Pangal
-
పతకానికి విజయం దూరంలో...
బెల్గ్రేడ్ (సెర్బియా): భారత రెజ్లింగ్ రైజింగ్ స్టార్ అంతిమ్ పంఘాల్ సీనియర్ స్థాయిలోనూ సత్తా చాటుకుంది. అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండేళ్లు స్వర్ణ పతకాలు నెగ్గిన తొలి భారతీయ రెజ్లర్‌గా చరిత్ర సృష్టించిన అంతిమ్... ప్రస్తుతం ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతక రేసులో నిలిచింది. సెమీఫైనల్లో అంతిమ్ 4–5 పాయింట్ల తేడాతో వనెసా కలాద్జిన్స్కాయా (బెలారస్) చేతిలో పోరాడి ఓడిపోయింది. నేడు జరిగే కాంస్య పతక బౌట్లో అంతిమ్ గెలిస్తే పతకంతోపాటు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ కూడా ఖరారవుతుంది. సాట్ల్విరా ఒర్షుష్ (హంగేరి), ఎమ్మా జోనా డెనిస్ మాల్‌్మగ్రెన్ (స్వీడన్) మధ్య బౌట్ విజేతతో కాంస్య పతకం పోరులో అంతిమ్ తలపడుతుంది. అంతకుముందు తొలి రౌండ్లో అంతిమ్ 3–2తో డిఫెండింగ్ చాంపియన్ డొమినిక్ ఒలివియా పారిష్ (అమెరికా)ను బోల్తా కొట్టించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అంతిమ్ 10–0తో రొక్సానా మార్టా జసినా (పోలాండ్)పై, క్వార్టర్ ఫైనల్లో 9–6తో నటాలియా మలిషెవా (రష్యా)పై గెలుపొందింది. భారత్‌కే చెందిన మనీషా (62 కేజీలు), ప్రియాంక (68 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో, జ్యోతి బెర్వాల్ (72 కేజీలు) తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. భారత రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో భారత రెజ్లర్లు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) పతాకంపై, ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా, బెలారస్ రెజ్లర్లు తటస్థ అథ్లెట్లుగా ఈ మెగా ఈవెంట్లో పోటీపడుతున్నారు. -
Wanaparthy: రూ.1.20కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో ఉద్యోగం
సాక్షి, పాన్‌గల్ (వనపర్తి): మండలంలోని కేతేపల్లి గ్రామానికి చెందిన వంగూరు బాలీశ్వర్‌రెడ్డి, వసంతలక్ష్మి దంపతుల ద్వితీయ కుమారుడు అనీష్కుమార్రెడ్డి అమెరికాలో అమెజాన్ సంస్థలో ఏడాదికి రూ.కోటి 20లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడని కుటుంబ సభ్యులు గురువారం తెలిపారు. అనీష్‌కుమార్ రెడ్డి పదవ తరగతి వరకు హైదరాబాద్‌లోని సెయింట్ జోసెఫ్ పాఠశాలల్లో, ఇంటర్ విద్యను శ్రీ చైతన్య కళాశాలలో, బీటెక్ (సీఎస్) గీతం యూనివర్సిటీ హైదరాబాద్, ఎంఎస్‌ను అమెరికాలో మిస్సోరి యూనివర్సిటీలో పూర్తిచేసి ఉద్యోగం సాధించారు. ఏడాదికి రూ.1.20కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించడంపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తంచేశారు. చదవండి: (సర్కారు వారి పాట) -
మొదట భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు
-
నేడు టెన్త్ టాపర్లకు సన్మానం
పాన్‌గల్: గత విద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్‌లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు, పాఠశాల హెచ్ఎంలకు బుధవారం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో సన్మానిస్తున్నట్లు మండల శాఖ అధ్యక్షుడు భీమయ్య ప్రకటనలో తెలిపారు. ఎంపీపీ వెంకటేష్‌నాయుడు, జెడ్పీటీసీ రవికుమార్‌ల చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తరలిరావాలని కోరారు. -
వేర్వేరు చోట్ల నలుగురి ఆత్మహత్య
పాన్‌గల్: కుటుంబ కలహాలు,ఆర్థిక ఇబ్బందులు.. తది తర కారణాలతో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనలు సోమవారం చోటుచేసుకుంది. పోలీ సులు బాధితుల కథనం మేరకు.. పాన్‌గల్ మండలం కొర్లకుంట గ్రామానికి చెందిన కేతావత్ రాములు(35), భార్యకు మధ్య కొంతకాలంగా కుటుంబ కల హాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున రాములు కిరోసిన్ పోసుకుని నిప్పం టించుకున్నాడు. చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలి స్తుండగా.. మార్గమధ్యంలోనే కనుమూశాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నాడు. భర్త వేధింపులు తాళలేక.. వంగూరు: భర్త వేధింపులకు తాళేక ఓ మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. మండలంలోని ఉల్పర గ్రామానికి చెందిన సుగుణమ్మ(35)ను భర్త వెంకటస్వామి తరుచుగా వేధించేవాడు. ఈ క్రమంలో మరోసారి గొడవ జరగడంతో పురుగుమందు తాగింది. చికిత్సకోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది. మృతురాలు సుగుణమ్మ తండ్రి నిరంజన్ ఫిర్యాదు మేరకు భర్తపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. మృతదేహానికి కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలికి ఆంజనేయులు, అనిల్ ఇద్దరు కొడుకులు ఉన్నారు. భార్య తనవెంట రాకపోవడంతో.. పెద్దకొత్తపల్లి: భార్య తనవెంట రాకపోవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని వెన్నచర్ల గ్రామానికి చెందిన గడ్డికోకుల రాములు(35) వ్యవసాయ పొలంలో వేరుశనగ పంటసాగు చేశాడు. ఆదివారం రాత్రి అడవి పందుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు కాపలా వెళ్లేందుకు భార్య అలివేలును తనతో రావాలని రాములు కోరాడు. తన ఆరోగ్యం బాగా లేదని భార్య చెన్నమ్మ చెప్పడంతో వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు చికిత్సకోసం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. మృతుడికి ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. భార్య కాపురానికి రాలేదని.. వీపనగండ్ల: భార్య కాపురానికి రాలేదని సోమవారం ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని గోవర్ధనగిరి గ్రామానికి చెందిన ఆడెమోని ఎల్లస్వామి(30), భాగ్యమ్మ భార్యాభర్తలు. తన భార్య నెలరోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. కాపురానికి రావాలని ఎల్లస్వామి భాగ్యమ్మను కోరాడు. ఆమె రాకపోవడంతో మనస్తాపానికి గురై పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్యతో పాటు కొడుకు ఉన్నాడు. మృతుడి తల్లి రోషమ్మ ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ భీంకుమార్ తెలిపారు. -
టీఆర్ఎస్ ద్వారానే తెలంగాణ పునర్నిర్మాణం
పాన్‌గల్,న్యూస్‌లైన్: అరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుతోనే నవ తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని టీఆర్ఎస్ పార్టీ కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు అన్నారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జెడ్పీటీసీ అభ్యర్థి రవితో కలిసి ఆదివారం మండలంలోనిగోప్లాపూర్,దొండాయిపల్లి,దావాజిపల్లి,మాందాపూర్,రాయినిపల్లి,బుసిరెడ్డిపల్లి తదితర గ్రామాలల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో నీరు,నిధులు పుష్కలంగా ఉంటే మిగతా వసతులు సమకురుతాయన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించి రాష్ట్రం సాధించింది టీఆర్ఎస్ పార్టీయే అన్నారు. విద్యార్థుల ఆత్మబలిదానాలకు కాంగ్రెస్ పార్టీయే కారణం {పత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం 1200మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. ఆలాంటి పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఓటు అడిగే హాక్కు టీఆర్ఎస్ పార్టీకి తప్పా మరొక పార్టీకి లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 2015 అగస్టు నాటికి కృష్ణా ద్వారా కాలువల ద్వారా సాగునీరు అంది ప్రతి సెంటు భూమి సస్యశ్యామలమవుతుందన్నారు. దొండాయిపల్లి,దావాజిపల్లి,బుసిరెడ్డిపల్లి గ్రామాలల్లో వివిధ పార్టీలకు చెందిన 40మంది ఆయన సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమములో విండో చైర్మన్ బాల్‌రెడ్డి,ఆయా గ్రామాల సర్పంచులు ఠాకూర్‌నాయక్,విజయలక్ష్మి,సత్యం,నాయకులు చంద్రశేఖర్‌నాయక్,శేఖర్‌రెడ్డి,జనార్ధన్‌గౌడు,గోవర్దన్‌సాగర్,కుర్వబాలయ్య,ఆయా గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థులు పాల్గొన్నారు.