సముద్రంలో వేటకు వెళ్లిన ఓ మత్య్స కారుడికి ఓ భారీ రొయ్య దొరికింది. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం కరవాక వద్ద చింతా కాసులు అనే మత్స్యకారుడువేటకువెళ్లాడు. అతని వలలో 1,200 గ్రాముల బరువైన భారీ రొయ్య పడింది. దీన్ని కొనేందుకు పెద్ద సంఖ్యలో జనం ఆసక్తి చూపారు. చివరకి ఈ రొయ్యను రూ.600కు విక్రయించారు. ఇది ఆళ్ల జాతికి చెందిన రొయ్యగా మత్స్యకారులు తెలిపారు.
రొయ్య @ రూ.600
Published Sun, Mar 6 2016 6:15 PM | Last Updated on Sun, Sep 3 2017 7:09 PM
Advertisement
Advertisement