Top 5 Best Smartphones: ఆధునిక కాలంలో మనిషి జీవితంలో ఒక భాగమైపోయిన స్మార్ట్‌ఫోన్ ఎవరి చేతిలో చూసిన కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో లక్షల్లో లభించే మొబైల్స్ ఉన్నాయి, సరసమైన ధరలో లభించే ఫోన్లు ఉన్నాయి. ఈ కథనంలో రూ. 20 వేలు కంటే తక్కువ ధర వద్ద లభించే ఐదు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లను గురించి మరిన్ని తెలుసుకుందాం.
రెడ్‌మీ నోట్ 12
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన రెడ్‌మీ బ్రాండ్‌కి సంబంధించిన 'నోట్ 12' రూ. 20,000 కంటే తక్కువ ధర లభించే బెస్ట్ మోడల్. దీని ధర రూ. 16,999. ఇందులోని 5,000mAh బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్ ద్వారా పనిచేసే ఈ మొబైల్ 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్లను పొందుతుంది. ఇది 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌కి సపోర్ట్ చేస్తుంది.
ఐక్యూ జెడ్7
రూ. 18,999 వద్ద లభించే 'ఐక్యూ జెడ్7' మన జాబితాలో రెండవ ఉత్తమ మోడల్. ఇందులో 5,000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు 6.38 ఇంచెస్ 90Hz AMOLED డిస్‌ప్లే ఉంటాయి. ఈ మొబైల్ 64 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా పొందుతుంది.
మోటో జీ73
దేశీయ విఫణిలో ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను పొందుతున్న మోటో బ్రాండ్ మొబైల్ ఇప్పటికీ అదే రీతిలో ముందుకు సాగుతున్నాయి. ఇందులో మోటో జీ73 స్మార్ట్‌ఫోన్ రూ. 18,999 వద్ద లభించే పాపులర్ మోడల్. ఇది 6.5 ఎల్‌సీడీ డిస్‌ప్లే పొందుతుంది. ఇందులోని 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జర్‌కి సపోర్ట్ చేస్తుంది.
రియల్‌మీ 10 ప్రో 5జీ
రియల్‌మీ 10 ప్రో 5జీ కూడా మన జాబితాలో సరసమైన వద్ద లభించే బెస్ట్ మోడల్. దీని ధర రూ. 18,999. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో LCD ప్యానెల్ పొందుతుంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెసర్ ఉంటుంది. ఈ మొబైల్ 5000 mAh బ్యాటరీ కలిగి 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ
రూ. 19,999 వద్ద లభించే 'వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ' ఆధునిక ఫీచర్స్ కలిగిన అద్భుతమైన మోడల్. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695జీ 5జీ ప్రాసెసర్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 ఇంచెస్ ఫుల్ HD+ LCD డిస్‌ప్లే కలిగిన ఈ మోడల్ 2MP మాక్రో లెన్స్, 2MP డెప్త్ సెన్సార్‌తో పాటు హై రిజల్యూషన్ 108MP ప్రైమరీ సెన్సార్ పొందుతుంది. ఇందులోని 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment