సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ పరిధిలోనూ, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లోనూ నామినేషన్ల పర్వం ముగిసింది. నేడు నామినేషన్ల పరిశీలన ప్రక్రియను రిటర్నింగ్ అధికారులు చేపట్టనున్నారు. నిబంధనల ప్రకారం ఏ ఒక్క పత్రం సమరి్పంచకపోయినా ఆ నామినేషన్‌ని తిరస్కరిస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణకు నిర్ధిష్ట కారణాలను అధికారులు చూపాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఎన్నికల అధికారులకు ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల పరిశీలన సమయంలో సమరి్పంచాల్సిన పత్రాలు, ఇతరత్రా వివరాలనూ సూచించింది. ఎన్నికల సంఘం సూచించిన మేరకు నామినేషన్ దాఖలు చేయలేకపోతే దానిని తిరస్కరించే అధికారం ఎన్నికల అధికారికి ఉంటుంది.
పరిశీలన సమయంలో అందజేయాల్సిన పత్రాలు, ఇతర వివరాలివీ...
►అభ్యర్థి పేరు, వారి ప్రతిపాదకుడి పేరు కలిగిన ప్రస్తుత ఎన్నికల జాబితా నకలును, లేదా ఎన్నికల జాబితాలోని సంబంధిత భాగమున్న జిరాక్స్, లేదా ఎన్నికల జాబితాలో నమోదైన భాగం ధ్రువీకృత జిరాక్స్ కాపీ.
►అభ్యర్థి వయసుకు సంబంధించి సంతృప్తికరమైన సాక్ష్యం.
►డిపాజిట్‌ను నగదుగా చెల్లించడం జరిగినట్లయితే ఎన్నికల అధికారి ఇచ్చిన రసీదు, ప్రభుత్వ ట్రెజరీ లేదా బ్యాంకులో డిపాజిట్టు చేసినట్లయితే ట్రెజరీ రసీదు లేదా బ్యాంక్ చలానా.
►నామినేషన్ పత్రాలు దాఖలు చేసినప్పటి రసీదు, అభ్యర్థి తన నామినేషన్ ప్రత్నాన్ని సమరి్పంచినప్పుడు ఎన్నికల అధికారి లేదా అ«దీకృత వ్యక్తి అందజేసిన పరిశీలన నోటీసు.
►షెడ్యూల్డు కులం, షెడ్యూల్డు తెగ, వెనుబడిన తరగతులకు రిజర్వు చేసిన ఏదేని స్థానంలో అభ్యర్థి పోటీ చేసినట్లయితే లేదా ఆ వర్గాలకు ఉద్దేశించిన రాయితీలో డిపాజిట్ మొత్తం చెల్లించినట్లయితే ఆ వర్గాలకు చెందినట్లుగా ఆధారం.
►అభ్యర్థి నామినేషన్‌కు వ్యతిరేకంగా ప్రస్తావించే లేదా ప్రస్తావించడానికి అవకాశం ఉన్న ఏదైనా ఆక్షేపణను ఎదుర్కొడానికి అవసరమైన ఏదేని ఇతర సాక్ష్యం..
నామినేషన్ తిరస్కరణకు కారణాలివీ..
►1965, ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీల చట్టంలోని సెక్షను–13, 13–ఎ, 13–బి, 14, 15, 15–ఎ, 15–బిల కింద అభ్యర్థి ఎన్నికవడానికి అనర్హత కలిగి ఉన్నట్‌లైౖతే సదరు అభ్యర్థి నామినేషన్ తిరస్కరిస్తారు.
►వార్డు సభ్యుని ఎన్నిక విషయంలో అభ్యర్థిని ప్రతిపాదించే వ్యక్తి పేరు సంబంధిత వార్డుకు సంబంధించిన ఓటరు జాబితాలో నమోదు కాకపోయినట్లయితే ఆ నామినేషన్ తిరస్కరిస్తారు.
►ఎన్నికల నిర్వహణ నియమావళిలోని నియమం–8, నియమం–10ల కింద ఏవేని నిబంధనలను అభ్యర్థి లేక ఆయన ప్రతిపాదకుడు పాటించనట్లయినా ఆ ఎన్నికకు అనర్హుడిగా ప్రకటిస్తారు.
►అభ్యర్థి లేదా వారి ప్రతిపాదకుడు కాకుండా ఇతర వ్యక్తి నామినేషను పత్రాన్ని ఎన్నికల అధికారికి లేదా ఈ విషయంలో ఆయన అధికారం ఇచ్చిన వ్యక్తికి అందజేయకపోయినా తిరస్కరిస్తారు.
►ఎన్నికల అధికారి జారీ చేసిన పబ్లిక్ నోటీసు లో నిర్దేశించిన స్థలంలో నామినేషన్ పత్రాలు అందజేయకపోయినా., నామినేషన్ పత్రంనిర్దేశించిన నమూనాలో లేకపోయినా తిరస్కరణకు గురవుతుంది.
►నామినేషన్ ప్రతాలలో సంతకాలు కోసం కేటాయించిన స్థలంలో అభ్యర్థి లేదా వారి ప్రతిపాదకుడు లేదా ఇద్దరు సంతకాలు చేయకపోయినా తిరస్కరిస్తారు.
►చట్టాన్ని అనుసరించి అభ్యర్థి అవసరమైన డిపాజిట్ చెల్లించకపోయినా, నామినేషను పత్రాలపై అభ్యర్థి లేదా ప్రతిపాదకుని సంతకం వాస్తవమైనది కాక పోయినా అనర్హుడిగా పేర్కొంటారు.
►షెడ్యూలు కులం లేదా షెడ్యూలు తెగలు లేదా వెనకబడిన తరగతుల లేదా మహిళలకు రిజర్వు చేసిన స్థానాల్లో ఆ వర్గాలకు చెందనివారు దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరిస్తారు.
►క్రిమినల్ సంఘటనలు, ఆస్తులు, బాధ్యతలు, విద్యార్హతలకు సంబంధించిన సమాచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన విధంగా అభ్యర్థి అఫిడవిట్ అందజేయకపోయినా సదరు అభ్యర్థి నామినేషన్ తిరస్కరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment