సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి.వరుసగా రెండో రోజు కూడా లాభాల్లో ముగిసిన కీలక సూచీలు బుధవారం ప్రధాన మద్దతు స్థాయిలకు ఎగువన పటిష్టంగా ముగిసాయి. ఫార్మా బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్ సహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ఆర్థిక పునరుద్ధరణకు ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజీ రానుందనే అంచనాలతో సెన్సెక్స్ నిఫ్టీ రెండు శాతానికి పైగా లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ షేర్లు భారీగా పుంజుకోవడంతో మిడ్ సెషన్ తరువాత లాభాల జోరందుకున్న సెన్సెక్స్ 622 పాయింట్లు ఎగిసి 30818 వద్ద, నిఫ్టీ 187 పాయింట్ల లాభంతో 9066 వద్ద స్థిరపడింది. తద్వారా సెన్సెక్స్ 30500 పాయింట్ల ఎగువన, నిఫ్టీ 9050కి ఎగువన ముగిసాయి.
అరవిందో, గ్లెన్‌మార్క్, ఎస్కార్ట్స్ లాంటి ఫార్మ షేర్లు ప్రదానంగా లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ, డా. రెడ్డీస్ 6 శాతం ఎగిసి టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. ఇంకా కోటక్ మహీంద్ర, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, బజాన్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ లాభపడ్డాయి. రైట్స్ ఇష్యూ ఇవాళ్టి నుంచి ప్రారంభం కావడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో జోరుగా ట్రేడ్ అయింది. మరోవైపు అదానీ పవర్, మైండ్ ట్రీ స్వల్పంగా నష్టపోయాయి.
అటు డాలరు మారకంలో రూపాయి నష్టాలతో ముగిసింది. డాలరు బలం, ఆసియన్ కరెన్సీల బలహీనత నేపథ్యంలో 75.86 స్థాయిని టచ్ చేసింది. అయితే ఈక్విటీ మార్కెట్లో లాభాలతో చివర్లో తేరుకుని 75.79 వద్ద ముగిసింది.
చదవండి : కరోనా కాటు, ఓలా ఉద్యోగులపై వేటు
కోవిడ్-19: రోల్స్ రాయిస్‌లో వేలాదిమందికి ఉద్వాసన
Comments
Please login to add a commentAdd a comment