Boeing 777 plane
-
విమానంలో మరో ప్రయాణికుడి వీరంగం..
విమానంలో మరో ప్రయాణికుడు వీరంగ సృష్టించాడు. గాలో ఉండగానే మరో ప్రయాణికుడిపై దాడి చేస్తూ రెచ్చిపోయాడు. ఏకంగా విమానంలో గాల్లో ఉండగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు ఇద్దరు ప్రయాణికులు. ఈ ఘటన బిమన్ బంగ్లాదేశ్ బోయింగ్ 777లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..విమానంలో సుమారు 20 ఏళ్ల యువకుడు చొక్కా లేకుండా మరో ప్రయాణికుడిపై భౌతిక దాడికి దిగాడు. దారుణంగా పిడిగుద్దులతో సదరు ప్రయాణికుడి కొట్టడం ప్రారంభించాడు. బాధిత ప్రయాణికుడు కూడా తనను రక్షించుకునే క్రమంలో ఎదురుదాడి చేశాడు. దీంతో ఆందోళనకు గురైన కొందరూ ప్రయాణకులు గొడవ సద్ధుమణిగేలా చేసేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయినా సరే తమ గొడవ తమదే అన్నట్లు ప్రవర్తించారు ఆ ఇద్దరూ ప్రయాణికులు. ఎయిర్ ఇండియా విమానంలో మూత్ర విసర్జన ఘటన మరువక మునుపే వరుసగా ప్రయాణికుల అనుచిత ప్రవర్తన ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం. ఐతే ఆ విమానం ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తుందనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఘటన నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Another "Unruly Passenger" 👊 This time on a Biman Bangladesh Boeing 777 flight!🤦♂️ pic.twitter.com/vnpfe0t2pz — BiTANKO BiSWAS (@Bitanko_Biswas) January 7, 2023 (చదవండి: 98 ఏళ్ల వృద్ధ ఖైదీకి..ఘనంగా జైలు సిబ్బంది వీడ్కోలు) -
ఎనిమిదేళ్ల నాటి విమానం మిస్సింగ్ మిస్టరీ.. కూలిందా? కూల్చారా!
మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఎంహెచ్ 370 విమానం 2014 మార్చి 8న మిస్సయ్యింది. ఆ విమానం ఆచూకీ కోసం గాలించినా... కనిపించకపోయేసరికి కూలిపోయిందనే నిర్ధారణకు వచ్చారు అధికారులు. ఐతే ఇప్పుడూ ఆ విమానం కూలిందా? ఉద్దేశ్వపూర్వకంగా కూల్చేశారా అను పలు అనుమానాలు తలెత్తేలా ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు ఆ విమానంలో సుమారు 239 మంది ప్రయాణికులతో మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తుండగా..ఆ విమానం ఆచూకీ కానరాకుండా పోయింది. దీంతో అప్పటి నుంచి ఆ విమానం మిస్సింగ్ మిస్టరీని చేధించే పనిలో పడ్డారు నిపుణులు. ఆ విమానానికి సంబంధించిన శకలాలను వెతికే పలు ప్రయత్నాలు చేశారు. ఆ బోయింగ్ 777 విమానం శకలాలు మడగాస్కన్ మత్స్యకారులకు లభించాయి. 2017లో వచ్చిన ఉష్ణమండల తుపాను ఫెర్నాండో నేపథ్యంలో మడగాస్కన్ సముద్ర తీరానికి విమాన శకలాలు కొట్టుకు రావడంతో టాటాలీ అనే మత్స్యకారుడు ఆ శిధిలాల భాగాన్ని గుర్తించినట్లు బ్రిటిష్ ఇంజనీర్ రిచర్డ్ గ్రాండ్ ఫ్రే చెబుతున్నారు. అతను నుంచి సేకరించిన శకలాల ఆధారంగా... ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని సముద్రంలోకి కూల్చివేసినట్లు విమాన శకలాలను గాలించే నిపుణుడు అమెరికన్ బ్లెయిన్ గిబ్సన్, బ్రిటిష్ ఇంజనీర్ రిచర్డ్ గాడ్ ఫ్రే చెబుతున్నారు. అందుకు సాక్ష్యం ఆ మత్స్యాకారుడి వద్ద ఉన్న ల్యాండింగ్ బోర్డు గేర్ని చూస్తే తెలుస్తుందంటున్నారు ఆ నిపుణులు. ఎందుకంటే క్రాష్ అయినప్పుడు.. విమానాన్ని వీలైనంతగా మునిగిపోయేలా చేసేలా.. ల్యాండింగ్ బోర్డు గేర్ని పొడిగించిన విధానమే అసలైన ఎవిడెన్స్ అని చెప్పారు. ఎందుకంటే ల్యాండింగ్ సమయంలో ఏ పైలెట్ సాధారణంగా ల్యాండింగ్ గేర్ను తగ్గించరు. విమానం ముక్కలుగా విరిగిపోయే ప్రమాదం ఉండటమే గాక నీటిలో సులభంగా మునిగిపోతుంది. ప్రయాణికులు ఎవరు ప్రాణాలతో బయటపడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని నిపుణులు గిబ్సన్, ఇంజనీర్ రిచర్డ్ గాడ్ ఫ్రే చెబుతున్నారు. (చదవండి: చైనాకు ఎదరు తిరిగితే అంతే...ఆ యువతి ఇంకా నిర్బంధంలోనే..) -
ఆ శకలం బోయింగ్దే!
హిందూ మహాసముద్రంలో దొరికిన శకలంపై మలేసియా కౌలాలంపూర్: హిందూ మహాసముద్రంలో దొరికిన విమాన శకలం.. బోయింగ్ 777 విమానానికి చెందినదేనని మలేసియా ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. దీంతో ఏడాది కిందట అంతుచిక్కని రీతిలో అదృశ్యమైన బోయింగ్ రకానికి చెందిన ఎమ్హెచ్ 370 విమానానికి సంబంధించిన శకలం అదేనని అభిప్రాయాలు బలపడుతున్నాయి. ఇటీవల హిందూ మహాసముద్రంలోని రినియన్ ద్వీపం వద్ద దొరికిన విమాన శకలం బోయింగ్ 777 రకానికి చెందినదేనని మలేసియా ఉప రవాణా మంత్రి అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఎమ్హెచ్ 370 విమానం ఆచూకీపై దర్యాప్తు చేస్తున్న ఉన్నతాధికారికి కూడా ఈ విషయం తెలిపామన్నారు. రినియన్ ద్వీపానికి ఒక బృందాన్ని పంపుతామని, ఆ శకలం ఎమ్హెచ్ 370కి సంబంధించినదా... కాదా అనే విషయం మరికొన్ని రోజుల్లో తెలుస్తుందని తెలిపారు. ఇప్పటివరకైతే ఆ శకలం ఎమ్హెచ్ 370 దేనని నిర్ధారణ కాలేదన్నారు. విమాన ఆచూకీపై ఫ్రాన్స్ సంస్థతో తాము సేకరించిన సమాచారం పంచుకుంటామని చెప్పారు. మరింత కచ్చితమైన ఆధారాలు లభించకుండా దొరికిన శకలం ఎమ్హెచ్ 370 దేనని చెప్పడం తొందరపాటు చర్య అవుతుందన్నారు. మరోవైపు దొరికిన శకలంపై ఉన్న 637 బీబీ నంబర్.. బోయింగ్ విమానానిదేనని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, అదృశ్యమైన విమానంపై దర్యాప్తునకు సారథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా.. దొరికిన శకలం ఎమ్హెచ్ 370 విమానానిదైనా.. విమానం కుప్పకూలిన ప్రాంతాన్ని కనిపెట్టడం కష్టమని పేర్కొంది. గత ఏడాది మార్చి 18న కౌలాలంపూర్ నుంచి బీజింగ్కు 239 మంది ప్రయాణికులతో వెళ్తున్న మలేసియాకు చెందిన ఎమ్హెచ్ 370 విమానం హిందూ మహాసముద్రం పరిధిలో అదృశ్యమైన విషయం తెలిసిందే. అ విమానంలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. కాగా, ఇన్నాళ్లుగా గాలిస్తున్నా అదృశ్యమైన విమానానికి సంబంధించి ఏలాంటి ఆధారాలను దర్యాప్తు అధికారులు కనుక్కోలేకపోయారు.