
తల్లిదండ్రులతో అనీష్‌కుమార్‌రెడ్డి
సాక్షి, పాన్‌గల్ (వనపర్తి): మండలంలోని కేతేపల్లి గ్రామానికి చెందిన వంగూరు బాలీశ్వర్‌రెడ్డి, వసంతలక్ష్మి దంపతుల ద్వితీయ కుమారుడు అనీష్‌కుమార్‌రెడ్డి అమెరికాలో అమెజాన్ సంస్థలో ఏడాదికి రూ.కోటి 20లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడని కుటుంబ సభ్యులు గురువారం తెలిపారు.
అనీష్‌కుమార్ రెడ్డి పదవ తరగతి వరకు హైదరాబాద్‌లోని సెయింట్ జోసెఫ్ పాఠశాలల్లో, ఇంటర్ విద్యను శ్రీ చైతన్య కళాశాలలో, బీటెక్ (సీఎస్) గీతం యూనివర్సిటీ హైదరాబాద్, ఎంఎస్‌ను అమెరికాలో మిస్సోరి యూనివర్సిటీలో పూర్తిచేసి ఉద్యోగం సాధించారు. ఏడాదికి రూ.1.20కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించడంపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తంచేశారు.
చదవండి: (సర్కారు వారి పాట)
Comments
Please login to add a commentAdd a comment