ముగిసిన పరిశీలన... ఈనెల 29న ఉపసంహరణకు గడువు
622 మంది అభ్యర్థుల నామినేషన్లు ఓకే
పత్రాలపై కొన్నిచోట్ల సంతకాలు చేయని కొందరు..
కాలమ్స్ అసంపూర్తిగా వదిలేసిన ఇంకొందరు..
ఉపసంహరణకు 29 గడువు
బీఫాం ఇవ్వకపోవడంతో మందా జగన్నాథం నామినేషన్ తిరస్కరణ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం రాత్రి ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల పరిధిలో మొత్తం 893 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 271 మంది అభ్యర్థుల నామినేషన్లను పరిశీలన అనంతరం అధికారులు తిరస్కరించారు. 622 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు 29తో ముగియనుంది.
తిరస్కరణకు కారణాలెన్నో: నామినేషన్ పత్రా ల్లోని అన్ని కాలమ్స్ పూరించాల్సి ఉండగా, కొందరు అభ్యర్థులు కొన్ని కాలమ్స్‌ను భర్తీ చేయకుండా వదిలివేయడం, పత్రాలపై కొన్నిచోట్లలో సంతకాలు చేయకపోవడం వంటి కారణాలతో చాలా మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కనీసం 10 మంది ఓటర్లు స్వతంత్ర అభ్యర్థులను ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. కొందరు స్వతంత్ర అభ్యర్థులకు 10 మంది ఓటర్లు కూడా ప్రతిపాదించకపోవడంతో వారి నామినేషన్లను సైతం జిల్లా ఎన్నికల అధికారులు తిరస్కరించారు.
మాజీ ఎంపీ మందా జగన్నాథంకు షాక్
నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ ఎంపీ స్థానానికి బీఎస్పీ తరఫున మాజీ ఎంపీ మందా జగన్నాథం వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఇటీవల అధినేత్రి మాయావతి సమక్షంలో బీఎస్పీలో చేరిన ఆయన ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే బీఎస్పీకి సంబంధించి బీఫాం అందజేయకపోవడంతో నామినేషన్ తిర్కరణకు గురై¯ంది. నామినేషన్ పత్రాల్లో నో అబ్జెక్షన్‌పత్రం అందజేయకపోవడం, గడువులోగా సమర్పించాల్సి ఉన్నా సమరి్పంచకపోవడంతో నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. అయితే బీఎస్పీ తరఫున మరో అభ్యర్థి యోసేఫ్ నామినేషన్ దాఖలు చేయడంతో పార్టీ బీఫాంను అతనికి అందజేసింది.
Comments
Please login to add a commentAdd a comment