Different
-
ఫ్లిప్‌కార్ట్‌పై మండిపడ్డ యూజర్: ఇంత అన్యాయమా అంటూ..
సాధారణంగా ఒక ప్రొడక్ట్ విలువ ఒక్కో యాప్‌లో.. ఒక్కో విధంగా ఉండొచ్చు. కానీ ఒకే యాప్‌లో ఒక ప్రొడక్ట్ ధర రెండు ఫోన్లలో వేరువేరు చూపిస్తే? ఇదెలా సాధ్యం, ఎక్కడైనా జరుగుతుందా.. అనుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే.సౌరభ్ శర్మ అనే ఐఓఎస్ యూజర్.. ఐఫోన్‌లోని ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ఓ చిన్న క్యాబిన్ సూట్‌కేస్ కొనుగోలు చేయాలని చూసారు. అయితే దాని ధర రూ.4,799 అని చూపిస్తోంది. అదే ఉత్పత్తిని ఆండ్రాయిడ్ యాప్‌లో చూస్తే.. దాని ధర 4,119 రూపాయలుగా చూపిస్తోంది. ఈ రెండింటినీ సౌరభ్ స్క్రీన్ షాట్ తీసి, తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.ఆండ్రాయిడ్ vs ఐఓఎస్.. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో వివిధ ధరలు అంటూ ఫోటోలను పోస్ట్ చేశారు. ధరలు ఎక్కువగా ఉండటమే కాకుండా నో కాస్ట్ ఈఎంఐలో కూడా వ్యత్యాసం కనిపిస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్ నెలకు రూ. 1373 నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఐఓఎస్ యూజర్ నో కాస్ట్ ఈఎంఐ రూ. 1600 నుంచి ప్రారంభమవుతోందని ఇక్కడా చూడవచ్చు. ఇది చాలా అన్యాయమని సౌరభ్ శర్మ వెల్లడించారు.సౌరభ్ శర్మ.. ధరల వ్యత్యాసం గురించి ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ సపోర్ట్‌తో కూడా సంబంధించారు. ''విక్రయదారు వివిధ అంశాల ఆధారంగా ధరలు నిర్ణయిస్తారు. కాబట్టి ధరలలో మార్పు జరగవచ్చు. దయచేసి చింతించకండి. అమ్మకందారులు మీకు గొప్ప డీల్స్, డిస్కౌంట్లను అందించడానికి ఎల్లప్పుడూ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. హ్యాపీ షాపింగ్'' అంటూ వెల్లడించారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా దీనిపైన స్పందిస్తూ ఇలాంటి అనుభవాలు తమకు కూడా ఎదురైనట్లు చెప్పుకొచ్చారు.Android vs iOS - different prices on @Flipkart App??same @my_mokobara cabin suitcase costs 4119₹ on FK Android App vs 4799₹ on iOS App.Apple charges 30% commission on subscriptions etc, so different pricing for iOS makes sense there.But for ecommerce? Very shady & unfair. pic.twitter.com/YmIq8nhuXO— Saurabh Sharma (@randomusements) October 30, 2024 -
గుళి సామ.. ఎకరానికి 11 క్వింటాళ్లు!
ఉత్తరాంధ్రలోని అల్లూరి సీతారామ జిల్లాలో సామ పంట విస్తృతంగా సాగవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇతర చిరుధాన్యాలతో పాటు సామలకు మంచి గిరాకీ ఏర్పడటంతో గిరిజన రైతుల్లో ఈ పంట సాగుపై ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఈ పంట విస్తీర్ణం కూడా విస్తరిస్తోంది. సేంద్రియ పద్ధతిలో పండించడానికి శ్రమ, పెట్టుబడి పెద్దగా అవసరం లేనిది సామ. అందువల్ల గిరిజనులందరూ ఎంతోకొంత విస్తీర్ణంలో ఈ పంటను పండించి, తాము తింటూ, మిగతా సామలు అమ్ముకుంటూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. పూర్వం సామ ధాన్యాన్ని తిరగలిలో మరపట్టి బియ్యంలా మార్చుకొని సామ అన్నం, ఉప్మా, జావ వంటి సాంప్రదాయ వంటలు వండుకునే వారు. ఈ మధ్య మైదాన ప్రాంతాల ప్రజల్లో కూడా చిరుధాన్యాల వినియోగం పెరగడం, వీటితో బిస్కట్లు, కేక్ వంటి వివిధ రకాల చిరు తిండి ఉత్పత్తులను తయారుచేసి అమ్మడం వల్ల చిరుధాన్యాల ధరలు పెరిగి రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి.అప్పుడు చోడి, ఇప్పుడు సామ ఈ క్రమంలో వికాస స్వచ్చంద సంస్థ 2016లో చోడి /రాగి పంటలో గుళి సాగు పద్ధతిని ప్రవేశపెట్టింది. సాధారణంగా రైతులు చిరుధాన్యాల విత్తనాలను వెదజల్లే పద్ధతిలో పండిస్తుంటారు. నారు పెంచి, పొడి దుక్కిలో వరుసల్లో గుంతలు తీసి నాట్లు వేసుకునే పద్ధతిలో పండించడాన్నే ‘గుళి’ (గుళి అంటే గిరిజన భాషలో గుంట అని అర్థం) పద్ధతిగా పిలుస్తున్నారు. గుళి చోడిని పద్ధతిలో పండిస్తూ గిరిజన రైతులు దిగుబడిని ఎకరాకు 400 కేజీల నుంచి దాదాపు 1000 కేజీల వరకు పెంచుకోగలిగారు. ఈ క్రమం లోనే వికాస సంస్థ 2024 ఖరీఫ్ పంట కాలంలో గుళి పద్ధతిలో సామ పంటను సాగు చేయటానికి 54 మంది గిరిజన రైతులకు తోడ్పాటునందించింది.30–35 రోజుల మొక్క నాటాలిప్రధాన పొలం చివరి దుక్కిలో 200 కేజీల ఘన జీవామృతాన్ని చల్లడం వల్ల భూమికి బలం చేకూరి, రైతులు మంచి దిగుబడి సాధించారు. సామ పంట ముఖ్యంగా పెద్ద సామ రకం బాగా ఎత్తు పెరుగుతుంది. అందువల్ల మొక్కలు నాటిన తర్వాత 30 నుండి 35 రోజుల మధ్య వెన్ను రాక ముందే తలలు తుంచాలి. దీని వల్ల పంట మరీ ఎత్తు పెరగకుండా, దుబ్బులు బలంగా పెరుగుతాయి. గాలులకు పడిపోకుండా ఉంటుంది. దుంబ్రీగూడ మండలం లోగిలి గ్రామంలో కొర్రా జగబంధు అనే గిరిజన రైతు పొలంలో గుళి పద్ధతిలో పండించిన పెద్ద సామ పంటలో క్రాప్ కటింగ్ ప్రయోగాన్ని నిర్వహించారు. రైతులు, వికాస సిబ్బంది, నాబార్డ్ జిల్లా అధికారి చక్రధర్ సమక్షంలో సామలను తూకం వేసి చూస్తే.. ఎకరాకు దాదాపు 1,110 కేజీల (11.1 క్వింటాళ్ల) దిగుబడి నమోదైంది. ఈ పొలానికి పక్కనే రైత్వారీ పద్ధతిలో వెదజల్లిన సామ పొలంలో దిగుబడి ఎకరాకు 150 కేజీల నుంచి 200 కేజీలు మాత్రమే! గుళి సాగు ప్రత్యేకత ఏమిటి?రైత్వారీ పద్ధతిలో ఎక్కువ విత్తనం వెదజల్లటం, నేలను తయారు చేసే సమయంలో ఎటువంటి ఎరువు వేయక΄ోవడం, ఒక ఎకరాకు ఉండాల్సిన మొక్కల కన్నా మూడు నాలుగు రెట్లు ఎక్కువ సాంద్రతలో మొక్కలు ఉండటంతో పంట బలంగా పెరగలేకపోతోంది. గుళి పద్ధతిలో లేత నారును పొలంలో వరుసల మధ్య అడుగున్నర దూరం, మొక్కల మధ్య అడుగు ఉండేలా నాటుతారు. రైత్వారీ వెద పద్ధతిలో ఎకరానికి 3 నుంచి 4 కేజీల విత్తనం అవసరం. దీనికి బదులు మొక్కలు నాటడం వల్ల ఎకరానికి 300 నుంచి 400 గ్రాముల విత్తనం (దాదాపు పది శాతం మాత్రమే) సరిపోతుంది. నారు పెంచుకొని 15 నుంచి 20 రోజుల వయసు మొక్కల్ని పొలంలో నాటుకోవడం వల్ల విత్తన ఖర్చు దాదాపుగా 90 శాతం తగ్గుతోంది. మొక్కల సాంద్రత తగినంత ఉండి, మొక్కలు పెరిగే సమయంలో ప్రతి మొక్కకూ చక్కగా ఎండ తగలుతుంది. ఘన జీవామృతం వల్ల నేల సారవంతమై సామ మొక్కలు బలంగా పెరిగి, మంచి దిగుబడి వస్తున్నట్టు గమనించామని వికాస సిబ్బంది వెంకట్, నాగేశ్వర రావు, తవుడన్న చెబుతున్నారు. దూరంగా నాటడం వల్ల దుక్కి పశువులతో కానీ, సైకిల్ వీడర్‌తో కానీ కలుపు తొందరగా, సులభంగా తియ్యవచ్చు. మొక్కలు బలంగా , ఏపుగా పెరగటం వల్ల కోత సమయంలో వంగి మొదలు నుంచి కోసే బదులు, నిలబడి వెన్నులు కొయ్యడం వల్ల సమయం ఆదా అవడమే కాక సులభంగా పంట కోత జరుగుతుండటం మరో విశేషం. మున్ముందు వరిగ, ఊద కూడా..అల్లూరి సీతారామ జిల్లాలో సామ పంటను ఈ సంవత్సరం ప్రయోగాత్మకంగా గుళి పద్ధతిలో పండించిన గిరిజన రైతులకు ఎకరానికి 11 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రైత్వారీ వెద పద్ధతిలో 2 క్వింటాళ్లకు మించలేదు. కనువిందు చేస్తున్న ఈ పొలాలను చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులను, మహిళలకు చూపిస్తున్నాం. వారు కూడా వచ్చే సంవత్సరం నుంచి మొక్కలు నాటే పద్ధతిని అనుసరించేలా ్ర΄ోత్సహిస్తున్నాం. ఇప్పటికే గిరిజన రైతులు చోడి సాగులో గుళి పద్ధతిని ΄ాటిస్తున్నారు. దీని వల్ల తక్కువ సమయంలోనే సామ రైతులు గుళి పద్ధతికి మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో వరిగ, ఊద పంటల్ని కూడా గుళి పద్ధతిలో సాగు చేయిస్తాం. – డా. కిరణ్ (98661 18877), వికాస స్వచ్ఛంద సంస్థ, అల్లూరి సీతారామరాజు జిల్లా -
వానమ్మ.. వాన! ఇన్ని రకాల వానలుంటాయంటే నమ్ముతారా?
నిన్నమొన్నటి దాకా వానలు దంచి కొట్టాయి. విపరీతంగా కురిసిన వానలతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. కాస్త తెరిపిన పడ్డారో లేదో తెలంగాణాలో, హైదరబాద్‌లో మళ్లీ వానలు ఆగమేఘాలమీద దూసుకొచ్చాయి. అసలు వానలు ఎన్నిరకాలు, వాటికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? నమ్మినా నమ్మకపోయినా, వివిధ రకాల వర్షాలు ఉన్నాయి. అవును. అంతేకాదు అన్ని వర్షాలు ఒకేలా ఉండవు! గాంధారి వాన –కంటికి ఎదురుగా ఉన్నది కనిపించనంత జోరుగా కురిసే వాన.మాపుసారి వాన –సాయంత్రం కురిసే వానమీసర వాన – మృగశిర కార్తెలో కురిసే వానదుబ్బురు వాన – తుప్పర / తుంపర వానసానిపి వాన – అలుకు (కళ్లాపి చల్లినంత కురిసే వాన)సూరునీల్ల వాన – ఇంటి చూరు నుంచి ధార పడేంత వానబట్టదడుపు వాన – ఒంటి మీదున్న బట్టలు తడిసేంత వానతప్పె వాన – ఒక చిన్న మేఘం నుంచి పడే వానసాలు వాన – ఒక నాగలి సాలుకు సరిపడా వానఇలువాలు వాన – రెండుసాల్లకు – విత్తనాలకు సరిపడా వానమడికట్టు వాన – బురద పొలం దున్నేటంత వానముంతపోత వాన – ముంతతోటి పోసినంత వానకుండపోత వాన – కుండతో కుమ్మరించినంత వానముసురు వాన – విడువకుండా కురిసే వానదరోదరి వాన – ఎడతెగకుండా కురిసే వానబొయ్య బొయ్య గొట్టే వాన – హోరుగాలితో కూడిన వానకోపులు నిండే వాన రోడ్డు పక్కన గుంతలు నిండేంత వనరాళ్ల వాన – వడగండ్ల వానకప్పదాటు వాన – అక్కడక్కడా కొంచెం కురిసే వానతప్పడతప్పడ వాన – టపటపా కొంచెంసేపు కురిసే వానదొంగ వాన – రాత్రంతా కురిసి తెల్లారి కనిపించని వానఏకార వాన – ఏకధారగా కురిసే వానమొదటి వాన – విత్తనాలకు బలమిచ్చే వానసాలేటి వాన – భూమి తడిసేంత భారీ వానసాలుపెట్టు వాన – దున్నేందుకు సరిపోయేంత వాన -
భిన్న రూపాల్లో బొజ్జ గణపయ్యలు (ఫోటోలు)
-
దీని కళ్లను చూడండి : హిప్నటైజ్ చేసేయగలవు, జాగ్రత్త!
అనంతమైన ప్రకృతిలో మనకు తెలియని ఎన్నోరహస్యాలు, మరెన్నో విశేషాలు దాగి ఉంటాయి. అలాంటి విశేషాలు వెలుగులోకి వచ్చినపుడు వావ్ అనిపిస్తుంటుంది. తాజాగా కర్ణాటకలో ఉన్న బందీపూర్ టైగర్ రిజర్వ్ లో ఒక అరుదైన చిరుతను గుర్తించారు. దీనికి సంబంధించిన విశేషాలను తమిళనాడు, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి సుప్రిహ సాహు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్ అవుతోంది.‘‘జాగ్రత్త ఈ చిరుత కళ్ళు మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తాయి. భారతదేశంలో ఇలాంటి ఫోటోను తీయడం ఇదే తొలిసారి బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో రెండు వేర్వేరు రంగుల కళ్లతో ఉన్న చిరుతపులిఫోటోను ధృవ్ పాటిల్ తీశారు. ఎంత అపురూపం, హెటెరోక్రోమియా ఇరిడియం అనేది చాలా అరుదైన జన్యు పరివర్తన వలన రెండు కళ్లకు వేర్వేరు రంగుల్లో ఉంటాయి.’’ అని ఆమె ట్వీట్ చేశారు. దీంతో అద్భుతం అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. హెటెరోక్రోమియా ఇరిడియం గురించి ఇపుడే తెలుసుకుంటున్నా.. అద్భుత మైన ఫోటో నన్ను మెస్మరైజ్ చేస్తోంది. మరొకరు కమెంట్ చేశారు.Beware ! The eyes of this leapord will hypnotise you. In a first documentation of its kind in India, a leopard with two different coloured eyes has been photographed in Bandipur Tiger Reserve by Dhruv Patil. How incredible ! Heterochromia Iridium is a very rare genetic mutation… pic.twitter.com/cR1i9VAa6u— Supriya Sahu IAS (@supriyasahuias) August 3, 2024 -
అనగనగా ఒక ఊరు..
మన మూలం చెప్పేది ఊరే! అందుకే మన పరిచయం ఊరి నుంచే మొదలవుతుంది! ఒక్కో ఊరుది ఒక్కో స్వభావం! సంస్కృతీసంప్రదాయాల నుంచి అభివృద్ధిబాట దాకా! ఆ భిన్నత్వాన్నే చెబుతోందీ ‘అనగనగా ఒక ఊరు’!అన్యులను అంటుకోని మలాణా (హిమాచల్ ప్రదేశ్)మన దేశంలోని అతి పురాతన గ్రామం ఇది. కులు, పార్వతి లోయల మధ్యలో సముద్రమట్టానికి 2,652 మీటర్ల (8,701 అడుగుల) ఎత్తులో.. మలాణా నది ఒడ్డున కొలుౖవై ఉంది. ప్రకృతి అందాలకు ఆలవాలం. బయటి ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ఉంటుంది. మలాణీయులకు భారతీయ పోలికలకన్నా మెడిటరేనియన్ పోలికలే ఎక్కువ. బహుశా ఇక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు! స్థానిక భాష కనాశీ. ఆధునిక ఛాయలకు దూరంగా ప్రాచీన సంస్కృతీ సంప్రదాయలకు నిలయంగా ఉంటుంది.జమదగ్నిని వీళ్లు జమ్లు దేవతగా కొలుస్తారు. ఆయననే తమ గ్రామ రక్షకుడిగా భావిస్తారు. జమదగ్నికి ఇక్కడ గుడి ఉంటుంది. మలాణీయులది ఫ్రెండ్లీ నేచరే కానీ మలాణీయేతరులెవరైనా వీళ్లకు అస్పృశ్యులే! వీరి అనుమతి లేకుండా పరాయి వాళ్లెవరూ వీరిని అంటుకోకూడదు. దూరం నుంచే మాట్లాడాలి. నడిచేప్పుడు వాళ్ల ఇంటి గోడలను కూడా తాకకూడదు. ఇక్కడి కొట్లలో పర్యాటకులు ఏమైనా కొనుక్కుంటే ఆ వస్తువులను చేతికివ్వరు కౌంటర్ మీద పెడతారు. అలాగే పర్యాటకులూ డబ్బును కౌంటర్ మీదే పెట్టాలి.పొరపాటున తాకితే వెంటనే స్నానం చేయడానికి పరుగెడ్తారు. ఈ ఊరిలో పోలీసులకు ప్రవేశం లేదు. మన రాజ్యాంగంతో సంబంధం లేకుండా ఈ ఊరికి ప్రత్యేకమైన న్యాయవ్యవస్థ ఉంది. ప్రాచీన ప్రజాస్వామ్యం గల ఊరు అని దీనికి పేరు. వీరి ప్రజాస్వామ్యం ప్రాచీన గ్రీకు ప్రజాస్వామ్యాన్ని పోలి ఉంటుందట! వీళ్ల ప్రధాన ఆర్థిక వనరు గంజాయి. ఎక్కడపడితే అక్కడ గంజాయి వనాలు కనిపిస్తుంటాయి. బ్యాన్ అయినప్పటికీ ‘మలాణా క్రీమ్’ పేరుతో ఇక్కడి గంజాయి దేశంలో ప్రసిద్ధి. ఉత్పత్తిలో మహిళలే అగ్రగణ్యులు. వంట పని నుంచి సాగు, మార్కెటింగ్ దాకా అన్ని బాధ్యతలూ మహిళలవే. మగవాళ్లు గంజాయి మత్తులో నిద్రపోతుంటారని మలాణా సందర్శకుల పరిశీలన. ఇక్కడ వెహికిల్స్ వెళ్లేంత రోడ్లు ఉండవు. వీళ్ల రోజువారీ రవాణాకు కేబుల్ కార్లే మార్గం.లక్షాధికారుల హివ్రే బాజార్ (మహారాష్ట్ర)తన తలరాతను తానే తిరగరాసుకుని అత్యధిక మిలయనీర్లున్న విలేజ్‌గా వాసికెక్కిందీ ఊరు. మరాఠ్వాడా ప్రాంతం, అహ్మద్‌నగర్ జిల్లాలోని హివ్రే బాజార్ ఒకప్పుడు దట్టమైన అడవి, పంటపొలాలతో అలరారిన గ్రామం. అడవిలోని చెట్లు వేటుకు గురై, వర్షాభావ స్థితులు ఏర్పడి.. చెరువులు కూడుకుపోయి.. భూగర్భ జలాలు అడుగంటి.. బావులు ఎండిపోయి.. కరవు కాటకాలకు నిలయమైంది. తాగుడు, క్రైమ్‌కు బానిసైంది. ఒకానొక దశలో సారా కాయడం, నేరాలే హివ్రే బాజార్‌కు ఉపాధిగా మారాయన్నా విస్తుపోవాల్సిన పనిలేదు. 90 శాతం కుటుంబాలు దారిద్య్ర రేఖ దిగువకు జారిపోయి, ఇక ఆ ఊరికి ఉనికిలేదనే పరిస్థితికి చేరిపోయింది. ప్రభుత్వోద్యోగులకైతే పనిష్మంట్ బదిలీ కేంద్రంగా మారింది.వలస వెళ్లిన వాళ్లు పోనూ.. మిగిలిన జనం తమ ఊరు అలా అయిపోవడానికి కారణాలు వెదుక్కున్నారు. ఆ అన్వేషణలోనే పరిష్కారమూ తట్టింది గ్రామ పెద్దలకు. కేంద్రప్రభుత్వం అందిస్తున్న ‘ఉపాధి హామీ’ పథకంతో అడవిని, చెరువులను పునరుద్ధరించుకోవచ్చనీ, వాన నీటిని సంరక్షించుకోవచ్చనీ అనుకున్నారు. తమ ఊరికే ప్రత్యేకమైన పంచవర్ష ప్రణాళికను వేసుకున్నారు. దాని ప్రకారం జనాలు నడుం కట్టారు. తొలకరికల్లా అడవుల సంరక్షణ, ప్లాంటేషన్, చెరువులు, బావుల పూడికతీత, వాటర్ షెడ్ల నిర్మాణం పూర్తిచేశారు.పడిన ప్రతి వానబొట్టునూ ఒడిసి పట్టుకున్నారు. అయిదేళ్లూ కష్టాన్ని పంటికింద బిగబట్టారు. శ్రమ ఫలించసాగింది. నాటిన మొక్కలు ఎదిగాయి. అడవి పచ్చగా కళకళలాడింది. భూగర్భజల స్థాయి పెరిగింది. చెరువులు, బావుల్లోకి నీరు చేరింది. పంటలు లాభాలు పండించలేకపోయినా తిండిగింజలకు కొదువ లేకుండా చేశాయి. రోజులు గడుస్తున్నా కొద్దీ ఊరి వాతావరణం మారసాగింది. వర్షపాతం పెరిగింది. నీళ్లొస్తే జీవకళ వచ్చినట్టే కదా! ప్రకృతిని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం మొదలుపెట్టారు హివ్రే బాజార్ వాసులు. వలస వెళ్లిన వాళ్లంతా మళ్లీ సొంతూరుకి చేరిపోయారు. మద్యాన్ని మరచిపోయారు. ఆదాయం తద్వారా జీవన ప్రమాణం పెరిగాయి.మూత బడిన బడులు తెరుచుకున్నాయి. 30 శాతానికి పడిపోయిన అక్షరాస్యత క్రమంగా 69 శాతానికి పెరిగింది. యువతలోంచి టీచర్లు, ఇంజినీర్లు వస్తున్నారు. ఇప్పుడక్కడ రైతు నెలసరి సగటు ఆదాయం 30 వేలు. 235 కుటుంబాల్లోకి 60 మంది రైతులు (ఫిబ్రవరి, 2024 నాటికి) లక్షాధికారులు. అలా దారిద్య్రం నుంచి అభివృద్ధి పథంలోకి నడిచిన ఈ ఊరు దేశానికే స్ఫూర్తిగా నిలుస్తోంది.శుచీశుభ్రతల చిరునామా మావల్యాన్నాంగ్ (మేఘాలయా)స్వచ్ఛభారత్ కంటే ముందే 2003లోనే ఆరువందల జనాభా గల ఈ చిన్న ఊరు ఆసియాలోకెల్లా క్లీనెస్ట్ విలేజ్‌గా కీర్తి గడించింది. ఇక్కడ అయిదేళ్ల పిల్లాడి నుంచి పళ్లూడిపోయిన వృద్ధుల వరకు అందరూ సామాజిక బాధ్యతతో మెలగుతారు. మావల్యాన్నాంగ్ పిల్లలంతా ఉదయం ఆరున్నరకల్లా లేచి చీపుర్లు పట్టుకుని వీథుల్లోకి వచ్చేస్తారు. వీథులన్నీ శుభ్రం చేస్తారు. డస్ట్బిన్స్లోంచి ఆర్గానిక్ చెత్తను వేరుచేసి మట్టి గుంతలో వేసి కప్పెట్టి, మిగిలిన చెత్తను కాల్చేస్తారు. తర్వాత ఇళ్లకు వెళ్లి రెడీ అయ్యి స్కూల్ బాటపడతారు.ఇది వారి రోజువారీ కార్యక్రమం. ఆ ఊరి బాటల వెంట పూల మొక్కలను పెంచడం, పచ్చదనాన్ని సంరక్షించడం పెద్దల పని. ఇక్కడ ప్రతి ఇంటికీ టాయ్‌లెట్ ఉంటుంది. ప్రతి ఇల్లూ అద్దంలా మెరుస్తూంటుంది. రోజూ చేసే ఈ పనులే కాకుండా ప్రతి శనివారం చిన్నాపెద్దా అందరూ సోషల్ రెస్పాన్స్బిలిటీకి సంబంధించిన స్పెషల్ అసైన్మెంట్స్నూ చేస్తుంటారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్లాస్టిక్ అనేది పెద్ద సమస్యగా మారిందని వాళ్ల బాధ. తాము ప్లాస్టిక్‌ని నివారించినా.. పర్యాటకుల వల్ల ఆ సమస్య ఏర్పడుతోందని వాళ్ల ఫిర్యాదు. ‘రీసైకిల్ చేయగలిగిన వాటితో ఇబ్బంది లేదు.. చేయలేని ప్లాస్టికే పెద్ద ప్రాబ్లం అవుతోంది.వాటిని కాల్చలేం.. పూడ్చలేం. పర్యాటకులు కూడా పర్యావరణ స్పృహతో ఉంటే బాగుంటుంది’ అని మావల్యాన్నాంగ్ వాసుల సూచన. మీ ఊరికి ఇంత శుభ్రత ఎప్పటి నుంచి అలవడిందని అడిగితే ‘130 ఏళ్ల కంటే ముందు.. కలరా ప్రబలినప్పటి నుంచి అని మా పెద్దవాళ్లు చెబుతుంటే విన్నాం’ అంటారు. శుభ్రత ముందు పుట్టి తర్వాత మావల్యాన్నాంగ్ పుట్టిందనడం సబబేమో ఈ ఊరి విషయంలో!పొదుపు, మదుపుల మాధాపార్ (గుజరాత్)కచ్ జిల్లాలోని ఈ ఊరిలో మొత్తం 7, 600 (2021 నాటి లెక్కల ప్రకారం) ఇళ్లు ఉన్నాయి. వీళ్లలో యూకే, అమెరికా, కెనడాల్లో నివాసముంటున్నవారే ఎక్కువ. మాధాపార్‌లో మొత్తం 17 బ్యాంకులున్నాయి. విదేశాల్లో ఉంటున్న మాధాపార్ వాసులు ఈ బ్యాంకుల్లోనే తమ డబ్బును డిపాజిట్ చేస్తున్నారు. అలా వాళ్లు డిపాజిట్ చేసిన మొత్తం రూపాయలు (2021 లెక్కల ప్రకారం) అయిదువేలకోట్లు. దీంతో మాధాపార్ దేశంలోకెల్లా ధనికగ్రామంగా పేరొందింది. ఈ ఎన్ఆర్ఐలు 1968లోనే లండన్‌లో ‘మాధాపార్ విలేజ్ అసోసియేన్’ను స్థాపించుకున్నారు. దీని ఆఫీస్‌ను మాధాపార్లోనూ ప్రారంభించి ఊరి అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఊరి అభివృద్ధికి పాటుపడుతూ వస్తున్నారు. వ్యవసాయపరంగానూ మాధాపార్ ముందు వరుసలోనే ఉంది. వీరి వ్యవసాయోత్పత్తులు ముంబైకి ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడ ఆటస్థలాలు, మంచి విద్యాలయాలు, ఆరోగ్యకేంద్రాలు, చెరువులు, చెక్ డ్యామ్‌లకు కొదువలేదు.మోడర్న్ విలేజ్ పున్సరీ (గుజరాత్)మామూలుగా ఊరు అనగానే .. మట్టి ఇళ్లు, మంచి నీటి కొరత, కరెంట్ కోత, మురికి గుంతలు, ఇరుకు సందుల ఇమేజే మెదులుతుంది మదిలో! కానీ సబర్‌కాంతా జిల్లా.. అహ్మదాబాద్‌కి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలోని పున్సరీ మాత్రం ఆ ఇమేజ్‌కి భిన్నం! ఇక్కడ 24 గంటల మంచినీటి, కరెంట్ వసతి ఉంటుంది. టాయ్‌లెట్ లేని ఇల్లుండదు. రెండు ప్రైమరీ స్కూళ్లు, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజీ సిస్టం.. మాత్రమే కాదు ఊరంతటికీ వైఫై, ప్రధాన కూడళ్లలో సీసీటీవీ కెమెరాలు, 140 లౌడ్ స్పీకర్లతో దేశానికే మోడల్ విలేజ్‌గా విరాజిల్లుతోంది. అంతేకాదు ఇది స్కూల్ డ్రాపౌట్స్ లేని గ్రామం కూడా. దీని అభివృద్ధి కోసం 11 మంది సభ్యులతో కూడిన కమిటీ నిరంతరం శ్రమిస్తోంది. అందులో అయిదుగురు మహిళలున్నారు. ఈ గ్రామాభివృద్ధిని అధ్యయనం చేయడానికి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 300కు పైగా అధికారులు ఈ ఊరును సందర్శించారు.మత్తూర్ (కర్ణాటక) సంస్కృతిసంస్కృతం పండిత భాషగానే బతికి కనుమరుగైపోయింది. కానీ షిమోగా జిల్లాలోని మత్తూర్‌లో ఆ భాష నేటికీ వినపడుతుంది. పండితుల నోటెంటే కాదు అక్కడి ఇంటింటా! ఆ గ్రామవాసులు తమ మూలాలను, సంస్కృతీసంప్రదాయాలనూ పరిరక్షించు కోవాలనే దృఢనిశ్చయంతో ఆ భాష ఉనికిని కాపాడుకుంటున్నారు. అందుకే మత్తూర్‌లో సంస్కృతాన్ని వ్యావహారిక భాషగా మార్చేసుకున్నారు.పెళ్లి పీటలెక్కని బర్వాకలా (బిహార్) కైమూర్ హిల్స్‌లోని ఈ ఊరు.. గుజరాత్ బెస్ట్ విలేజ్ పున్సరీకి భిన్నం. కనీస వసతులకు కడు దూరం. ఇక్కడ తాగునీటి సరాఫరా లేదు. కరెంట్ కనపడదు. టాయ్లెట్లు, డ్రైనేజ్ల గురించి అడగనే వద్దు. రోడ్లూ ఉండవు. ఈ స్థితి వల్ల ఈ ఊరు వార్తల్లోకి ఎక్కలేదు. ఈ స్థితి వల్ల ఇక్కడి అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదు. సుమారు 50 ఏళ్లుగా ఈ ఊళ్లో మంగళ వాయిద్యాల మోగడం లేదు. కనీస అవసరాలు లేని ఆ ఊరికి మా అమ్మాయిని ఎలా ఇస్తామని ఆడపిల్లల తల్లిదండ్రులంతా తమ మాట్రిమోనీ లిస్ట్‌లోంచి బర్వాకాలాను డిలీట్ చేసేశారు. కనాకష్టంగా 2017లో ఒక్కసారి మాత్రం ఇక్కడ పెళ్లి హడావిడి కనిపించింది. ఎందుకూ.. ఊరి ప్రజలంతా కష్టపడి రోడ్డు వేసుకోవడం వల్ల! ఇంకేం ఆ పెళ్లితో ఊరి కళ మారి తమకూ కల్యాణ ఘడియలు వచ్చేస్తాయని అక్కడి బ్రహ్మచారులంతా సంబరపడ్డారట. అది అత్యాశే అయింది. కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇదిగో ఈ నేపథ్యం వల్లే ఆ ఊరు పేరు వైరల్ అయింది.ద్వారాలు కనపడని శని శింగణాపూర్ (మహారాష్ట్ర)శిరిడీని దర్శించిన చాలామందికి శనైశ్చరుడి ఊరు శని శింగణాపూర్ సుపరిచితమే. శనైశ్చరుడి ఆలయం ఒక్కటే దీని ప్రత్యేకత కాదు. ఈ ఊళ్లో ఇళ్లకు తలుపులు, తాళాలు ఉండవు. చెప్పుకోవాల్సిన ప్రత్యేకత అదే. ఇక్కడుండే ఆఫీస్ బిల్డింగ్స్, రిసార్ట్స్ వంటి వాటికి, ఆఖరకు పోలీస్ స్టేషన్‌కి కూడా తలుపులు ఉండవు. కొన్నిళ్లల్లో మాత్రం ట్రాన్స్పరెంట్ కర్టెన్స్ కనపడ్తాయి తలుపుల స్థానంలో. దాదాపు 150 ఏళ్లకు పైగా చరిత్ర గల ఈ ఊరు అప్పటి నుంచీ ఇంతే అట!పాములను పెంచుకునే శెట్పాల్ (మహారాష్ట్ర)ఈమధ్య.. హైదరాబాద్, మణికొండ ప్రాంతంలోని నివాసాల మధ్య నాగుపాము కనపడిందని సోషల్ మీడియాలో ఒకటే గోల. అలాంటిది శెట్పాల్ గ్రామమే నాగుపాముల మయమని తెలిస్తే వీడియోల కోసం ఆ ఊరికి క్యూ కడతారో.. భయంతో బిగుసుకుపోతారో! శెట్పాల్లో ఈ ఇల్లు.. ఆ ఇల్లు అనే భేదం లేకుండా ఏ ఇంటినైనా చుట్టొస్తాయట నాగుపాములు. వాటిని చూసి అక్కడివాళ్లు ఆవగింజంతైనా భయపడకపోగా కుక్క, పిల్లి లాంటి పెంపుడు జంతువులను ముద్దు చేసినట్టుగా ముద్దు చేస్తారట. ఆ పాములూ అంతే.. శెట్పాల్ వాసులను సొంతవాళ్లలాగే భావిస్తాయిట. ఈ ఊరు పుట్టినప్పటి నుంచి ఈ పాములు విసుగుతోనో.. కోపంతోనో.. చిరాకేసో.. ఏ ఒక్కరినీ కాటేసిన సందర్భం ఒక్కటీ లేదని స్థానికుల మాట. అందుకేనేమో శెట్పాల్æ జనాలు ఈ పాములను తమ ఇలవేల్పుగా కొలుస్తారు!కవలల్ని కనే కొడిన్హీ (కేరళ)మనుషులను పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురుంటారు అంటారు. కానీ ఒకే ఊళ్లో డజన్లకొద్దీ కనిపిస్తే! అవునా.. నిజమా.. అని హాశ్చర్యపోయే పనిలేదు. నిజమే! ఆ దృశ్యం కొడిన్హీలో కనిపిస్తుంది. ఈ ఊళ్లో దాదాపు రెండువేల కుటుంబాలు ఉంటాయి. దాదాపు అయిదు వందల కవల జంటలు కనిపిస్తాయి. ఈ విశేషంతో అత్యధిక కవలల రేటు నమోదైన ఊళ్ల సరసన కూడా చేరింది కొడిన్హీ. ఇక్కడ ఇంతమంది కవలలు పుట్టడానికి కారణమేం ఉండొచ్చని పలు అధ్యయనాలూ జరిగాయి. ప్చ్.. ఏమీ తేలలేదు!రెండు పౌరసత్వాల లోంగ్వా (నాగాలాండ్)మోన్ జిల్లాలోని ఈ ఊర్లో కొన్యాక్ నాగా జాతి ప్రజలు ఉంటారు. ఆ జిల్లాలోని పెద్ద గ్రామాల్లో ఇదీ ఒకటి. ఆ ఊరి వాసులకు రెండు దేశాల పౌరసత్వం ఉంటుంది. దానికి కారణం ఆ ఊరి పెద్ద నివాసమే. అతని ఇంటిని మన దేశంతో పాటు మయన్మార్ కూడా పంచుకుంటుంది. అంటే అతనిల్లు సరిగ్గా ఈ రెండు దేశాల సరిహద్దు మీద ఉంటుంది. డీటేయిల్‌గా చెప్పాలంటే ఆ ఇంటి పడకగది ఇండియాలో ఉంటే వంటగది మయన్మార్‌లో ఉంటుంది. దీనివల్ల ఆ ఊరు ఈ రెండు దేశాల హద్దులోకి వస్తుందని ఇటు భారత ప్రభుత్వం పౌరసత్వం ఇస్తుంది.. అటు మయన్మార్ కూడా లోంగ్వా వాసులకు తమ సిటిజ¯Œ షిప్‌ని మంజూరు చేస్తుంది. మన దేశంలో రెండు పౌరసత్వాలు కలిగి ఉండటంలో ఈ ఊరి ప్రజలకు మాత్రమే మినహాయింపు ఉంది.చెప్పులొదిలి వెళ్లాల్సిన వెళ్లగవి (తమిళనాడు)కొడైకెనాల్ దగ్గర్లోని చిన్న తండా ఇది. వంద కుటుంబాలుంటాయి. మూడు వందల ఏళ్ల నాటి ఈ తండాకు రోడ్డు లేదు. ట్రెక్కింగ్ ఒక్కటే మార్గం. ఇక్కడ చెప్పుల జాడలు కనిపించవు. ఊరి పొలిమేరల్లో బోర్డ్ కూడా ఉంటుంది.. ‘దయచేసి మీ పాదరక్షలను ఇక్కడే వదిలేయండి’ అని! ఎందుకంటే ఇక్కడ ఇళ్లకన్నా గుళ్లు ఎక్కువ. లెక్కకు మించిన గుడులైతే ఉన్నాయి కానీ ఒక్క బడీ లేదు. అంతెందుకు ఒక్క ప్రాథమిక కేంద్రం కూడా లేదు. ఒక టీ కొట్టు, చిన్న కిరాణా కొట్టు తప్ప ఇంకే కనీస సౌకర్యాలూ వెళ్లగవిని చేరలేదు. రోజువారీ అవసరాలకు ఈ తండా వాసులు కొడైకెనాల్ దాకా నడిచివెళ్తారు.దయ్యాల కొంప కుల్ధారా (రాజస్థాన్)జైసల్మేర్ జిల్లాలోని ఈ ఊరు 13వ శతాబ్దం నాటిది. ఇప్పుడు మొండి గోడలతో.. నిర్మానుష్యంగా కనిపించే కుల్ధారా ఒకప్పుడు పాలీవాల్ బ్రాహ్మణులకు నిలయం. ఒక మంత్రగాడి శాపంతో రాత్రికి రాత్రే ఆ ఊరు మాయమైందని ఒక కథ, భూస్వాముల దాష్టీకాలను తట్టుకోలేక ఆ బ్రాహ్మణులంతా కుల్ధారా వదిలి వెళ్లిపోయారని ఇంకో కథ ప్రచారంలో ఉంది. కారణం ఏదైనా మనుషుల ఆనవాళ్లు లేక ఇది ఘోస్ట్ విలేజ్‌గా పేరు తెచ్చుకుంది. పాలీవాల్ బ్రాహ్మణుల ఆత్మలు నేటికీ ఆ ఊరిలో తిరిగుతుంటాయనే ప్రచారమూ ఉంది. రాజస్థాన్ ప్రభుత్వం కుల్ధారాను పర్యాటక కేంద్రంగా మలచాలనే ప్రయత్నాలు మొదలుపెట్టింది.పోర్చ్‌గీస్ జాడ.. కోర్లాయీ (మహారాష్ట్ర)అలీబాగ్‌కి గంట దూరంలో ఉన్న ఈ ఊరిని పోర్చ్‌గీస్ వాళ్లు నిర్మించారు. అందుకే ఒకప్పుడు దీన్ని పోర్చ్‌గీస్‌లో ‘మరో డి చాల్’ అనేవారట. అంటే ‘గుండ్రని చిన్న కొండ’ అని అర్థం. ప్రస్తుతం ఇక్కడి వాళ్లు పోర్చ్‌గీస్ క్రీయోల్ (యాస) ‘క్రిస్టీ’లో మాట్లాడుతారు. అంతేకాదు ఇక్కడ పేర్లన్నీ పోర్చుగీస్వే ఉంటాయి. పోర్చ్‌గీస్ ఫుడ్డే తింటారు. క్రీయోల్ అనే పదమే రూపాంతరం చెంది కోర్లాయీగా స్థిరపడింది.ఆఫ్రికన్ విలేజ్ ఆఫ్ గుజరాత్ జాంబుర్గిర్కి సమీపంలో ఉన్న ఈ ఊరును ‘ఆఫ్రికన్ విలేజ్ ఆఫ్ గుజరాత్’ అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ గుజరాతీ భాషను మాట్లాడుతూ, గుజరాతీ పద్ధతులను పాటించే ఆఫ్రికన్స్ ఉంటారు కాబట్టి. ఆఫ్రో– అరబ్ వారసులైన వీళ్లను సిద్దీస్ అంటారు. బానిసలుగా అరబ్ షేక్‌ల ద్వారా ఇక్కడికి వచ్చారు. దాదాపు 200 ఏళ్ల నుంచి వాళ్లు ఈ ఊరిలోనే జీవిస్తున్నారు.సోలార్ తొలి వెలుగు ధర్నాయీ (బిహార్)జహానాబాద్ జిల్లాలో, బో«ద్ గయాకు దగ్గర్లో ఉంటుందీ ఊరు. దీని జనాభా 2,400. ఒకప్పుడు విద్యుత్ సౌకర్యం లేక చీకట్లో మగ్గింది. కానీ కొన్నేళ్ల కిందట. ఆ ఊరి ప్రజలే పూనుకొని సోలార్ పవర్ ప్లాంట్‌ని ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇది 450 ఇళ్లకు, 50 వాణిజ్య సముదాయాలకు ఎలాంటి కోతల్లేని కరెంట్‌ని అందిస్తోంది. ధర్నాయీ వాసుల ఈ సాహసం ఆ ఊరిని.. దేశంలో పూర్తిగా సోలార్ విద్యుత్‌నే వాడుతున్న తొలి గ్రామంగా నిలబెట్టింది. ఇప్పడు ఆ ఊర్లో ఇప్పుడు పిల్లలు చదువును కేవలం పగటి పూటకే పరిమితం చేసుకోవడం లేదు. స్త్రీలు రాత్రివేళల్లో గడపదాటడానికి భయపడటమూ లేదు.ఇవేకాక ఫస్ట్ విలేజ్ మానా, బ్యూటిఫుల్ విలేజ్ చిరాపూంజీ, వలస పక్షుల ఆత్మహత్యలకు కేంద్రం జతింగా, ఎకో ఫ్రెండ్లీ టూరిస్ట్ ప్లేస్ కుంబలంగీ, బార్టర్ సిస్టమ్ అమల్లో ఉన్న జూన్ బేల్ మేల (అసోం) లాంటి ఎన్నో ప్రత్యేకతలున్న ఊర్ల జాబితా చాంతాడంత పెద్దది. సమయం చిక్కినప్పుడల్లా వాటి గురించి తెలుసుకుంటూ.. డబ్బు వెసులుబాటైనప్పుడల్లా చుట్టిరావడమే! ప్రస్తుతం ఈ వివరాలతో వెరీ నెక్స్›్ట వెకేషన్‌కి డిస్టినేషన్ని టిక్ చేసేసుకోండి మరి! -
డిఫరెంట్ లుక్స్‌లో రాశి ఖన్నా.. అందిరిందన్నా.. (ఫోటోలు)
-
Rave Party: ఓరి దేవుడా! రేవ్ పార్టీలు ఇన్ని రకాలా..!
రేవ్ పార్టీ అంటే సంగీతం, నృత్యం, పార్టీలు, ఆనందం ఇవన్నీ లైసెన్స్ పొందిన నైట్‌క్లబ్‌లలో సాగే వ్యవహారం. కానీ రాను రాను డీజేలు, లేజర్ లైట్లు, లైవ్ పాప్ అండ్ ర్యాప్,ఎలక్ట్రానిక్ సంగీత కారుల హోరు, అర్థనగ్న నృత్యాలు, బాడీ పెయింటింగ్స్, విజువల్ ఎఫెక్ట్స్ మద్యం, మాదక ద్రవ్యాల వినియోగం, లైంగిక కార్యకలాపాలు, అమ్మాయిలపై వేధింపులు, ఒక్కోసారి అత్యాచారాలకు నిలయంగా రేవ్ పార్టీలు మారిపోయాయి. కాలానుగుణంగా ఈవెంట్ ప్రమోటర్లు తమ వ్యూహాలను మార్చుకుంటూ రావడం గమనార్హం.సాధారణంగా ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ (EDM), టెక్నో మ్యూజిక్ ,ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఇలా అనేక రకాల మ్యూజిక్స్‌తో హోరెత్తించే భారీ ఆల్-నైట్ డ్యాన్స్ పార్టీలు. మిరుమిట్లు గొలిపే లైట్ షోలు, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ మిళితంగా సాధారణంగా నివాస ప్రాంతాలకు దూరంగానో, లైసెన్స్ ఉన్న క్లబ్స్‌లో జరుగుతాయి. రేవ్ పార్టీలు విభిన్న రకాలుగా ఉంటాయి. వాటి వివరాలు చూద్దాం.రేవ్ పార్టీలు, రకాలుఫెస్టివల్ రేవ్స్: ఫెస్టివల్ రేవ్‌లు చాలా రోజుల పాటు జరిగే భారీ స్థాయిలో జరిగే ఈవెంట్లు. ఇందులో టెక్నో, హౌస్ ,డ్రమ్, బాస్ వంటి అనేక రకాల ఎలక్ట్రానిక్ మ్యూజిక్ స్టయిల్స్ ఉంటాయి.అండర్‌గ్రౌండ్ రేవ్‌లు: అండర్‌గ్రౌండ్ రేవ్‌లు సాధారణంగా గిడ్డంగులు, పాడుబడిన భవనాలుచ అండర్ గ్రౌండ్ క్లబ్‌లలో నిర్వహిస్తారు. క్లబ్ రేవ్స్: క్లబ్ రేవ్‌లు సాంప్రదాయ నైట్‌క్లబ్ వేదికలలుగా ఏర్పాటు చేస్తారు. టెక్నో, హౌస్ , ట్రాన్స్ వంటి ఎలక్ట్రానిక్ సంగీత కళా ప్రక్రియల మిశ్రమాన్ని కలిగి ఉంటాయి. ఈ పార్టీలు ఎక్కువగా కమర్షియల్‌గానే జరుగుతాయిథీమ్ బేస్డ్ రేవ్‌లు: హాలిడే లేదా నిర్దిష్ట సంగీత శైలి వంటి నిర్దిష్ట థీమ్ చుట్టూ కేంద్రీకృతమై ఉండే పార్టీలను థీమ్డ్ రేవ్‌లు అంటారు. ఈ పార్టీల్లో ధరించే దుస్తులు, డెకరేషన్, యాక్టవిటీస్ అన్నీ థీమ్‌కు అనుగుణంగా ఉంటాయి.డే రేవ్స్: డే రేవ్‌లు అనేది పగటిపూట జరిగేవి. వివిధ రకాల ఎలక్ట్రానిక్ సంగీతంతో ఆరు బయట జరుగుతాయి.సైలెంట్ డిస్కో: పేరుకు తగ్గట్టుగానే ఇవి చుట్టుపక్కలవారికి ఎలాంటి అంతరాయంగా లేకుండా సెలెంట్‌గా ఉంటాయి. ఈ పార్టీలో సంగీతాన్ని వినడానికి హాజరైనవారు సైలెంట్ డిస్కోల సంప్రదాయ స్పీకర్లకు బదులుగా వైర్లెస్ హెడ్ఫోన్లను ధరిస్తారు.సైట్రాన్స్ రేవ్స్: సైట్రాన్స్ రేవ్‌లు సైకెడెలిక్ ట్రాన్స్ సంగీతంపై దృష్టి సారించే పార్టీలు. డ్యాన్స్, కాస్ట్యూమ్స్ విజువల్స్ తోపాటు తమదైన సొంత సబ్‌కల్చర్ మ్యూజిక్ ఉంటుంది. హార్డ్స్టైల్ రేవ్‌లు: హార్డ్స్టైల్ రేవ్‌లు హార్డ్స్టైల్ సంగీతాన్ని కలిగి ఉండే పార్టీలు. హార్డ్ టెక్నో, హార్డ్‌కోర్, ఫాస్ట్ టెంపో మ్యూజిక్‌తో హై ఎనర్జీతో ఉంటాయి. ఇలా ఒక్కో రేవ్ పార్టీకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. -
నేను డిఫరెంట్
ఆజంగఢ్: తాను భిన్నమైన వ్యక్తినని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘సాధారణంగా రాజకీయ నాయకులు హామీలిచి్చ, వాటిని అమలు చేయకుండా తప్పించుకుంటూ ఉంటారు. నేను మాత్రం అలా కాదు’’ అని స్పష్టం చేశారు. ‘మోదీ భిన్నమైన (డిఫరెంట్) మట్టితో రూపొందాడు’ అన్నారు. గతంలో అధికారం చెలాయించిన ప్రభుత్వాలు ఎన్నో హామీలిచ్చాయని, కానీ వాటిని నిలబెట్టుకోలేదని విమర్శించారు. పథకాలను ప్రకటించి, వాటిని అమలు చేయకుండా ప్రజల కళ్లకు గంతలు కట్టాయన్నారు. 30–35 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వాలు చేసిన ప్రకటనలు, ఇచ్చిన హామీలను తాను సమీక్షించానని, అవి పెద్దగా అమల్లోకి రాలేదని తేలిందని వెల్లడించారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, శంకుస్థాపనలు చేయడం, ఎన్నికల తర్వాత హామీలిచి్చన నాయకులు, ఆ శిలాఫలకాలు కనిపించకుండాపోవడం గతంలో ఒక తంతుగా ఉండేదన్నారు. ఈ విషయంలో తాను విభిన్నమైన వ్యక్తినని మోదీ వ్యాఖ్యానించారు. ఆయన ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌గఢ్‌లో పర్యటించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించి రూ.42,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఢిల్లీ, కడప, హుబ్బళ్లి, బెలగావి, కొల్హాపూర్ తదితర విమానాశ్రయాల్లో కొత్త టెరి్మనల్ భవనాలకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. అభివృద్ధి విషయంలో యూపీ కొత్త శిఖరాలకు చేరుకుంటోందని, దాంతో విషం లాంటి బుజ్జగింపు రాజకీయాలు బలహీనపడుతున్నాయని చెప్పారు. బుజ్జగింపు, బంధుప్రీతి రాజకీయాల్లో చాలా ప్రమాదకరమన్నారు. ప్రాజెక్టులకు ఎన్నికలతో సంబంధం లేదు తాను ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకు రానున్న లోక్‌సభ ఎన్నికలతో సంబంధముందని ఎవరూ భావించొద్దని మోదీ అన్నారు. 2019 ఎన్నికల వేళ తానెన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశానని, అవి చాలావరకు పూర్తయ్యాయని గుర్తుచేశారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి కృషి చేస్తున్నానని తెలిపారు. అవినీతిని పరమావధిగా భావించే కుటుంబ పారీ్టలు అధికారంలో ఉంటే అభివృద్ధి జరిగేది కాదన్నారు. ఈఎఫ్టీఏ ఒప్పందంపై హర్షం యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ)తో వాణిజ్య ఒప్పందంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ అసోసియేషన్‌లో సభ్యదేశాలైన ఐస్‌ల్యాండ్, లీచ్టెన్స్టీన్ నార్వే, స్విట్జర్లాండ్‌తో భారత్ కలిసి పని చేస్తుందని ప్రధాని అన్నారు. లోక్‌పాల్ ప్రమాణస్వీకారం లోక్‌పాల్ చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్‌రావ్ ఖని్వల్కర్ (66) ఆదివారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. -
అక్కడో రీతి.. ఇక్కడో తీరు
సాక్షి, హైదరాబాద్: విద్యావిధానంలో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య భిన్నమైన ధోరణుల నేపథ్యంలో ఆ రెండు ప్రాంతాల మానవ వనరుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందుకు పాఠ్య ప్రణాళికలు అవసరమని ఉన్నత విద్యా మండలి, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ భావిస్తున్నాయి. ఈ మేరకు జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో భిన్న కోర్సులను రూపొందించేందుకు కసరత్తు చేపట్టాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని యూనివర్శిటీలతో కలిసి మానవ వనరుల అభివృద్ధికి కార్యాచరణను తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇక్కడ టెక్‌లు, సాఫ్ట్వేర్లు.. అక్కడ సివిల్స్ టార్గెట్ వయా డిగ్రీలు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిల్లో విద్యార్థులు ఒకే విధమైన కోర్సుల్లో చేరుతున్నారు. ముఖ్యంగా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్), ఎంబీఏ, ఎంసీఏను ఎంచుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. ఆ తర్వాత వాళ్ళు పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగానే సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ కేంద్రాలు ఉత్తరాదిలోనే ఎక్కువగా ఉంటున్నాయని తేలింది. సగానికి పైగా ఇంజనీరింగ్ సీట్లు దక్షిణాదికే దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు బీటెక్ తర్వాత తక్షణ ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు. సాఫ్ట్వేర్ లేదా ఇతర సాంకేతిక ఉపాధి అవకాశాలను ఎంచుకుంటున్నారు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా ఉండే ఇంజనీరింగ్ సీట్లలో 54 శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా 12,47,667 బీటెక్ సీట్లు అందుబాటులో ఉంటే, వీటిల్లో 6,74,697 సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఎంసీఏలో 70,065 సీట్లు ఉంటే, 30,812 (44 శాతం) దక్షిణాదిలో ఉన్నాయి. ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించి దేశవ్యాప్తంగా 3,39,405 సీట్లు ఉంటే, దక్షిణాదిన 1,57,632 సీట్లున్నాయి. బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ సీట్లు దక్షిణాదిలోనే పెరగడానికి ఇదే కారణమని ఏఐసీటీఈ భావిస్తోంది. 2015–16లో దక్షిణాది రాష్ట్రాల్లో 48.77 బీటెక్ సీట్లు ఉంటే, ఆరేళ్లలో అవి 5.3 శాతం మాత్రమే పెరిగాయని మండలి గుర్తించింది. స్కిల్.. పాలన నైపుణ్యంపై దృష్టి అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న పాలనాపరమైన మార్పులు, ప్రైవేటు రంగంలో వస్తున్న సరికొత్త డిమాండ్‌కు అనుగుణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పాఠ్యాంశాలు రూపొందించాలని ఏఐసీటీఈ, యూజీసీ భావిస్తోంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ విద్యలో నైపుణ్యం పెంచడంపై దృష్టి పెట్టాలని గుర్తించింది. పారిశ్రామిక భాగస్వామ్యంతో ఇంజనీరింగ్ విద్యను ముందుకు తీసుకెళ్ళే ఆలోచనలపై ఫోకస్ చేయాలని భావిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై త్వరలో విధివి«దానాలు వెల్లడించే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. -
‘నా పొట్ట.. నా ఇష్టం’.. నెట్టింట్లో వైరల్ అవుతోన్న రెస్టారెంట్
కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలంటే పబ్లిసిటీ చాలా అవసరం. ట్రెండ్‌కు తగ్గట్లు కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఈమధ్య రెస్టారెంట్ బిజినెస్‌కి డిమాండ్ బాగా పెరిగింది. డిఫరెంట్ థీమ్స్‌తో,క్యాచీ నేమ్స్‌తో వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. కొన్ని రెస్టారెంట్ పేర్లు అయితే ఒక్కసారి చదివితే గుర్తుండేలా వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. వెరైటీ పేర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. తాజాగా మరో రెస్టారెంట్ పేరు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవలె ప్రారంభమన ఆ రెస్టారెంట్ పేరు వింటే నవ్వు ఆపుకోలేరు. లేటెస్ట్గా ‘నా పొట్ట నా ఇష్టం’ అనే రెస్టారెంట్ పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే ఈ రెస్టారెంట్ పేరుపై పలు ఫన్నీ మీమ్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ రెస్టారెంట్ రాజమండ్రిలోని దానవాయిపేటలో ఉంది. ఇదే పేరుతో మరో రెస్టారెంట్ జగిత్యాలలో ఉంది. దానిపై సరదా కవిత్వాలు అల్లేస్తున్నారు. “నా పొట్ట నా ఇష్టం” 😂 చూడూ - చూడకపో నీ ఇష్టం తినడం నా అభీష్టం 😃 నే తినకపోతే హోటెల్ వాడికి నష్టం 😪 మధ్యలో నీకేమిటి కష్టం? 🤔 భోజన ప్రియుల్ని ఆకర్షించేందుకు వినూత్న ఐడియాలతో రెస్టారెంట్ ఓనర్స్ తెగ ట్రై చేస్తున్నారు. మొదట్లో ఓ హోటల్ ప్రారంభిస్తే అక్కడి టేస్ట్, క్వాలిటీ బావుంటే ఆటోమెటిక్‌గా వ్యాపారం పుంజుకునేది. కానీ ప్రస్తుతం నిర్వాహకులు మౌత్ పబ్లిసిటీకే సై అంటున్నారు. క్రియేటివిటీతో కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. తమ రెస్టారెంట్లకు డిఫరెంట్ పేర్లు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా ప్రయత్నిస్తారు. ఇలా గతంలోనూ..తిందాంరా మామ, తిన్నంత భోజనం, పాలమూరు గ్రిల్స్, వివాహ భోజనంబు, సుబ్బయ్యగారి హోటల్, బాబాయ్ భోజనం, రాయలసీమ రుచులు, ఉలవచారు, నాటుకోడి, మాయాబజార్,రాజుగారి పులావ్, ఘుమఘుమలు,నిరుద్యోగి ఎంఏ, బీఈడి, కోడికూర చిల్లు వంటి వెరైటీ రెస్టారెంట్ల పేర్లు వైరల్ అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో కనిపించే వెరైటీ టైటిల్స్ - హోటల్స్ తిన్నంత భోజనం - నాగోల్ మెట్రో ఉప్పు కారం - కొండాపూర్ కోడికూర, చిట్టిగారె - జూబ్లీ హిల్స్ రాజుగారి రుచులు - కొండాపూర్ వివాహ భోజనంబు - జూబ్లీ హిల్స్ దిబ్బ రొట్టి - మణికొండ అరిటాకు భోజనం - అమీర్ పేట వియ్యాలవారి విందు - ఎల్బీనగర్ తాలింపు - అమీర్ పేట తినేసి పో - కొంపల్లి బకాసుర - AS రావు నగర్ అద్భుతః - దిల్సుఖ్ నగర్ -
ప్రపంచంలో టాప్10 విచిత్రమైన డైనోసార్స్
-
మమతా బనెర్జీ ఏం చేస్తుందో చూడండి..!
-
మారణాయుధాలతో వచ్చి, అక్షితపై దాడిచేసి...
జగిత్యాల క్రైం: జగిత్యా ల రూరల్ మండలంలని బాలపల్లిలో ఆదివారం మధ్యాహ్నం ఓ యువతిని బెదిరించి, కొట్టి తీసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. బాలపల్లికి చెందిన జక్కుల మధు, రాయికల్ మండలంలోని ఇటిక్యాలకు చెందిన జవ్వాజి అక్షిత గత జూలై 3న ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో ఆమెపై కక్ష పెంచుకున్న తండ్రి భూమయ్య, మేనమామ సుంకశీల సత్తయ్యతోపాటు మరికొందరు రెండు కార్లలో మారణాయుధాలతో ఆదివారం బాలపల్లికి వచ్చారు. అక్షితపై దాడిచేసి, బలవంతంగా కారులో ఎక్కించారు. అడ్డుకోబోయిన ఆమె అత్త్త, ఆడపడుచులపై దాడి చేయడంతో గాయపడ్డారు. అక్కడికి చేరుకున్న స్థానికులపైనా ఆయుధాలతో వెంట పడటంతో వారు పరుగులు పెట్టారు. అనంతరం యువతిని తీసుకొని, వెళ్లిపోయారు. స్థానికులు జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్‌కు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. అక్షిత భర్త మధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల కోసం రెండు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి, గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. -
Heteroparental superfecundation: కవలలే గానీ... తండ్రులు వేరు
బ్రెజిల్లో ఓ 19 ఏళ్ల యువతి కవలలకు జన్మనిచ్చింది. ఇందులో విశేషం ఏముందంటారా? చాలా పెద్ద విశేషమే ఉంది. ఆ కవలలిద్దరికీ తండ్రులు వేర్వేరు! నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజమే. సదరు యువతి ఒకే రోజున ఇద్దరు యువకులతో శారీరకంగా కలవడం ఇందుకు దారి తీసిందట!! పిల్లలకు 8 నెలలు వచ్చాక అసలు వారి తండ్రి ఎవరా అని ఆమెకు అనుమానం వచ్చింది. వారి తండ్రిగా తాను భావిస్తున్న యువకునికి పితృత్వ పరీక్ష చేయించగా కవలల్లో ఒకరి డీఎన్ఏతో మాత్రమే సరిపోయిందట. దాంతో ఆమెతో పాటు డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. కాసేపు ఆలోచించిన మీదట, తాను అదే రోజు మరో యువకునితో శారీరకంగా కలిసిన విషయం ఆమెకు గుర్తొచ్చింది. డీఎన్ఏ పరీక్ష చేయించగా రెండో బాబుకు అతనే తండ్రి అని తేలింది! ‘‘ఇది అత్యంత అరుదైన సంగతి. 10 లక్షల్లో ఒక్క కేసులో మాత్రమే ఇలా జరిగేందుకు ఆస్కారముంటుంది’’ అని డాక్టర్లు చెబుతున్నారు. శాస్త్రీయంగా దీన్ని హెటరో పేరెంటల్ సూపర్ ఫెకండేషన్ (బహుళ పిండోత్పత్తి)గా పిలుస్తారట. ఒకే రోజు ఇద్దరు పురుషులతో శారీరకంగా కలిసి, సదరు స్త్రీ తాలుకు రెండు అండాలు వారి వీర్య కణాలతో వేర్వేరుగా ఫలదీకరణ చెందితే ఇలా జరుగుతుందట. ఫలితంగా తయారయ్యే రెండు పిండాలూ వేర్వేరు మావి (ఉమ్మనీటి సంచి)లో పెరుగుతాయట. మనుషుల్లో అత్యంత అరుదే అయినా పలు జంతువుల్లో మాత్రం ఇది కాస్త సాధారణమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
మనువుల ‘రేవు’: వరుడికి తాళికట్టిన వధువు..
వజ్రపుకొత్తూరు రూరల్(శ్రీకాకుళం జిల్లా): శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామం గురువారం సామూహిక వివాహాలతో కళకళలాడింది. తరతరాలుగా వస్తోన్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ 47 జంటలు ఒకే ముహూర్తానికి ఒక్కటై దాంపత్య జీవితంలో అడుగు పెట్టాయి. వరుడు తలవంచితే.. వధువు మూడు ముళ్లు వేసింది. చదవండి: చికెన్ 312 నాటౌట్.. చరిత్రలోనే ఆల్‌టైం రికార్డు -
Telangana: సాగులో సరికొత్త ‘వరి’వడి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కొందరు రైతులు వరిలో కొత్త రకాల వంగడాలు సాగు చేస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలతో బ్లాక్ రైస్ (నల్ల ధాన్యం), రెడ్ రైస్, బాస్మతి, కూజ్ పటియాలా, రత్నచోడీ, ఇంద్రాణి.. ఇలా విభిన్న రకాల వరి పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కొందరు సేంద్రియ ఎరువులు వాడుతూ తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందుతున్నారు. కొన్ని రకాల ధాన్యానికి స్థానికంగా బాగా డిమాండ్ ఉండటంతో వీటి సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. కొందరు పండించిన ధాన్యంలో కొంత ఇంటి అవసరాలకు వాడుకుంటున్నారు. మిగిలింది తెలిసిన వారికి ఇవ్వడంతో పాటు అవసరమైన వారికి విత్తనాలుగానూ అందిస్తున్నారు. మోత్కూరు/హుజూర్‌నగర్‌రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన రైతు దేవరపల్లి విద్యాసాగర్‌రెడ్డి సాధారణంగా తనకున్న 25 ఎకరాల వ్యవసాయ భూమిలో 15 ఎకరాల్లో వరి సాగు చేస్తాడు. వానాకాలం పంటగా పూస బాస్మతి వరిని అర ఎకరంలో సాగు చేశాడు. భువనగిరిలోని ఓ ప్రైవేట్ దుకాణంలో ఈ రకం విత్తనాలను కిలోకు రూ.200 చొప్పున 12 కిలోలు కొనుగోలు చేశాడు. సాధారణ రకం వరి సాగులానే దీనికి కూడా సస్యరక్షణ చర్యలు చేపట్టాడు. మొత్తం మీద అర ఎకరం సాగుకు రూ.10 వేల పెట్టుబడి పెట్టాడు. సుమారు 20 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాడు. కిలో రూ.80 నుంచి రూ.100 పలుకుతుందని ఆశిస్తున్నాడు. లక్కవరంలోనూ.. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన రైతు రణపంగురాజు కూడా ఎకరం పది గుంటల పొలంలో పూస బాస్మతి (1503) సాగు చేశాడు. దీని కోసం రూ.18 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. అయితే తాను అనుకున్న దానికంటే అధికంగా ఎకరానికి 30 బస్తాల చొప్పున దిగుబడి రావడం, మార్కెట్లో బాస్మతికి మంచి గిరాకీ ఉండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. కొత్త వంగడాలపై దృష్టి సారించాలి నేను బాస్మతి సాగు చేశా. దిగుబడి తక్కువగా వస్తుందని కొంత మంది రైతులు చెప్పారు. కానీ ధైర్యం చేసి సాగు చేశా. అంచనాలకు మించి దిగుబడి వచ్చింది. రైతులు కొత్తరకపు వరి వంగడాలపై దృష్టి సారించాలి. – రైతు రణపంగురాజు, లక్కవరం బ్లాక్, రెడ్‌తో భారీ లాభాలు చివ్వెంల (సూర్యాపేట): సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రానికి చెందిన యువరైతు ఇట్టమళ్ల స్టాలిన్ నూతన వరి వంగడాలను సేద్యం చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నాడు. గత సంవత్సరం నుంచి రెండు ఎకరాల్లో బ్లాక్, రెడ్ రైస్ వంగడాలను నాటి ఎకరాకు రూ.1.50 లక్షలు లాభం పొందుతున్నాడు. ఎకరాకు 10 కేజీల వరి విత్తనాలు నారుగా పోసి నాటడంతో పాటు దానికి కావాల్సిన సేంద్రియ ఎరువులు స్థానికంగా సేకరించి వేస్తున్నాడు. ప్రతి పంటకు ఎకరాకు 20–25 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. పండించిన పంటను స్థానికంగా వరి విత్తనాలకు విక్రయిస్తున్నాడు. క్వింటాల్‌కు రూ.10 వేల చొప్పున ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి రైతులు వచ్చి కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక పంట వేస్తూ పెట్టుబడి పోగా ఎకరానికి రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు లాభాలు పొందుతున్నాడు. బ్లాక్ రైస్, 1119 జోరు నిడమనూరు/బీబీనగర్: నల్లగొండ జిల్లా నిడమనూరు, సోమోరిగూడెం, నారమ్మగూడెంలలో రైతులు వరిలో బ్లాక్ రైస్, 1119 రకాలను సాగు చేస్తున్నారు. నిడమనూరు మండలంలోని నారమ్మగూడెంలో కొండా శ్రీనివాసరెడ్డి తన వ్యవసాయబూమిలో ఖరీఫ్‌లో బ్లాక్ రైస్ సాగు చేశాడు. 120 నుంచి 130 రోజుల పంట. దీనిలో సన్న, దొడ్డు రకం రెండూ ఉన్నాయి. ఇవి నల్లగా ఉంటాయి. మధుమేహంతో బాధపడుతున్నవారు బ్లాక్ రైస్ బియ్యాన్ని వాడడానికి ఇష్టపడుతున్నారు. మండల కేంద్రానికి చెందిన బొల్లం శ్రీనివాస్‌యాదవ్ అతని సోదరుడు కూడా నిడమనూరులో కొంత, మండలంలోని సోమోరిగూడెంలో ఎకరంలో బ్లాక్ రైస్‌ను సాగు చేశారు. ఈసారి మరిన్ని ఎకరాల్లో.. పంట దిగుబడి బాగానే వస్తుందని అనుకుంటున్న. రెండు ఎకరాల్లో సాగు చేశా. ఇంటి అవసరాలకు పోను తెలిసిన వారికి ఇవ్వాలని అనుకుం టున్నా. గతంలోనూ తెలిసిన వారికి ఇచ్చా. ఎక్కువ మొత్తంలో సాగు చేస్తే మార్కెట్ చేసుకో వాల్సి ఉంటుంది. ఈసారి ఎక్కువ ఎకరాల్లో సాగు చేస్తా. –కొండా శ్రీనివాసరెడ్డి గొల్లగూడెంలో.. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బాత్క వెంకటేష్ 20 గుంటల భూమిలో బ్లాక్ రైస్ సాగు చేశాడు. రూ.450 కేజీ చొప్పున విత్తనాలు కొనుగోలు చేశాడు. వరి సాగు మాదిరిగానే మెళుకువలు పాటిస్తూ పంటను పండించాడు. ప్రసుత్తం పంట బాగా రాగా సుమారు 5 అడుగుల ఎత్తున ధాన్యం గొలుసులు పెరిగాయి. మరో 5 రోజుల్లో చేనును కోయనున్నట్లు, పంట బాగా వచ్చినట్లు వెంకటేష్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఇతను బ్లాక్ రైస్ సాగు చేస్తున్నాడని తెలియగానే కొందరు టీచర్లు, ఉద్యోగులు..ధాన్యం తమకు విక్రయించాలని కోరారు. ఈసారి 5 ఎకరాలలో ఈ రకం సాగు చేస్తానని వెంకటేష్ చెబుతున్నాడు, ఒకే రైతు.. పలు రకాలు రాజాపేట: ఎప్పటికీ ఒకే వరి రకం పంటలు సేద్యం చేయకుండా విభిన్న వంగ డాలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని నెమిల గ్రామానికి చెందిన పులి భూపాల్. బ్లాక్ రైస్, రత్నచోడి గుంట, ఇంద్రాణి, మహరాజ, కూజ్ పటియాలా వంటి రకాలను తనకు ఉన్న 10 ఎకరాలకు గాను 3 ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. ఇందుకు ఎకరాకు రూ.40 వేల వరకు ఖర్చు చేశాడు. మార్కెట్లో బ్లాక్‌రైస్, నవార్, రత్నచోడీ వంటి వరి ధాన్యానికి డిమాండ్ ఉండటంతో వాటి సాగు చేసినట్లు తెలిపాడు. ప్రస్తుతం బ్లాక్ రైస్ కిలో రూ. 250, నవార్ కిలో రూ.120 చొప్పున సొంతంగా విక్రయిస్తున్నట్లు వివరించాడు. సేంద్రియ పద్ధతిలో బ్లాక్‌రైస్, నవార్ సాగు ప్రస్తుత పరిస్థితుల్లో బ్లాక్‌రైస్, నవార్ వంటి వివిధ రకాల వరి ధాన్యం వైపు ప్రజలు మక్కువ చూపుతున్నారు. సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తే ప్రతి పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కేజీ ధర రూ.220 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. డిమాండ్‌ను బట్టి సొంతంగా మార్కెట్ చేయాలనే ఉద్దేశంతో వివిధ రకాల వరి ధాన్యం సేద్యం చేస్తున్నా. – పులి భూపాల్ కూజ్ పటియాలాతో ఖుషీ ఆత్మకూరు (ఎం): యాదాద్రి భువనగిరిజిల్లా ఆత్మకూర్ (ఎం) మండలం టి.రేపాక గ్రామానికి చెందిన రైతు బండ యాదగిరి మూడు ఎకరాల్లో కూజ్ పటియాలా రకం సాగు చేస్తున్నాడు. 1010 రకం వడ్లు పండిస్తే సరైన ధర లేక పోవడం, ప్రభుత్వం కొనుగోలు చేయక పోవడం లాంటి సమస్యలు వస్తుండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపాడు. వడ్లను సిద్దిపేటలో ఓ రైతు నుంచి కిలోకు రూ.100 చొప్పున తీసుకువచ్చాడు. పంట కాలం నాలుగు నెలలు. సేంద్రియ పద్ధతిలో వేప నూనె, పంచగవ్వ, స్థానికంగా దొరికే దినుసులతో కషాయాలను తయారు చేసి పంటకు పిచికారీ చేస్తున్నాడు. ఈ రకం వరి పంటతో మంచి లాభం పొందే అవకాశం ఉందని యాదగిరి తెలిపాడు. సేంద్రీయ పద్ధతులు పాటించి సాగు చేయడమే కాకుండా మంచి బలవర్థకమైన, ప్రొటీన్లు, ఔషధగుణాలు కలిగిన ధాన్యం కావడంతో స్థానికంగా ఈ రకానికి బాగా డిమాండ్ ఉంది. ఎకరానికి 50 బస్తాల వరకు దిగుబడి రాగా క్వింటాల్ రూ. 8 వేల చొప్పున అమ్ముతున్నాడు. సాగు విస్తీర్ణం పెంచుతా బాస్మతి వరి సాగు విస్తీర్ణం పెంచుతా. వానాకాలంలో అర ఎకరం సాగు చేశాను. తెగుళ్ల బాధ పెద్దగా లేదు. దిగుబడి ఆశాజనకంగా ఉంది. సుమారు 40 బస్తాల ధాన్యం రావచ్చు. ఇప్పటికే పది మంది రైతులు పొలంలోని బాస్మతి వరి పంటను పరిశీలించారు. వారంతా బాస్మతి సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. – దేవరపల్లి విద్యాసాగర్‌రెడ్డి -
బ్రిటిష్ వైద్యుడు పరిశోధించి చెప్పిన మన ‘వరి’కథేంటో తెలుసా..!
పుష్కలంగా నీళ్లు.. ఎడారి లాంటి మారుమూలలనూ తడుపుతున్న నదీ జలాలు.. కోటిన్నర టన్నుల వరకు వరి దిగుబడికి సానుకూల పరిస్థితులు.. ధాన్యాగారం పంజాబ్ తర్వాత మనమేనని గర్వంగా చెప్పుకోగలిగే కీర్తి.. ఇది ఇప్పుడు వినిపిస్తున్నమాట. కానీ, నేటి కాలాన్ని దిగదుడుపు చేస్తూ రెండు శతాబ్దాల కిందటే వరంగల్ రైతులు పొలాల్లో సాగు విప్లవమే సృష్టించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిశోధించి వరి చేలో హలధారుల గణకీర్తిని అక్షరబద్ధం చేశాడో బ్రిటిష్ వైద్యుడు. ఆ నివేదికను బ్రిటిష్ రెసిడెంట్‌కు అందించి ఓరుగల్లు రైతుల అద్భుత పనితీరును కళ్లకుకట్టాడు. ఇది 180 ఏళ్ల కింద ‘స్టాటిస్టికల్ రిపోర్ట్ ఆన్ సర్కార్ ఆఫ్ వరంగల్’పేరుతో ‘మద్రాస్ జర్నల్ ఆఫ్ లిటరేచర్ అండ్ సైన్స్’మేగజైన్లో అచ్చయింది. ‘అటకెక్కిన’పుస్తకాల దొంతరలో అంతర్ధానమయ్యే వేళ పుదుచ్చేరిలోని కాంచి మామునివర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఫర్ పీజీ స్టడీస్ అండ్ రీసెర్చ్ హిస్టరీ విభాగాధిపతి బి.రామచంద్రారెడ్డి గుర్తించి సేకరించారు. దీంతో అలనాటి ఓరుగల్లు ప్రాంతంలో పంటలు, ప్రత్యేకంగా వరి విప్లవం, నాటి సాగునీరు, భూముల వివరాలు ఇప్పటి తరానికి తెలిసే అవకాశం కలిగింది. – సాక్షి, హైదరాబాద్ ఇలా మొదలైంది.. ముందునుంచి తెలంగాణ ప్రాంతం వ్యవసాయంపైనే ఆధారపడింది. సాగునీటి లభ్యతతో సంబంధం లేకుండా పొలాన్ని నమ్ముకుంది. అందునా.. వరికి ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. నిజాం జమానాలో అందుబాటులోని సాగునీటిని వాడుకుంటూ నాటి కర్షకులు అద్భుతాలే సృష్టించారు. నీటి లభ్యత తక్కువగా ఉండటంతో తక్కువ నీటితోనే ఎక్కువ దిగుబడినిచ్చే కొత్తరకం వంగడాలను సృష్టించి గొప్ప మేధస్సుందని నిరూపించారు. ఇక్కడ పాలన నిజాందే అయినా.. క్రమంగా కంటోన్మెంట్లను ఏర్పాటు చేసుకుని బ్రిటిష్ సైన్యం ఆధిపత్యం చలాయించేవేళ ఈ సాగు పద్ధతులపై ఆంగ్ల పాలకులు ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. నిజాం–బ్రిటిష్ పాలకుల మధ్య పన్నుల లావాదేవీలో, మరే ఇతర కారణాలో స్పష్టత లేదు కానీ.. ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో భూములు, సాగునీటి ప్రత్యేకతలు, పంటల వివరాలను సేకరించాలని నిర్ణయించారు. స్థానిక బ్రిటిష్ రెసిడెంట్ ప్రత్యేకంగా ఈ బాధ్యతను కంటోన్మెంట్ ఆసుపత్రిలో సర్జన్‌గా ఉన్న ఎ.వాకర్‌కు అప్పగించారు. ఆయన ప్రత్యేక విధుల పేరుతో నాటి వరంగల్ సర్కార్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని అక్కడ అధ్యయనం చేసి వివరాలు సేకరించారు. నేలల స్వభావం, ఏయే నేలల్లో ఎలాంటి పంటలు పండుతున్నాయి, రైతులు ఏయే కాలాల్లో ఏం పంటలు వేస్తున్నారు, సాగు నీటి స్వభావం.. ఇలా చాలా వివరాలు సేకరించారు. అన్నింటిలోనూ ఆయన దృష్టి వరిపై పడింది. దీంతో ప్రత్యేకంగా వరి వంగడాల చిట్టా రూపొందించారు. మళ్లీ పరిశోధన అవసరం.. ‘గతంలో పండించిన అద్భుత వంగడాలపై ఇప్పుడు ఆసక్తి లేకుండా పోయింది. కొత్త వంగడాల మోజులో వాటిని వదిలేశారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆసక్తి చూపేలా అలనాడు పండిన పంటలపై మళ్లీ పరిశోధనలతో కూడిన వివరాలు, ఆ పంటలు రావాలి.’ – జలపతిరావు, వ్యవసాయ విశ్వవిద్యాలయం విశ్రాంత అధికారి 32 రకాల వంగడాలివి... : బతిక్ ధాన్, గూటుమొలకలు, గుర్కసన్నాలు, పచ్చగన్నేర్లు, సుపురాయినాలు, బంగారు తీగలు, కుంకుమ పూలు, మూడుగొటిమెలు, కకలాలపుచ్చెలు, ఇప్పవడ్లు, మసూరి వడ్లు, పులి మూసలు, గోదావరి ఉస్కెలు, చిట్టిముత్యాలు, గుంభోజులు, కుత్తకిస్మూరలు, బుల్లిమచ్చలు, తెల్ల మచ్చెలు, తాటిపెల్లు, కాకిరెక్కలు, చామకూరలు, చండ్రమున్కలు, కొంగగొర్లు, పొట్టి మొలకలు, అడెంగలు, బూరవడ్లు, రెడ్డిసామికటికెలు, డోండ్రీ సంకెలు, మైల సామలు, గరిడురొడ్లు, బుంజాలు. వంద రకాలున్నా.. 32 ప్రత్యేకం.. వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన పరిశోధన చేసే సమయానికి దాదాపు వంద రకాల ధాన్యాన్ని పండిస్తున్నారని గుర్తించారు. అయితే ఇందులో ఎక్కువ మంది రైతులు 32 రకాల వంగడాలపై ఆసక్తి చూపుతున్నారని తేల్చారు. కాకిరెక్కలు లాంటి వడ్లు నల్లగా ఉండేవి, కానీ బియ్యం తెల్లగా మెరిసేవి. చిట్టి ముత్యాలు చిన్న ముత్యాల్లా మెరుస్తూ ఉండేవి. బియ్యం వండితే ఘుమఘుమలాడేది. గోదావరి ఉస్కెలు ఎత్తుగా పెరిగే వంగడం, బియ్యం బరువుగా, సువాసనతో ఉండేవి. కుంకుమపూలు సులభంగా పండే వంగడం. తక్కువ నీటినే వాడుకుంటుంది. ఆ బియ్యానికి శక్తివంతమైనవన్న పేరుంది. ఇలాంటి సమగ్ర వివరాలనే బ్రిటిష్ రెసిడెంట్‌కు అందించారు. ఆ మేరకు అప్పట్లో ప్రతిష్టాత్మక మద్రాసు జర్నల్‌లో అది ప్రచురితమైంది. ఈ వివరాల ఆధారంగా బ్రిటిష్ పాలకులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారన్న విషయం మాత్రం అందులో స్పష్టం చేయలేదు. ప్రత్యేకంగా అనిపించి సేకరించా ‘నా పరిశోధనకు సమాచారాన్ని సేకరించే క్రమంలో మద్రాస్ ఆర్కీవ్స్‌కు వెళ్లినప్పుడు బ్రిటిష్ వైద్యుడు వాకర్ సేకరించిన వివరాలతో ప్రచురణ కనిపించింది. చాలా ఆసక్తిగా అనిపించడంతో దాన్ని సేకరించి మళ్లీ ముద్రించుకున్నాను’. – బి.రామచంద్రారెడ్డి అవి గొప్ప వంగడాలు ‘వరిలో అలనాడు అద్భుత వంగడాలు సృష్టించి పండించారు. ఇప్పటి తరానికి వాటి పేర్లు కూడా చాలా వరకు తెలియదు. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేలా ఉండేవి. అందుకే నేను సంప్రదాయ వంగడాలను తిరిగి సృష్టించి పండిస్తున్నా. ప్రస్తుతం వంద రకాల వరిధాన్యాలు పండుతున్నాయి’. – నాగుల చిన్నగంగారాం, నిజామాబాద్, అభ్యుదయ రైతు. -
గాన గంధర్వుడు బాలు మ్యూజికల్ మ్యాజిక్: వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తుది శ్వాస విడిచి సంవత్సరం ముగిసినా ఆ అమర గాయకుడిని మర్చి పోవడం అభిమానులకు వశం కావడం లేదు. అమృతగానంతో ఓలలాడించిన బాలుని తలచుకుని ఇప్పటికీ కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన జ్ఞాపకాలను పదే పదే నెమరువేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో బాలుకి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. రావోయి చందమామ అంటూ మధుర గాత్రంలొ అయిదు రకాల గొంతులతో ఆయన చేసిన మ్యాజిక్‌ను మరోసారి ఎంజాయ్ చేస్తున్నారు. బాలు జ్ఞాపకాలుఅనే ట్విటర్ ఖాతా ఈ వీడియోను షేర్ చేసింది. When Balu garu gave us a glimpse of his mimicry talent with the classic "Raavoyi Chandamama", in 5 different voices...#SPBLivesOn ❤🙏#SPBalasubrahmanyam pic.twitter.com/L6NZVRk8Uh — బాలు జ్ఞాపకాలు (@balu_jnapakalu) September 28, 2021 -
వెరైటీ కోడి
-
వింతగా కాసిన మిరప
సాక్షి, మహబూబ్‌నగర్ : ధారణంగా ఏ చెట్టుకైనా పండ్లు గాని, కూరగాయలు గాని కొమ్మ కిందకు వేలాడుతూ కాస్తాయి. కానీ ఇక్కడ కన్పించే మిరప చెట్టుకు మాత్రం మిరపకాయలు వింతగా ఆకాశం వైపు చూస్తూ పైకి కాశాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎదిర గ్రామంలోని కుర్వ చంద్రశేఖర్ ఇంట్లోని చెట్టుకు వింతగా మిరప కాయలు కాయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. -
బాల్కొండ ఓటరు తీర్పు విభిన్నం
సాక్షి,మోర్తాడ్(బాల్కొండ): బాల్కొండ ఓటర్ల తీర్పు ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. రాజకీయ విశ్లేషకుల అంచనాలకు తలకిందులు చేస్తూ ఇక్కడి ఫలితాలు రావడం ఆనవాయితీగా వస్తోంది. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక విధంగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోలా విభిన్నమైన తీర్పునిచ్చిన బాల్కొండ ఓటర్లు రాజకీయ పరిశీలకుల అంచనాలను తలకిందులు చేశారు. శాసనసభ ఎన్నికల్లో టీడీపీని మట్టి కరిపించి కాంగ్రెస్‌కు పట్టం కట్టిన ఓటర్లు.. స్థానిక ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చి టీడీపీకి జైకొట్టారు. ఇలా ఒక్కో ఎన్నికలో ఒక్కో విధమైన తీర్పును వెల్లడించిన బాల్కొండ ఓటర్లు.. రాజకీయ విశ్లేషకులకు తమ నాడిని అంతు పట్టకుండా చేశారు. కాంగ్రెస్, టీడీపీ మధ్యే పోటీ.. నియోజకవర్గ పునర్విభజన జరుగక ముందు బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్పల్లి, ఆర్మూర్, నందిపేట్ మండలాలు ఉండేవి. మండల పరిషత్‌లకు తొలిసారి 1987లో ఎన్నికలు జరుగగా, బాల్కొండలో గడ్డం నర్సయ్య, కమ్మర్‌పల్లిలో భాస్కర్‌రావు(కాంగ్రెస్), మోర్తాడ్‌లో అమృతలతారెడ్డి, ఆర్మూర్‌లో జగదీశ్వర్‌రెడ్డి, నందిపేట్‌లో మారంపల్లి నర్సారెడ్డి(టీడీపీ) ఎంపికయ్యారు. 1995లో ఎంపీపీ స్థానాలకు పరోక్ష పద్ధతిలో, అలాగే, కొత్తగా జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించారు. ఆ సమయంలో బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉంది. కానీ, స్థానిక ఎన్నికల్లో ఫలితాలు మాత్రం నిరాశపరిచాయి. ఈ ఎన్నికల్లో టీడీపీకి రెండు మండలాల్లో ప్రభావం కనిపించగా, కాంగ్రెస్ మూడు మండలాల్లో సత్తా చాటింది. 2001లో టీఆర్ఎస్ హవా.. 2001లో నిర్వహించిన ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అప్పుడే ఆవిర్భవించిన టీఆర్ఎస్ తన సత్తా చాటింది. నియోజకవర్గంలో పట్టు ఉన్న కాంగ్రెస్, టీడీపీలను మట్టి కరిపించిన టీఆర్ఎస్ నాయకులు స్థానిక సంస్థలలో పాగా వేశారు. ఒక్క కమ్మర్‌పల్లిలో మాత్రం జెడ్పీటీసీ స్థానం కాంగ్రెస్‌కు లభించింది. ఈ ఎన్నికల్లో మోర్తాడ్ ఎంపీపీగా కనకం గంగనర్సు, జెడ్పీటీసీగా నూగూరు ప్రకాశ్, బాల్కొండ ఎంపీపీగా బద్దం నర్సవ్వ, జెడ్పీటీసీ సభ్యునిగా ఈఎన్ రావు, ఆర్మూర్ ఎంపీపీగా ఉషారాణి, జెడ్పీటీసీ సభ్యుడిగా రణధీర్ ఎంపికయ్యారు. నందిపేట్ ఎంపీపీగా సమంత సాయిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడిగా నారాగౌడ్, కమ్మర్పల్లి ఎంపీపీగా గుడిసె అంజమ్మ టీఆర్ఎస్ తరపున స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహించారు. ఈ ఎన్నికల్లో కమ్మర్పల్లి జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ తరపున చింత ధర్మపురి ఎంపికయ్యారు. 2006లో తారుమారు.. 2006 ఎన్నికల నాటికి ఫలితాలు తారుమారయ్యాయి. టీఆర్ఎస్ హవా పూర్తిగా తగ్గిపోయి కాంగ్రెస్, టీడీపీ పుంజుకున్నాయి. ఈ ఎన్నికల్లో నాలుగు మండలాల్లో కాంగ్రెస్, ఒక మండలంలో టీడీపీ విజయం సాధించాయి. మోర్తాడ్ ఎంపీపీగా గుర్రం నర్సయ్య, జెడ్పీటీసీ సభ్యురాలిగా శారద తెలుగుదేశం పార్టీ గెలుపొందారు. బాల్కొండ ఎంపీపీగా జక్క రాజేశ్వర్, జెడ్పీటీసీ సభ్యునిగా గంగాధర్, ఆర్మూర్ ఎంపీపీగా సుంకర శెట్టి, జడ్పీటీసీ సభ్యునిగా దేవమల్లయ్య కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. నందిపేట్ ఎంపీపీగా కోల రాములు, జెడ్పీటీసీ సభ్యుడిగా నాయుడు ప్రకాశ్, కమ్మర్పల్లి ఎంపీపీగా గోపు దేవిదాస్, జెడ్పీటీసీ సభ్యురాలిగా లక్ష్మి గెలుపొందారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో బాల్కొండ నియోజకవర్గం స్వరూపం మారిపోయింది. బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాలు యథావిధిగా నియోజకవర్గంలో ఉండగా, వేల్పూర్, భీమ్‌గల్ మండలాలు కొత్తగా చేరాయి. అనంతరం 2014లో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో అన్ని మండలాల్లో గులాబీ పార్టీ ఆధిక్యతను చాటుకుంది. టీఆర్ఎస్ తరపున ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు గెలిచి ఆ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకవచ్చారు. -
నా పేరు చెప్పుకోండి..?
జహీరాబాద్ టౌన్: ఈ ఫొటోలో కనిపిస్తోంది క్యాబేజీ అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడినట్లే. ఇది క్యాబేజీలా కనిపిస్తున్న ఓ పిచ్చిమొక్క. మండలంలోని హుగ్గెల్లి రైతు ఇస్మాయిల్ తన పొలంలో క్యారెట్ సాగు చేశాడు. పంట మధ్యలో ఈ పిచ్చి మొక్క మొలిచింది. విచిత్రమైన ఈ మొక్కను సమీప రైతులు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. -
వినూత్న బోధన
అల్లాదుర్గం(మెదక్): గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య గాడి తప్పుతుంటే, ఈ ఉపాధ్యాయుడు ప్రాణం పోస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో ప్రాథమిక విద్య అస్తవ్యస్తంగా మారుతోంది. ఆ పాఠశాలలో ఉన్న ఒకే ఉపాధ్యాయుడు ఐదు తరగతులకు బోధించడం ఇబ్బందిగా మారుతుంది. ఐతే ఆయనకు వినూత్నమైన ఆలోచన తట్టింది. సేల్ఫోన్ సహాయంతో ఐదు తరగతులకు పాఠాలు బోధిస్తున్నాడు. ఆయన ఒక తరగతిలో బోధిస్తూ , మిగితా వాటిలో ఫోన్ ద్వారా యూట్యూబ్‌లోని వీడియోలను డౌన్లోడ్ చేసి దానికి సౌండ్ బాక్స్‌లను అనుసంధానం చేసి పలు తరగతుల్లో ఉంచడం ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు. యూట్యూబ్ నుంచి తెలుగు వర్ణమాల, గుణితాలు, పద్యాలు, ఆంగ్ల వర్ణమాల నంబర్లను డౌన్లోడ్ చేసుకుని వాటి ద్వారా చార్ట్‌లను తయారు చేసి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధిస్తున్నాడు. బ్లూటూత్ ద్వారా కనెక్షన్.. అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ తండా (మాణిక్యరాజ్‌తండా) ప్రాథమిక పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలకు దీటుగా విద్యబోధన జరుగుతోంది.ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని సెల్‌ఫోన్‌కు చిన్న సౌండ్ బాక్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు తరగతులు బోధిస్తున్నాడు. ఒక్క ఉపాధ్యాయుడు ఐదు తరగతులు బోధించడం గగనంగా మారింది.దీంతో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు చిట్టిబాబుకు ఈ ఐడియా వచ్చింది. ఫోన్‌కు బ్లూటూత్ ద్వారా చిన్న చిన్న సౌండ్ బాక్స్ ఏర్పాటు చేశారు. అఆలు రాస్తు చెబుతుంటే అందులో విద్యార్థులు వింటూ నేర్చుకుంటున్నారు. విద్యార్థులు చక్కగా వింటూ పలకడం, రాయడం చేస్తుండటంతో ఉపాధ్యాయుడి వినూత్న ప్రయోగం విజయవంతమైంది. ఉపాధ్యాయుడి రూపొందించిన వివిధ రకాల చార్ట్‌లు పాఠశాల గోడలపై అతికించిన చార్ట్‌లు సులువుగా నేర్చుకుంటున్నారు.. రాష్ట్రంలోనే ఈ విధంగా విద్యబోధన చేయడం ఏ ప్రభుత్వ పాఠశాలలో కనిపించదు. కూడికలు, తీసివేతలు, గుణితాలు, సంయుక్త అక్షరాలు, వివిధ రకాల చాట్లు 500 వరకు ఆయన తయారు చేశాడు. విద్యార్థులకు చార్ట్‌లు ఇచ్చి కూడికలు, తీసివేతలు, గుణితాలు చేయాలని చేప్తూ విద్యార్థులకు బోధిస్తున్నాడు. అలాగే రైమ్స్ పద్యాలు విద్యార్థులు సులువుగా నేర్చుకుంటున్నారు. బొమ్మల కథలు విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి. ఇంగ్లిష్ పదాలు, కాకుర్తాలు ఫోన్లో వింటూ నేర్చుకుంటున్నారు. ఇబ్బందిగా ఉండేది.. ఐదు తరగతులకు ఒక్కడినే బోధించాంలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ ఐడియా ద్వారా విద్యబోధన సులువు అయ్యింది. ఫోన్లో అక్షరాలు రాయడం, పలకడంతో విద్యార్థులు శ్రద్ధగా వింటూ నేర్చుకుంటున్నారు. 3 , 4 తరగతుల విద్యార్థుల కోసం చార్ట్‌లు తయారు చేసి , విద్యార్థుల ముందు పెట్టడంతో వారే వాటిని చూసుకుని గణితం, తెలుగు, సైన్స్ పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇలా ప్రతి పాఠశాలకు ప్రభుత్వం ల్యాప్‌ట్యాప్, ట్యాబ్ పంపిణీ చేస్తే ఇలాంటి బోధనతో విద్యార్థులు సులువుగా నేర్చుకుంటారు. – చిట్టిబాబు, ఉపాధ్యాయుడు, గడిపెద్దాపూర్‌తండా -
వేర్వేరు చోట్ల ముగ్గురి మృతి
జిల్లాలో వేర్వేరు చోట్ల ముగ్గురు మృతి చెందారు. శ్రీకాకుళం నగరంలో అనుమానాస్పద స్థితిలో ఓ యువతి, పాలకొండలో చెరువు గట్టుపై ఓ యువకుడు, ఇచ్ఛాపురంలో రైలు పట్టాలపై ఓ వృద్ధుడు దుర్మరణం చెందారు. శ్రీకాకుళం రూరల్: నగరంలోని వెంకటేశ్వర ఆలయం వెనుక చెరువు గట్టుపై ఉన్న ఇంట్లో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కిలుగు శాంతి(19) తంర్రి మృతి చెందడంతో కొన్నాళ్లుగా తల్లి, అమ్మమ్మతో కలిసి చెరువు గట్టుపై ఉన్న ఇంట్లో ఉంటోంది. చుట్టుపక్కల వీధుల్లోని చిన్నారులకు ట్యూషన్ చెబుతూ ఇంటిని నెట్టుకొస్తోంది. ఏం జరిగిందో గానీ సోమవారం ఉదయం విగతజీవిగా కనిపించింది. శాంతి మృతిపై బిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంతమంది అనారోగ్యం కారణంగా ఉరివేసుకొందని చెబుతుండగా, మరికొందరు ఇంట్లోకి నీరు తీసుకువెళ్తుండగా మెట్లపై నుంచి జారిపడి తలకు బలమైన గాయమై చనిపోయిందని చెబుతున్నారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందలేదు. రైలుపట్టాలపై వృద్ధుడు.. ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైలు నిలయం సమీపంలో బెల్లుపడ కాలనీ వద్ద ఇచ్ఛాపురం నుంచి బరంపురం వైపు వెళ్లే డౌన్ట్రాక్లో గుర్తు తెలియని రైలు ఢీకొట్టడంతో ఓ వృద్ధుడు మృతిచెందాడు. తెలుపు షర్టు, పంచె ధరించిన ఈ వృద్ధుడి వయసు సుమారు 63 ఏళ్లు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. జీఆర్పీ ఎస్ఐ కె.రవికుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కోనేటి గట్టుపై యువకుడు... పాలకొండ రూరల్: వడమ గ్రామ సమీపంలోని కళ్యాణి కోనేటి గట్టుపై ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించి సోమవారం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ కె.వాసునారాయణ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పాలకొండ ఇందిరానగర్ కాలనీకి చెందిన కళివరపు రమణ(25) స్థానికంగా వంట పనులు చేస్తుండేవాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో దూరప్రాంతాల్లో వంటలకు వెళ్తుండేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసై చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రమణ కుటుంబీకులకు సమాచారం అందించి మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదుచేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.