ఆకాశంలో సూర్యుడి చుట్టూ ఏర్పడిన వలయాకారం
వేలేరుపాడు: వేలేరుపాడు మండలంలో బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సూర్యుడి చుట్టూ వలయాకారంలో రంగుల వృత్తం ఏర్పడింది. వలయం చుట్టూ నీలం రంగులో నిలువెత్తు కిరణాలు వెలువడ్డాయి. దీనిని అంతా ఆసక్తిగా చూసారు. దీనిపై ఖగోళ శాస్త్రవేత్త కంబాల రవికుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాల్లో వాతావరణం చల్లబడిన తర్వాత ఈ తరహా వలయాలు ఏర్పడతాయన్నారు. నదీ పరివాహక, సముద్రాలు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఏర్పడతాయన్నారు. సూర్యుడి చుట్టూ వలయం ఏర్పడి వాతావరణంలో మేఘాలు ఎక్కువగా ఉన్న సమయంలో వాటిలో నీటి బిందువులపై పడిన కాంతి కిరణాలు పరావర్తనం, వక్రీభవనం చెందడం వల్ల ఈ తరహా వలయాలు ఏర్పడతాయని ఆయన వివరించారు.
ఆకాశంలో సూర్యుడి చుట్టూ ఏర్పడిన వలయాకారం
Comments
Please login to add a commentAdd a comment