ప్రాణాలు తీసిన ప్రమాదాలు | ROAD ACCIDENTS.. TWO PERSONS DEAD | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీసిన ప్రమాదాలు

Published Wed, May 24 2017 2:15 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ప్రాణాలు తీసిన ప్రమాదాలు - Sakshi

ప్రాణాలు తీసిన ప్రమాదాలు

చాగల్లు/జంగారెడ్డిగూడెం రూరల్‌ : రోడ్డు ప్రమాదాలు ప్రాణాలను హరిస్తున్నాయి.. నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతూ ఢీకొట్టడం, వాహనాల నుంచి జారిపడటం వంటి ఘటనల్లో ప్రాణాలు పోతున్నాయి. జిల్లాలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. చాగల్లులో మెటల్‌ రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందగా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో బైక్‌పై నుంచి పడి తలకు తీవ్రగాయమై మరోవ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. 
 
చాగల్లులో ట్రాక్టర్‌ ఢీకొని..
చాగల్లులో ట్రాక్టర్‌ ఢీకొని వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన చోటుచేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి.. చాగల్లుకు చెందిన విజయదుర్గ బ్రిక్స్‌ పరిశ్రమలో పనులు ముగించుకుని సోమవారం రాత్రి సమయంలో ఇండస్ట్రీ అధినేత కోట కృష్ణ (45) మోటార్‌ బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో బైక్‌ గ్రామంలోని ఈదమ్మవారి ఆలయ సమీపంలోకి వచ్చేసరికి వెనుక నుంచి నల్ల కంకర రవాణా చేసే ట్రాక్టర్‌ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కృష్ణ తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు నిడదవోలు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరిం చారు. కృష్ణ సోదరుడు సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎం.జయబాబు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కు మార్తెలు. కృష్ణ క్వారీ, బ్రిక్‌ ఇండస్ట్రీ యా జమానిగా పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో గ్రామంలో మం చి పేరు ఉంది. గ్రామ ప్రముఖులు, చాగల్లులో విజయదుర్గ భవన నిర్మాణ సం ఘం కార్మికులు మంగళవారం ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. 
 
వివాహ వేడుకకు వెళ్లి వస్తూ తాడువాయిలో.. 
జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో మంగళవా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. టి.నరసాపురం మండలం బండివారిగూడెం గ్రామానికి చెందిన చింతం శ్రీనివాసరావు (37) అనే వ్యక్తి కొయ్యలగూడెం మండలం డిప్పకాయలపాడులో బంధువుల ఇంట్లో వి వాహ వేడుకకు వెళ్లాడు. తిరిగి మధ్యాహ్న సమయంలో స్వగ్రామానికి మోటారు సైకిల్‌పై బయలుదేరాడు. తాడువాయి సబ్‌స్టేషన్‌ సమీపంలోకి వచ్చేసరికి శ్రీని వాసరావు మోటారు సైకిల్‌పై నుంచి కిం ద పడ్డాడు. అతడి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెం దాడు. ఘటనా స్థలం వద్ద బంధువుల రోదనలు మిన్నం టాయి. మృతునికి భార్య, ముగ్గురు  పిల్లలు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement