న్యూఢిల్లీ: ప్రకృతి అంటే ఇష్టపడిని వారు ఉండరు. అందుకోసం చాలామంది అడువులకు లేదా పచ్చదనంతో కూడిని మంచి అందమైన ప్రదేశాల్లో ఉండేందుకు ఇష్టపడుతుంటారు. మరి కొద్దిమంది ఏ మాత్రం అవకాశం దొరకిన ప్రపంచంలో మంచి అభయ అరణ్యాలను సందర్శించటం వంటివి చేస్తుంటారు. అయితే అడువుల్లో తిరిగితే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్‌కు గురవడమే కాక ఒక్కొసారి ప్రాణాంతకంగా కూడా మారుతుంటుందంటున్నారు వైద్యులు.
జౌను ఇటీవలే అమెజాన్ అడువులను సందర్శించిన ఒక మహళకి మియాసిస్ అనే ఒక రకమైన టిష్యూ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ ఘటన ఢిల్లీ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...ఢిల్లీ ఆసుపత్రిలోని వైద్యులు 32 ఏళ్ల అమెరికన్ మహిళకు అరుదైన మియాసిస్ అనే టిష్యూ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమెకు సోమవారం విజయవంతంగా శస్త్రచికిత్స చేసినట్లు ఆసుపత్రి అధికారులు పేర్కొన్నారు.
మియాసిస్(బోట్ ఫ్లై) అనేది మానవ కణజాలంలో ఫ్లై లార్వా (మాగ్గోట్)కి సంబంధించిన ఇన్ఫెక్షన్. అయితే ఆమె ఆమెరికాలో ఉండగానే తనకు ఈ ఇన్ఫెక్షన్ వచ్చిందని చ్పెపారు. కానీ అక్కడి అమెరికన్ వైద్యులను సంప్రదించినప్పడూ ఆ రోగ లక్షణానికి సంబంధించిన ఉపశమన మందులు ఇచ్చి పంపించేశారని ఆమె తెలిపారు.అయితే ఆమెకు మళ్లీ నాలుగు వారాల నుంచి శరీరంలో ఏదో కదులుతున్నట్లు అనిపించడం, కనురెప్పలో వాపు, కళ్లు ఎరుపెక్కడం వంటి ఫిర్యాదులతో ఆమె ఢిల్లీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యింది.
ఆ అమెరికన్ మహిళ ఒక ప్రయాణికురాలు. కాబట్టి ఆమె ప్రయాణ చరిత్ర గురించి ఆరా తీయగా.... ఆమె ఇటీవలే అమెజాన్ అడువులను సందర్శించి వచ్చినట్లు చెప్పారు. దీంతో మియాసిస్(బోట్ ఫ్లై) కి సంబంధించిన కేసుల గురించి వైద్యులు క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆమె ఇన్ఫక్షన్స్‌కి గల కారణాలను నిర్ధారణ చేశారు. ఈ మేరకు వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసి దాదాపు 2 సెం.మీ పరిమాణంలోని మూడు ప్రత్యక్ష బొట్ ఫ్లైస్‌ను తొలగించారు.
ఒకటి కుడి ఎగువ కనురెప్ప నుంచి, రెండవది ఆమె మెడ వెనుక నుంచి, మూడవది ఆమె కుడి ముంజేయి నుంచి బోట్ ఫ్లైని తొలగించారు. అంతేకాదు ఎలాంటి అనస్థీషియా లేకుండా అన్ని అస్ప్టిక్ జాగ్రత్తలతో 10-15 నిమిషాల్లో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. మియాసిస్(బొట్ ఫ్లైస్) అనే ఇన్ఫక్షన్ ఉష్ణమండల ప్రాంతాలలో నివశించే వారికి వస్తుంది. ఇది ఒక రకమైన పరాన్నజీవి అడవులలో చెట్లను ఆశ్రయించి ఉంటుంది.
ఇది మానవుని శరీరంలో సున్నితమైన పొరల్లోకి చొచ్చుకుపోయి మానవ కణజాల వ్యవస్థలను నాశనం చేసి ప్రాణాంతకంగా మారుతుంది. భారతదేశంలో, ఇటువంటి కేసులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. ఇవి దెబ్బలు తగిలి గాయాలు ఏర్పడినప్పుడు లేదా అడువుల్లోనూ, దట్టమైన చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ సంచరించినప్పుడూ ఇలాంటి అరుదైన ఇన్ఫెక్షన్‌లకు గురవుతుంటారని వైద్యులు చెబుతున్నారు.
(చదవండి: చెత్త యవ్వారం: కంటెయినర్ల నిండా టన్నుల్లో! యూకేకు షాకిచ్చిన లంక)
Comments
Please login to add a commentAdd a comment