల్లని టోపి పెట్టుకుని గల్లంతైన వారి బంధువులు 15 మంది మంగళవారం పౌర విమానయాన శాఖ కార్యాలయం ఎదుట నిలబడ్డారు. ఈ ప్రమాదం నిన్న వారికి జరిగింది. నేడు, రేపో మీలో మాలో ఎవరో ఒకరికి ఇదే సంఘటన ఎదురు కావచ్చు' అంటూ రాసిన ప్లకార్డులు వారు చేతిలో పట్టుకున్నారు. 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం ఈ ఏడాది మార్చి 8వ తేదీన మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన 40 నిమిషాలకే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం ప్రపంచదేశాలు కలిసికట్టుగా గాలింపు చర్యలు చేపట్టన ఫలితం మాత్రం కనిపించలేదు. ఎమ్హెచ్ 370 ప్రమాదానికి గురైందని మలేసియా ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో అధికారికంగా ప్రకటించడంతో మృతుల కుటుంబసభ్యులు, బంధువులు దుఖఃసాగరంలో మునిగిపోయారు. ఈ విమానంలో 154 మంది చైనా జాతీయులతోపాటు నలుగురు ఫ్రెంచ్ జాతీయులు, ఐదుగురు భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే.