దాదాపు రెండేళ్ల కిందట హిందూ మహా సముద్రంలో అదృశ్యమైన మలేషియా విమానం ఎంహెచ్ 370 గురించి తాజాగా దర్యాప్తులో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్ 370 విమానం కూలిపోతున్న చివరిక్షణాల్లో దానిని ఎవరూ నియంత్రించలేదని దర్యాప్తు అధికారులు తాజాగా నిర్ధారణకు వచ్చారు.