Catching fire
-
స్మార్ట్‌ఫోన్‌లో ఇవి గమనించారా? లేకుంటే పేలిపోతాయ్..
ఇటీవల కాలంలో స్మార్ట్ఫోన్లు పేలిపోతున్న సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. స్మార్ట్ఫోన్లు పేలిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కేరళలోని త్రిసూల్ ప్రాంతంలో స్మార్ట్‌ఫోన్ పేలి ఎనిమిదేళ్ల అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. ఇంతకీ స్మార్ట్ఫోన్లు ఎందుకు పేలుతున్నాయి? దానికి గల కారణాలు ఏమిటనేది ఇక్కడ తెలుసుకుందాం. బ్యాటరీ వాపు లేదా ఉబ్బడం: మనం ఉపయోగించే స్మార్ట్ఫోన్లు అప్పుడప్పుడు కిందపడిపోవడం వల్ల బ్యాటరీలోని కొన్ని ముఖ్యమైన పరికరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఇందులోని బ్యాటరీలు ఉబ్బుతాయి. ఇలాంటి ఉబ్బిన బ్యాటరీలు కలిగిన మొబైల్స్ చాలా ప్రమాదకరమైనవి, ఎందుకంటే అవి ఏ సమయంలో అయినా పేలిపోయే ప్రమాదం ఉంది. (ఇదీ చదవండి: భారత్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు కలిగి టాప్ 5 కార్లు - ధరలు ఎలా ఉన్నాయంటే?) బ్యాటరీలో ఏర్పడిన లోపం: స్మార్ట్ఫోన్లను తయారు చేసే కంపెనీలు కట్టుదిట్టమైన భద్రతలతో తయారు చేస్తాయి. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో సాంకేతి సమస్యల వల్ల బ్యాటరీలో ఏదైనా సమస్య రావొచ్చు. ఎంచుకుంటే స్మార్ట్‌ఫోన్‌లో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీని వల్ల ఏర్పడే కెమికల్ బ్యాలెన్ కారణంగా వేడి పెరిగి పేలిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. (ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త ఎలక్ట్రిక్ బైక్ - ధర రూ. 55,555 మాత్రమే!) బ్యాటరీలు వేడెక్కడం: బ్యాటరీలు వేడెక్కడం అనేది మనం నిజ జీవితంలో గమనించే ఉంటాము. ఇది మొబైల్ పేలిపోవడానికి మరో ప్రధానమైన కారణం కావచ్చు. నిజానికి కొంత మంది తమ మొబైల్ ఫోన్స్ లేదా స్మార్ట్ఫోన్లను రాత్రి పూట ఛార్జింగ్ లో ఉంచి అలాగే వదిలేస్తారు. ఇది ప్రమాదానికి ప్రధాన హేతువు అవుతుంది. అంతే కాకుండా వేడిగా ఉన్న ప్రాంతాల్లో మొబైల్స్ ఛార్జింగ్ వేయకూడదు. ఛార్జింగ్ వేసిన సమయంలో ఫోన్ కాల్స్ మాట్లాడటం, ఇతర ఉపయోగాలకోసం వినియోగించడం రెండూ చేయకూడదు. ఇది చాలా ప్రమాదం అని తప్పకుండా గుర్తుంచుకోండి. -
గిన్నిస్ రికార్డుల్లోకి జెన్నీఫర్ లారెన్స్
సుప్రసిద్ధ హాలీవుడ్ నటి జెన్నీఫర్ లారెన్స్ కీర్తి కిరీటంలో ఇప్పుడు మరో తురాయి వచ్చి చేరింది. అత్యంత విజయవంజమైన సినీ హీరోయిన్గా ఆమె తాజాగా గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కారు. విశేష ప్రాచుర్యం పొందిన హంగర్ గేమ్స్ సిరీస్ చిత్రాల్లో కట్నిస్ ఎవర్డీన్ పాత్ర పోషించడం ద్వారా జెన్నీఫర్ లారెన్స్‌ను ఈ అదృష్టం వరించింది. ‘ది హంగర్ గేమ్స్’, దానికి సీక్వెల్ అయిన ‘క్యాచింగ్ ఫైర్’ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల పౌండ్లకు పైగా వసూళ్ళు సాధించడంతో ఈ రికార్డు సాధ్యమైందని ‘టెలిగ్రాఫ్’ పత్రిక పేర్కొంది. 2010 నాటి ‘వింటర్స్ బోన్’ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అందాల భామ ‘ఎక్స్ మెన్ - ఫస్ట్ క్లాస్’, దాని సీక్వెల్ అయిన ‘ఎక్స్ మెన్ - డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్’, ‘అమెరికన్ హజిల్’ లాంటి విజయవంతమైన చిత్రాల్లో ప్రధాన భూమిక పోషించారు. డేవిడ్ ఓ రస్సెల్ రూపొందించిన ‘సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్’లో నటనకు గాను 2013 ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ నటిగా ఎంపికైన ఘనత ఈ హాలీవుడ్ నటిది. ఆమెతో పాటు, ఇంటర్నెట్లో అత్యధికులు అన్వేషించిన పాప్‌స్టార్‌గా సింగర్ మిలీ సైరస్ కూడా తాజాగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు.