Best Mobile Phones Under 15,000 In India; Check Mobile List - Sakshi
Sakshi News home page

Best Smartphones: తక్కువ ధరలో బెస్ట్ మొబైల్ కావాలంటే.. నచ్చిన ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి!

Published Thu, Aug 3 2023 11:50 AM | Last Updated on Thu, Aug 3 2023 12:39 PM

Best Smartphones under rs 15000 Redmi 12 5G to iQOO Z6 Lite 5G - Sakshi

Best Mobile Phones Under 15,000: భారతీయ మార్కెట్లో రోజు రోజుకి కొత్త ఉత్పత్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇందులో స్మార్ట్‌ఫోన్లు ఎక్కువగా ఉన్నాయి. చాలా బ్రాండ్స్ ఖరీదైనవి కాగా.. మరికొన్ని బడ్జెట్ ధరలోనే లభిస్తాయి. ఆగష్టు నెలలో రూ. 15,000 కంటే తక్కువ ధర కొనుగోలుచేయదగిన టాప్ 5జీ మొబైల్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

రెడ్‌మీ 12 5జీ (Redmi 12 5G)..
ఆధునిక మార్కెట్లో రెడ్‌మీ మొబైల్స్‌కి డిమాండ్ భారీగా ఉంది. దీనికి కారణం తక్కువ ధర వద్ద వినియోగదారునికి కావలసిన ఫీచర్స్ లభించడమే. మన జాబితాలో బడ్జెట్ ధరలో లభించే స్మార్ట్‌ఫోన్లలో రెడ్‌మీ 12 5జీ ఒకటి. దీని ధర రూ. 10,999 మాత్రమే. ఇది స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌ కలిగి మంచి కెమెరా సెటప్ కూడా పొందుతుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎమ్14 5జీ (Samsung Galaxy M14 5G)..
శాంసంగ్ కంపెనీకి చెందిన 'గెలాక్సీ ఎమ్14 5జీ' రూ. 15,000 కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ మోడల్. రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా గేమింగ్ వంటి వాటికి కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉండే ఈ మొబైల్ 93Hz డిస్‌ప్లే పొందుతుంది. మంచి డిజైన్, అద్భుతమైన బ్యాటరీ పర్ఫామెన్స్ కలిగి వినియోగదారులకు అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుంది.

ఇదీ చదవండి: ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి!

రియల్‌మీ నర్జో ఎన్53 5జీ (Realme Narzo N53)..
చూడటానికి ఐఫోన్ మాదిరిగా కనిపించడమే కాకుండా వినియోగదారులను ఒక్క చూపుతోనే ఆకట్టుకునే ఈ 'రియల్‌మీ నర్జో ఎన్53 5జీ' మన జాబితాలో చెప్పుకోదగ్గ స్మార్ట్‌ఫోన్. ఇది ప్రత్యేకంగా గేమింగ్ ఫోన్ కానప్పటికీ.. గేమ్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఫింగర్‌ప్రింట్ రెసిస్టెంట్ బ్యాక్ ప్యానెల్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది.

ఇదీ చదవండి: ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌పై జొమాటో ద్వారా రివేంజ్! యువతి చేసిన పనికి..

ఐక్యూ జెడ్6 లైట్ 5జీ (iQOO Z6 Lite 5G)..
మన జాబితాలో తక్కువ ధరలో లభించే మరో మొబైల్.. ఐక్యూ జెడ్6 లైట్ 5జీ. ఇది ఆకర్షణీయమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ఎస్ఓసీ చిప్‌సెట్‌ కలిగి, మంచి బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉంటుంది.అంతే కాకుండా ఇందులో 50 మెగా పిక్సెల్ డ్యూయెల్ రియర్ కెమెరా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement