మత్స్యకారుల భగీరథ ప్రయత్నం | fishermen Bhagiratha effort | Sakshi
Sakshi News home page

మత్స్యకారుల భగీరథ ప్రయత్నం

Published Sat, Apr 30 2016 2:42 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

మత్స్యకారుల భగీరథ ప్రయత్నం - Sakshi

మత్స్యకారుల భగీరథ ప్రయత్నం

చెరువులోకి బావుల నీళ్లు మళ్లింపు
చేపలు మృత్యువాత పడకుండా ప్రత్యామ్నాయం

 
కేసముద్రం : రూ.లక్షలు వెచ్చించి చెరువుల్లో పోసిన చేపపిల్లలు పెద్దవయ్యూక పట్టి అమ్ముకోవడం ద్వారా నాలుగు రాళ్లు సంపాదించుకోవచ్చన్న మత్స్యకారులు ఆశలు ఆవిరవుతున్నారుు. ఎండ వేడితో చెరువుల్లో నీరు అడుగంటుతుండగా చేపలు చనిపోరుు తేలుతున్నారుు. దీంతో ఏం చేయూలో పాలుపోని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వారికో ఆలోచన వచ్చింది! ఇంకేం అనుకున్నదే తడవుగా ఆలోచనను ఆచరణలో పెట్టి తమ జీవనాధారమైన చేపలను బతికించుకునే యత్నాలు ఆరంభించారు.

కేసముద్రం మండలంలోని కోరుకొండపల్లి గ్రామానికి చెందిన మంగి ఉప్పలయ్య రూ.2లక్షల విలువైన చేపపిల్లలను ఊరచెరువులో పెంపకానికి వేశాడు. ఎండల కారణంగా నీరు అడుగంటి రెండు టన్నుల చేపలు మృత్యువాత పడ్డారుు. ఎండతో చెరువు మూడు పాయలుగా విడిపోగా.. ఓ పాయలోనే కొద్ది మేర నీళ్లు ఉన్నారుు. దీంతో మిగతా పాయల్లోని చేపలను పట్టి పెద్ద పాయలో వేరుుంచాడు. అరుుతే, అక్కడ కూడా నీరు అడుగంటుతోందనే భావనతో పక్కనే ఉన్న ఇద్దరు రైతులకు రూ.30వేలు చెల్లించి నీటిని కందకాల ద్వారా చెరువులోకి మళ్లించాడు. ఈ విధంగా వేడెక్కిన నీళ్లను చల్లబర్చడంతో పాటు చేపలను బతికించుకోవాలని లీజుదారుడు ఉప్పలయ్య పడుతున్న తపన భగీరథ ప్రయత్నాన్ని తలపిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement