పాన్‌గల్: కుటుంబ కలహాలు,ఆర్థిక ఇబ్బందులు.. తది తర కారణాలతో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనలు సోమవారం చోటుచేసుకుంది. పోలీ సులు బాధితుల కథనం మేరకు.. పాన్‌గల్ మండలం కొర్లకుంట గ్రామానికి చెందిన కేతావత్ రాములు(35), భార్యకు మధ్య కొంతకాలంగా కుటుంబ కల హాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున రాములు కిరోసిన్ పోసుకుని నిప్పం టించుకున్నాడు. చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలి స్తుండగా.. మార్గమధ్యంలోనే కనుమూశాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నాడు.
భర్త వేధింపులు తాళలేక..
వంగూరు: భర్త వేధింపులకు తాళేక ఓ మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. మండలంలోని ఉల్పర గ్రామానికి చెందిన సుగుణమ్మ(35)ను భర్త వెంకటస్వామి తరుచుగా వేధించేవాడు. ఈ క్రమంలో మరోసారి గొడవ జరగడంతో పురుగుమందు తాగింది. చికిత్సకోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది. మృతురాలు సుగుణమ్మ తండ్రి నిరంజన్ ఫిర్యాదు మేరకు భర్తపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు. మృతదేహానికి కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలికి ఆంజనేయులు, అనిల్ ఇద్దరు కొడుకులు ఉన్నారు.
భార్య తనవెంట రాకపోవడంతో..
పెద్దకొత్తపల్లి: భార్య తనవెంట రాకపోవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని వెన్నచర్ల గ్రామానికి చెందిన గడ్డికోకుల రాములు(35) వ్యవసాయ పొలంలో వేరుశనగ పంటసాగు చేశాడు. ఆదివారం రాత్రి అడవి పందుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు కాపలా వెళ్లేందుకు భార్య అలివేలును తనతో రావాలని రాములు కోరాడు. తన ఆరోగ్యం బాగా లేదని భార్య చెన్నమ్మ చెప్పడంతో వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు చికిత్సకోసం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. మృతుడికి ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.
భార్య కాపురానికి రాలేదని..
వీపనగండ్ల: భార్య కాపురానికి రాలేదని సోమవారం ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని గోవర్ధనగిరి గ్రామానికి చెందిన ఆడెమోని ఎల్లస్వామి(30), భాగ్యమ్మ భార్యాభర్తలు. తన భార్య నెలరోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. కాపురానికి రావాలని ఎల్లస్వామి భాగ్యమ్మను కోరాడు. ఆమె రాకపోవడంతో మనస్తాపానికి గురై పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్యతో పాటు కొడుకు ఉన్నాడు. మృతుడి తల్లి రోషమ్మ ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ భీంకుమార్ తెలిపారు.
వేర్వేరు చోట్ల నలుగురి ఆత్మహత్య
Published Tue, Feb 17 2015 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 9:26 PM
Advertisement
Advertisement