రేవ్ పార్టీ అంటే సంగీతం, నృత్యం, పార్టీలు, ఆనందం ఇవన్నీ లైసెన్స్ పొందిన నైట్‌క్లబ్‌లలో సాగే వ్యవహారం. కానీ రాను రాను డీజేలు, లేజర్ లైట్లు, లైవ్ పాప్ అండ్ ర్యాప్,ఎలక్ట్రానిక్ సంగీత కారుల హోరు, అర్థనగ్న నృత్యాలు, బాడీ పెయింటింగ్స్, విజువల్ ఎఫెక్ట్స్ మద్యం, మాదక ద్రవ్యాల వినియోగం, లైంగిక కార్యకలాపాలు, అమ్మాయిలపై వేధింపులు, ఒక్కోసారి అత్యాచారాలకు నిలయంగా రేవ్ పార్టీలు మారిపోయాయి. కాలానుగుణంగా ఈవెంట్ ప్రమోటర్లు తమ వ్యూహాలను మార్చుకుంటూ రావడం గమనార్హం.
సాధారణంగా ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ (EDM), టెక్నో మ్యూజిక్ ,ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఇలా అనేక రకాల మ్యూజిక్స్‌తో హోరెత్తించే భారీ ఆల్-నైట్ డ్యాన్స్ పార్టీలు. మిరుమిట్లు గొలిపే లైట్ షోలు, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ మిళితంగా సాధారణంగా నివాస ప్రాంతాలకు దూరంగానో, లైసెన్స్ ఉన్న క్లబ్స్‌లో జరుగుతాయి. రేవ్ పార్టీలు విభిన్న రకాలుగా ఉంటాయి. వాటి వివరాలు చూద్దాం.
రేవ్ పార్టీలు, రకాలు
ఫెస్టివల్ రేవ్స్: ఫెస్టివల్ రేవ్‌లు చాలా రోజుల పాటు జరిగే భారీ స్థాయిలో జరిగే ఈవెంట్‌లు. ఇందులో టెక్నో, హౌస్ ,డ్రమ్, బాస్ వంటి అనేక రకాల ఎలక్ట్రానిక్ మ్యూజిక్ స్టయిల్స్ ఉంటాయి.
అండర్‌గ్రౌండ్ రేవ్‌లు: అండర్‌గ్రౌండ్ రేవ్‌లు సాధారణంగా గిడ్డంగులు, పాడుబడిన భవనాలుచ అండర్ గ్రౌండ్ క్లబ్‌లలో నిర్వహిస్తారు.
క్లబ్ రేవ్స్: క్లబ్ రేవ్‌లు సాంప్రదాయ నైట్‌క్లబ్ వేదికలలుగా ఏర్పాటు చేస్తారు. టెక్నో, హౌస్ , ట్రాన్స్ వంటి ఎలక్ట్రానిక్ సంగీత కళా ప్రక్రియల మిశ్రమాన్ని కలిగి ఉంటాయి. ఈ పార్టీలు ఎక్కువగా కమర్షియల్‌గానే జరుగుతాయి
థీమ్ బేస్డ్ రేవ్‌లు: హాలిడే లేదా నిర్దిష్ట సంగీత శైలి వంటి నిర్దిష్ట థీమ్ చుట్టూ కేంద్రీకృతమై ఉండే పార్టీలను థీమ్డ్ రేవ్‌లు అంటారు. ఈ పార్టీల్లో ధరించే దుస్తులు, డెకరేషన్, యాక్టవిటీస్ అన్నీ థీమ్‌కు అనుగుణంగా ఉంటాయి.
డే రేవ్స్: డే రేవ్‌లు అనేది పగటిపూట జరిగేవి. వివిధ రకాల ఎలక్ట్రానిక్ సంగీతంతో ఆరు బయట జరుగుతాయి.
సైలెంట్ డిస్కో: పేరుకు తగ్గట్టుగానే ఇవి చుట్టుపక్కలవారికి ఎలాంటి అంతరాయంగా లేకుండా సెలెంట్‌గా ఉంటాయి. ఈ పార్టీలో సంగీతాన్ని వినడానికి హాజరైనవారు సైలెంట్ డిస్కోల సంప్రదాయ స్పీకర్లకు బదులుగా వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లను ధరిస్తారు.
సైట్రాన్స్ రేవ్స్: సైట్రాన్స్ రేవ్‌లు సైకెడెలిక్ ట్రాన్స్ సంగీతంపై దృష్టి సారించే పార్టీలు. డ్యాన్స్, కాస్ట్యూమ్స్ విజువల్స్ తోపాటు తమదైన సొంత సబ్‌కల్చర్ మ్యూజిక్ ఉంటుంది.
హార్డ్‌స్టైల్ రేవ్‌లు: హార్డ్‌స్టైల్ రేవ్‌లు హార్డ్‌స్టైల్ సంగీతాన్ని కలిగి ఉండే పార్టీలు. హార్డ్ టెక్నో, హార్డ్‌కోర్, ఫాస్ట్ టెంపో మ్యూజిక్‌తో హై ఎనర్జీతో ఉంటాయి. ఇలా ఒక్కో రేవ్ పార్టీకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment