Four suicide
-
నంద్యాల: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
-
విషాదం: ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
సాక్షి, కర్నూలు: నంద్యాల మాల్దార్‌పేటలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు కుమార్తెలతో పాటు దంపతులు పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. మృతి చెందిన వారు శేఖర్, కళావతి, అంజలి(16), అఖిల(14)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధతోనే వారు ఆత్మహత్య చేసుకోవచ్చని స్థానికులు చెబుతున్నారు. చదవండి: కరోనా: బెడ్డు దొరక్క కాబోయే వరుడు మృతి -
కోట రహస్యం..వీడని చిక్కుముడి
పర్లాకిమిడి : గజపతి సంస్థానం మహారాజా గోపీనాథ గజపతి అస్వస్థత కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఆయన వ్యక్తిగత సిబ్బంది కేసుకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు ఇవి జిల్లా వ్యాప్తంగా బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. రాజావారి ఆరోగ్యం పట్ల ఆయన వ్యక్తిగత సిబ్బంది వహించిన నిర్లక్ష్యం కారణంగానే రాజావారు నిశ్చలస్థితిలో ఉండిపోయారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా సిబ్బందిపై ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. ఈ అవమానం భరించలేక రెండేళ్ల క్రితం రాజావారి వ్యక్తిగత సిబ్బందిగా పనిచేసిన గజపతి సంస్థానం మేనేజర్ అనంగమంజరీ దేవి, ఆమె సోదరి విజయలక్ష్మి పాత్రో, తమ్ముళ్ళు సంజయ్‌కుమార్ పాత్రో, సంతోష్‌కుమార్ పాత్రోలు వారి స్వగృహంలోనే ఆత్మహత్య చేసుకున్నారు. 2016లో మహారాజా గోపీనాథ గజపతి అస్వస్థకు గురై ప్రస్తుతం రాష్ట్ర రాజధానిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రభుత్వ ఆధీనంలో దీర్ఘకాలిక వైద్య సేవలు పొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు గజపతి ప్యాలెస్ వ్యవహారాలు మహారాజా గోపినాథ గజపతి నారాయణ దేవ్ కుమార్తె కల్యాణీ దేవి చూసుకుంటున్నారు. ఆత్మహత్యల నేపథ్యంలో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టారు. సిట్‌కు కేసు అప్పగింత కానీ కారణాలు ఎంతమాత్రం తెలియరాకపోవడంతో సిట్ బృందానికి కేసును అప్పగించారు. ఈ బలవన్మరణాల పట్లబలమైన వ్యక్తుల పాత్రే ఉందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై పలు మీడియాల్లో పెద్ద ఎత్తున కథనాలు కూడా అప్పట్లో వెలువడ్డాయి. అనంతరం దర్యాప్తు చేపట్టిన సిట్ బృందం దర్యాప్తు చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్యల రహస్యాన్ని పసిగట్టేందుకు అప్పట్లో సిట్ బృందం రెండు నెలల కాలం పాటు పర్లాకిమిడిలో ఉండి దర్యాప్తు చేపట్టింది. ఇదే సమయంలో సంస్థానం మేనేజర్ అనంగమంజరీ దేవి మరణ వాంగ్మూలంలో పేర్కొన్న వ్యక్తులను కూడా ప్రశ్నించింది. కేసుకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేతో పాటు మరో 11 మందిని సిట్ బృందం ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మేనేజర్ మరణ వాంగ్మూలంలో ఏముందోనన్న విషయం ఇప్పటికీ సిట్ దర్యాప్తు బృందం వెల్లడించకపోవడంపై కూడా స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. నివేదిక సంగతేంటి..? దర్యాప్తు పూర్తయినా ఇంతవరకు నిందితుల వివరాలు కూడా వెల్లడించకపోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. సిట్ దర్యాప్తు బృందం అలసత్వంపై బాధిత కుటుంబ సభ్యులు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఆశ్రయించారు. అయినా వివరాలు తెలియరాక పోవడం విశేషం. అప్పట్లో ఈ ఉమ్మడి ఆత్మహత్యలు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా కేసు విషయంలో కొందరి రాజకీయ నేతల హస్తం ఉందని తేలిన నేపథ్యంలో సిట్ దర్యాప్తు బృందం నివేదిక వెల్లడిస్తుందా? లేదా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు సిట్ నివేదిక వెల్లడిస్తుందని అధికారులు చెబుతున్నారు. -
వేర్వేరు కారణాలతో నలుగురి ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక... తొర్రూరు : ఉరివేసుకొని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని పోలేపల్లిలో శుక్రవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ శ్యాంసుందర్‌రెడ్డి కథనం ప్రకా రం.. గ్రామానికి చెందిన బొల్లం సంపత్ (25) కొత్తగా ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. అందుకోసం తెచ్చిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో ఇంటిలోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డా డు. మృతుడి తండ్రి ఉప్పలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులతో.. పోచమ్మమైదాన్: ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం మధ్యాహ్నం వరంగల్ నగరంలోని గోపాలస్వామి గుడి ఏరియాలో ఉన్న కొత్తవాడ లో చోటు చేసుకుంది. అందె త్రివేణి(35) మహిళాæ సంఘాల ఆర్పీగా కొనసాగుతోంది. ఈక్రమంలో ఆమె మహిళా సంఘాల్లో కొంత అప్పు చేసింది. దాన్ని తీర్చలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది. శనివారం ఇద్దరు కుమార్తెల ఫీజులు కట్టాలంటూ సదరు విద్యాసంస్థ నోటీసులు పంపించారు. దీంతో మనస్తాపానికి గురైన త్రివేణి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్ప డి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఆమె భర్త అందె సతీష్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసు లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తల్లి మృతి చెందిందనే మనస్తాపంతో.. జఫర్‌గఢ్ : తల్లి మృతిచెందిందనే మనస్తాపంతో ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల కేంద్రంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఆలియాబాద్‌కు చెందిన కుంటా ల ఎల్లయ్య కుమారుడు కుంటాల కిరణ్(21) స్థానిక బీసీ హస్టల్ ఉంటూప్రభుత్వ ఉన్నత పాuý ‡శాలలో 10వ తరగతి చదువుతున్నాడు. కాగా, అతడి తల్లి నాలుగేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై మతిస్థిమితం కోల్పోయాడు. ఈ క్రమంలో ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లిన కిరణ్ గ్రామ శివారులోని తమ వ్యవసాయ భూమిలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ శ్యాంసుందర్ తెలిపారు. వ్యాధి నయం కావడం లేదనే మనస్తాపంతో.. మడిపల్లి(హసన్‌పర్తి) : వ్యాధి నయం కావడం లేదనే మనస్తాపంతో మండలంలోని మడిపల్లికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి కాందారి గౌరయ్య(70) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన గత పదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నారు. వైద్యం చేయించుకున్నప్పటికీ ఆరోగ్యంలో ఎ లాంటి మార్పు రాలేదని కుటుంబ సభ్యులు తెలి పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎం జీఎంకు తరలించారు. హసన్‌పర్తి పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. a -
అగాధమే.. ఆత్మహత్యకు కారణమా?
* ఒకే కుటుంబంలో నలుగురి బలవన్మరణం ఘటన * సత్యనారాయణ కుటుంబం చాలాకాలంగా బంధువులకు దూరం * మృతదేహాన్ని ఎటు తీసుకెళ్లాలో తెలియక అయోమయం * ఆ సంఘర్షణతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం ఘట్కేసర్: కుటుంబ పెద్ద మృతదేహన్ని సొంతూరుకు తీసుకెళ్తే ఎదురయ్యే వ్యతిరేకతకు భయపడే నలుగురు ఆత్మహత్య చేసుకొని ఉంటారని మృతుల సమీప బంధువులు తెలిపారు. వరంగల్ జిల్లా మద్దూరు మండలం లద్నూరు గ్రామానికి చెందిన పారుపల్లి సత్యనారాయణ (55) అనారోగ్యంతో మృతి చెందగా.. భార్య మీరా, కూతుళ్లు స్వాతి, నీలిమ, కుమారుడు శివరామకృష్ణ శుక్రవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సత్యనారాయణ ఆదిలాబాద్ జిల్లాలో హౌసింగ్ డీఈగా పనిచేస్తున్నారు. భార్యాపిల్లలు వరంగల్ జిల్లా హన్మకొండలోని టీచర్స్ కాలనీలో ఉంటున్నారు. తల్లిదండ్రులు లద్నూరులోనే నివాసం ఉంటున్నారు. ఆరోగ్యం దెబ్బతినడంతో సత్యనారాయణను చికిత్స నిమిత్తం తరలిస్తుండగా భువనగిరిలో మృతిచెందాడు. అరుుతే మృతదేహాన్ని ఎక్కడికి తీసుకెళ్లి కర్మకాండలు నిర్వహించాలనే సమస్య కుటుంబసభ్యులకు ఎదురైంది. హన్మకొండలో అద్దె ఇంట్లో కర్మకాండలకు ఇంటివారు అనుమతించరు. మీరాకు తల్లిగారింటితోనూ సత్సంబంధాలు లేవు. చాలాకాలంగా సత్యనారాయణ తల్లిదండ్రులకు రాకపోకలు లేవు. ఇన్నేళ్ల తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్తే ఇప్పుడు గుర్తొచ్చామా అంటారు. ఈ వ్యతిరేకతకు భయపడే ఆత్మహత్య చేసుకుని ఉంటారని బంధువులు భావిస్తున్నారు. పరిస్థితుల గురించి తమకు సమాచారం ఇచ్చి ఉంటే తాము ధైర్యం చెప్పే వారమని వారు అంటున్నారు. కుమిలిపోరుు, మానసిక సంఘర్షణతో చావే పరిష్కారమని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు పెళ్లీడుకొచ్చిన పిల్లలకు వివాహాలు కాకపోవడం కూడా ఆందోళనకు కారణమై ఉంటుందన్నారు. కొత్త కారు సంబరం నాలుగు రోజులే.. కొత్త కారు తీసుకొని గత నెల 26న రిజిస్టర్ చేరుుంచారు. నాలుగు రోజులే అందులో తిరిగారు. మృతుని కుమారుడు శివరామకృష్ణ డ్రైవింగ్ చేసేవాడు. గత నెల 29న తండ్రి మృతితో వారు సైతం ఆత్మహత్య చేసుకున్నారు. చివరిసారి నల్లగొండ జిల్లాలో భువనగిరిలోని హోటల్లో భోజనం చేస్తే , ఘట్కేసర్ మండలం అంకుశాపూర్‌లో తుదిశ్వాస వదిలారు. డీఈగా రెండు సంవత్సరాలే.. సత్యనారాయణ హౌసింగ్ బోర్డులో ఏఈగా వరంగల్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాలో పనిచేసి సస్పెండ్‌కు గురయ్యారు. చాలాకాలం విరామం తరువాత డీఈగా ప్రమోషన్ పై ఆసిఫాబాద్‌కు బదిలీపై వెళ్లారు. మద్యానికి బానిసై ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోలేదు. అక్కడ రెండేళ్లే పనిచేసి మృతిచెందారు. ఆరు సెల్ఫోన్లు స్వాధీనం సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యుల మృతదేహాల నుంచి రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ పోలీసులు ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయూ ఫోన్లలోని కాల్ డేటా వెలుగుచూస్తే.. సత్యనారాయణను హైదరాబాద్ తీసుకొచ్చే క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు ఎవరితోనైనా ఫోన్లలో మాట్లాడారా అనేది తెలుస్తుంది. తద్వారా ఆయన కుటుంబం ఆత్మహత్మకు కారణాలు తెలియవ చ్చని భావిస్తున్నారు. -
ఇంటి పెద్ద మరణాన్ని తట్టుకోలేక..
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య - రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ శివార్లలో విషాదం - అనారోగ్యంతో మృతిచెందిన తండ్రి సత్యనారాయణ - మనస్తాపంతో రైలు కింద పడిన భార్య, ముగ్గురు పిల్లలు ఘట్కేసర్ : ఆప్యాయత, అనురాగం, ప్రేమాభిమానాలకు నిలయం ఆ కుటుంబం.. ఒకరి ని విడిచి మరొకరు ఉండలేనంత ప్రేమ వారిది.. అనూహ్యంగా ఆ కుటుంబ పెద్ద మరణించాడు.దాంతో ఆయన భార్యాపిల్లలు తీవ్ర ఆవేదనలో కూరుకుపోయారు. ఆయన లేకుండా తాము జీవించలేమంటూ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం అంకుశాపూర్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. వరంగల్ జిల్లా మద్దూరు మండలం లద్నూరు గ్రామానికి చెందిన పారుపల్లి సత్యనారాయణ (55) ఆ ఇంటి పెద్ద. ఆత్మహత్య చేసుకున్నది ఆయన భార్య మీరా, కుమార్తెలు స్వాతి(33), నీలిమ(28), కుమారుడు శివరామకృష్ణ(22). అనారోగ్యంతో... ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సమీపంలోని కెరిమెరి మండలంలో హౌసింగ్ డీఈగా సత్యనారాయణ పనిచేస్తున్నారు. భార్యాపిల్లలు హన్మకొండలోని టీచర్స్ కాలనీలో ఉంటున్నా రు. ఆయన పెద్ద కుమార్తె, కుమారుడు బీటెక్ చదవగా.. చిన్న కుమార్తె ఎంటెక్ పూర్తిచేసిం ది.సత్యనారాయణ రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు రోజుల కిందట ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆసిఫాబాద్‌కు వెళ్లిన భార్యాపిల్లలు..మెరుగైన చికిత్స కోసం శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరారు.మార్గమధ్యంలో రాత్రి 9 గంటల సమయంలో నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలో ఉన్న ఓ హోటల్లో భోజనం చేశారు.ఆ తర్వాత సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. భువనగిరిలోని ఆస్పత్రికి వెళ్లారు. అప్పటికే సత్యనారాయణ మరణించి నట్లు వైద్యులు చెప్పడంతో వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని కారులోనే డ్రైవర్ పక్కసీటులో ఉంచి, సీటు బెల్టు పెట్టి హైదరాబాద్ వైపు బయలుదేరారు. ఘట్కేసర్ మండలం అంకుశాపూర్ వద్ద హెచ్‌పీసీఎల్ డిపో సమీపంలో హైవే నుంచి పక్కగా వెళ్లి కారును ఆపారు. సత్యనారాయణను వదిలి ఉండలేమనే ఆవేదనతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పట్టాలపై భార్యాపిల్లలు... శనివారం వేకువజామున రైల్వే ట్రాక్‌పై మృతదేహాలున్నాయన్న సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నలుగురు ఆత్మహత్యకు పాల్పడడంతో రైల్వే ట్రాక్‌పై శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి భయానక వాతావరణం నెలకొంది. ట్రాక్ సమీపంలోనే పార్క్ చేసివున్న కారులో సత్యనారాయణ మృతదేహాన్ని, ఆస్పత్రి కేస్ షీట్‌ను పోలీసులు గుర్తించారు. కారులో ఫోన్లోని నంబర్ల ఆధారంగా మృతుడి సోదరుడు రవీందర్‌కు సమాచారమిచ్చారు. ఆయన వచ్చి మృతి చెందినవారిని సత్యనారాయణ, మీరా, స్వాతి, నీలిమ, శివరామకృష్ణగా గుర్తించారు. తమ సోదరుడు సత్యనారాయణ కుటుంబం ఎంతో అన్యోన్యంగా ఉండేదని.. ఎక్కడికెళ్లినా కుటుంబ సభ్యులంతా కలిసే వెళ్లేవారని రవీందర్ చెప్పారు. కుమార్తెల పెళ్లి చేసేందుకు పలుసార్లు సంబంధాలు తెచ్చినా సాకులు చెప్పి వద్దనే వారని తెలిపారు. అర్ధరాత్రి దాటిన తరువాత.. సత్యనారాయణ కుటుంబ సభ్యులు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ పెద్ద సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందడంతో తట్టుకోలేక అందరూ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని మల్కాజిగిరి ఏసీపీ రవిచందర్‌రెడ్డి తెలిపారు. అయినా అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. సత్యనారాయణతో పాటు ఆయన భార్య మీరా, కుమార్తెలు స్వాతి, నీలిమ, కుమారుడు శివరామకృష్ణల మృతదేహాలకు శనివారం సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. సత్యనారాయణ తండ్రి ప్రకాశం వారందరికీ తలకొరివి పెట్టడం అందరినీ కలచివేసింది. చాలా కాలంగా దూరమే.. సత్యనారాయణకు ఇద్దరు సోదరులు ఉండగా.. ఆయన భార్య మీరాకు ఓ సోదరుడు, ఇద్దరు సోదరిలు ఉన్నారు. అయినా వారి కుటుంబం ఎవరితోనూ కలిసేది కాదని బంధువులు చెబుతున్నారు. వారికి ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని.. సత్యనారాయణ మరణించి ఉన్న కారును కూడా ఇటీవలే కొన్నారని పేర్కొన్నారు. కొన్నాళ్ళుగా సత్యనారాయణ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారని... ఆయనకు నయమైతేనే పిల్లలకు పెళ్లిళ్లు అవుతాయనే భావనలో ఉండేవారని తెలిపారు. -
వేర్వేరు చోట్ల నలుగురి ఆత్మహత్య
పాన్‌గల్: కుటుంబ కలహాలు,ఆర్థిక ఇబ్బందులు.. తది తర కారణాలతో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనలు సోమవారం చోటుచేసుకుంది. పోలీ సులు బాధితుల కథనం మేరకు.. పాన్‌గల్ మండలం కొర్లకుంట గ్రామానికి చెందిన కేతావత్ రాములు(35), భార్యకు మధ్య కొంతకాలంగా కుటుంబ కల హాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున రాములు కిరోసిన్ పోసుకుని నిప్పం టించుకున్నాడు. చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలి స్తుండగా.. మార్గమధ్యంలోనే కనుమూశాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నాడు. భర్త వేధింపులు తాళలేక.. వంగూరు: భర్త వేధింపులకు తాళేక ఓ మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. మండలంలోని ఉల్పర గ్రామానికి చెందిన సుగుణమ్మ(35)ను భర్త వెంకటస్వామి తరుచుగా వేధించేవాడు. ఈ క్రమంలో మరోసారి గొడవ జరగడంతో పురుగుమందు తాగింది. చికిత్సకోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది. మృతురాలు సుగుణమ్మ తండ్రి నిరంజన్ ఫిర్యాదు మేరకు భర్తపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. మృతదేహానికి కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలికి ఆంజనేయులు, అనిల్ ఇద్దరు కొడుకులు ఉన్నారు. భార్య తనవెంట రాకపోవడంతో.. పెద్దకొత్తపల్లి: భార్య తనవెంట రాకపోవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని వెన్నచర్ల గ్రామానికి చెందిన గడ్డికోకుల రాములు(35) వ్యవసాయ పొలంలో వేరుశనగ పంటసాగు చేశాడు. ఆదివారం రాత్రి అడవి పందుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు కాపలా వెళ్లేందుకు భార్య అలివేలును తనతో రావాలని రాములు కోరాడు. తన ఆరోగ్యం బాగా లేదని భార్య చెన్నమ్మ చెప్పడంతో వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు చికిత్సకోసం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. మృతుడికి ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. భార్య కాపురానికి రాలేదని.. వీపనగండ్ల: భార్య కాపురానికి రాలేదని సోమవారం ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని గోవర్ధనగిరి గ్రామానికి చెందిన ఆడెమోని ఎల్లస్వామి(30), భాగ్యమ్మ భార్యాభర్తలు. తన భార్య నెలరోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. కాపురానికి రావాలని ఎల్లస్వామి భాగ్యమ్మను కోరాడు. ఆమె రాకపోవడంతో మనస్తాపానికి గురై పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్యతో పాటు కొడుకు ఉన్నాడు. మృతుడి తల్లి రోషమ్మ ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ భీంకుమార్ తెలిపారు. -
ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య
రాజమండ్రి: రాజమండ్రిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. దంపతులతోపాటు వారి ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నాను. కోనసీమలోని అంబాజీపేటకు చెందిన వీరు నగరంలోని హోటల్ ఆనంద్ రీజెన్సీలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.