వేర్వేరు కారణాలతో నలుగురి ఆత్మహత్య | Four suicide for different reasons | Sakshi
Sakshi News home page

వేర్వేరు కారణాలతో నలుగురి ఆత్మహత్య

Published Sun, Sep 4 2016 12:29 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

Four suicide for different reasons

అప్పుల బాధ తాళలేక...
తొర్రూరు : ఉరివేసుకొని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని పోలేపల్లిలో శుక్రవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. హెడ్‌ కానిస్టేబుల్‌ శ్యాంసుందర్‌రెడ్డి కథనం ప్రకా రం.. గ్రామానికి చెందిన బొల్లం సంపత్‌ (25) కొత్తగా ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. అందుకోసం తెచ్చిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో ఇంటిలోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డా డు. మృతుడి తండ్రి ఉప్పలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. 
ఆర్థిక ఇబ్బందులతో.. 
పోచమ్మమైదాన్‌: ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం మధ్యాహ్నం వరంగల్‌ నగరంలోని గోపాలస్వామి గుడి ఏరియాలో ఉన్న కొత్తవాడ లో చోటు చేసుకుంది. అందె త్రివేణి(35) మహిళాæ సంఘాల ఆర్‌పీగా కొనసాగుతోంది. ఈక్రమంలో ఆమె మహిళా సంఘాల్లో కొంత అప్పు చేసింది. దాన్ని తీర్చలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది. శనివారం ఇద్దరు కుమార్తెల ఫీజులు కట్టాలంటూ సదరు విద్యాసంస్థ నోటీసులు పంపించారు. దీంతో మనస్తాపానికి గురైన త్రివేణి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్ప డి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఆమె భర్త అందె సతీష్‌ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసు లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తల్లి మృతి చెందిందనే మనస్తాపంతో.. 
జఫర్‌గఢ్‌ : తల్లి మృతిచెందిందనే మనస్తాపంతో ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల కేంద్రంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఆలియాబాద్‌కు చెందిన కుంటా ల ఎల్లయ్య కుమారుడు కుంటాల కిరణ్‌(21) స్థానిక బీసీ హస్టల్‌ ఉంటూప్రభుత్వ ఉన్నత పాuý ‡శాలలో 10వ తరగతి చదువుతున్నాడు. కాగా, అతడి తల్లి నాలుగేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి  తీవ్ర మానసిక ఒత్తిడికి గురై మతిస్థిమితం కోల్పోయాడు. ఈ క్రమంలో ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లిన కిరణ్‌ గ్రామ శివారులోని తమ వ్యవసాయ భూమిలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ శ్యాంసుందర్‌ తెలిపారు.
వ్యాధి నయం కావడం లేదనే మనస్తాపంతో.. 
మడిపల్లి(హసన్‌పర్తి) :  వ్యాధి నయం కావడం లేదనే మనస్తాపంతో మండలంలోని మడిపల్లికి చెందిన రిటైర్డ్‌  ఉద్యోగి కాందారి గౌరయ్య(70) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన గత పదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నారు. వైద్యం చేయించుకున్నప్పటికీ ఆరోగ్యంలో ఎ లాంటి మార్పు రాలేదని కుటుంబ సభ్యులు తెలి పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎం జీఎంకు తరలించారు. హసన్‌పర్తి పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. a

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement