ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 28న మహారాష్ట్రలోని యవత్మాల్‌ను సందర్శించారు. ఆ సందర్భంలోనే మోదీ 9 కోట్ల మంది రైతులకు రూ. 21,000 కోట్ల విలువైన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ 16వ విడతను విడుదల చేశారు. కానీ కొందరికి ఈ స్కీముకు సంబంధించిన డబ్బు ఖాతాలో జమ కాలేదు.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ 16వ విడత డబ్బు జమకావడానికి కొందరికి ఇంకా కొంత సమయం పట్టచ్చు. అయితే స్కీమ్ నమోదు చేసుకున్నప్పటికీ.. డబ్బు జమకాకపోతే.. దానికి వివిధ కారణాలు ఉంటాయి.
పీఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి డబ్బు ఖాతాలో జమకాకపోవడానికి ప్రధాన కారణం కేవైసీ అప్డేట్ సరిగ్గా లేకపోవడం అని తెలుస్తోంది. మీరు కేవైసీ అప్డేట్ చేసినప్పటికీ.. డబ్బు రాకపోతే మీరు హెల్ప్‌లైన్ నెంబర్లను సంప్రదించవచ్చు.. లేదా అధికారిక వెబ్‌సైట్‌లో పిర్యాదు చేయవచ్చు.
పీఎమ్ కిసాన్ డబ్బు రాకపోవడానికి కారణాలు
- లబ్ధిదారుని పేరు తప్పుగా ఉండటం
- కేవైసీ పూర్తి కాకాపోవడం
- అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు IFSC కోడ్ తప్పుగా రాయడం
- తప్పు అకౌంట్ నంబర్స్ ఇవ్వడం
- బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ కార్డ్ లింక్ చేయకపోవడం
- ఫీల్డ్ వాల్యూ మిస్సింగ్
- వాలీడ్ కానీ బ్యాంక్, ఫాస్ట్ ఆఫీస్ పేరు
- బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ నెంబర్ రెండూ సరైనవి కానప్పుడు
ఇదీ చదవండి: పనామా కాలువను ఓడలు ఎలా దాటుతాయంటే? చూస్తేనే అర్థమవుతుంది
Comments
Please login to add a commentAdd a comment