circles
-
కంట్లో వలయం కనిపిస్తోందా? ఈ విషయాలు తెలుసుకోండి!
కొంతమందికి కంట్లో నల్లగుడ్డు చుట్టూరా ఓ తెల్లని రింగ్ కనిపిస్తుంటుంది. దీన్ని చూడగానే ఆందోళనకు గురవుతుంటారు. కానీ ఇది అంతగా ఆందోళన చెందాల్సిన అంశమూ కాదు... అంతగా ప్రమాదకారీ కాదు. ఇది కేవలం అలర్జీతో వచ్చిన సమస్య మాత్రమే. మన కన్ను ఆరు బయట ఉండే దుమ్మూ ధూళి వంటి కాలుష్యాలకూ, పుప్పొడికి ఎక్స్పోజ్ అయినప్పుడు... అలర్జీ ఉన్నవాళ్లలో కంటి నల్ల గుడ్డు చుట్టూ ఇలాంటి తెల్లటి రింగ్ కనిపించే అవకాశం ఉంది. అందుకే కేవలం ఇలా రింగ్ కనిపించే వాళ్లు మాత్రమే కాకుండా అందరూ ఈ తరహా కాలుష్యాలకు దూరంగా ఉండాలి. రక్షణ కోసం ప్లెయిన్ గ్లాసెస్ వాడటమూ మంచిదే. ఈ సమస్య ఉన్నవారు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కన్ను స్వచ్ఛమైన నీటితో కడుగుతూ ఉండాలి. డాక్టర్‌ను సంప్రదించి యాంటీ అలర్జిక్ చుక్కల మందు వాడాల్సి ఉంటుంది. (కేవలం రూ. 500తో మొదలై, కష్టాలను ‘పచ్చడి’ చేసింది!)అయితే హానికరం కాదు కదా అంటూ ఈ సమస్యను అలాగే వదిలేస్తే... దీర్ఘకాలం తర్వాత చూపు కాస్తంత మందగించడం, కార్నియా పొర దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి కాబట్టి వీలైనంత త్వరగా కంటి డాక్టర్‌కు చూపించుకొని వారు సూచించే మందులు వాడాలి. -
'సన్'మోహన దృశ్యం
వేలేరుపాడు: వేలేరుపాడు మండలంలో బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సూర్యుడి చుట్టూ వలయాకారంలో రంగుల వృత్తం ఏర్పడింది. వలయం చుట్టూ నీలం రంగులో నిలువెత్తు కిరణాలు వెలువడ్డాయి. దీనిని అంతా ఆసక్తిగా చూసారు. దీనిపై ఖగోళ శాస్త్రవేత్త కంబాల రవికుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాల్లో వాతావరణం చల్లబడిన తర్వాత ఈ తరహా వలయాలు ఏర్పడతాయన్నారు. నదీ పరివాహక, సముద్రాలు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఏర్పడతాయన్నారు. సూర్యుడి చుట్టూ వలయం ఏర్పడి వాతావరణంలో మేఘాలు ఎక్కువగా ఉన్న సమయంలో వాటిలో నీటి బిందువులపై పడిన కాంతి కిరణాలు పరావర్తనం, వక్రీభవనం చెందడం వల్ల ఈ తరహా వలయాలు ఏర్పడతాయని ఆయన వివరించారు. ఆకాశంలో సూర్యుడి చుట్టూ ఏర్పడిన వలయాకారం -
జీహెచ్ఎంసీ: ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. 1610 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సర్కిళ్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతమున్న 30 సర్కిళ్లను 48కి పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఆరు జోన్లను 12కు పెంచింది. గ్రేటర్ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రెండు నియోజకవర్గాలకు ఒక జోన్ చొప్పున ఏర్పాటు చేసింది. ప్రతి జోన్లో నాలుగు సర్కిళ్లు ఉండనున్నాయి. సర్కిళ్లు, జోన్ల పెంపుతో 1,610 అదనపు పోస్టుల మంజూరు కానున్నాయి. నగర వాసులకు మరింత వేగంగా, సమర్థంగా, పారదర్శకంగా పౌర సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు జీవో నంబర్ 149ని మున్సిపల్ పరిపాలన నగరాభివృద్ది శాఖ జారీచేసింది. -
మెరుగైన ర్యాంకు సాధ్యమేనా?
వినాయక్‌నగర్ : స్వచ్ఛసర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు గత కొన్ని నెలలుగా నగరంలోని ఆయా ప్రాంతాల నుంచి పకడ్బందీగా చెత్త తరలించినప్పటికీ ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా మారింది. ఎప్పటికప్పుడు చెత్త తరలించకపోవడంతో కూడళ్లలో చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2017లో నగరానికి 178వ ర్యాంకు రాగా ఈ ఏడాది మరింత మెరుగైన ర్యాంకుకు నగర పాలకసంస్థ అధికారులు, సిబ్బంది చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. కాగా సోమవారం స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం నగరంలో పర్యటించి పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ, పారిశుధ్యానికి తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు. కాగా నగరంలోని ఆయా ప్రాంతాల్లో చెత్త పాయింట్ల వద్ద భారీ చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. పలు చోట్ల చెత్త వేస్తే రూ.500 జరిమానా అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన చోట చెత్త పేరుకుపోతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రారంభంకాని అద్దెవాహనాలు చెత్త సేకరణ కోసం కార్పొరేషన్‌కు మొత్తం 64 వాహనాలుండగా అందులో 16 వాహనాలు అద్దెప్రాతిపదికన నడుపుతున్నారు. ఇందులో 10ట్రాక్టర్లు, 6లారీలు ఉన్నాయి. అద్దె చెల్లించడం లేదని వాహనాల యజమానులు తమ వాహనాలను నిలిపివేశారు. వాహనాల అద్దె బకాయిలు మొత్తం రూ.64 లక్షలు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు ఈ విషయంలో అధికారులు చొరవ చూపలేదు. దీంతో చెత్త సేకరణ అంశం మళ్లీ మొదటికి వచ్చింది. తమ కాలనీల్లో చెత్త తొలగించడం లేదని ఆయా కాలనీల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నగర పాలక సంస్థ అధికారులు స్పందించి తమ కాలనీల్లో నుంచి ఎప్పటికప్పుడు చెత్త తరలించాలని కోరుతున్నారు. కేంద్రబృందం సభ్యుడి పర్యటన స్వచ్ఛ సర్వేక్షణ్–2018లో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ బృంద సభ్యుడు జోసెఫ్ పర్యటించారు. గతంలో నగర పాలక సంస్థలో డాక్యుమెంటేషన్‌ను పరిశీలించిన ఆయన సోమవారం నగరంలో పర్యటించారు. పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ తీరును, పారిశుధ్య నిర్వహణపై ఆరా తీశారు. కాగా నగరంలో పలుచోట్ల చెత్త పేరుకుపోయి ఉండటంతో మెరుగైన ర్యాంకుపై ప్రభావం పడే అవకాశం ఉంది. -
30 సర్కిళ్లు మారిన గ్రేటర్ ముఖచిత్రం
పూర్తయిన జీహెచ్ఎంసీ పునర్విభజన 24 నుంచి 30కి పెరిగిన సర్కిళ్లు 3 డివిజన్లున్న సర్కిళ్లు: గచ్చిబౌలి, ఆర్సీపురం,పటాన్చెరు, అల్వాల్ 8 డివిజన్లున్న సర్కిల్: చార్మినార్ కొత్త సర్కిళ్ల పేర్లు: హయత్‌నగర్, గడ్డిఅన్నారం, సైదాబాద్, చాంద్రాయణగుట్ట, బేగంబజార్, ఫలక్‌నుమా,మెహిదీపట్నం, కార్వాన్, ముషీరాబాద్, అంబర్‌పేట, జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ, గచ్చిబౌలి, మూసాపేట, గాజులరామారం, మోండా మార్కెట్ సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ముఖచిత్రం మారింది. ప్రస్తుతం 24 సర్కిళ్లుగా ఉండగా, వీటిని 30 సర్కిళ్లకు మార్చారు. దీంతో ప్రసాదరావు కమిటీ సిఫార్సుల మేరకు గ్రేటర్ పునర్విభజన పూర్తరుునట్లే. 2011 జనాభా లెక్కల మేరకు జీహెచ్ఎంసీని గతంలో ఉన్న 18 సర్కిళ్ల నుంచి 30 సర్కిళ్లకు మార్చాలని కమిటీ సిఫారసు చేయగా, గత సంవత్సరం సెప్టెంబర్ 9న 18 సర్కిళ్లను 24 సర్కిళ్లుగా మార్చారు. ప్రస్తుతం మరో ఆరు సర్కిళ్లను కొత్తగా ఏర్పాటు చేస్తూ మొత్తం 30 సర్కిళ్లుగా మార్చారు. ప్రసాదరావు కమిటీ స్టాఫింగ్ ప్యాటర్న్ మేరకు మొత్తం 30 సర్కిళ్లు ఏర్పాటు చేయగా, ఒక్కో జోన్‌కు ఆరు సర్కిళ్లు ఉండనున్నారుు. జీహెచ్ఎంసీలో మొత్తం ఐదు జోన్లుండటం తెలిసిందే. 2011 జనాభా లెక్కల మేరకు, కోర్ఏరియా పరిధిలోని 15 సర్కిళ్లల్లో ఒక్కో సర్కిల్‌కు సగటున 2.65 లక్షల జనాభా, శివార్లలోని సర్కిళ్లలో ఒక్కో సర్కిల్‌కు సగటున 2.25 లక్షల జనాభా ఉండాలని కమిటీ సిఫార్సు చేసింది. 2011 జనాభా లెక్కల మేరకు గ్రేటర్ జనాభా 67,31,790 కాగా, ఒక్కో డివిజన్లో దాదాపు 45 వేల జనాభా ఉంది. గతంలో ఒక సర్కిల్లో 3 డివిజన్లు మాత్రమే ఉండగా, ఒక డివిజన్లో 16 డివిజన్ల వరకున్నారుు. ప్రస్తుతం భారీ వ్యత్యాసం లేకుండా సగటున ఒక్కో సర్కిల్లో ఐదారు డివిజన్లుండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుత కొత్త సర్కిళ్లలో కొన్నింట్లో అత్యల్పంగా మూడు డివిజన్లు మాత్రమే ఉండగా, అత్యధికంగా చార్మినార్ సర్కిల్లో 8 డివిజన్లున్నారుు. -
గ్రేటర్‌కు కొత్త రూపు!
సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్.. నాగోల్.. మూసాపేట.. బేగంపేట.. మలక్‌పేట.. వనస్థలిపురం/హయత్‌నగర్.... ఇవన్నీ ఏమిటనుకుంటున్నారా ! కొత్తగా రానున్న జీహెచ్ఎంసీ సర్కిళ్ల పేర్లు !గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో సర్కిళ్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం 24 సర్కిళ్లు ఉండగా...6 కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. ఇవి దసరా నుంచి అమలులోకి వస్తాయి. కాగా గ్రేటర్ పరిధిలో గతంలో 18 సర్కిళ్లుగా ఉండగా, వాటిని 24 సర్కిళ్లుగా మార్చారు. ఆరు సర్కిళ్లను రెండు సర్కిళ్లుగా విభజించి వీటిని పెంచారు. అప్పటినుంచే సంబంధిత సర్కిల్నే ఏ, బీలుగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు ఖైరతాబాద్ సర్కిల్‌ను రెండుగా విభజించాక ఖైరతాబాద్–ఎ, ఖైరతాబాద్–బి సర్కిల్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో గందరగోళం ఏర్పడింది. ప్రజలకు తమది ఏ సర్కిలో తెలియక అయోమమానికి గురవుతున్నారు. మరికొన్ని సర్కిళ్లు కేవలం సర్కిల్ నెంబర్లతోనే కొనసాగుతున్నాయి. వీటిని కూడా మారుస్తూ అన్ని సర్కిళ్లకు పేర్లు పెట్టనున్నారు. దాంతోపాటు ఇప్పుడున్న 24 సర్కిళ్లకు అదనంగా మరో 6 సర్కిళ్లు పెంచి మొత్తం 30 సర్కిళ్లు రానున్నాయి. 30 సర్కిళ్లకు వేర్వేరు పేర్లు రానున్నాయి. ఇప్పుడున్న సర్కిళ్ల పేర్లను అలాగే ఉంచి పేరు లేకుండా నెంబర్ల పేర్లతో, ఏ లేదా బీ పేర్లతోకొనసాగుతున్న సర్కిళ్లకు నియోజకవర్గ పేరును లేదా, సంబంధిత సర్కిల్లో బాగా ప్రాచుర్యం కలిగిన డివిజన్ పేరునే సర్కిల్ పేరుగా నిర్ణయించనున్నారు. ఈ లెక్కన పైన పేర్కొన్న పేర్లతో కొత్త సర్కిళ్లు ఏర్పాటు కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీటితోపాటు మరికొన్ని సర్కిళ్లు కొత్తగా వాడుకలోకి రానున్నాయి. ప్రసాదరావు కమిటీ సిపార్సుల మేరకు జీహెచ్ఎంసీని 30 సర్కిళ్లుగా విభజించే ప్రక్రియను జీహెచ్ఎంసీ ఇప్పటికే చేపట్టింది. కొత్త సర్కిళ్ల ముసాయిదాల్లో అవసరమైన మార్పుచేర్పుల కోసం జోనల్ కమిషనర్లకు పంపించారు. సౌత్‌జోన్ నుంచి మాత్రం మార్పుచేర్పులు సూచించినట్లు తెలిసింది. సెంట్రల్‌జోన్ నుంచి ఇంకా నివేదిక అందలేదు. అవి రాగానే జీహెచ్ఎంసీ జనరల్‌బాడీ సమావేశం ముందుంచి కొత్త సర్కిళ్లను వాడుకలోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 30న వార్డుకమిటీ సభ్యుల కోసం జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశానంతరం జరిగే సాధారణ సర్వసభ్య సమావేశం ముందు ఆమోదం కోసం కొత్త సర్కిళ్లను ఉంచుతారు. ఎటొచ్చీ.. దసరానాటికి కొత్త సర్కిళ్లు వాడుకలోకి రానున్నాయని సంబంధిత అధికారి తెలిపారు. దసరా నాటికి కొత్త జిల్లాలు కూడా రానున్నందున ఆలోగానే తమ సర్కిళ్ల కసరత్తు కూడా పూర్తిచేయాలని జీహెచ్ఎంసీ యోచిస్తోంది. గ్రేటర్లో పరిపాలన సౌలభ్యం కోసం రేషనలైజేషన్, స్టాఫింగ్ ప్యాటర్న్‌పై తగు సూచనలందజేయాల్సిందిగా ప్రభుత్వం రిటైర్డు ఐఏఎస్ అధికారి ప్రసాదరావు నేతృత్వంలో కమిటీని నియమించింది. అన్ని అంశాలు కూలంకషంగా పరిశీలించిన ప్రసాదరావు కమిటీ సర్కిళ్లను 30కి పెంచాలని సిఫార్సు చే శారు. అదనపు సర్కిళ్లు.. ఎల్బీనగర్లో సర్కిల్ 3ఎ, 3బిలకు తోడు మరో సర్కిల్, సర్కిల్ 4 ఎ, బిలకు తోడు చార్మినార్‌లో మరో సర్కిల్, 10ఎ, బిలకు తోడు ఖైరతాబాద్‌లో మరో సర్కిల్ అదనంగా రానున్నాయి. వీటితోపాటు సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, సర్కిల్–5(చార్మినార్–2లో) ఒక్కో సర్కిల్ అదనంగా వచ్చే అవకాశం ఉంది.