కొంతమందికి కంట్లో నల్లగుడ్డు చుట్టూరా ఓ తెల్లని రింగ్ కనిపిస్తుంటుంది. దీన్ని చూడగానే ఆందోళనకు గురవుతుంటారు. కానీ ఇది అంతగా ఆందోళన చెందాల్సిన అంశమూ కాదు... అంతగా ప్రమాదకారీ కాదు. ఇది కేవలం అలర్జీతో వచ్చిన సమస్య మాత్రమే.
మన కన్ను ఆరు బయట ఉండే దుమ్మూ ధూళి వంటి కాలుష్యాలకూ, పుప్పొడికి ఎక్స్‌పోజ్ అయినప్పుడు... అలర్జీ ఉన్నవాళ్లలో కంటి నల్ల గుడ్డు చుట్టూ ఇలాంటి తెల్లటి రింగ్ కనిపించే అవకాశం ఉంది. అందుకే కేవలం ఇలా రింగ్ కనిపించే వాళ్లు మాత్రమే కాకుండా అందరూ ఈ తరహా కాలుష్యాలకు దూరంగా ఉండాలి. రక్షణ కోసం ప్లెయిన్ గ్లాసెస్ వాడటమూ మంచిదే. ఈ సమస్య ఉన్నవారు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కన్ను స్వచ్ఛమైన నీటితో కడుగుతూ ఉండాలి. డాక్టర్‌ను సంప్రదించి యాంటీ అలర్జిక్ చుక్కల మందు వాడాల్సి ఉంటుంది. (కేవలం రూ. 500తో మొదలై, కష్టాలను ‘పచ్చడి’ చేసింది!)
అయితే హానికరం కాదు కదా అంటూ ఈ సమస్యను అలాగే వదిలేస్తే... దీర్ఘకాలం తర్వాత చూపు కాస్తంత మందగించడం, కార్నియా పొర దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి కాబట్టి వీలైనంత త్వరగా కంటి డాక్టర్‌కు చూపించుకొని వారు సూచించే మందులు వాడాలి.
Comments
Please login to add a commentAdd a comment