రెండు రోజులకు షెడ్యూల్ కుదింపు
గురువారం రాత్రే కేరళ వెళ్లిపోయిన కురియన్
రకీబుల్, పర్గత్‌సింగ్‌ల ఎదుట హాజరై అభిప్రాయాలు తెలిపిన పలువురు ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లు
ఈనెల 21న అధిష్టానానికి నివేదిక ఇస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పనితీరు అంచనా వేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నియమించిన త్రిసభ్యకమిటీ తొలిదఫా సమీక్షలు పూర్తయ్యాయి. వాస్తవానికి, గురు, శుక్ర, శనివారాల్లో ఈ పోస్టుమార్టమ్ జరగాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల రెండురోజులకే కుదించారు. కుటుంబసభ్యులు మరణించడంతో కమిటీకి నేతృత్వం వహించిన రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ పీజే.కురియన్ గురువారం రాత్రే కేరళ వెళ్లిపోయారు. దీంతో గురువారం సమీక్షల్లో పాల్గొన్న అసోం ఎమ్మెల్యే రకీబుల్ హసన్‌తోపాటు పంజాబ్ ఎమ్మెల్యే పర్గత్‌సింగ్‌లు శుక్రవారం గాం«దీభవన్ వేదికగా కాంగ్రెస్‌నేతల అభిప్రాయాలు తీసుకున్నారు.
తొలిరోజు గురు వారం మొత్తం 16 మంది అభిప్రాయాలు తీసుకున్న కురియన్ కమిటీ రెండో రోజు శుక్రవారం పలువురు ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతో సమావేశమై వారి నుంచి లోక్‌సభ ఎన్నికల ఫీడ్‌బ్యాక్ తీసుకుంది. ఉమ్మడిజిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులతో సమావేశమైంది. పార్టీ ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, ఉత్తమ్‌పద్మావతిరెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, శ్రీగణేశ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ తదితరులు కమిటీ ఎదుట హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించారు.
అయితే, ఎవరైనా తమ అభిప్రాయాలను ఫోన్‌లో అయినా తెలియజేయవచ్చంటూ కమిటీ సభ్యులు ఫోన్‌నంబర్లు ఇచ్చి వెళ్లారని, లిఖితపూర్వకంగా అయినా తమకు పంపొచ్చని నేతలకు చెప్పారని సమాచారం. శుక్రవారం కూడా కురియన్ కమిటీకి గురువారం వచి్చన తరహాలోనే ఫీడ్‌బ్యాక్ వచి్చందని, పోస్టుమార్టమ్‌కు హాజరైన పలువురు ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలు, వ్యక్తిగత ఆలోచనలను రకీబుల్‌హసన్, పర్గత్‌సింగ్‌లకు వివరించారు.
కోదాడ ఎమ్మెల్యే
ఉత్తమ్‌పద్మావతి రెడ్డి తన నియోజకవర్గంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్ల వివరాలను పోలింగ్ బూత్‌ల వారీగా తెచ్చి కమిటీకి సమర్పించారు. కోదాడతోపాటు మంత్రి ఉత్తమ్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్ నియోజకవర్గంలో భారీ మెజారిటీలు ఎలా సాధ్యమయ్యాయని కమిటీ సభ్యులు ప్రశ్నించగా, లోక్‌సభ ఎన్నికల్లో
తాము శ్రమించిన తీరును పద్మావతి వివరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆమెను
అభినందించారు.
⇒ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఇప్పటివరకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని, దీనివల్ల రాష్ట్ర రాజధాని చుట్టూ అభివృద్ధి కార్యకలాపాలు వేగంగా సాగడం లేదని, జీహెచ్‌ఎంసీతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తమ జిల్లాలకు చెందిన ఎవరికైనా మంత్రిపదవి ఇవ్వాలని కోరారు. ఎవరికి ఇచ్చినా ఫర్వాలేదని, అయితే, తమ జిల్లాలకు మంత్రిపదవి ఇవ్వాలని కమిటీకి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు కూడా.
⇒ మెదక్ జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో ఓ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. మిగిలిన అన్నిచోట్ల మంచిఓట్లు వచి్చనా సదరు ఎమ్మెల్యే దూకుడు కారణంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు తగ్గాయని చెప్పారు.
⇒ కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశంలో పలువురు మాట్లాడుతూ ఎన్నికలకు 16 రోజుల ముందే అభ్యర్థిని ప్రకటించారని, అయినా తమ శక్తివంచన లేకుండా వెల్చాల విజయం కోసం కృషి చేశామని చెప్పుకొచ్చారు. బీజేపీ నాలుగు నెలల ముందే ఎన్నికల ప్రచారం ప్రారం భించిందని, మోదీ సభలతో పాటు అయోధ్యఅక్షింతలు ఆ పార్టీకి కలసి వచ్చా యని చెప్పినట్టు సమాచారం.
⇒ నల్లగొండజిల్లా నేతలతో జరిగిన సమావేశంలో నల్లగొండ కాంగ్రెస్ కంచుకోట అని, పార్టీకి అన్ని రకాలుగా కలసిరావడంతో మంచి మెజారిటీలు సాధ్యమయ్యాయని కమిటీకి తెలిపారు. భువనగిరిలో బీజేపీ అభ్యర్థి గెలుస్తాడనే టాక్ వచ్చినా తాను ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత దాన్ని మార్చివేశామని, మంచి మెజారిటీతో పార్టీ అభ్యరి్థని గెలిపించుకున్నామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కమిటీకి వెల్లడించారు.
⇒ బీజేపీకి బీఆర్‌ఎస్ మద్దతిచి్చంది కాబట్టే బీజేపీకి సీట్లు పెరిగాయని నిజామాబాద్ జిల్లా నేతలు కమిటీకి స్పష్టం చేశారు. కామారెడ్డిలో బీఆర్‌ఎస్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో 60వేల ఓట్లు వస్తే, లోక్‌సభ ఎన్నికల్లో అది 20వేలకు తగ్గిపోయిందని చెప్పారు. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు బెయిల్ కోసం బీఆర్‌ఎస్ నేతలు బహిరంగంగానే బీజేపీకి మద్దతు ప్రకటించారని ఈ సమావేశంలో షబ్బీర్‌అలీ కమిటీకి చెప్పినట్టు సమాచారం. అందరి అభిప్రాయాలను విన్న కమిటీ నాయకుల అభిప్రాయాలను క్రోడీకరించి ఈనెల 21న అధిష్టానానికి తమ నివేదిక ఇవ్వనుంది. ఈ విషయాన్ని కమిటీ సభ్యుడు రకీబుల్ హుస్సేన్ మీడియాకు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment