న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్‌తో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడాలంటే మూడు కోట్ల లక్షల కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీని ప్రకటించాలంటూ కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహదారు కేవీ సుబ్రమణియన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే ప్రకటిస్తున్న ప్యాకేజీలకు అదనంగా ఈ మూడు లక్షల కోట్ల ప్యాకేజీ ఉండాలన్నారు.
మౌలిక రంగంలో
పారిశ్రామికవేత్తలతో జరిగిన సంభాషణలో మూడు లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించిన వ్యాఖ్యలు కేవీ సుబ్రమణియన్ చేశారు. ఈ ప్యాకేజీ ద్వారా విడుదల చేసే నిధుల్లో అధిక భాగం మౌలిక రంగంలో ఖర్చు చేయాలని కూడా ఆయన సూచించారు. కరోనా సెకండ్‌వేవ్ కారణంగా రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన ఉత్పాదకతను దేశం నష్టపోయిందంటూ ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment