Reasons Behind Why Smartphones Are Catching Fire, Know Details Inside - Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్‌లో ఇవి గమనించారా? లేకుంటే పేలిపోతాయ్..

Published Sun, Apr 30 2023 7:20 AM | Last Updated on Sun, Apr 30 2023 12:02 PM

Why smartphones are catching fire reasons - Sakshi

ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్లు పేలిపోతున్న సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్లు పేలిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కేరళలోని త్రిసూల్ ప్రాంతంలో స్మార్ట్‌ఫోన్ పేలి ఎనిమిదేళ్ల అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. ఇంతకీ స్మార్ట్‌ఫోన్లు ఎందుకు పేలుతున్నాయి? దానికి గల కారణాలు ఏమిటనేది ఇక్కడ తెలుసుకుందాం.

బ్యాటరీ వాపు లేదా ఉబ్బడం:
మనం ఉపయోగించే స్మార్ట్‌ఫోన్లు అప్పుడప్పుడు కిందపడిపోవడం వల్ల బ్యాటరీలోని కొన్ని ముఖ్యమైన పరికరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఇందులోని బ్యాటరీలు ఉబ్బుతాయి. ఇలాంటి ఉబ్బిన బ్యాటరీలు కలిగిన మొబైల్స్ చాలా ప్రమాదకరమైనవి, ఎందుకంటే అవి ఏ సమయంలో అయినా పేలిపోయే ప్రమాదం ఉంది. 

(ఇదీ చదవండి: భారత్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు కలిగి టాప్ 5 కార్లు - ధరలు ఎలా ఉన్నాయంటే?)

బ్యాటరీలో ఏర్పడిన లోపం:
స్మార్ట్‌ఫోన్లను తయారు చేసే కంపెనీలు కట్టుదిట్టమైన భద్రతలతో తయారు చేస్తాయి. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో సాంకేతి సమస్యల వల్ల బ్యాటరీలో ఏదైనా సమస్య రావొచ్చు. ఎంచుకుంటే స్మార్ట్‌ఫోన్లో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీని వల్ల ఏర్పడే కెమికల్ బ్యాలెన్ కారణంగా వేడి పెరిగి పేలిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

(ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త ఎలక్ట్రిక్ బైక్ - ధర రూ. 55,555 మాత్రమే!)

బ్యాటరీలు వేడెక్కడం:
బ్యాటరీలు వేడెక్కడం అనేది మనం నిజ జీవితంలో గమనించే ఉంటాము. ఇది మొబైల్ పేలిపోవడానికి మరో ప్రధానమైన కారణం కావచ్చు. నిజానికి కొంత మంది తమ మొబైల్ ఫోన్స్ లేదా స్మార్ట్‌ఫోన్లను రాత్రి పూట ఛార్జింగ్ లో ఉంచి అలాగే వదిలేస్తారు. ఇది ప్రమాదానికి ప్రధాన హేతువు అవుతుంది. అంతే కాకుండా వేడిగా ఉన్న ప్రాంతాల్లో మొబైల్స్ ఛార్జింగ్ వేయకూడదు. ఛార్జింగ్ వేసిన సమయంలో ఫోన్ కాల్స్ మాట్లాడటం, ఇతర ఉపయోగాలకోసం వినియోగించడం రెండూ చేయకూడదు. ఇది చాలా ప్రమాదం అని తప్పకుండా గుర్తుంచుకోండి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement