Rejection nomination
-
271 నామినేషన్ల తిరస్కరణ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం రాత్రి ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల పరిధిలో మొత్తం 893 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 271 మంది అభ్యర్థుల నామినేషన్లను పరిశీలన అనంతరం అధికారులు తిరస్కరించారు. 622 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు 29తో ముగియనుంది. తిరస్కరణకు కారణాలెన్నో: నామినేషన్ పత్రా ల్లోని అన్ని కాలమ్స్ పూరించాల్సి ఉండగా, కొందరు అభ్యర్థులు కొన్ని కాలమ్స్‌ను భర్తీ చేయకుండా వదిలివేయడం, పత్రాలపై కొన్నిచోట్లలో సంతకాలు చేయకపోవడం వంటి కారణాలతో చాలా మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కనీసం 10 మంది ఓటర్లు స్వతంత్ర అభ్యర్థులను ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. కొందరు స్వతంత్ర అభ్యర్థులకు 10 మంది ఓటర్లు కూడా ప్రతిపాదించకపోవడంతో వారి నామినేషన్లను సైతం జిల్లా ఎన్నికల అధికారులు తిరస్కరించారు. మాజీ ఎంపీ మందా జగన్నాథంకు షాక్ నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ ఎంపీ స్థానానికి బీఎస్పీ తరఫున మాజీ ఎంపీ మందా జగన్నాథం వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఇటీవల అధినేత్రి మాయావతి సమక్షంలో బీఎస్పీలో చేరిన ఆయన ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే బీఎస్పీకి సంబంధించి బీఫాం అందజేయకపోవడంతో నామినేషన్ తిర్కరణకు గురై¯ంది. నామినేషన్ పత్రాల్లో నో అబ్జెక్షన్పత్రం అందజేయకపోవడం, గడువులోగా సమర్పించాల్సి ఉన్నా సమరి్పంచకపోవడంతో నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. అయితే బీఎస్పీ తరఫున మరో అభ్యర్థి యోసేఫ్ నామినేషన్ దాఖలు చేయడంతో పార్టీ బీఫాంను అతనికి అందజేసింది. -
కొంప ముంచిన ‘పదకొండు’
తిరుపతి రూరల్: మనిషికి మతిమరుపనేది సహజం. జాగ్రత్తగా ఉండాల్సిన చోటా పొర పాట్లు చేస్తుంటారు. అచ్చం అలాంటిదే స్థానిక సమరంలో చోటు చేసుకుంది. తిరుపతి రూర ల్ మండలం పెరుమాళ్లపల్లె పంచాయతీలో రెండో విడత ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులు నామినేషన్ పత్రం డిక్లరేషన్‌లో 11వ తేదీ వేయడం మరిచిపోయారు. దీంతో అందరి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. (చదవండి: అక్కడ అలా లేదు.. మెడలో రెండు పార్టీలు!) గందరగోళమే లక్ష్యం.. ఓడినా నాదే పైచేయి! -
అమిత్ జోగీ నామినేషన్ తిరస్కరణ
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని మార్వాహీ రిజర్వుడ్ శాసనసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో పోటీకి దిగుతున్న జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్(జే) అధినేత, దివంగత సీఎం అజిత్ జోగీ తనయుడు అమిత్ జోగీ నామినేషన్ శనివారం తిరస్కరణకు గురైంది. ఆయన సమర్పించిన కుల ధ్రువీకరణ పత్రం చెల్లదని రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు. అమిత్ జోగీ గిరిజనుడు కాదని అక్టోబర్ 15న ఉన్నత స్థాయి సర్టిఫికేషన్ పరిశీలన కమిటీ తేల్చిచెప్పింది. ఆయన కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసింది. దీని ఆధారంగా∙అమిత్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. అలాగే ఇదే ఉప ఎన్నికలో బరిలోకి దిగుతున్న అమిత్ జోగీ భార్య రిచా నామినేషన్‌ను కూడా ఇదే కారణంతో తిరస్కరించారు. అజిత్ జోగీకి కంచుకోట అయిన మార్వాహీ అసెంబ్లీ స్థానంలో ఈసారి ఆయన కుటుంబ సభ్యులెవరూ పోటీపడే అవకాశం లేకుండాపోయింది. అజిత్ జోగీ మరణంతో ఖాళీ అయిన మార్వాహీ అసెంబ్లీకి స్థానానికి నవంబర్ 3న ఉపఎన్నిక జరగనుంది. -
ఇలా తిరస్కరిస్తారు..
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ పరిధిలోనూ, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లోనూ నామినేషన్ల పర్వం ముగిసింది. నేడు నామినేషన్ల పరిశీలన ప్రక్రియను రిటర్నింగ్ అధికారులు చేపట్టనున్నారు. నిబంధనల ప్రకారం ఏ ఒక్క పత్రం సమరి్పంచకపోయినా ఆ నామినేషన్‌ని తిరస్కరిస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణకు నిర్ధిష్ట కారణాలను అధికారులు చూపాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఎన్నికల అధికారులకు ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల పరిశీలన సమయంలో సమరి్పంచాల్సిన పత్రాలు, ఇతరత్రా వివరాలనూ సూచించింది. ఎన్నికల సంఘం సూచించిన మేరకు నామినేషన్ దాఖలు చేయలేకపోతే దానిని తిరస్కరించే అధికారం ఎన్నికల అధికారికి ఉంటుంది. పరిశీలన సమయంలో అందజేయాల్సిన పత్రాలు, ఇతర వివరాలివీ... ►అభ్యర్థి పేరు, వారి ప్రతిపాదకుడి పేరు కలిగిన ప్రస్తుత ఎన్నికల జాబితా నకలును, లేదా ఎన్నికల జాబితాలోని సంబంధిత భాగమున్న జిరాక్స్, లేదా ఎన్నికల జాబితాలో నమోదైన భాగం ధ్రువీకృత జిరాక్స్ కాపీ. ►అభ్యర్థి వయసుకు సంబంధించి సంతృప్తికరమైన సాక్ష్యం. ►డిపాజిట్‌ను నగదుగా చెల్లించడం జరిగినట్లయితే ఎన్నికల అధికారి ఇచ్చిన రసీదు, ప్రభుత్వ ట్రెజరీ లేదా బ్యాంకులో డిపాజిట్టు చేసినట్లయితే ట్రెజరీ రసీదు లేదా బ్యాంక్ చలానా. ►నామినేషన్ పత్రాలు దాఖలు చేసినప్పటి రసీదు, అభ్యర్థి తన నామినేషన్ ప్రత్నాన్ని సమరి్పంచినప్పుడు ఎన్నికల అధికారి లేదా అ«దీకృత వ్యక్తి అందజేసిన పరిశీలన నోటీసు. ►షెడ్యూల్డు కులం, షెడ్యూల్డు తెగ, వెనుబడిన తరగతులకు రిజర్వు చేసిన ఏదేని స్థానంలో అభ్యర్థి పోటీ చేసినట్లయితే లేదా ఆ వర్గాలకు ఉద్దేశించిన రాయితీలో డిపాజిట్ మొత్తం చెల్లించినట్లయితే ఆ వర్గాలకు చెందినట్లుగా ఆధారం. ►అభ్యర్థి నామినేషన్‌కు వ్యతిరేకంగా ప్రస్తావించే లేదా ప్రస్తావించడానికి అవకాశం ఉన్న ఏదైనా ఆక్షేపణను ఎదుర్కొడానికి అవసరమైన ఏదేని ఇతర సాక్ష్యం.. నామినేషన్ తిరస్కరణకు కారణాలివీ.. ►1965, ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీల చట్టంలోని సెక్షను–13, 13–ఎ, 13–బి, 14, 15, 15–ఎ, 15–బిల కింద అభ్యర్థి ఎన్నికవడానికి అనర్హత కలిగి ఉన్నట్లైౖతే సదరు అభ్యర్థి నామినేషన్ తిరస్కరిస్తారు. ►వార్డు సభ్యుని ఎన్నిక విషయంలో అభ్యర్థిని ప్రతిపాదించే వ్యక్తి పేరు సంబంధిత వార్డుకు సంబంధించిన ఓటరు జాబితాలో నమోదు కాకపోయినట్లయితే ఆ నామినేషన్ తిరస్కరిస్తారు. ►ఎన్నికల నిర్వహణ నియమావళిలోని నియమం–8, నియమం–10ల కింద ఏవేని నిబంధనలను అభ్యర్థి లేక ఆయన ప్రతిపాదకుడు పాటించనట్లయినా ఆ ఎన్నికకు అనర్హుడిగా ప్రకటిస్తారు. ►అభ్యర్థి లేదా వారి ప్రతిపాదకుడు కాకుండా ఇతర వ్యక్తి నామినేషను పత్రాన్ని ఎన్నికల అధికారికి లేదా ఈ విషయంలో ఆయన అధికారం ఇచ్చిన వ్యక్తికి అందజేయకపోయినా తిరస్కరిస్తారు. ►ఎన్నికల అధికారి జారీ చేసిన పబ్లిక్ నోటీసు లో నిర్దేశించిన స్థలంలో నామినేషన్ పత్రాలు అందజేయకపోయినా., నామినేషన్ పత్రంనిర్దేశించిన నమూనాలో లేకపోయినా తిరస్కరణకు గురవుతుంది. ►నామినేషన్ ప్రతాలలో సంతకాలు కోసం కేటాయించిన స్థలంలో అభ్యర్థి లేదా వారి ప్రతిపాదకుడు లేదా ఇద్దరు సంతకాలు చేయకపోయినా తిరస్కరిస్తారు. ►చట్టాన్ని అనుసరించి అభ్యర్థి అవసరమైన డిపాజిట్ చెల్లించకపోయినా, నామినేషను పత్రాలపై అభ్యర్థి లేదా ప్రతిపాదకుని సంతకం వాస్తవమైనది కాక పోయినా అనర్హుడిగా పేర్కొంటారు. ►షెడ్యూలు కులం లేదా షెడ్యూలు తెగలు లేదా వెనకబడిన తరగతుల లేదా మహిళలకు రిజర్వు చేసిన స్థానాల్లో ఆ వర్గాలకు చెందనివారు దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరిస్తారు. ►క్రిమినల్ సంఘటనలు, ఆస్తులు, బాధ్యతలు, విద్యార్హతలకు సంబంధించిన సమాచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన విధంగా అభ్యర్థి అఫిడవిట్ అందజేయకపోయినా సదరు అభ్యర్థి నామినేషన్ తిరస్కరించనున్నారు. -
మాజీ జవాన్ నామినేషన్ తిరస్కరణ
వారణాసి: వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీపై సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. భద్రతాబలగాలకు పెట్టే ఆహార నాణ్యతపై ఫిర్యాదు చేస్తూ ఆన్లైన్లో వీడియో పెట్టడంతో 2017లో తేజ్ బహదూర్‌ను విధుల నుంచి తొలగించారు. ఆయన సమర్పించిన రెండు జతల నామినేషన్ పత్రాల్లో తేడాలున్నట్లు గుర్తించిన వారణాసి రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. తనను ఎన్నికల్లో పోటీ చేయకూడదనే బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. -
నామినేషన్ తిరస్కరణపై వివాదం
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ :అమలాపురం మున్సిపాలిటీ 22వ వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి గొవ్వాల రాజేష్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం మంగళవారం రాత్రి వివాదానికి, ఉద్రిక్తత, ఆందోళనకు దారితీసింది. పో లీసుల మోహరింపు అనివార్యమైంది. వైఎస్సార్ సీపీ పట్టణ ము ఖ్య నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని అధికారులను నిలదీశారు. వివరాలు ఇలా ఉన్నాయి. 22వ వార్డుకు గొవ్వాల రాజేష్ వైఎస్సార్ సీపీ తరఫున ఒకటి, స్వతంత్ర అభ్యర్థిగా మరొక నామినేషన్ దాఖలు చేశారు. కేవలం స్వతంత్ర అభ్యర్థిగా వే సిన నామినేషన్‌ను సోమవారం ఉపసంహరించుకున్నారు. ఉపసంహరణ పర్వం ముగిసిన మంగళవారం సాయంత్రం రాజేష్ నామినేషన్ తిరస్కరణ కావడం బయటకు వచ్చింది. దీంతో రాజేష్‌తో పాటు పార్టీ పట్టణ కన్వీనర్ మట్టపర్తి నాగేంద్ర, నాయకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, కుడుపూడి బాబు తదితరులు కార్యకర్తల తో కలిసి మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ఏం జరిగిందంటూ కమిషనర్ ఎ.శివనాగిరెడ్డిని నిలదీశారు. ఇందులో ఎలాంటి తప్పిదాలు లేవని, రెండు నామినేషన్లు వేసినప్పుడు ఒక నామినేషన్ ఉపసంహరించుకుంటే రెండో నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని కమిషనర్ ఆధారాలతో సహా పత్రాలు చూపించారు. అధికారులు మోసం చేశారు ఆ పత్రాలు చూడగానే రాజేష్‌తో పాటు నాయకులు కూడా అధికారులు మోసం చేశారంటూ ఆరోపించారు. అవగాహన లేని అధికారులను ఏఆర్ఓలుగా నియమించి, నామినేషన్ల విషయం లో అభ్యర్థులను గందరగోళానికి గురి చేశారని ధ్వజమెత్తారు. అధికారులు ఉద్దేశపూర్వకంగా నామినేషన్ తిరస్కరించారని రా జేష్ కన్నీటిపర్యంతమయ్యారు. పార్టీ కార్యకర్తలు కమిషనర్ చాం బర్ వద్ద బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పట్టణ సీఐ శ్రీనివాసబాబు, ఎస్సైలు యాదగిరి, రామారావులతో సా యుధ పోలీసులు రంగంలోకి దిగారు. కమిషనర్ చాంబర్లో పా ర్టీ నాయకులు.. కమిషనర్ శివనాగిరెడ్డితో రాత్రి 9 గంటల వరకు వివిధ అంశాలపై చర్చించారు. ఇండిపెండెంట్ నామినేషన్‌పై ఏఆర్ఓ పెన్సిల్‌తో రాయడం అనుమానాలకు తావిస్తోందని రాజేష్ విలపించారు. ఇదే విషయమై పార్టీ నాయకులు అధికారులను నిలదీశారు. నామినేషన్ తిరస్కరిస్తే సహించేది లేదని హె చ్చరించారు. ఇదే తరహాలో మిగిలిన అభ్యర్థులకు వర్తింపజేయాలన్నారు. రాజేష్ నామినేషన్ అర్హతలో ఉండేలా చేసేవరకు మున్సిపల్ కార్యాలయం నుంచి వెళ్లేది లేదని భీష్మించారు. ఏ ఆర్ఓ తీరుపై కోర్టును ఆశ్రయిస్తామని నేతలు చెప్పారు. అప్పటి వరకు 22వ వార్డు ఎన్నికలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు పినిపే విశ్వరూప్, గొల్ల బాబూరావు ఈ విషయమై కలెక్టర్‌తో మంగళవారం రాత్రి ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. దీంతో ఆందోళన విరమించారు.