reasons
-
కంట్లో వలయం కనిపిస్తోందా? ఈ విషయాలు తెలుసుకోండి!
కొంతమందికి కంట్లో నల్లగుడ్డు చుట్టూరా ఓ తెల్లని రింగ్ కనిపిస్తుంటుంది. దీన్ని చూడగానే ఆందోళనకు గురవుతుంటారు. కానీ ఇది అంతగా ఆందోళన చెందాల్సిన అంశమూ కాదు... అంతగా ప్రమాదకారీ కాదు. ఇది కేవలం అలర్జీతో వచ్చిన సమస్య మాత్రమే. మన కన్ను ఆరు బయట ఉండే దుమ్మూ ధూళి వంటి కాలుష్యాలకూ, పుప్పొడికి ఎక్స్పోజ్ అయినప్పుడు... అలర్జీ ఉన్నవాళ్లలో కంటి నల్ల గుడ్డు చుట్టూ ఇలాంటి తెల్లటి రింగ్ కనిపించే అవకాశం ఉంది. అందుకే కేవలం ఇలా రింగ్ కనిపించే వాళ్లు మాత్రమే కాకుండా అందరూ ఈ తరహా కాలుష్యాలకు దూరంగా ఉండాలి. రక్షణ కోసం ప్లెయిన్ గ్లాసెస్ వాడటమూ మంచిదే. ఈ సమస్య ఉన్నవారు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కన్ను స్వచ్ఛమైన నీటితో కడుగుతూ ఉండాలి. డాక్టర్‌ను సంప్రదించి యాంటీ అలర్జిక్ చుక్కల మందు వాడాల్సి ఉంటుంది. (కేవలం రూ. 500తో మొదలై, కష్టాలను ‘పచ్చడి’ చేసింది!)అయితే హానికరం కాదు కదా అంటూ ఈ సమస్యను అలాగే వదిలేస్తే... దీర్ఘకాలం తర్వాత చూపు కాస్తంత మందగించడం, కార్నియా పొర దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి కాబట్టి వీలైనంత త్వరగా కంటి డాక్టర్‌కు చూపించుకొని వారు సూచించే మందులు వాడాలి. -
కవిత అరెస్టుకు కారణం ఏంటి ?
-
వయనాడ్ విషాదానికి ఇదీ ఓ కారణమే..!
కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తూంటారు.అంటే దేవుడి సొంత దేశం అని! మరి...దేవుడు తన సొంత దేశాన్ని ఎలా నాశనం చేసుకున్నాడు?వయనాడ్‌లో అంత విలయం సృష్టించాల్సిన అవసరం ఏమొచ్చింది?ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది దేవుడు కాదు.. మనిషే!ఎందుకంటే జూలై 30న కురిసిన కుంభవృష్టి... పల్లెలకు పల్లెలు కొట్టుకుపోవడం...మానవ చర్యల ఫలితంగా వస్తున్న వాతావరణ మార్పుల ప్రభావమే మరి!!దేవుడి ప్రస్తావన ఎలాగూ తీసుకొచ్చాం కాబట్టి.. కాసేపు రామరాజ్యంలోకి వెళదాం. అప్పట్లో నెలకు రెండు వానలు ఎంచక్కా కురిసేవని, ఏటా బంగారు పంటలు పండేవని.. ప్రజలంతా సుఖ శాంతులతో వర్ధిల్లే వారని పురాణ గాధలు చెబుతాయి. అయితే ఇప్పుడు రాముడు లేడు కానీ.. ప్రకృతిని చెరబడుతున్న రావణాసులు మాత్రం ఎందరో. అభివృద్ది పేరుతో ప్రకృతి సమతౌల్యాన్ని దెబ్బతీయడం, విద్యుత్తు, తదితరాల కోసం పెట్రోలు, డీజిళ్ల విచ్చలవిడి వినయోగం పుణ్యమా అని ఇప్పుడు వాతావరణ మార్పులు మనల్ని కబళించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మొన్నటికి మొన్న ఉత్తరాఖండ్‌లో కురిసిన కుంభవృష్టి... ఢిల్లీ, ముబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహా నగరాలను ముంచెత్తిన వరదలు అన్నీ ప్రకృతి ప్రకోపానికి మచ్చుతునకలే. మరో తాజా ఉదాహరణ వయనాడ్ విలయం!. ఇంతకీ జూలై 30 తేదీన వయనాడ్ ప్రాంతంలో ఏం జరిగింది? అప్పటివరకూ వర్షాభావాన్ని అనుభవిస్తున్న ఆ ప్రాంతం కేవలం ఒకే ఒక్క రోజులో అధిక వర్షపాతం నమోదైన ప్రాంతంగా రికార్డులకు ఎక్కింది. మంచిదే కదా? అనుకునేరు. అతితక్కువ సమయంలో ఎక్కువ వానలు కురవడం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే మేఘాల నుంచి జారిపడే చినుకులను ఒడిసిపట్టేందుకు.. సురక్షితంగా సముద్రం వరకూ తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు అంటే... నదులు, చెరువులు భూమ్మీద లేవు మరి! ఫలితంగానే ఆ విపరీతమైన కుంభవృష్టికి కొండ సైతం కుదేలైంది. మట్టి, బురద, రాళ్లు వేగంగా లోయ ప్రాంతంలోకి వచ్చేసి పల్లెలను మింగేశాయి.ఏటా నైరుతి రుతుపవనాల రాక కేరళతోనే మొదలవుతుంది మనకు తెలుసు. జూన్‌తో మొదలై సెప్టెంబరు వరకూ ఉండే నైరుతి రుతుపవన కాలంలో వయనాడ్ ప్రాంతంలో సగటు వర్షపాతం 2,464.7 మిల్లీమీటర్లు (మి.మి). అయితే గత ఏడాది రుతు పవనాల వైఫల్యం కారణంగా ఇక్కడ 55 శాతం తక్కువ వర్షం నమోదైంది. అంతేకాదు... 128 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షాభావ పరిస్థితులను కేరళ రాష్ట్రం మొత్తం ఎదుర్కొంది. ఈ రాష్ట్రంలోనే ఉన్న వయనాడ్‌లో ఈ ఏడాది జూన్ నుంచి జూలై 10వ తేదీ మధ్యలో సుమారు సాధారణ వర్షపాతం (574.8 మి.మి) కంటే 42 శాతం తక్కువగా 244.4 మి.మి వర్షం మాత్రమే కురిసింది. ఆ తరువాత కొన్ని రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసినా అది సాధారణం కంటే తక్కువగానే ఉండటం గమనార్హం. జూలై 29న నమోదైన తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సగటు వర్షపాతమైన 32.9 మిల్లీమీటర్లలో నాలుగో వంతు కంటే కొంచెం ఎక్కువ. కానీ జూలై 30న పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. సాధారణ 23.9 మిల్లీమీటర్ల స్థానంలో ఏకంగా 141.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. వయనాడ్ ప్రాంతంలోని వియత్రిలోనైతే ఇది పది రెట్లు ఎక్కువ. అలాగే మనటోడిలో 200 మి.మిలు, అంబాలవయ్యల్లో 140 మి.మి. కుపాడిలో 122 మి.మి.ల వర్షం కురిసినట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. అంటే.. నాలుగు నెలల్లో కురవాల్సిన వానలో ఒకే రోజు దాదాపుగా ఆరు నుంచి పది శాతం కురిసేసిందన్నమాట!. జూలై 10 నుంచి జూలై 30 వరకూ కురిసిన వాన కూడా సగటు వర్షపాతంలో 28 శాతం వరకూ ఉండటం గమనార్హం. కర్బన ఉద్గారాల కారణంగా భూగోళం వేడెక్కుతోందని.. పరిస్థితిని అదుపు చేయకుంటే.. ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతాయని శాస్త్రవేత్తలు ఏళ్లుగా చేస్తున్న హెచ్చరికలు నిజమేనని మరోసారి రుజువైనట్లు వయనాడ్ ఉదంతం స్పష్టం చేస్తోంది. -
వయనాడ్ విషాదం: ఈ తరహా విపత్తుల్ని ముందుగా గుర్తించలేమా? మానవ తప్పిదాలతోనే..
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన తీవ్ర బీభత్సం సృష్టించింది. ఈ ప్రకృత్తి విపత్తు కారణంగా వరద, బురద వెల్లువెత్తాయి. వాటి ప్రవాహ మార్గంలో ఉన్న ముందక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ తదితర కుగ్రామాలు సమాధయ్యాయి. సోమవారం అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనతో అసులు కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? వాటికి గల కారణాలేంటీ? ఏంటీ అనే దానిపై అందరూ చర్చిస్తున్నారు.. సహజంగా సంభవించే ప్రకృతి విపత్తుల్లో కొండచరియలు విరిగిపడటం ఒకటి. వానకాలంలో భారీ వర్షాల కారణంగా కొండప్రాంతం నుంచి రాళ్లు, మట్టిపెళ్లలు కిందకు పడటాన్ని కొండచరియలు విరిగిపడటం అంటాం. మన దేశంలో హిమాలయ ప్రాంతం, పశ్చిమ కనుమలు, నీలగిరి కొండల ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా సంభవిస్తోంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఇవి చోటుచేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కొండచరియలు విరిగిపడటానికి సహజమైన కారణాలు కంటే మానవ చర్యలే ఎక్కువ ప్రభావం చూపుతాయి. కొండ ప్రాంతాల్లో నిర్మాణాల సమయంలో ఏటవాలు(స్లోప్) సరిగా ప్లాన్ చేయకపోవటం, వృక్ష సంపదను భారీగా తొలగించటం, కొండపై పడి కిందకు జాలువారే నీరు వెళ్లే వ్యవస్థలో ఆటంకాలు.. కారణాల వల్ల కొండచరియలు విరిగిపడుతుంటాయి.సరైన గ్రేడింగ్ లేకుండా వాలు నిర్మాణం: ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో రోడ్డు, భవన నిర్మాణాల్లో ఏటవాలుకు సరైన గ్రేడింగ్ లేకుండా నిర్మించినప్పుడు అవి పటిష్టంగా ఉండవు. దీంతో కొండప్రాంతాల్లో సమానంగా లేని భూమి ఉపరితలం అధికం అవుతుంది. ఈ కారణంగా కొండచరియలు విరిగిపడతాయి. నీళ్లు వెళ్లే మార్గాల్లో..: సహజంగా కొండల మీద వాన పడినప్పుడు.. ఆ నీరు పల్లానికి వెళ్తుంది. అందుకోసం సహజంగా మార్గాలు ఏర్పడతాయి. అయితే ఆ వ్యవస్థల దిశ మార్చడం, అందులో ఏమైనా మార్పులు చేయడంతో ఆ నీరు కిందకు వెళ్లేందుకు ఆటంకాలు ఏర్పడతాయి. ఫలితంగా.. ఆ వాననీరుతో ల మట్టి, రాళ్లు బలహీనపడి కొండచరియలు హఠాత్తుగా విరిగిపడతాయి.పాత కొండచరియల్లో తవ్వకాలు: పాత కొండచరిచయలు ఉన్న ప్రాంతాల్లో తవ్వకాలు, భారీ నిర్మాణాలు చేపట్టం వల్ల కూడా వర్షాకాలంలో అవి విరిగిపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక.. వీటితో పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం, అధిక వర్షపాతం, కొండ ప్రాంతాల్లో అడవుల నరికివేత, కొండ దిగువ ప్రాంతాల్లో గనులు, క్వారీల తవ్వకాలు వంటివి చేయటం కారణంగా తరచూ కొండచరియలు విరగిపడతాయి. మానవులు చేసే ఈ చర్యలు వల్ల కొండ పైభాగాల్లో ఉండే రాళ్లు, మట్టిలో పటుత్వం తగ్గడంతో అకస్మాత్తుగా ఈ ఘటనలు జరుగుతాయి. భూకంపాల వల్ల కూడా తరచుగా కొండచరియలు విరిగి పడుతుంటాయి.తేడాలు ఇవే..ఎక్కువగా మట్టి, ఇసుక, బండరాళ్ల మిశ్రమాలతో వదులుగా ఉంటుంది. ఫలితంగా వర్షం నీరు వదులుగా ఉండే భాగాల్లోకి సులభంగా చొచ్చుకొనిపోతుంది. అడుగున ఉండే మట్టి నీటితో తడుస్తుంది. తద్వారా కొండవాలు వెంబడి రాళ్లు దిగువ వైపు సులువుగా జారిపోతాయి. ఉత్తర భారత భూభాగం ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక.. భూభాగం శిలలతో కూడి ఉంటే ఇలాంటి ముప్పు తక్కువగా జరగొచ్చు. ఉదాహరణకు.. తెలంగాణ ప్రాంతాల్లో ఉండే గ్రానైట్ లాంటి శిలల్లో సిలికా ధాతువు ఎక్కువగా ఉంటుంది. దానివల్ల శిలల్లో కాఠిన్యత పెరిగి గట్టిగా ఉంటాయి. పగుళ్లు సులువుగా ఏర్పడవు. అయితే..ఉదాహరణకు.. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఖోండలైట్ లాంటి శిలల్లో అల్యూమినియం ధాతువు ఎక్కువుగా ఉండటం వల్ల శిలల్లో కాఠిన్యత తగ్గి గట్టిగా ఉండవు. పగుళ్లు సులభంగా ఏర్పడతాయి. రసానిక చర్యలతో క్రమేణా మట్టిలా మార్పు చెందుతాయి. ఈ మట్టి శిలల పగుళ్ల మధ్య కూడా ఉంటుంది. వర్షాలు పడ్డప్పుడు మట్టి తడిసి శిలలు కొండవాలు వెంబడి దిగువ భాగానికి జారడానికి దోహదపడుతుంది.ముందస్తు సూచనలుకొండచరియలు విరిగి పడటం వంటి విపత్తులు సంభవించే ముందుగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఇంట్లోని తలుపులు, కిటికీలు వాటంతటవే బిగుసుకుపోవడం, నేల, గోడల్లో పగుళ్లు రావడం. స్తంభాలు, వృక్షాలు పక్కకు వంగిపోవటం, కొండల నుంచి మట్టి రాలటం వంటివి చోటు చేసుకుంటాయి. ఇలా చేస్తే..ప్రమాదాల తీవ్రత అధికంగా ఉండే కొండ ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదు. కొండల నుంచి మట్టి, రాళ్లు రోడ్ల మీద పడకుండా గోడలు నిర్మించాలి. ఫెన్సింగ్ ద్వారా రక్షణ కల్పించాలి. పగుళ్లు తక్కువగా ఉండే ప్రాంతాల్లో నిర్మాణాలకు సరైన ఇంజినీరింగ్ ప్రమాణాలను పాటించాలి. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి.కొండ ఏటవాలు ప్రాంతాల్లో ఎక్కువగా మొక్కలు నాటాలి. -
పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఇలా చేయండి..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 28న మహారాష్ట్రలోని యవత్మాల్ను సందర్శించారు. ఆ సందర్భంలోనే మోదీ 9 కోట్ల మంది రైతులకు రూ. 21,000 కోట్ల విలువైన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ 16వ విడతను విడుదల చేశారు. కానీ కొందరికి ఈ స్కీముకు సంబంధించిన డబ్బు ఖాతాలో జమ కాలేదు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ 16వ విడత డబ్బు జమకావడానికి కొందరికి ఇంకా కొంత సమయం పట్టచ్చు. అయితే స్కీమ్ నమోదు చేసుకున్నప్పటికీ.. డబ్బు జమకాకపోతే.. దానికి వివిధ కారణాలు ఉంటాయి. పీఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి డబ్బు ఖాతాలో జమకాకపోవడానికి ప్రధాన కారణం కేవైసీ అప్డేట్ సరిగ్గా లేకపోవడం అని తెలుస్తోంది. మీరు కేవైసీ అప్డేట్ చేసినప్పటికీ.. డబ్బు రాకపోతే మీరు హెల్ప్‌లైన్ నెంబర్లను సంప్రదించవచ్చు.. లేదా అధికారిక వెబ్సైట్లో పిర్యాదు చేయవచ్చు. పీఎమ్ కిసాన్ డబ్బు రాకపోవడానికి కారణాలు లబ్ధిదారుని పేరు తప్పుగా ఉండటం కేవైసీ పూర్తి కాకాపోవడం అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు IFSC కోడ్ తప్పుగా రాయడం తప్పు అకౌంట్ నంబర్స్ ఇవ్వడం బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ కార్డ్ లింక్ చేయకపోవడం ఫీల్డ్ వాల్యూ మిస్సింగ్ వాలీడ్ కానీ బ్యాంక్, ఫాస్ట్ ఆఫీస్ పేరు బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ నెంబర్ రెండూ సరైనవి కానప్పుడు ఇదీ చదవండి: పనామా కాలువను ఓడలు ఎలా దాటుతాయంటే? చూస్తేనే అర్థమవుతుంది -
తరుచు కాళ్ల నొప్పులు వస్తున్నాయా..?
కొందరు తరుచు కాళ్ల నొప్పితో బాధపడుతుంటారు. అదొక దీర్ఘకాలిక వ్యాధిలా ఇబ్బంది పెడుతుంటుంది. ఎందువల్ల వస్తుందో తెలయదు గానీ సడెన్‌గా వచ్చి నానా ఇబ్బందులు పెడుతుంటుంది. ఇలా ఎందుకు జరగుతుంది? ఏమైనా అనారోగ్యాలకు సంకేతమా? ప్రధాన కారణాలేంటి తదితరాల గురించే ఈ కథనం కాళ్ల నొప్పికి చాలా కారణాలు ఉండొచ్చు. అది నొప్పి తీవ్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల ఆరోగ్య సమస్యల కారణంగా కూడా ఇలా కాలి నొప్పి రావొచ్చు. అందుకు గల ప్రధాన కారణాలేంటో చూద్దాం కండరాల ఒత్తిడి లేదా అతిగా కష్టపడినా.. కాలినొప్పిలో అత్యంత సాధారణ కారణాల్లో ఒకటి కండరాల ఒత్తిడి లేదా అతిగా నడవటం. తీవ్రమైన శారీరక శ్రమ, వ్యాయామం చేసే సమయంలో సరికాని విధానంల లేదా మీ కండరాలను వాటి పరిమితికి మించి నెట్టడం వల్ల జరగొచ్చు. గాయాలు లేదా ప్రమాదాలు కాలికి ఏదైన గాయం లేదా ప్రమాదంలో కాళ్లకు తీవ్రంగా గాయం అయినా ఈ నొప్పులు రావడం జరుగుతుంది. ఆ టైంలో బెణకడం జరిగి అది సెట్ అవ్వక కూడా తరుచుగా ఇలా కాలి నొప్పి రూపంలో ఇబ్బంది పెట్టొచ్చు. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్(ప్యాడ్) కాళ్లకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో ఫలకం ఏర్పడినప్పుడూ ప్యాడ్ సంభవిస్తుంది. ఈ పరిస్థితి కండరాలకు రక్తప్రసరణను తగ్గిస్తుంది. ముఖ్యంగా కార్యకలాపాల సమయాల్లో నొప్పికి దారితీస్తుంది. ప్యాడ్ ఉన్న వ్యక్తుల కాళ్లల్లో తిమ్మిరి, లేదా బలహీనత సంభవించొచ్చు నరాల కుదింపు తుంటి లేదా తొడ వెనుక భాగపు నరములు కుదింపు లేదా చిట్లడం వల్ల నొప్పి రావొచ్చు. హెర్నియేటెడ్ డిస్కలు లేదా స్పైనల్ స్టెనోసిస్ వంటి పరిస్థితులు నరాల మీద ఒత్తిడికి దారితీయొచ్చు. ఫలితంగా నొప్పి, జలదరింపు లేదా తిమ్మిరి కాళ్లలో ఏర్పడి నొప్పిలా అనిపిస్తుంది. పరిధీయ నరాల వ్యాధి పరిధీయ నరాల వ్యాధి అనేది తరచుగా మధుమేహం, ఆల్కహాల్ సేవించడం లేదా కొన్ని మందుల కారణంగా పరిధీయ నరాలకు నష్టం జరగడంతో ఈ పరిస్థితి సంభవిస్తుంది. కీళ్ల సమస్య కీళ్లను ప్రభావితం చేసే పరిస్థితులు లేదా ఆర్థరైటిస్ వంటివి కూడా కాళ్లనొప్పులకు దారితీస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా గౌట్ వంటివి కాళ్ల కీళ్లల్లో మంట, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కాళ్లల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఎర్రగా వాపు వచ్చి నొప్పి వస్తుంది. డీప్ వెయిన్ థ్రాంబోసిస్(డీవీటీ)తో సంబంధం ఉన్న కాలు నొప్పి సాధారణంగా నిరంతరం తిమ్మిరి లాంటి అసౌకర్యం లేదా తీవ్రమైన నొప్పి ఉంటుంది. అంతేగాక ప్రభావిత ప్రాంతంలో వెచ్చగా ఎరుపుతో కూడిన నొప్పి ఉంటుంది. ఈ నొప్పి తొడ వరకు విస్తరించొచ్చు. కదిలిన లేదా నిలబడేందుకు చూసిన మరింత తీవ్రంగా నొప్పి వస్తుంది. ఇది తీవ్రంగాక మునుపే వైద్యుడిని తక్షణమే సంప్రదించాలి. లేదంటే రక్తం గడ్డకట్టుకుపోయిన ప్రాంతం చలనం కోల్పోయి తీసివేయడం లేదా ప్రాణాంతకంగానో మారొచ్చు. ముఖ్యంగా పైన చెప్పిన ఏవిధమైన అనుభూతి కలిగిన సమీపంలోని వైద్యుడిని సంప్రదించి, సూచనలు పాటించడం ఉత్తమం. సాధారణ నొప్పిగా నిర్లక్ష్యం వహిస్తే పూర్తిగా నడవలేని స్థితిని కొని తెచ్చుకోవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. (చదవండి: రాగిపాత్రల్లో ఈ పానీయాలను అస్సలు తాగొద్దు!) -
దాడికి కారణమేంటి?
మిరుదొడ్డి (దుబ్బాక)/ సాక్షి, సిద్దిపేట: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తి దాడికి కారణాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. మిరుదొడ్డి మండలం చెప్యాల కు చెందిన నిందితుడు గటాని రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పలు యూట్యూబ్ చానళ్ల లో పనిచేసిన రాజు వైఖరి తొలి నుంచీ వివాదాస్పదమని.. విలేకరి ముసుగులో దందాలకు పాల్పడేవాడని స్థానికులు చెప్తున్నారు. కలప రవాణా వాహనాలను ఆపి వసూళ్లకు పాల్పడటం, కల్లు డిపో, దుకాణాల యజమానుల నుంచి చందాలు వసూలు చేయడం వంటివి చేసేవాడని.. ఈ ఆగడాలతో సహనం నశించిన వ్యాపారులు గతంలో రాజుపై దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయని అంటున్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజు.. జిల్లా ముఖ్య నాయకులతో తిరిగేవాడని చెప్తున్నారు. అయితే ఎంపీపై దాడి చేసేంత పగ ఏమిటన్నది అంతుపట్టడం లేదని అంటున్నారు. అయితే.. దళితబంధు రాకపోవడం, ఇంటి స్థలం ఇవ్వకపోవడంతో ఎంపీపై కక్షగట్టి దాడి చేసి ఉంటాడని ప్రచారం జరుగుతోంది. అధికారులు ఇటీవల మిరుదొడ్డి మండల విలేకరులకు ఇక్కడి చెప్యాల క్రాస్‌రోడ్డులో ఇళ్ల స్థలాలు కేటాయించారు. అందులో తనకూ స్థలం కేటాయించాలని రాజు కోరగా.. ఎంపీతో చెప్పించాలని అధికారులు సూచించినట్టు తెలిసింది. రాజు పలుమార్లు ఈ విషయాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఎన్నికల కోడ్ ఉన్నందున ఇప్పుడు సాధ్యం కాదని చెప్పినట్టు సమాచారం. దీనికితోడు దళితబంధుకు ఎంపికైనవారి జాబితాలో తన పేరు లేకపోవడంతోనూ రాజు ఆగ్రహించాడని, ఇవన్నీ మనసులో పెట్టుకుని, దాడి చేసి ఉంటాడని స్థానికులు చర్చించుకోవడం కనిపించింది. -
హరియాణా అల్లర్ల వెనుక ముందస్తు ప్రణాళిక..!
-
ఫ్రాన్స్ అల్లర్లు - అభివృద్ధి చెందిన దేశానికి ఎందుకీ గతి పట్టింది?
పారిస్: జూన్ 27న ఒక ముస్లిం యువకుడిని స్థానిక ట్రాఫిక్ పోలీసులు కాల్చి చంపిన తర్వాత పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. అభివృద్ధికి చెందిన ఫ్రాన్స్ లాంటి దేశం కూడా ఇలాంటి విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పుడు కుదేలైపోవడమే ప్రపంచ దేశాలను ఆలోచింపజేస్తుంది. అసలు ఫ్రాన్స్‌లో ఈ పరిస్థితులు ఏర్పడటానికి కారణమేంటి? అసలేం జరిగిందంటే.. జూన్ 27న 17 ఏళ్ల నాహేల్ మెరెజోక్ ను ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడన్న కారణంతో ట్రాఫిక్ పోలీసులు అతడిని కాల్చి చంపడంతో వివాదానికి తెరలేచింది. పోలీసుల విచారణలో అతడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని పైగా నేర చరిత్ర కూడా ఉందని తేలింది. ఆ ప్రకారం చూస్తే నేరస్తులు ఎవరైనా తమ నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తే వారిని కాల్చవచ్చని 2017లో అమల్లోకి వచ్చిన ఒక ఫ్రాన్స్ చట్టం చెబుతోంది. టెర్రరిస్టులపై వారు ఇదే చట్టాన్ని అమలు చేస్తుంటారు. అదే చట్టాన్ని నాహేల్ పై కూడా ప్రయోగించినట్లు సమర్ధించుకుంటున్నారు పోలీసులు. వలసదారుల విషయంలో వారు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉంటారు.. కాబట్టి అన్నీ తెలిసే వారు ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపారు. ప్రధాన కారణమిదే.. ఫ్రాన్స్ దేశ జనాభా మొత్తం 67 మిలియన్లయితే అందులో వలసదారుల జనాభా సుమారు 4.5 మిలియన్లు ఉంటుంది. ఆతిధ్య దేశం కనికరిస్తే స్థానికంగా జీవనం కొనసాగించడానికి మాత్రమే అన్నట్టుగా మొదలైన వలసదారుల ప్రయాణం హక్కులు, సమానత్వం అంటూ రెక్కలు విచ్చుకుంటూ సాగింది. France Bizarre forms of Riot, cars flying out of the car park This hasn't even been filmed in the movies. pic.twitter.com/XGkliojCOf — Dialogue works (@Dialogue_NRA) July 2, 2023 ఫ్రెంచి విప్లవం ప్రభావం.. 1789లో ఉవ్వెత్తున ఎగిసిన ఫ్రెంచి విప్లవం వలసదారుల్లో కొత్త ఆలోచనలకు బీజం వేసింది. స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వం పేరిట జరిగిన ఆ ఉద్యమం వలసదారులపై పెను ప్రభావం చూపింది. హక్కుల కోసం పోరాడాలన్న సంకల్పాన్ని వారిలో పుట్టించింది. వారెందుకలా.. వీరెందుకిలా.. ప్రపంచంలో ఎక్కడైనా వలదారులు దేశాలు బయలు వెళ్ళడానికి మూడే ప్రధాన కారణాలను చూడవచ్చు. యుద్ధం, రాజకీయ సంక్షోభం, కటిక దారిద్య్రం. ఈ నేపథ్యంతో వచ్చిన వారిని ఆతిధ్య దేశాలు మొదటిగా సానుభూతితో స్వాగతిస్తుంటాయి. అలాగే చౌకగా పనివారు దొరుకుతారన్న ఆర్ధిక ప్రయోజనంతో కూడా ఆహ్వానిస్తూ ఉంటారు. #French nationalists in the streets of Lyon are ready to fight protesters “Blue, white, red, the France to the French! they chant#FranceRiots pic.twitter.com/88V2O7JCXu — CtrlAltDelete (@TakingoutTrash7) July 3, 2023 అక్కడ మొదలైంది.. ఇక్కడే ఒకటి కొంటే ఒకటి ఉచితమన్న ఫార్ములా అమల్లోకి వస్తుంటుంది. మొదట్లో మెతకగా ఎంట్రీ ఇచ్చిన వలసదారులు కొన్నాళ్ళకో.. కొన్నేళ్ళకో.. మాక్కూడా పౌరసత్వం కావాలని, సమాన హక్కులు కల్పించమని కోరుతూ ఉంటారు. అందుకు ఆయా దేశాలు అంగీకరిస్తే ఎటువంటి సమస్యలూ ఉండవు. కానీ వారు అలా అంగీకరిస్తే స్థానికంగా ఉంటున్నవారికి కొత్త సమస్యలు తీసుకొచ్చినట్టేనని వెనకడుగు వేస్తూ ఉంటారు. పెరిగిన మైనారిటీ జనాభా.. మత విభేదాలు సృష్టించినంతగా జాతి విభేదాలు హింసను ప్రేరేపించకపోవచ్చని నమ్మే ఫ్రాన్స్ దేశం వలసదారులు అక్కడి నియమాలను పాటించాలని, చట్టాలను గౌరవించి ఆచార వ్యవహారాలను పాటించి జీవన విధానాన్ని కొనసాగించాలని కోరుతూ వచ్చింది. అందుకు అంగీకరించిన నేపథ్యంలోనే ఫ్రాన్స్‌లో కేథలిక్ జనాభా తర్వాత ముస్లిం జనాభా కూడా పెరుగుతూ వచ్చింది. అత్యుత్తమ పౌరులు.. 1960ల్లో ఉత్తర ఆఫ్రికా నుండి వలస వచ్చిన ముస్లిం జనాభా ఆనాడు ఫ్రాన్స్ కట్టుబాట్లకు లోబడి చక్కగా ఒదిగిపోయారు. కానీ తర్వాతి తరం వలసదారుల్లో ఈ క్రమశిక్షణ తగ్గుతూ వచ్చింది. ఇది మా సొంత దేశం కాదన్న ధోరణి మొదటి తరంలో ఉన్నంతగా తర్వాతి తరాల్లో లేదు. వలసదారులమన్న భావన కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడైతే మేము వలసదారులమన్న ఆలోచన కూడా అత్యధికులు మర్చిపోయారు. 👉It’s getting so much more obvious that these riots are all orcheststrsted WATCH: Rioters have burned down the largest library in France. The Alcazar library in Marseille included an archive of one million historically significant archives.#FranceRiots #France #FranceOnFire pic.twitter.com/hko8no7yuC — Censored American NO MORE (@NotADirtyDem) July 5, 2023 పెరుగుతోన్న విపరీతవాదం.. ఇక ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోన్న మరో పెనుభూతం ఇస్లాం రాజకీయవాదం.. తాజాగా ఫ్రాన్స్ దేశాన్ని ఇబ్బంది పెట్టిన ఈ సమస్యతో ప్రపంచ దేశాలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. హింసాత్మక సంఘటనలను ప్రేరేపిస్తూ దొరికిందే అవకాశంగా విపరీతవాదం పేట్రేగిపోతోంది. పెరుగుపోతున్న ఈ హింస కారణంగానే ఫ్రాన్స్ దేశం కొన్ని కఠిన నియమాలను, చట్టాలను అమలు చేస్తూ వచ్చింది. తలపాగా నిషేధం, చార్లీ హెబ్డో కార్టూన్లు నిషేధం ఈ కోవలో చేసినవే. ఫ్రాన్స్ దేశం వారు తమ చట్టాలను కఠినంగా అమలు చేయబట్టే జూన్ 27న నాంటెర్రే సంఘటన కూడా చోటు చేసుకుంది. దానిని అనుసరిస్తూనే దేశవ్యాప్తంగా అల్లర్లు చోటు చేసుకున్నాయి. This is France, July 2023, slowly becoming a third world country #France #FranceHasFallen #FranceRiots pic.twitter.com/ouxGzttxRY — FRANCE RIOTS (@FranceRiots) July 7, 2023 ఇది కూడా చదవండి: ఖలిస్తానీలకు దీటుగా భారతీయుల ర్యాలీ.. -
సాయి పల్లవి సినిమాలకు దూరం కావడానికి కారణం ఇదే
-
చాతక పక్షి స్వాతి చినుకులు మాత్రమే తాగుతుందా? సంతానోత్పత్తి కోసం..
బహుశా చాతక పక్షి, మూఢనమ్మకం అవిభాజ్య కవలలు అయుండొచ్చు, అందుకే ఈ పక్షికి చాలా మూఢనమ్మకాలు అంటగట్టారు. చాతక పక్షిని చిట్టి కోకిల, Pied cuckoo, Jacobin Cuckoo (Clamator jacobinus) అని కూడా పిలుస్తారు. వివిధ పేర్లతో పిలువబడే ఈ పక్షి అనేకమంది ప్రేమ జంటల, రైతుల, శాస్త్రవేత్తల దృష్టిని ఎంతో కాలంగా ఆకర్షిస్తూ ఉంది . కవిత్వంలో ఈ పక్షిని ప్రేమద్వేషాల అతిశయోక్తిని వ్యక్తీకరించడానికి కవిసమయంలో వాడితే, రైతులకు, శాస్త్రవేత్తలకు రుతుపవనాలరాకను తెలిపే శుభ సంకేతంగా ఈ పక్షిని సూచిస్తుంటారు. మేఘదూత కవిత్వంలో ఈ చాతక పక్షి గురించి ఎన్నో పురాణాలు, జానపద కథలు మరియు కవిత్వం రచించ బడ్డాయి. కాళిదాసు రూపొందించిన మేఘదూత కవిత్వంలో, ప్రేమ కోసం తపనకు ప్రతీకగా ఈ పక్షిని వర్ణించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఈ పక్షి కవిని ఆకట్టుకోవడం అనేది చాల ఆసుక్తికరమైన విషయమే. ఎప్పటి నుంచో భారతీయ సంస్కృతిలో భాగమైన పక్షి కాబట్టి, దాని చుట్టూ ఉన్న కథను మహిమపరిచే అవకాశం ఉంది. ఇప్పటికీ సామాన్యుల మదిలో ఈ పక్షిపై రకరకాల అపనమ్మకాలు ఉన్నాయనడంలో తప్పులేదు. వార్తా పత్రికలు, వెబ్ సైట్లు మరియు యూట్యూబ్ వీడియోలు ఆ మూఢనమ్మకానినే సత్యంగా చిత్రీకరిస్తున్నాయి. వర్షపు నీరే తాగుతుందా? మన సంప్రదాయం ప్రకారం ఈ చాతక పక్షి నేల మీద ఉండే నీరు త్రాగదని, ఇది కేవలం తొలకరి వర్షపు చినుకులు (స్వాతి వర్షం) ఆకాశం నుంచి పడుతున్నప్పుడే నేరుగా నోరు తెరచి పట్టుకుని తాగుతుంటుందని, లేకుంటే నీరు తాగకుండా రోజుల తరబడి బతుకుతుందని చెబుతుంటారు. ఇవన్నీ అసత్యాలు ఇంకొక మూఢనమ్మకం ఏమిటంటే, చాతక పక్షి తలపై ఉన్న శిఖరంలో వర్షపు నీటిని సేకరించి త్రాగుతుందని, ఒక వేల చాతకం నిలిచిన నీటిని త్రాగడానికి ప్రయత్నించినప్పుడు, ఈ శిఖరం అడ్డుపడడం వల్ల నిలిచిన నీటిని త్రాగదని చెబుతారు. ఈ పక్షి యొక్క మెడ ఎముకలు నిటారుగా ఉండటం వలన దాని మెడను వంచి నీటిని త్రాగదని చెబుతుంటారు. ఇవన్నీ అసత్యాలు ! నిజానికి, ఇది వర్షం పడుతున్నప్పుడే నేరుగా ఆ నీరుని త్రాగదు, నిలిచిన నీళ్లే త్రాగతుంది. ఇప్పటికీ, ఎడారులలో నివసించే కొన్ని జీవులు మాత్రమే, ఆ వాతావరణానికి తట్టుకునే ప్రత్యేకమైన శారీరిక నిర్మాణం కారణంగా నీరు లేకుండా ఎక్కువ కాలం జీవించగలవు. వాటికి అడ్డురాదా? అయితే అన్ని జీవులకు నీరు చాలా అవసరం. ఇంకా, పక్షులు శిఖరం కలిగివుండానికి కారణం, వాటి ప్రత్యర్థులకు తమ దూకుడును వ్యక్తపరిచేందుకు. ఇంకా నీళ్ళు తాగడానికి శిఖరం అడ్డు వచ్చే అవకాశం లేదు, ఐదు వందలకు పైగా పక్షులకు ఈ శిఖరం ఉంది, అంటే అవి నీరు త్రాగడానికి ఈ శిఖరం అడ్డు రాదా?. అన్ని పక్షుల మాదిరిగానే, ఈ పక్షి మెడ ఎముకలు నిటారుగా ఉండవు, అన్నిటికి ఉండే లాగానే దీనికి ఉంటాయి. భారతదేశంలో రెండు సమూహాల చాతక పక్షులు ఉన్నాయి, దక్షిణ భారతదేశానికి మాత్రమే పరిమితమైన ఒక చిన్న దేశీయ సమూహం మరియు రుతుపవనాల ముందు భారీ సంఖ్యలో ఆఫ్రికా నుండి వలస వచ్చే మరో సమూహం. ఈ చిన్న పక్షుల సమూహం చాలా అరుదు, ఎవరూ పెద్దగా గమనించి ఉండరు, కానీ ఈ వలస సమూహం భారీ సంఖ్యలో వస్తుంది. ఈ సమయంలో వర్షాలు లేకపోవడం వల్ల, వేసవి తాపానికి బంజరు భూములు, ఎండిన చెట్లు, జంతువులు, పక్షులు నీటి కొరతతో అల్లాడిపోతుంటాయి. ఈ కాలంలో మనిషి వ్యవసాయ పనులు లేకుండా ఖాళీగా ఉండడం, వ్యాపార లావాదేవీలన్నీ నిలిచిఉండడం చేత, ఇలాంటి సమయంలో మానవుని ఉత్సుకత పకృతిలో చిన్న చిన్న మార్పుల పైనే ఉంటుంది. వర్షపు రాక సూచనగా అకస్మాత్తుగా ఎక్కడి నుంచో పెద్ద సంఖ్యలో వచ్చిన ఈ పక్షులు ‘ప్యూ ప్యూ ప్యూ... ప్యూ ప్యూ ప్యూ... ప్యూ ప్యూ ప్యూ...’ అంటూ గంభీర స్వరాలతో అరుస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి. అదనంగా ఈ పక్షుల రాకతో రుతు పవనాలతో పెద్ద వర్షాలే వస్తాయి, దీనిని గమనించిన మన పెద్దలు చాతక పక్షి రాకను వర్షం వచ్చేందుకు సూచనగా భావిస్తారు. అంటే చాతక పక్షి వచ్చిందంటే వర్షం వస్తుందని ఒక గట్టి నమ్మకం. సంతతి విస్తరించుకోడానికి ఆఫ్రికా ఖండం నుంచి సముద్రం మీదుగా భారతదేశానికి ఒకేసారి వెళ్లడం చాలా కష్టమైన ప్రయాణం కాబట్టి, మే నెలలో వీచే రుతుపవనాల సహాయం పొందే మార్గాన్ని కనుగొన్నాయి. రుతుపవనాల గాలి సహాయంతో అవి వర్షాలు ప్రారంభానికి ముందే భారత ఉపఖండానికి చేరుకుంటాయి, అందుకే చాతకాకి ’వాన దూత’ అని పిలిచేది. ఈ సమయానికే రావడానికి గల మరొక ప్రధాన కారణం ఏమిటంటే భారతదేశంలో దాని యొక్క సంతతి విస్తరించుకోడానికి అది అనువైన వాతావరణం. రుతుపవనాలు విచేస్తునప్పుడు పుష్టిగా ఆహారం అందుబాటులో ఉండడం వలన స్థానిక పక్షులు తమ సంతానోత్పత్తి ప్రారంభిస్తాయి. చాతక ఒక బ్రూడ్ పరాన్నజీవి. అనగా అవి తమ గుడ్డులను పెట్టడానికి, పిల్లలను పెంచడానికి ఇతరులపై ఆధారపడే పక్షులు. ఇవి తమ గూడు నిర్మించకుండా మరొక అతిధేయ పక్షి గూడులో వాటి గుడ్లను పెడతాయి. ఇవి ముఖ్యంగా భారతదేశంలో గుడ్లు పెట్టడానికి బాబ్లర్స్ అనే జాతి పక్షి గూళ్ళపై ఎక్కువగా ఆధారపడతాయి. ఇవి వచ్చిన పనిని పూర్తిచేసి, కొత్తతరం పక్షులతో, ఉత్తర భారతదేశం మీదుగా చలికాలం సమయానికి ఆఫ్రికా ఖండానికి తిరిగివెళ్తాయి. ప్రేమానుభూతిలో కవి అతిశయోక్తితో సృష్టించిన ఊహాగానకవిత్వాన్ని సత్యంగా భావించి ఇన్నాళ్లూ అదే సత్యమని నమ్మి పురాణాన్ని సంపద్రాయంగా భావించడం ఎంతవరకు సమంజసం? ఆ కవిసమయం నుంచి బయటపడి ఒక్కసారైనా శాస్త్రీయ దృక్పథంతో ప్రశ్నించుకోలేమా?. - హరీష ఏఎస్(Hareesha AS) ఫొటోగ్రాఫర్- సుభద్రా దేవి -
కెలికింది సిరాజ్... బ్యాడ్ అయింది కోహ్లీ
-
ఈ ఒక్క కారణం వల్లే ఏజెంట్ మూవీ ప్లాప్ అయ్యిందా ?
-
స్మార్ట్‌ఫోన్‌లో ఇవి గమనించారా? లేకుంటే పేలిపోతాయ్..
ఇటీవల కాలంలో స్మార్ట్ఫోన్లు పేలిపోతున్న సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. స్మార్ట్ఫోన్లు పేలిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కేరళలోని త్రిసూల్ ప్రాంతంలో స్మార్ట్‌ఫోన్ పేలి ఎనిమిదేళ్ల అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. ఇంతకీ స్మార్ట్ఫోన్లు ఎందుకు పేలుతున్నాయి? దానికి గల కారణాలు ఏమిటనేది ఇక్కడ తెలుసుకుందాం. బ్యాటరీ వాపు లేదా ఉబ్బడం: మనం ఉపయోగించే స్మార్ట్ఫోన్లు అప్పుడప్పుడు కిందపడిపోవడం వల్ల బ్యాటరీలోని కొన్ని ముఖ్యమైన పరికరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఇందులోని బ్యాటరీలు ఉబ్బుతాయి. ఇలాంటి ఉబ్బిన బ్యాటరీలు కలిగిన మొబైల్స్ చాలా ప్రమాదకరమైనవి, ఎందుకంటే అవి ఏ సమయంలో అయినా పేలిపోయే ప్రమాదం ఉంది. (ఇదీ చదవండి: భారత్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు కలిగి టాప్ 5 కార్లు - ధరలు ఎలా ఉన్నాయంటే?) బ్యాటరీలో ఏర్పడిన లోపం: స్మార్ట్ఫోన్లను తయారు చేసే కంపెనీలు కట్టుదిట్టమైన భద్రతలతో తయారు చేస్తాయి. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో సాంకేతి సమస్యల వల్ల బ్యాటరీలో ఏదైనా సమస్య రావొచ్చు. ఎంచుకుంటే స్మార్ట్‌ఫోన్‌లో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీని వల్ల ఏర్పడే కెమికల్ బ్యాలెన్ కారణంగా వేడి పెరిగి పేలిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. (ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త ఎలక్ట్రిక్ బైక్ - ధర రూ. 55,555 మాత్రమే!) బ్యాటరీలు వేడెక్కడం: బ్యాటరీలు వేడెక్కడం అనేది మనం నిజ జీవితంలో గమనించే ఉంటాము. ఇది మొబైల్ పేలిపోవడానికి మరో ప్రధానమైన కారణం కావచ్చు. నిజానికి కొంత మంది తమ మొబైల్ ఫోన్స్ లేదా స్మార్ట్ఫోన్లను రాత్రి పూట ఛార్జింగ్ లో ఉంచి అలాగే వదిలేస్తారు. ఇది ప్రమాదానికి ప్రధాన హేతువు అవుతుంది. అంతే కాకుండా వేడిగా ఉన్న ప్రాంతాల్లో మొబైల్స్ ఛార్జింగ్ వేయకూడదు. ఛార్జింగ్ వేసిన సమయంలో ఫోన్ కాల్స్ మాట్లాడటం, ఇతర ఉపయోగాలకోసం వినియోగించడం రెండూ చేయకూడదు. ఇది చాలా ప్రమాదం అని తప్పకుండా గుర్తుంచుకోండి. -
లైఫ్ స్టయిల్ పాలసీలకు అయిదు కారణాలు
అలవాట్లు, అభిరుచులు, ఇష్టాఇష్టాలను బట్టి ప్రతి ఒక్కరికీ ఒకో జీవన విధానం...అంటే లైఫ్ స్టయిల్ ఉంటుంది. విలువైనదిగా పరిగణించే లైఫ్ స్టయిల్‌ను కాపాడుకునేందుకు అంతా ప్రయత్నిస్తుంటాము. బీమా సాధనం దీనికి కూడా ఉపయోగపడుతుంది. మీరు ఇష్టపడేవి చేజారకుండా నివారించలేకపోయినా.. అలాంటి సందర్భాల్లో వాటిల్లే నష్టాన్ని ఎంతో కొంత మేర భర్తీ చేసుకునేందుకు ఇది ఉపయోగకరంగా ఉండగలదు. మిగతా పాలసీలకు భిన్నమైన లైఫ్ స్టయిల్ బీమాను ఎంచుకోవడానికి ప్రధానంగా అయిదు కారణాలు ఉన్నాయి. ► మానసిక, శారీరక ఆరోగ్యానికి రక్షణ కోసం: ఒత్తిళ్లు, ఆందోళనలతో కూడుకున్న ప్రస్తుత ప్రపంచంలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్నీ కాపాడుకోవడం చాలా కీలకంగా ఉంటోంది. సమగ్రమైన హెల్త్ ఇన్సూరెన్స్ ఇందుకు సహాయపడుతుంది. ప్రస్తుతం టెలీ కౌన్సిలింగ్, మానసిక.. శారీరక ఆరోగ్యంపై వెబినార్లు, వెల్నెస్ సెంటర్స్ .. డయాగ్నాస్టిక్ సెంటర్లకు వోచర్లు, తరచూ హెల్త్ చెకప్‌లు మొదలైన వాటికి కూడా బీమా కంపెనీలు కవరేజీనిస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవన విధానాలు పాటిస్తే రెన్యువల్ సమయంలో ప్రీమియంపై డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్లు కూడా ఇస్తున్నాయి. ► సైబర్ క్రైమ్ నుంచి రక్షణ కోసం: కరోనా మహమ్మారి ప్రబలినప్పటి నుంచి సైబర్ నేరాలు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ మోసగాళ్ల వల్ల వాటిల్లే నష్టాల నుంచి వ్యక్తిగత సైబర్ రిస్క్ పాలసీలు కాపాడగలవు. వ్యక్తిగత డేటా లేదా ప్రైవసీకి భంగం కలగడం, ఈ–మెయిల్ ఫిషింగ్, మొదలైన వాటి నుంచి రక్షణనివ్వగలవు. ► రిస్కీ క్రీడల్లో గాయాల బారిన పడితే రక్షణ: మీకు ఎంతో ఇష్టమైన క్రీడలు ఆడేటప్పుడు గాయాలబారిన పడితే రక్షణ కల్పించే విధమైన పాలసీలు ఉన్నాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్, ఎన్డ్యురెన్స్ స్పోర్ట్స్ వంటి రిస్కీ హాబీలు ఉన్న వారికీ స్పోర్ట్స్ ఇన్సూరెన్స్ కవరేజీని బీమా కంపెనీలు ఇస్తున్నాయి. క్రీడలపరంగా వివిధ రకాల గాయాలకు చికిత్స, ఫిజియోథెరపీ మొదలుకుని ప్రమాదవశాత్తూ ఏదైనా అనుకోనిది జరిగితే యాక్సిడెంటల్ డెత్ కవరేజీ వరకూ పలు అంశాలకు కవరేజీ ఉంటోంది. ప్రమాదాల బారిన పడినప్పుడు తలెత్తే వైద్య ఖర్చులు, విరిగిన ఎముకలకు చికిత్స వ్యయాలు, సాహస క్రీడలపరమైన బెనిఫిట్, ఎయిర్ అంబులెన్స్ కవరేజీ లాంటివి అదనంగా తీసుకోవచ్చు. ► పెంపుడు జంతువులకు బీమా: జంతువులను పెంచుకోవడమంటే చాలా బాధ్యతతోను, ఖర్చుతోనూ కూడుకున్న వ్యవహారం. వాటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ ఉండాలి. వెటర్నరీ ఫీజులు, వైద్యం ఖర్చులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో సమగ్రమైన పెట్ కవరేజీ ఉంటే శస్త్రచికిత్సలు .. హాస్పిటలైజేషన్ వ్యయాలు, థర్డ్ పార్టీ లయబిలిటీ మొదలైన భారాలను తగ్గించుకోవచ్చు. ► వివాహ శుభకార్యానికీ కవరేజీ: ప్రస్తుతం పెళ్లిళ్లంటే చాలా ఖర్చుతో కూడుకున్నవిగా మారిపోయాయి. అనుకోనిది ఏదైనా జరిగితే చేసిన ఖర్చంతా వృధాగా పోయే రిస్కులు ఉంటు న్నాయి. అయితే, వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌తో పెళ్లిళ్లలో ఏదైనా ప్రమాదాలు చోటు చేసుకున్నా, విలువైనవి పోయినా కవరేజీని పొందవచ్చు. అంతే కాదు, ఊహించని పరిస్థితుల వల్ల వివాహం రద్దయినా లేదా వాయిదా పడినా అప్పటి వరకూ చేసిన ఖర్చులను నష్టపోకుండా లైఫ్‌స్టయిల్ కవరేజీ కాపాడుతుంది. -
కడుపులో మంట వస్తుందా?.. లైట్ తీసుకోవద్దు.. షాకింగ్ విషయాలు
సాక్షి, గుంటూరు మెడికల్: ఫాస్ట్ ఫుడ్స్‌కు అలవాటు పడడం, పాశ్చాత్య జీవన శైలికి అలవాటు పడడం, ఇంట్లో వంట తగ్గించేసి హోటళ్లలో సమయపాలన లేకుండా మసాలాలతో కూడిన ఆహారం అమితంగా తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులను ప్రజలు కొని తెచ్చుకుంటున్నారు. జీర్ణకోశ వ్యాధులపై ఏమాత్రం అవగాహన లేకపోవడం వల్ల ప్రజలు ఏళ్ల తరబడి ఎడాపెడా మందులు వాడుతూ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులను సంప్రదించకుండా సొంత వైద్యం చేసుకుంటూ చివరకు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ఒకింత వ్యాధులపై అవగాహన కలిగి ఉండటం ద్వారా ప్రాథమిక దశలోనే జీర్ణకోశ వ్యాధులను కట్టడి చేయడంతోపాటు, వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. సొంత వైద్యంతో మొదటికే మోసం.. అల్సర్ సోకగానే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై వైద్యుల సలహాలు పాటించకుండా ఇష్టానుసారంగా మందులు వాడేస్తుంటారు. అల్సరుకు నెలల తరబడి గ్యాస్ మాత్రలు వాడవలసిన అవసరం లేదు. అల్సర్‌కు కారణం కేవలం (యాసిడ్) కాదు. హెచ్. పైలొరి బ్యాక్టీరియా లేదా నొప్పి మాత్రల వల్ల అల్సర్ సోకుతోంది. అల్సరు తగ్గడానికి ఆ బ్యాక్టీరియా కోర్సు వాడితే సరిపోతోంది. అతిగా నొప్పి మాత్రలు వాడితే జీర్ణాశయానికి పుండ్లు పడతాయి. ఆ్రస్పిన్, నొప్పి మాత్రలు వాడుతున్న వారికి పొట్టనొప్పి, మంట వచ్చినా, నల్ల విరోచనాలు, నోటిలో రక్తం వచ్చినా వెంటనే ఎండోస్కోపి చేయించుకోవాలి. జీర్ణాశయ క్యాన్సర్‌ను గుర్తించండి ఫ్యాషన్ కోసం అలవాటు చేసుకునే చెడు వ్యసనాలు జీర్ణ కోశ వ్యాధులకు ముఖ్యంగా జీర్ణాశయ క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి. సిగరేట్, మద్యం సేవించడం వల్ల లివర్ క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది. అతిగా మద్యం తాగితే క్లోమం దెబ్బతింటుంది. తీవ్రమైన పొట్టనొప్పి, వాంతులు, నడుం నొప్పి, షుగరు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దీనిని ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స చేయడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చు. సిగరెట్, మందు తాగేవారు. 50 సంవత్సరాల పైబడినవారు బరువు తగ్గుతున్నా, ఆకలిలేకున్నా, మింగటంలో ఇబ్బంది, రక్త హీనత, అతిగా వాంతులు ఉన్నా, వెంటనే గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులను సంప్రదించాలి. గుట్కా, పాన్ పరాగ్, సిగరెట్లు తాగితే నోటి, జీర్ణాశయ క్యాన్సర్ వస్తుంది. ఆహారనాళం పూర్తిగా మూసుకు పోతుంది. నోటిద్వారా ఆహారం తీసుకోలేరు. ఈలక్షణాలు ఉన్నవారు గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులను సంప్రదించాలి. పిల్లలకు చిల్లర ఇవ్వొద్దు పిల్లలు తినుబండారాల కొనుగోలు కోసం మారం చేసి డబ్బులు అడిగినప్పుడు ఎట్టిపరిస్థితుల్లో వారి చేతికి చిల్లర డబ్బులు ఇవ్వొద్దు. ముఖ్యంగా ఆటలు ఆడుకునే సమయంలో నోటిలో పట్టేంత చిన్న బొమ్మలు, వస్తువులు ఇవ్వవద్దు. తద్వారా పిల్లలు అమాయకత్వంతో వాటిని నోటిలో పెట్టుకుని మింగుతారు. కొన్ని సందర్భాల్లో అది గొంతులో ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందికర పరిస్థితి తలెత్తే ప్రమా దం ఉంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిల్లలకు ఏమీ తినిపించకుండా గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులను సంప్రదిస్తే ఎండోస్కోపి ద్వారా చిల్లర నాణేలు, కడుపులో మింగిన వస్తువులు తొలగించవచ్చు. చదవండి: ఆహారంలో ఉప్పు తగ్గిస్తేనే... లేదంటే ఈ ముప్పు తప్పదు! ఆపరేషన్లు కొంత మందికి మాత్రమే.. ఈమధ్య బిజీ లైఫ్‌లో పడి సక్రమంగా మంచినీరు తీసుకోకపోవడం, త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోకపోవడం, జీర్ణం కావడానికి సరిపడా సమయం ఇవ్వకపోవడం ద్వారా పసరు తిత్తుల్లో రాళ్లు ఏర్పడుతున్నాయి. పసరుతిత్తిలో రాళ్లు ప్రతి 100మందిలో 10మందికి ఉంటాయి. వీరిలో 75 శా తం మందికి వీటివలన ఏ ఇబ్బందీ రాదు. కేవలం పొట్టనొప్పి, కామెర్లు వచ్చినవారికి మాత్రమే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. పసరు తిత్తి మార్గంలో రాళ్లు అడ్డుపడితే ఆపరేషన్ లేకుండా ఇ.ఆర్.సి.పి అను ఎండోస్కోపి పద్ధతిద్వారా తొలగించ వచ్చు. తక్కువ తినండి.. జీర్ణకోశ వ్యాధులు రావడానికి మితిమీరిన ఆహారం తీసుకోవడమే కారణమవుతోంది. తిన్న ఆహారం జీర్ణం కాక శరీర బరువు పెరిగిపోయి వ్యాయామం లేకపోవడంతో లివరులో కొవ్వు చేరే ప్రమాదం ఉంది. మద్యం బాగా తాగే వారికి వచ్చే లివరు జబ్బులన్నీ వీరికి రావచ్చు. తక్కువ తిని ఎక్కువగా నడవాలి. కోతకుట్టులేకుండా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా పొట్టలో ఎటువంటి గడ్డలు అయినా పరీక్షించి ముక్క పరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. – డాక్టర్ షేక్ నాగూర్ బాషా, లివర్, జీర్ణకోశ వ్యాధుల వైద్య నిపుణులు, గుంటూరు -
వివాహేతర సంబంధాలకు కారణాలివే.. సర్వేలో షాకింగ్ విషయాలు
దొర్నిపాడుకు చెందిన ఓ మహిళను వైఎస్సార్ జిల్లా పెద్దముడియం మండలం జంగాలపల్లెకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా భర్త వేధింపులు తాళలేక పిల్లలతో వచ్చి పుట్టినింట్లో జీవనం సాగిస్తున్న ఆమె మరో వ్యక్తితో తప్పటడుగులు వేసింది. విషయం తెలిసి తల్లిదండ్రులు మందలించడంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని వందేళ్ల జీవితానికి 25 ఏళ్లకే ముగింపు పలికింది. ఫలితంగా ఇద్దరు చిన్నారులు దిక్కులేనివారయ్యారు. ఇటీవల ఆళ్లగడ్డ పట్టణంలోని యేసునాథపురానికి చెందిన ఓ వివాహిత ప్రియు డి మోజులో పడి భర్తను హత్య చేసింది. తండ్రి చనిపోవడం, తల్లి జైలుకు వెళ్లడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. కర్నూలు నగరం బంగారుపేటలో నివాసముంటున్న ఓ మహిళ తన భర్త మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని కొంతకాలంగా మధనపడుతుండేది. భర్తలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి వేరే మహిళ మాయలో పడటం..తల్లి బలవన్మరణం చెందడంతో వారి ముగ్గురు పిల్లలూ అనాథలయ్యారు. ఇలాంటి ఘటనలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడూనీడగా ఉండాల్సిన భార్యాభర్తలు వివాహేతర సంబంధాలతో విడిపోతున్నారు. ఒక్కోసారి జీవితాలను అర్ధంతరంగా చాలిస్తూ అభం శుభం తెలియని పిల్లల్ని అనాథలను చేసి వెళ్తున్నారు. కృష్ణగిరి(కర్నూలు జిల్లా): క్షణికావేశంలో తల్లిదండ్రులు చేసే తప్పుల వల్ల వారి జీవితాలు నాశనమవుతుండగా వారి పిల్లలు దిక్కులేని వారవుతున్నారు. వాట్సప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగ్రాం.. సామాజిక మాధ్యమం ఏదైనా వ్యక్తుల మధ్య దూరాన్ని తగ్గించి మరింత దగ్గర చేస్తున్నాయి. ఇవి ఒక్కోసారి కాపురాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. వివాహేతర సంబంధాలకు దారి తీసి భార్యను కడతేర్చే భర్తలు, ప్రియుడి కోసం భర్తను బండరాళ్లతో మోదే భార్యలు ఎక్కువైపోతున్నారు. స్మార్ట్ ఫోన్లు వివాహేతర సంబంధాలకు వారధిగా మారుతున్నాయని తాజాగా విడుదలైన సర్వే వెల్లడించింది. వివాహేతర సంబంధాల కారణంగా దేశంలో ఏటా మూడు వేల మంది హత్యకు గురవుతున్నారు. కట్టుబాట్లను దాటిన ఇష్టాలు, బంధాలను బలి కోరే సంబంధాలు, నైతికం కాని స్నేహాలు జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. దారి తప్పుతున్న దంపతులు పిల్లల బతుకులను చేతులారా ధ్వంసం చేస్తున్నారు. వివాహేతర సంబంధాలతో వినాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నారు. ఆదర్శ దాంపత్యాలు అడుగడుగునా కనిపిస్తున్నా.. ఎక్కడో ఓ చోట విషపు గుళికలా ఇలాంటి వివాహేతర సంబంధాలు తారస పడుతున్నాయి. ఒక్కసారి పట్టు తప్పితే ఆ తప్పులకు మూల్యంగా ప్రాణాలే పోతున్నాయి. అనాథలవుతున్న పిల్లలు వివాహేతర సంబంధాలు భార్యాభర్తల గొడవలతో ముగిసిపోవు. వాటి ప్రభావం పిల్లలపై అధికంగా పడుతోంది. ఎదిగే వయసులో తల్లిదండ్రులు గొడవ పడటం చూసిన పిల్లల మనసులు తీవ్రంగా గాయపడతాయి. మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోవడం, మరొకరు ఆ కారణంతో జైలుకు వెళ్లడం వంటి ఘటనలతో చిన్నారుల బాల్యంపై మరక పడుతోంది. అది జీవితకాలం వెంటాడుతోంది. తల్లిదండ్రుల సంరక్షణలో చక్కగా నవ్వుతూ బతకాల్సిన పిల్లలు ఇలా ఏడుస్తూ రోజులు లెక్కపెట్టాల్సి వస్తోంది. వివాహేతర సంబంధాలకు కారణాలు ♦సంపాదనే ధ్యేయంగా చూసుకుని సంసారాన్ని నిర్లక్ష్యం చేయడం ♦దంపతుల మధ్య తరచూ పడే చిన్నపాటి గొడవలను పెద్దవి చేసుకోవడం ♦భార్యాభర్తల విషయాల్లో కుటుంబ సభ్యుల మితిమీరిన జోక్యం ♦బయటవారితో కేటాయించిన సమయం.. లైఫ్‌పార్టనర్‌తో గడపకపోవడం ♦పెచ్చుమీరిన ఆన్లైన్ స్నేహాలు ♦చెడు వ్యసనాలకు బానిస కావడం ♦బలహీన మనస్తత్వాలు తప్పనిసరిగా పాటించాల్సినవి ♦దాంపత్యంలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలి ♦బకరినొకరు అర్థం చేసుకోవాలి.. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించాలి ♦ఆకర్షణలు తాత్కాలికమే గానీ శాశ్వతం కావనే నిజాన్ని గ్రహించాలి ♦నైతిక విలువలు, సంబంధాలు, కుటుంబ విలువలకు గౌరవం ఇవ్వాలి ♦దాంపత్య జీవితంలో భాగస్వామికి అన్ని విషయాల్లో తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాలి చదవండి: ప్రియుడి మర్మాంగాన్ని కోసిన ప్రియురాలు.. ఆ ఇంట్లో అసలేం జరిగిందంటే.. చట్టం ద్వారా పరిష్కరించుకోవాలి దంపతుల మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు చట్టం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలే తప్ప నేరాలకు పాల్పడకూడదు. కౌన్సెలింగ్ ద్వారా చాలామంది దంపతులు మళ్లీ ఒక్కటై సంతోషంగా ఉంటున్నారు. ఆకర్షణలకు లోనై జీవితాలను నాశనం చేసుకోకూడదు. – కల్లా మహేశ్వరరెడ్డి, డోన్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పిల్లలపై ఎక్కువ ప్రభావం వివాహేతర సంబంధాల వల్ల కలిగే దుష్ఫరిణామాలు పిల్లలపైనే ఎక్కువ ప్రభావితం చూపుతాయి. పెద్దలు చేస్తున్న తప్పిదాలను గమనిస్తూ చిన్నారులు మానసిక క్షోభకు గురవుతారు. దీని వల్ల భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. – మహేశ్వరప్రసాద్, వైద్యాధికారి, కృష్ణగిరి జీవితాలను నాశనం చేసుకోవద్దు మానవ సంబంధాల్లో అత్యంత ప్రమాదకరమైనది వివాహేతర సంబంధం. దీని వల్ల రెండు కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకునే ప్రమాదముంది. వ్యామోహం సరదాగా ప్రారంభమై చివరకు జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతాయి. మా వద్దకు వచ్చే భార్య, భర్తల తగాదాల్లో అధికశాతం ఇలాంటి కేసులే. ఇప్పటికే ఎంతో మందికి కౌన్సెలింగ్ చేసి జీవితాలను నిలబెట్టాం. – యుగంధర్, సీఐ, వెల్దుర్తి -
గుజరాత్ కేబుల్ బ్రిడ్జి విషాదం.. వంతెన కూలడానికి కారణాలివేనా?
గుజరాత్లో మచ్చు నదిపై నిర్మించిన మోర్బీ తీగల వంతెన కూలిపోయిన ఘటన దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకునే గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి కుప్పకూలడంతో దాని మీదున్న వందలాది మంది సందర్శకులు నదిలో పడిపోయారు. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 500 మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 130 మందికి పైగా మృత్యువాత పడ్డారు. దాదాపు 170 మందిని రక్షించారు. మరో వందమంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి మరమ్మతుల కోసం ఆరు నెలల క్రితం మూసేసిన ఈ కేబుల్ బ్రిడ్జిని ఐదు రోజుల క్రితమే పునఃప్రారంభించారు. వారం కూడా గడవక ముందే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. కూలిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనితో సంబంధం ఉన్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హోం మంత్రి షర్ష్ సంఘ్వీ తెలిపారు. ఇప్పటికే ఈ ఘటనపై సెక్షన్లు 304, 308, 114 ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఏర్పాటు చేశారు. చదవండి: Morbi Bridge Collapse: కేబుల్ బ్రిడ్జి విషాదం. 12 మంది ఎంపీ కుటుంబ సభ్యులు మృతి ప్రస్తుతం బ్రిడ్జి కూలడానికి గల కారణాలు ఏంటనే ప్రశ్న అందరి బుర్రల్లో మెదులుతోంది. రద్దీ ఎక్కువగా ఉండటం, పాతకాలపు వంతెన, నిర్వహణ లోపం వంటి పలు కారణాలు తెర మీదకు వస్తున్నాయి. చదవండి: 140 ఏళ్ల నాటి బ్రిడ్జి.. ఇటీవలే మరమత్తులు.. 4 రోజులకే పెను విషాదం #Watch the CCTV footage of the bridge collapse in Gujarat's Morbi. Over 200 people have been rescued from the site of the incident, MoS Harsh Sanghvi said Monday. #MorbiBridgeCollapse Follow live updates: https://t.co/yxhdG5Hw3P pic.twitter.com/d1cKoTSDQw — The Indian Express (@IndianExpress) October 31, 2022 ► మచ్చు నదిపై నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జిపై ఆదివారం సాయంత్రం రద్దీ ఎక్కువగా కనిపించింది. దుర్ఘటన జరిగిన సమయంలో వంతెనపై స్థానికులతో పాటు సందర్శకులు మొత్తం కలిపి 500మంది వరకు ఉన్నట్లుగా కనిపిస్తోంది. వీరిలో ఛట్ పూజా వేడుకల కోసం, సెలవు దినం కావడంతో కుటుంబంతో వచ్చినవారు అధికంగా ఉన్నారు. ఒకేసారి వంతెనపై పరిమితికి మించి ఎక్కువ మంది నడవటం, జన సాంద్రత తట్టుకోలేకే కూలినట్లుగా భావిస్తున్నారు. Over 100 killed and 170 injured in the tragic #Morbi bridge collapse in Gujarat. Several people still remain missing. Rescue efforts underway by Indian Army, Indian Navy, Indian Air Force, NDRF, SDRF, Fire Brigade and local police. Chief Minister and Home Minister at spot. pic.twitter.com/mocM8UuajY — Aditya Raj Kaul (@AdityaRajKaul) October 30, 2022 ► ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో బ్రిడ్జిపై నడుస్తున్న కొందరు యువకులు ఉద్ధేశ పూర్వకంగా వంతెనను విపరీతంగా ఊపుతుండటం, ఒకరినొకరు తోసుకోవడం కనిపిస్తుంది. యువకుల పిచ్చి చేష్టల వల్లే బ్రిడ్జి కూలిందని నెటిజనన్లు మండిపడుతున్నారు. అయితే ఈ వీడియో పాతదా.. ప్రమాదానికి ముందు తీసిందా అనేది తెలియాల్సి ఉంది. ► మోర్బీ వంతెన 140 ఏళ్ల నాటిది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన బ్రిడ్జి కావడం, బలమైన పునాది లేకపోవడం కూడా ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దీనికితోడు మరమత్తుల కోసం వంతెనను మూసేశారు. ఏడు నెలలపాటు మరమత్తులు నిర్వహించి గుజరాత్ న్యూయర్ డే వేడుకల కోసం అక్టోబర్ 26నే తిరిగి సందర్శకుల నిమిత్తం తెరిచారు. అయితే అధికారుల నిర్లక్ష్యం, ఛట్ పూజ నేపథ్యంలో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో వందలాది మంది ఒకేసారి వంతెనపైకి వచ్చారని పలువురు ఆరోపిస్తున్నారు. ►మరమత్తుల అనంతరం వంతెనను తెరవడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది. అంతేగాక వంతెన పటిష్టతను తనిఖీ చేయలేదని, బ్రిడ్జికి మున్సిపల్ అధికారుల నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోకుండానే రీఓపెన్ చేశారని విమర్శలు గుప్పుముంటున్నాయి. అయితే బ్రిడ్జి కూలిన ఘటనపై పోలీసుల దర్యాప్తు పూర్తయితే గానీ అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఎందుకివ్వరు?
ఐక్యరాజ్యసమితి: భారత్, జపాన్, బ్రెజిల్, ఉక్రెయిన్ లాంటి దేశాలకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఎందుకు కల్పించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నిలదీశారు. శాశ్వత సభ్యత్వం ఇవ్వకపోవడానికి కారణాలు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. బుధవారం జరిగిన ఐరాస సాధారణ సభ చర్చా కార్యక్రమంలో వర్చువల్‌గా ప్రసంగించారు. భదత్రా మండలిలో అన్ని గొంతుకలకు అవకాశం కల్పించాలన్నారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా, సెంట్రల్, ఈస్ట్రన్ యూరప్‌లకు వీటో అధికారం ఉండాలని సూచించారు. సమతూకంతో కూడిన భదత్రా మండలిని కోరుకుంటున్నామని ఉద్ఘాటించారు. ఇప్పటికే శాశ్వత సభ్యదేశ హోదా పొందిన రష్యా ఇతర దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించడంపై ఏనాడూ మాట్లాడలేదని జెలెన్స్కీ విమర్శించారు. అందుకు కారణమేంటో చెప్పాలన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇప్పుడు ఐదు శాశ్వత సభ్యదేశాలున్నాయి. అవి రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్, అమెరికా. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మరికొన్ని దేశాలకు ఈ హోదా కల్పించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. తమకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని భారత్ కోరుతున్న సంగతి తెలిసిందే. -
Rishi Sunak: వెన్నుపోటు ఫలితమే.. ఈ ఓటమి!
బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించాలనుకున్న రిషి సునాక్ కల చెదిరింది. ప్రధాని రేసులో లిజ్ ట్రస్ చేతిలో 21వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారాయన. అయితే.. ఈ ఎన్నిక ప్రక్రియ మొదలైన వెంటనే ముందుగా ప్రచారం ప్రారంభించింది రిషి సునాక్. పైగా ఆయన దూకుడు చూసి చాలామంది ఆయనే నెగ్గుతారని భావించారు కూడా. దీనికి తోడు.. విదేశాంగ మంత్రి అయిన ట్రస్‌కు.. టోరీ(కన్జర్వేటివ్) ఎంపీల సపోర్ట్ కూడా మొదట్లో తక్కువే ఉండేది. ఇది ఆయనకు కలిసొస్తుందని భావించారు రాజకీయ విశ్లేషకులు. కానీ, ఆన్లైన్, పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఎన్నికల సీన్ రివర్స్ అయ్యింది. ట్రస్‌కు క్రమక్రమంగా ఆధిక్యం పెరగుతూ వచ్చింది. మరోవైపు సర్వే ఫలితాలు కూడా ట్రస్‌కే మద్దతుగా వచ్చాయి. అయినప్పటికీ రిషి సునాక్ ధైర్యం వీడలేదు.. ప్రచారంలో ఎక్కడా తగ్గలేదు. అధికారంలోకి రాగానే.. పన్నుల భారాన్ని తగ్గిస్తానని ట్రస్ చెప్పగా, సునాక్ మాత్రం ఆమెది తప్పుడు నిర్ణయమని.. తాను మాత్రం ద్రవ్యోల్బణం కట్టడి మీదే ప్రధానంగా దృష్టిసారిస్తానని చెప్పడం చాలామందిని ఆకట్టుకుంది. అయితే పోటాపోటీగా ప్రచారం కార్యక్రమాలు సాగినా.. గ్రాండ్ ప్రచారంతో ఆకట్టుకున్నా.. రిషి సునాక్‌కు ‘ప్చ్’ ఓటమి మాత్రం తప్పలేదు. మరి ఈ మధ్యలో ఏం జరిగింది?.. రిషి సునాక్ ఓటమికి కారణాలను విశ్లేషిస్తే.. నాయకత్వ పోటీలో తనను తాను ‘చిత్తశుద్ధి’ ఉన్న అభ్యర్థిగా నిలబెట్టుకోవాలని సునాక్ శతవిధాల ప్రయత్నించారు. కానీ, వెన్నుపోటుదారుడనే ముద్ర ఆయన్ని ముందుకు పోనివ్వలేదు. టోరీ సభ్యుల్లో ఎక్కువ మంది బోరిస్ జాన్సన్ విధేయులు కావడం.. పైగా ఛాన్సలర్‌గా రాజీనామా చేస్తూ రిషి సునాక్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించడంతో అసలు కథ మొదలైంది. రాజకీయ గురువు సమానుడు.. సీనియర్ రాజకీయ నాయకుడిగా ఎదిగేందుకు కారణమైన వ్యక్తిని(బోరిస్ జాన్సన్)కు వెన్నుపోటు పొడిచాడంటూ టోరీ సభ్యులు రిషి సునాక్‌పై ఆరోపణలు గుప్పించారు. అయితే.. దేశ ఆర్థిక విధానంపై తనకు, జాన్సన్‌కు మధ్య పెద్ద అభిప్రాయ భేదం ఉందని స్పష్టమైన తర్వాతే తనకు వేరే మార్గం లేకుండా పోయిందని రాజీనామాపై సునాక్ ప్రతిస్పందించారు. కానీ, ఆ సమయంలోనే దాదాపు రిషి సునాక్ ఓటమి ఖాయమైంది. బోరిస్ సింపథీ వర్కవుట్ రిషి సునాక్ మంచి సేల్స్‌మ్యాన్.. వెన్నుపోటుదారుడు.. మోసగాడు.. ఈ విమర్శలు చేసింది టోరీ సభ్యులే. తన రాజీనామా ప్రకటన తర్వాత తాత్కాలిక ప్రధానిగా ప్రకటించుకున్న బోరిస్ జాన్సన్.. ‘‘ప్రధాని ఎన్నికల్లో ఎవరికైనా ఓటేయండి.. సునాక్‌కు తప్ప’’ అంటూ ఇచ్చిన పిలుపు టోరీ సభ్యుల్లోకి బలంగా దూసుకెళ్లింది. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. జులై నెలలో బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభ తలెత్తింది. ఆ సమయంలో విపక్షం నుంచే కాకుండా సొంత పార్టీ కన్జర్వేటివ్ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు బోరిస్. సాజిద్ జావిద్, రిషి సునాక్లాంటి వాళ్ల రాజీనామా తర్వాతే.. చాలామంది ఆ బాటలో పయనించారు. సుమారు 50 మంది రాజీనామాలు చేయడంతో.. ఒత్తిడికి తలొగ్గి రాజీనామా చేశారు బోరిస్ జాన్సన్. ఈ తరుణంలో.. లక్ష్యం కాదు.. విశ్వాస ఘాతుకం బ్రెగ్జిట్ సమయంలో, కరోనాను కంట్రోల్ చేయడం, ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కీలక పాత్ర పోషించడం లాంటి చర్యలతో బోరిస్‌పై సింపథీ క్రియేట్ అయ్యింది. అదే ఎన్నికల ప్రచారంలో రిషి సునాక్‌కు మైనస్ అయ్యింది. ప్రధాని పదవి రేసులోకి ఎంటర్ అయిన వెంటనే ఆలస్యం చేయకుండా.. ‘రెడీ ఫర్ రిషి’ నినాదంతో 10 డౌనింగ్ స్ట్రీట్(బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం) వైపు ఉరుకులు మొదలుపెట్టాడు. ఇది చూసి చాలామంది.. ‘‘తన లక్ష్యం(ప్రధాని కావాలనే..) కోసమే జాన్సన్‌ను రాజీనామా వైపు నెట్టేశాడని చర్చించారు టోరీలు. ఇది ద్రోహమని ఫిక్స్ అయిపోయారు. ఈ అభిప్రాయం వల్ల.. నలుగురు మాజీ చీఫ్ విప్‌లు ప్రచారం చేసినా రిషి సునాక్‌కు ప్రయోజనం లేకుండా చేసింది. అదే టైంలో.. ట్రస్ తనను తాను ‘నిజాయితీ పరురాల’నే ప్రచారం చేసుకుంది. బోరిస్ జాన్సన్‌కు నమ్మినబంటునని, తానే ప్రధానినైతే 2019 మేనిఫెస్టో అమలు చేస్తానని ఇచ్చిన హామీలు ట్రస్‌కు బాగా కలిసొచ్చాయి. వివాదాలు.. బ్రిటన్ ప్రధాన మంత్రి పదవి అనే టాప్ జాబ్ రేసులోకి ఎంటర్ కాకముందే నుంచే.. సునాక్ చుట్టూ కొన్ని వివాదాలు నెలకొన్నాయి. ► ఆర్థిక మంత్రిగా ఉన్న టైంలో(ప్రత్యేకించి కరోనా సమయంలో..) ఆయన తీసుకున్న నిర్ణయాలు విమర్శలు దారి తీశాయి. ఎంతలా అంటే.. సొంత పార్టీ నేతలే ఆ నిర్ణయాలను తప్పుబట్టేంతగా. ► భార్య అక్షత మూర్తి ఆస్తులు, వ్యాపార లావాదేవీలు, పన్నుల చెల్లింపుల విషయంలో కూడా ప్రతిపక్ష లేబర్ పార్టీ విమర్శలు గుప్పిస్తూ వచ్చేది. ఇది సొంతపార్టీ కన్జర్వేటివ్‌కు విసుగు తెప్పించింది. ► కరోనా టైంలో శాస్త్రవేత్తలపై నోరు పారేసుకున్నారు రిషి సునాక్. వ్యాక్సిన్ తయారీ వంకతో సైంటిస్టులు ఎక్కువ అధికారం చెలాయిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సైంటిస్టు కమ్యూనిటీల నుంచి తీవ్ర వ్యతిరేకతను కట్టబెట్టింది. ► నార్త్ యార్క్‌షైర్‌లో ఉన్న తన మాన్షన్‌లో భారీగా ఖర్చు చేపట్టి రిషి సునాక్ స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేపట్టడంపై దుమారం రేగింది. నీటి కొరత ఉన్న సమయంలో.. పైగా ఆ ప్రాంతంలో స్విమ్మింగ్‌పూల్స్‌ను మూసేసిన టైంలో సునాక్ చేసిన పని వివాదాస్పదంగా మారింది. ఇక ఓటమిపాలైతే.. ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తానని, ఉత్తర యార్క్‌షైర్‌లోని రిచ్మండ్కు ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతానని, నియోజకవర్గం కోసం పని చేస్తానని ఆయన వ్యాఖ్యానించడం తెలిసిందే. తాజాగా ఓటమి తర్వాత.. తనకు ఓటేసిన వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేశాడు. కన్జర్వేటివ్ అంతా ఒక కుటుంబం అని, లిజ్ ట్రస్ కింద పని చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. -
ట్విన్ టవర్స్ కూల్చివేతకు ప్రధాన కారణాలు ఇవే..
-
Amarinder Singh: కెప్టెన్ కథ కంచికి చేరిందిలా!
ఒకప్పుడు పంజాబ్ కాంగ్రెస్‌ను విజయతీరాలకు నడిపించిన సింగ్ సాబ్ చివరకు అవమానకరంగా నిష్క్రమించారు. కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లు అమరీందర్ రాజీనామాకు కూడా చాలా కారణాలున్నాయి. కానీ ఎన్ని కారణాలున్నా, పట్టుమని ఎన్నికలకు 5 నెలల సమయం కూడా లేని ఈ సమయంలో అమరీందర్‌ను తొలగిస్తారని చాలామంది ఊహించలేదు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రాబోయే ఎన్నికల్లో గెలిచి పంజాబ్‌లో పాగా వేయాలని ఆప్, పునర్వైభవం దక్కించుకోవాలని ఆకాళీదళ్, ఒంటరిగా సత్తా చూపాలని బీజేపీ.. మల్లగుల్లాలు పడుతుంటే, ఇవేమీ పట్టనట్లుగా ఉన్నట్లుండి సీఎంను మార్చాలని కాంగ్రెస్ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. పార్టీ లో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోవడంతో తప్పక ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ వర్గాలు చెప్పాయి. పంజాబ్ రాజకీయాలు తెలిసి కూడా కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకోవడం దుస్సాహసమేనని రాజకీయ పండితుల అభిప్రాయం. మరి ఉన్నట్లుండి అమరీందర్‌ను తొలగించారా? కాంగ్రెస్ హైకమాండ్‌ను ఇందుకోసం ప్రేరేపించిన అంశాలేంటి? అనేవి శేష ప్రశ్నలు. వీటికి సమాధానంగా కొందరు రాజకీయ విశ్లేషకుల అంచనాలు ఇలా ఉన్నాయి... ► మసకబారుతున్న ప్రభ: సంవత్సరాలుగా పంజాబ్ కాంగ్రెస్‌లో ఎదురులేని నేతగా ఉన్న అమరీందర్ ప్రతిష్ట క్రమంగా మసకబారుతోందని కొన్ని సర్వేలు ఎత్తి చూపాయి. ఉదాహరణకు 2019లో ఆయన రేటింగ్ 19శాతం ఉండగా, 2021 ఆరంభంలో 9.8శాతానికి పడిపోయింది. కాంగ్రెస్ సొంతంగా రాష్ట్రంలో నిర్వహించిన సర్వేలో కూడా కెపె్టన్ పట్ల ప్రతికూలత కనిపించినట్లు సమాచారం. ► డ్రగ్ మాఫియా: పంజాబ్ యువతను పీలి్చపిప్పి చేస్తున్న డ్రగ్ మాఫియాపై అమరీందర్ ఉక్కుపాదం మోపుతారని, ఆయన గురు గ్రంధ్ సాహిబ్‌పై ప్రమాణం చేయగానే అంతా ఆశించారు. కానీ గత ప్రభుత్వ హయంలో లాగానే డ్రగ్స్, ఇసుక మాఫి యాపై ఎలాంటి తీవ్ర చర్యలు కెప్టెన్ తీసుకోలేదు. ► బాదల్స్తో సంబంధాలు: 2015లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో గొడవలకు బాదల్స్ కారణమని ప్రజలు భావించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశించారు. కానీ బాదల్స్‌పై ఆరోపణలను హైకోర్టు తోసిపుచి్చంది. దీంతో కెప్టెన్‌పై ప్రజల్లో వ్యతిరేకత ప్రబలింది. పైగా సిక్కు యువత ఎక్కువగా ఉపా కేసుల్లో అరెస్టు కావడం అమరీందర్‌కు ప్రతికూలించింది. ► నెరవేరని ఆశలు: ఎన్నికల హామీల్లో కీలకమైన ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతి వంటివాటిని అమరీందర్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. పెద్దల పింఛను సక్రమంగా అందడం లేదన్న ఆరోపణలు వచ్చాయి. ► ఆందోళనలు: అమరీందర్ పదవీ కాలంలో రాష్ట్రంలో పలు విషయాలపై ఆందోళనలు పెరిగాయి. ప్రభుత్వ ఉద్యోగులు, పారా టీచర్లు, రైతులు, ఆశా వర్కర్లు, నిరుద్యోగులు, దళితులు.. ఇలా అనేక వర్గాలు వారి బాధలు తీరడంలేదంటూ ఆందోళనలు ముమ్మరం చేశాయి. రైతు ఆందోళనలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తున్నాయన్న కెప్టెన్ వ్యాఖ్యలు ఆయనపై విముఖత పెంచాయి. ► అందుబాటులో ఉండరు: అమరీందర్ అందుబాటులో ఉండరనేది ఆయనపై ఎంఎల్ఏల ఆరోపణ. ఎక్కువగా మొహాలీ ఫామ్‌హౌస్‌లో ఉంటారని, ప్రజలను, పారీ్టనేతలను కలవరని, అధికారులపై అతిగా ఆధారపడతారని చాలామందిలో అసంతృప్తి ఉంది. ► సిద్ధూ బ్యాటింగ్: గతంలో కూడా అమరీందర్‌పై పార్టీలో అసంతృప్తులుండేవారు. కానీ వారి గొంతు పెద్దగా వినిపించేది కాదు. ఈసారి సిద్ధూ రూపంలో కెపె్టన్‌కు అతిపెద్ద అసమ్మతి ఎదురైంది. ఇతర అసంతృప్తి నేతల అండ దొరకటం, మంత్రి పదవి పోవటంతో సిద్దూ చూపంతా అమరీందర్‌ను దింపడంపైనే ఉంది. చివరకు తన బ్యాటింగ్ ఫలించి కెపె్టన్ ఇంటిబాట పట్టారు. కానీ అంతమాత్రాన కెప్టెన్‌ను తక్కువగా తీసిపారేయడానికి వీల్లేదు. ఆయన మద్దతుదారులు రాబోయే ఎన్నికల్లో ఏం చేస్తారన్నది పంజాబ్‌లో కాంగ్రెస్ పరిస్థితిని డిసైడ్ చేస్తుందని విశ్లేషకుల భావన. – నేషనల్ డెస్క్, సాక్షి -
బట్టతలను అడ్డుకుందామిలా...!
పురుషులకు మాత్రమే బట్టతల సమస్య ఉంటుందని భావిస్తాం కానీ, చాలామంది మహిళల్లో సైతం ఈ సమస్య కనిపిస్తుంది. నల్ల జుట్టు తెల్లబడడం ఎంత బాధపెడుతుందో, కళ్లముందే జుట్టరాలి బట్టతల రావడం అంతకన్నా ఎక్కువగా బాధిస్తుంది. ముఖ్యంగా యుక్తవయసులో బట్టతల రావడం మానసికంగా కుంగదీస్తుంది. అసలు మనిషిలో బట్టతల ఎందుకు వస్తుంది? మానవ జన్యువుల్లోని బాల్డ్నెస్ జీన్స్ ఆండ్రోజెనిటిక్ అలోపిసియా బట్టతల వచ్చేందుకు కారణమని సైన్సు చెబుతోంది. జీవితంలో ఎదుర్కొనే ఒత్తిళ్లు, తీసుకునే ఆహారంలో పోషకాలు లోపించడం కూడా బట్టతల విషయంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. మహిళల్లో మెనోపాజ్, గర్భధారణ తదితర పలు సమయాల్లో వచ్చే హార్మోనల్ మార్పులు బట్టతలను ప్రేరేపిస్తాయి. పురుషుల్లో కానీ, స్త్రీలలో కానీ గుండెవ్యాధులు, బీపీ, షుగర్, గౌట్, ఆర్థరైటిస్ తదితరాలకు వాడే మందులు బట్టతలకు కారణమవుతుంటాయి. బట్టతలను అడ్డుకోవడం చాలా కష్టం, కానీ దాన్ని జాప్యం చేయవచ్చని నూతన పరిశోధనలు చెబుతున్నాయి. జన్యుసంబంధిత కారణాలు, ఇతరత్రా కారణాలతో వచ్చే బట్టతలను పూర్తిగా ఆపలేకున్నా, చాలా సంవత్సరాలు అడ్డుకోవచ్చన్నది సైంటిస్టుల మాట. సాధారణంగా జుట్టు రాలిపోవడమనేది పురుషుల్లో, స్త్రీలల్లో ఒక ప్రత్యేక ఆకారంలో ఆరంభమవుతుంది. దీన్ని ఎంపీబీ (మేల్ పాట్రన్ బాల్డ్నెస్) లేదా ఎఫ్‌పీబీ (ఫిమేల్ పాట్రన్ బాల్డ్నెస్) అంటారు. ఎంపీబీ ఉన్నవారిలో 20–30 ఏళ్లు వచ్చేసరికి నెత్తిపై ఎం అక్షరం ఆకారంలో జుట్టు రాలడం ఆరంభమై బట్టతల స్టార్టవుతుంది. 80 సంవత్సరాలు వచ్చేసరికి దాదాపు ప్రతిఒక్క మగవారిలో ఎంపీబీ కనిపిస్తుంది. ఆడవారిలో మెనోపాజ్ తర్వాత ఎఫ్‌పీబీ కనిపిస్తుంటుంది. పైన చెప్పిన ఆండ్రోజెనిటిక్ అలపీనియా వల్లనే ఈ ఎంపీబీ, ఎఫ్పీబీలు సంభవిస్తాయి. అలాగే ఇతర కారణాలు దీన్ని వేగవంతం చేస్తాయి. మగవారిలో బట్టతల తల్లితరఫు తాతను బట్టి వస్తుందని ఒక పుకారు ఉంది. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. పురుషుల్లోని ఎక్స్, వై క్రోమోజోముల్లో ఎక్స్ క్రోమోజోము తల్లి నుంచి వస్తుంది. బట్టతల జన్యువులు ఈ ఎక్స్ క్రోమోజోమ్‌లో ఉంటాయి కాబట్టి తల్లి తరపు తాత నుంచి బట్టతల వస్తుందని భావించారు. అయితే బట్టతలకు కారణమయ్యే జన్యువులు దాదాపు 63కాగా, వీటిలో కేవలం కొన్ని మాత్రమే ఎక్స్ క్రోమోజోములో ఉన్నట్లు 2017లో పరిశోధన తేల్చింది. అందువల్ల అటు తండ్రి ఇటు తల్లి తరఫు ఎవరికి బట్టతల ఉన్నా, అది వారసత్వంగా సంక్రమించే అవకాశముంది. బ్రేకులు వేయడం ఎలా? ►పైన చెప్పినట్లు జెనిటికల్ లేదా ఇతర కారణాల వల్ల వచ్చే బట్టతలను ►పూర్తిగా ఆపలేకపోయినా, దాని ప్రక్రియను మందగింపజేయవచ్చని ►పరిశోధకులు చెబుతున్నారు. మరి ఆ మార్గాలేంటో చూద్దాం... ►ప్రతి సమస్యకు ఎవరైనా ముందు చెప్పే పరిష్కారం ఒక్కటే.. ఆరోగ్యవంతమైన జీవన శైలి. అంటే బాలెన్స్ డైట్ అది కూడా ప్రొటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారం, తగినంత నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం, రోజువారీ జీవనంలో ఒత్తిడిని తగ్గించుకోవడంతో బట్టతలతో పాటే పలు జీవన సంబంధిత సమస్యలను అడ్డుకోవచ్చు. ►మైల్డ్ షాంపూను తరచూ వాడడం, బయోటిన్ ఉన్న మసాజ్ ఆయిల్స్‌తో తలపై మసాజ్ చేయడం ద్వారా హెయిర్‌లాస్‌ను మందగింపజేయవచ్చు. అలాగే స్కాల్ప్‌కు వాడే సీరమ్స్‌లో విటమిన్ ఏ, ఈ ఉండేలా చూసుకోవాలి. ఈ రెండూ జుట్టు రాలడం అరికట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ►చాలామంది తడిజుట్టును చిక్కుతీయడానికి బలప్రయోగాలు చేస్తుంటారు. జుట్టు తడిసినప్పుడు బలహీనదశలో ఉంటుందని, ఈ సమయంలో దీన్ని బలంగా గుంజడం వల్ల కుదుళ్లు చెడిపోయి హెయిర్‌లాస్ తీవ్రతరమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల చిక్కుతీయాలంటే బ్రష్షులు, దువ్వెనల బదులు చేతివేళ్లను వాడడం ఉత్తమం. ►వెల్లుల్లి, ఉల్లి, అల్లం రసాలు జీర్ణకోశానికి మంచివని చాలామంది భావిస్తారు. కానీ ఇవి జుట్టుకు కూడా ఎంతో మంచివని పరిశోధనలు చెబుతున్నాయి. వీటిలో ఏదో ఒక రసాన్ని రాత్రి నిద్రపోయే ముందు నెత్తికి పట్టించి పొద్దునే కడిగేయడం ద్వారా వారంరోజుల్లో మంచి ఫలితాన్ని పొందవచ్చు. గ్రీ¯Œ టీ బ్యాగ్స్‌ను నీళ్లలో వేసి గంట ఉంచిన తర్వాత ఆ నీటిని నెత్తికి రాయడం కూడా సత్ఫలితాన్నిస్తుంది. ►నెత్తిపై రాసే మైనోక్సిడిల్ లేదా నోటితో తీసుకునే ఫినాస్టిరైడ్ లాంటి మందులను బట్టతల నెమ్మదింపజేసేందుకు డాక్టర్లు సూచిస్తుంటారు. ►నెత్తిపై రాసే మైనోక్సిడిల్ లేదా నోటితో తీసుకునే ఫినాస్టిరైడ్ లాంటి మందులను బట్టతల నెమ్మదింపజేసేందుకు డాక్టర్లు సూచిస్తుంటారు. ►కొంతమంది నిపుణులు నెత్తిమీద జుట్టు సాంద్రత పెంచుకోవడానికి లేజర్ థెరపీని సూచిస్తున్నారు. దీంతోపాటు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్లను వాడడం ద్వారా తలపై జట్టు పెరుగుదలను ప్రేరేపించవచ్చు. అయితే ఈ విధానాలపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిఉంది. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండడం, జుట్టుకు సంబంధించి సరైన కేర్ తీసుకోవడం, చుండ్రులాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడడంవంటివి పాటించడంతో బట్టతల రాకను వాయిదా వేయవచ్చు. – డి. శాయి ప్రమోద్ -
ఇలా తిరస్కరిస్తారు..
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ పరిధిలోనూ, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లోనూ నామినేషన్ల పర్వం ముగిసింది. నేడు నామినేషన్ల పరిశీలన ప్రక్రియను రిటర్నింగ్ అధికారులు చేపట్టనున్నారు. నిబంధనల ప్రకారం ఏ ఒక్క పత్రం సమరి్పంచకపోయినా ఆ నామినేషన్‌ని తిరస్కరిస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణకు నిర్ధిష్ట కారణాలను అధికారులు చూపాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఎన్నికల అధికారులకు ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల పరిశీలన సమయంలో సమరి్పంచాల్సిన పత్రాలు, ఇతరత్రా వివరాలనూ సూచించింది. ఎన్నికల సంఘం సూచించిన మేరకు నామినేషన్ దాఖలు చేయలేకపోతే దానిని తిరస్కరించే అధికారం ఎన్నికల అధికారికి ఉంటుంది. పరిశీలన సమయంలో అందజేయాల్సిన పత్రాలు, ఇతర వివరాలివీ... ►అభ్యర్థి పేరు, వారి ప్రతిపాదకుడి పేరు కలిగిన ప్రస్తుత ఎన్నికల జాబితా నకలును, లేదా ఎన్నికల జాబితాలోని సంబంధిత భాగమున్న జిరాక్స్, లేదా ఎన్నికల జాబితాలో నమోదైన భాగం ధ్రువీకృత జిరాక్స్ కాపీ. ►అభ్యర్థి వయసుకు సంబంధించి సంతృప్తికరమైన సాక్ష్యం. ►డిపాజిట్‌ను నగదుగా చెల్లించడం జరిగినట్లయితే ఎన్నికల అధికారి ఇచ్చిన రసీదు, ప్రభుత్వ ట్రెజరీ లేదా బ్యాంకులో డిపాజిట్టు చేసినట్లయితే ట్రెజరీ రసీదు లేదా బ్యాంక్ చలానా. ►నామినేషన్ పత్రాలు దాఖలు చేసినప్పటి రసీదు, అభ్యర్థి తన నామినేషన్ ప్రత్నాన్ని సమరి్పంచినప్పుడు ఎన్నికల అధికారి లేదా అ«దీకృత వ్యక్తి అందజేసిన పరిశీలన నోటీసు. ►షెడ్యూల్డు కులం, షెడ్యూల్డు తెగ, వెనుబడిన తరగతులకు రిజర్వు చేసిన ఏదేని స్థానంలో అభ్యర్థి పోటీ చేసినట్లయితే లేదా ఆ వర్గాలకు ఉద్దేశించిన రాయితీలో డిపాజిట్ మొత్తం చెల్లించినట్లయితే ఆ వర్గాలకు చెందినట్లుగా ఆధారం. ►అభ్యర్థి నామినేషన్‌కు వ్యతిరేకంగా ప్రస్తావించే లేదా ప్రస్తావించడానికి అవకాశం ఉన్న ఏదైనా ఆక్షేపణను ఎదుర్కొడానికి అవసరమైన ఏదేని ఇతర సాక్ష్యం.. నామినేషన్ తిరస్కరణకు కారణాలివీ.. ►1965, ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీల చట్టంలోని సెక్షను–13, 13–ఎ, 13–బి, 14, 15, 15–ఎ, 15–బిల కింద అభ్యర్థి ఎన్నికవడానికి అనర్హత కలిగి ఉన్నట్లైౖతే సదరు అభ్యర్థి నామినేషన్ తిరస్కరిస్తారు. ►వార్డు సభ్యుని ఎన్నిక విషయంలో అభ్యర్థిని ప్రతిపాదించే వ్యక్తి పేరు సంబంధిత వార్డుకు సంబంధించిన ఓటరు జాబితాలో నమోదు కాకపోయినట్లయితే ఆ నామినేషన్ తిరస్కరిస్తారు. ►ఎన్నికల నిర్వహణ నియమావళిలోని నియమం–8, నియమం–10ల కింద ఏవేని నిబంధనలను అభ్యర్థి లేక ఆయన ప్రతిపాదకుడు పాటించనట్లయినా ఆ ఎన్నికకు అనర్హుడిగా ప్రకటిస్తారు. ►అభ్యర్థి లేదా వారి ప్రతిపాదకుడు కాకుండా ఇతర వ్యక్తి నామినేషను పత్రాన్ని ఎన్నికల అధికారికి లేదా ఈ విషయంలో ఆయన అధికారం ఇచ్చిన వ్యక్తికి అందజేయకపోయినా తిరస్కరిస్తారు. ►ఎన్నికల అధికారి జారీ చేసిన పబ్లిక్ నోటీసు లో నిర్దేశించిన స్థలంలో నామినేషన్ పత్రాలు అందజేయకపోయినా., నామినేషన్ పత్రంనిర్దేశించిన నమూనాలో లేకపోయినా తిరస్కరణకు గురవుతుంది. ►నామినేషన్ ప్రతాలలో సంతకాలు కోసం కేటాయించిన స్థలంలో అభ్యర్థి లేదా వారి ప్రతిపాదకుడు లేదా ఇద్దరు సంతకాలు చేయకపోయినా తిరస్కరిస్తారు. ►చట్టాన్ని అనుసరించి అభ్యర్థి అవసరమైన డిపాజిట్ చెల్లించకపోయినా, నామినేషను పత్రాలపై అభ్యర్థి లేదా ప్రతిపాదకుని సంతకం వాస్తవమైనది కాక పోయినా అనర్హుడిగా పేర్కొంటారు. ►షెడ్యూలు కులం లేదా షెడ్యూలు తెగలు లేదా వెనకబడిన తరగతుల లేదా మహిళలకు రిజర్వు చేసిన స్థానాల్లో ఆ వర్గాలకు చెందనివారు దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరిస్తారు. ►క్రిమినల్ సంఘటనలు, ఆస్తులు, బాధ్యతలు, విద్యార్హతలకు సంబంధించిన సమాచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన విధంగా అభ్యర్థి అఫిడవిట్ అందజేయకపోయినా సదరు అభ్యర్థి నామినేషన్ తిరస్కరించనున్నారు. -
ఇద్దరే ఇద్దరు !
సాక్షి, బి.కొత్తకోట : 2014 నవంబర్ 5న అంగళ్లులో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బి.కొత్తకోటకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేసి, అందులో వృత్తిపరమైన కోర్సులు అందిస్తామని ప్రకటించారు. దానికోసం నిరుపేద విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు. రెండేళ్లు గడిచినా కదలికలేదు. 2016 చివర్లో కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీచేసి చేతులు దులుపుకుంది. తర్వాత దీని గురించి పట్టించుకోలేదు. రెండు నెలల క్రితం ప్రభుత్వం మరో జీఓ జారీ చేస్తూ అధ్యాపకులు, సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశాలిచ్చింది. పుంగనూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్రామను ఇన్చార్జ్ ప్రిన్సిపాల్‌గా నియమించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఖాళీ భవనాల్లో తరగతులు తాత్కాలికంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల చేరిక కోసం ఇన్చార్జ్ ప్రిన్సిపాల్, కొందరు అధ్యాపకులు పల్లెల్లో పర్యటించి తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించారు. అయినా ఫలితం మాత్రం శూన్యం. చేరింది ఇద్దరే.. కళాశాలలో మంగళవారం నాటికి ఇద్దరు విద్యార్థులు మాత్రమే చేరారు. వీరిలో పెద్దతిప్పసముద్రం మండలం కమ్మపల్లెకు చెందిన సి.నరేంద్ర, రంగసముద్రానికి చెందిన షేక్ వలీ ఉన్నారు. డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల చేరికపై ఉన్నత విద్యాశాఖ ఈనెల 18న ప్రకటన చేసింది. తొలివిడతలో ఈ కళాశాలలో చేరిన వారు ఇద్దరే. ఈ నెలాఖరులో మరోసారి ప్రకటన ఇవ్వనుంది. బి.కొత్తకోట కళాశాలలో ఈ విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభించాలంటే బీఏకు 25మంది, బీకాంకు 25 మంది విద్యార్థులు అవసరం. ఈ సంఖ్యను ఈనెల 30వ తేదీలోగా చేరుకోకుంటే తరగతులు ప్రారంభమయ్యేది ప్రశ్నార్థకమే. కారణాలేమిటి? డిగ్రీ కళాశాలను ప్రారంభిస్తున్నా విద్యార్థులు చేరకపోవడానికి ప్రభుత్వ పరంగా చర్యలు సక్రమంగా లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆలస్యంగా జీఓ జారీ చేయడం, విద్యార్థుల చేరిక విషయంలో సరైన ప్రచారం లేకపోవడం కనిపిస్తోంది. ప్రయివేటు కళాశాల సిబ్బంది పల్లెలకు వెళ్లి ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులను చేర్పించుకోవడం, టీసీలు తీసుకోవడం లాంటి చర్యలతో ప్రభుత్వ కళాశాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలిగించే ఈ కళాశాల తరగతుల నిర్వహణకు తగిన సంఖ్య లేకపోవడం ఆవేదన కలిగిస్తోందని ప్రభుత్వ అధ్యాపకులు చెబుతున్నారు. మిగిలిన 10 రోజుల్లోనైనా ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కాపాడుకునే వీలుంది.