
భువనేశ్వర్: ఎన్నో ఔషధ, పోషకాలతో కూడిన క్రోకర్ చేప ఒడిషాలోని భద్రక్ జిల్లాలో మత్స్యకారుల వలకు చిక్కింది. ధామ్రా నదీ సంగమ తీరంలో శుక్రవారం మత్స్యకారుడు హఫీజ్ ఉల్లా వేసిన వలలో 32కిలోలు ఉన్న ఈ భారీ జలపుష్పం లభ్యమైంది.
దీనిని చాంద్‌బాలి చాందినిపాల్ చేపల వేలం కేంద్రంలో వేలం వేయగా, ముంబైకి చెందిన ఔషధాల కంపెనీ రూ.3 లక్షల 10 వేలకు దక్కించుకుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో లభించే ఈ చేప భద్రక్ ధామ్రా తీరంలో చిక్కడం విశేషం. దీనిని ఘోల్ చేప కూడా అంటారు. స్థానిక భాషలో తెలియా అని వ్యవహరిస్తారు. ఈ చేపలను ఎక్కువగా సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, హాంగ్‌కాంగ్, జపాన్ దేశాల వారు దిగమతి చేసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు.
క్రోకర్ చేప గుండెను సీ గోల్డ్‌గా కొనియాడతారు. దీనిని ఎయిర్ బ్లాడర్‌తో తయారు చేసిన ప్రత్యేక దారం మనిషి గుండె శస్త్రచికిత్సలో కుట్లు వేసేందుకు వినియోగించడంతో గిరాకీ విపరీతంగా ఉంటుంది. క్రోకర్ మొప్పలతో తయారు చేసిన దారం సాధారణ పరిస్థితుల్లో శరీరంపై కుట్లు వేసేందుకు వినియోగిస్తారు. సుమారు మూడేళ్ల క్రితం జగత్‌సింఘ్‌పూర్ జిల్లా పారాదీప్ తీరంలో క్రోకర్ చేప వలకు చిక్కగా.. దీని ధర రూ.లక్షా 10 వేలకు పరిమితమైంది.
ఇది కూడా చదవండి: వరదలో కొట్టుకువచ్చిన పులి.. బ్యారేజ్ గేట్ల వద్ద బతుకు పోరాటం
Comments
Please login to add a commentAdd a comment