జనం ఈ రోజుల్లో అన్నింటికీ ఆన్‌లైన్ షాపింగ్‌పైననే ఆధారపడుతున్నారు. ఇందుకోసం ఒక్కోసారి అడ్వాన్స్ పేమెంట్ చేస్తుంటారు. అలాగే క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయాన్ని కూడా వినియోగించుకుంటుంటారు. అయితే వర్జీనియాకు చెందిన ఒక మహిళకు వింత అనుభవం ఎదురయ్యింది. ఆ మహిళకు షాపింగ్ వెబ్‌సైట్ అమెజాన్ నుంచి లెక్కకు మించిన పార్సిళ్లు అందాయి.
ఆమె ఎటువంటి ఆర్డర్ చేయకుండానే చాలా సామానులు ఆమె ఇంటికి చేరాయి. ఇలా 100కు పైగా ప్యాకేజీలు ఆమె ఇంటికి వచ్చాయి. వర్జీనియాకు చెందిన మహిళ సిండీ స్మిత్ తనకు ఎదురైన అనుభవం గురించి మాట్లాడుతూ..ఈ ప్యాకేజీలు ఇటీవల ప్రిన్స్ విలియం కౌంటీలోని ఇంటికి వచ్చాయన్నారు. వాటిలో 1,000 హెడ్‌ల్యాంప్‌లు, 800 గ్లూగన్‌లు, పాతికకుపైగా భూతద్దాలు ఉన్నాయని తెలిపారు.
ఇప్పుడు తాను వీటిని కారులో పెట్టుకుని తిరుగుతున్నానని,ఆ పేరుగలవారు ఎవరైనా కనిపిస్తే వారికి ఇచ్చేస్తానని తెలిపారు. ప్యాకేజీలపై స్మిత్ చిరునామా ఉన్నప్పటికీ పేరు లిక్సియావో జాంగ్ అని ఉందని తెలిపారు. తాను ఈ పేరును గతంలో ఎన్నడూ వినలేదని అన్నారు. మొదట్లో దీనిని స్కామ్ అనుకున్నానని, అయితే ఇది తనకు ఎదురైన తొలి అనుభవం కాదన్నారు. గతంలో తాను వాషింగ్టన్ డీసీలోని లిజ్ గోల్ట్‌మెన్‌లో ఉన్నప్పుడు కూడా ఇలానే జరిగిందన్నారు. అప్పట్లో తాను ఆర్డర్ చేయకుండానే లెక్కకు పైగా చిన్నపిల్లల దుప్పట్లు వచ్చాయన్నారు. ఇదేవిధంగా తనకు కాలిఫోర్నియాలోనూ ఇటువంటి అనుభవమే ఎదురయ్యిందన్నారు. నాడు తాను ఆర్డర్ చేయకుండానే 100 స్పేస్ హీటర్లు వచ్చాయన్నారు.
ఈ ఉదంతం గురించి అమెజాన్ అధికారులు మాట్లాడుతూ ఆమెకు వస్తున్న ఆర్డర్లను పరిశీలిస్తే స్మిత్, గెల్ట్‌మాన్ పేరుతో ఉన్న ప్యాకేజీలు రెండూ అమ్మకందారులు అమెజాన్ కేంద్రాల నుండి యాదృచ్ఛిక చిరునామాలకు ప్యాకేజీలను పంపిన ఫలితంగా ఇలా జరిగిందన్నారు. న్యూయార్క్‌కు చెందిన న్యాయవాది సీజే రోసెన్‌బామ్ మాట్లాడుతూ విక్రేతలు యాదృచ్ఛిక చిరునామాలను ఎంచుకుని, అమెజాన్ గిడ్డంగులలోని తమ అమ్ముడుపోని ఉత్పత్తులను పంపిస్తున్నారని అన్నారు. తమ స్టోరేజీని తగ్గించుకునేందుకు వారు ఇలా చేస్తుంటార్ననారు. అయితే ఇలా వ్యవహించే అమ్మకందారుల అకౌంట్‌ను అమెజాన్ బంద్ చేసిందని తెలిపారు.
ఇది కూడా చదవండి: వర్షం మధ్య దాహార్తి తీర్చుకుంటున్న పులి.. అలరిస్తున్న అరుదైన వీడియో!
Comments
Please login to add a commentAdd a comment