నామినేషన్ తిరస్కరణపై వివాదం
Published Wed, Mar 19 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 AM
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ :అమలాపురం మున్సిపాలిటీ 22వ వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి గొవ్వాల రాజేష్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం మంగళవారం రాత్రి వివాదానికి, ఉద్రిక్తత, ఆందోళనకు దారితీసింది. పో లీసుల మోహరింపు అనివార్యమైంది. వైఎస్సార్ సీపీ పట్టణ ము ఖ్య నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని అధికారులను నిలదీశారు. వివరాలు ఇలా ఉన్నాయి. 22వ వార్డుకు గొవ్వాల రాజేష్ వైఎస్సార్ సీపీ తరఫున ఒకటి, స్వతంత్ర అభ్యర్థిగా మరొక నామినేషన్ దాఖలు చేశారు. కేవలం స్వతంత్ర అభ్యర్థిగా వే సిన నామినేషన్‌ను సోమవారం ఉపసంహరించుకున్నారు.
ఉపసంహరణ పర్వం ముగిసిన మంగళవారం సాయంత్రం రాజేష్ నామినేషన్ తిరస్కరణ కావడం బయటకు వచ్చింది. దీంతో రాజేష్‌తో పాటు పార్టీ పట్టణ కన్వీనర్ మట్టపర్తి నాగేంద్ర, నాయకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, కుడుపూడి బాబు తదితరులు కార్యకర్తల తో కలిసి మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ఏం జరిగిందంటూ కమిషనర్ ఎ.శివనాగిరెడ్డిని నిలదీశారు. ఇందులో ఎలాంటి తప్పిదాలు లేవని, రెండు నామినేషన్లు వేసినప్పుడు ఒక నామినేషన్ ఉపసంహరించుకుంటే రెండో నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని కమిషనర్ ఆధారాలతో సహా పత్రాలు చూపించారు.
అధికారులు మోసం చేశారు
ఆ పత్రాలు చూడగానే రాజేష్‌తో పాటు నాయకులు కూడా అధికారులు మోసం చేశారంటూ ఆరోపించారు. అవగాహన లేని అధికారులను ఏఆర్‌ఓలుగా నియమించి, నామినేషన్ల విషయం లో అభ్యర్థులను గందరగోళానికి గురి చేశారని ధ్వజమెత్తారు. అధికారులు ఉద్దేశపూర్వకంగా నామినేషన్ తిరస్కరించారని రా జేష్ కన్నీటిపర్యంతమయ్యారు. పార్టీ కార్యకర్తలు కమిషనర్ చాం బర్ వద్ద బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పట్టణ సీఐ శ్రీనివాసబాబు, ఎస్సైలు యాదగిరి, రామారావులతో సా యుధ పోలీసులు రంగంలోకి దిగారు. కమిషనర్ చాంబర్‌లో పా ర్టీ నాయకులు.. కమిషనర్ శివనాగిరెడ్డితో రాత్రి 9 గంటల వరకు వివిధ అంశాలపై చర్చించారు.
ఇండిపెండెంట్ నామినేషన్‌పై ఏఆర్‌ఓ పెన్సిల్‌తో రాయడం అనుమానాలకు తావిస్తోందని రాజేష్ విలపించారు. ఇదే విషయమై పార్టీ నాయకులు అధికారులను నిలదీశారు. నామినేషన్ తిరస్కరిస్తే సహించేది లేదని హె చ్చరించారు. ఇదే తరహాలో మిగిలిన అభ్యర్థులకు వర్తింపజేయాలన్నారు. రాజేష్ నామినేషన్ అర్హతలో ఉండేలా చేసేవరకు మున్సిపల్ కార్యాలయం నుంచి వెళ్లేది లేదని భీష్మించారు. ఏ ఆర్‌ఓ తీరుపై కోర్టును ఆశ్రయిస్తామని నేతలు చెప్పారు. అప్పటి వరకు 22వ వార్డు ఎన్నికలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు పినిపే విశ్వరూప్, గొల్ల బాబూరావు ఈ విషయమై కలెక్టర్‌తో మంగళవారం రాత్రి ఫోన్‌లో మాట్లాడారు. ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. దీంతో ఆందోళన విరమించారు.
Advertisement