కెరటాల తాకిడి నుంచి రక్షణకు వేసుకున్న ఇసుక బస్తాలు
అచ్యుతాపురం (యలమంచిలి): తుపాను వచ్చిందంటే మత్స్యకారుల కంటి మీద కునుకు ఉండదు. ఒక పక్క కెరటాల ఉద్ధృతితో తీరం చేరి పడవలు తాకుతూ భయంకర శబ్దం చేస్తాయి. సముద్రం కోతకు గురై ఇసుక కొట్టుకుపోయి గోతులు ఏర్పడతాయి. తీరంలో ఉన్న గుడిసెలపైకి కెరటాలు దూసుకు వస్తాయని భయం.. ఒక పక్క పడవల్ని కాపాడుకోవాలి మరో పక్క ఇళ్లను కాపాడుకోవాలి. వలలు, ఇతర సామగ్రి భద్రపరచుకోవాలి. అర్ధరాత్రి అ యినా మత్స్యకారులకు కష్టాలు తప్పడం లేదు. పూడిమడకతీరంలో వెయ్యి పడవలకు రక్షణ లేకుండా పో యింది. మత్స్యకారులకు ప్రశాంతత కరువైంది. ఫొని తుఫాను హెచ్చరికతో మత్స్యకారుల మరోసారి ఉలిక్కిపడ్డారు. పడవల్ని కాపాడుకోవడానికి నానా అవస్థలు పడ్డారు. జెట్టీ నిర్మించకపోవడం, రక్షణగోడ ఏర్పాటు కాకపోవడంతో మత్స్యకారులకు తుపాను కష్టాలు తప్పటం లేదు.
రక్షణగోడ నిర్మించాలి
విశాఖకు – కాకినాడకు మధ్య వెయ్యి పడవలలో ఆరువేలమంది మత్స్యకారులు వేటాడే పెద్దగ్రామం పూడిమడక. పూడిమడక జనాబా 16వేల మంది ఉన్నారు. ఇక్కడి తీరం వేటకు అనుకూలంగా ఉండటంతో çపరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి , ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల మత్స్యకారులు ఇక్కడ నుంచి వేటాడతారు. పూడిమడక మత్స్యకారులకు చెందిన బంధువులు సీజన్‌లో ఇక్కడికి వచ్చి వేటసాగిస్తారు. ఆ వేట ప్రశ్నార్థకంగా మారింది. తీరం వద్ద నివాసం ఉండేవéరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోక తప్పదు. జాలరిపాలెం కొండ నుంచి మెరైన్‌పోలీస్ స్టేషన్ వరకూ రెండు కిలోమీటర్ల పరిధిలో రక్షణ గోడ నిర్మించాలని మత్స్యకారులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. తీరం వెంబడి ఆరువందల కుటుం బాలను ఖాళీ చేయించడానికి ప్రభుత్వం ఇళ్లు నిర్మించింది. ఆ ఇళ్లను పంపిణీ చేయకపోవడంతో ఇప్పటికీ మత్స్యకారుల తీరానికి సమీపంలో నివాసం ఉంటున్నా రు. తీరప్రాంత మత్స్యకారులకు సురక్షిత ప్రాంతంలో ఇళ్లు నిర్మించి తరలించాలని తీరం నుంచి రెండువందల అడుగుల దూరంలో రక్షణ గోడ నిర్మించాలని మత్స్యకారులు కోరుతున్నారు.
జెట్టీ లేక పడవలకు ముప్పు
ఖరీదైన చేపల్ని వేటాడడానికి మత్స్యకారులు 200 కిలోమీటర్లకు మించి దూరం వేటకు వెళ్తున్నారు. ఇందుకోసం పెద్దబోట్లు, ఇంజిన్లను విని యోగిస్తున్నారు.రూ.పదిలక్షల ఖర్చుతో వేటసామగ్రి తయారు చేసుకుంటున్నారు. జెట్టీ లేకపోవడంతో తీరం వద్ద ఇసుకతిన్నలపై ఉంచేస్తున్నారు. కెరటాల తీ వ్రత పెరిగినప్పుడు తక్షణమే పడవల్ని సురక్షిత ప్రాం తానికి చేర్చాలి. జాగ్రత్తపడకపోతే పడవలు ఢీకొని దెబ్బతింటున్నాయి. ఒక్కొక్క పడవని జరపాలంటే కనీ సం 12 మంది భుజంపట్టి ఈడ్చాల్సి వస్తుంది. వేటకు వెళ్లేటప్పడు, వేట ముగిసిన తరువాత పడవల్ని భూజంపట్టి లాగుతారు. చేపలు పడినా పడకపోయినా ఈ మోత తప్పడం లేదు. గతంలో సీజన్‌ను బట్టి కెరటాలు ఎక్కడికి వస్తాయో అంచనా ఉండేది. తుపానుకు కెరటాలు ఉద్ధృతంగా వస్తాయని భావించేవారు. ఇప్పుడు క్షణంలో పరిస్థితి మారుతోంది. దీంతో రాత్రులు కంటి మీద కునుకు ఉండటం లేదు. జెట్టీ నిర్మిస్తే కెరటాల తీవ్రత పెరిగినా జెట్టీలో లంగరు వేసిన పడవలు సురక్షితంగా ఉంటాయి. వేటసామగ్రి భద్రంగా ఉంటుంది. మోతభారం పూర్తిగా ఉండదు.. ఇద్దరు మత్స్యకారులు లంగరు విదిలించి పడవను తీసుకొని వేటకు వెళ్లగలరు. మోతకు భయపడి పలువురు వేటకు దూరమవుతున్నారు.
జెట్టీ నిర్మాణానికి నిధులు మంజూరు
పూడిమడక తీరం కోతకు గురవుతోందన్నది వాస్తవం. తీరం వెంబడి ఇళ్లకు ప్రమాదం ఏర్పడుతుంది. ఎక్కువ బోట్లు వేట సాగిస్తున్నందు వల్ల జెట్టీ్ట నిర్మాణం జరిగితే మత్స్యకారులకు శ్రమ తగ్గుతుంది. రక్షణగోడ, జెట్టీ నిర్మాణానికి గతంలో పతిపాదనలు పంపించాం. జెట్టీ నిర్మాణానికి రూ. 50లక్షల నిధులు మంజూరయ్యాయి. పనులు ప్రారంభించాల్సి ఉంది. –పి.శ్రావణి కుమారి, ఎఫ్‌డీవో, అచ్యుతాపురం
Comments
Please login to add a commentAdd a comment