chagallu
-
పొరలు పొరలుగా.. నోరూరించేలా..
సాక్షి, చాగల్లు (పశ్చిమగోదావరి) : మామిడి పండు అంటేనే నోరూరుతుంది. ఇక ఆ మామిడితో చేసే తాండ్రను తింటే మనం ఒక పట్టాన వదిలిపెట్టం. తాండ్రను పొరలు పొరలుగా తీసుకుంటూ తింటూ ఉంటే ఆ రుచే వేరు. పిల్లలు, పెద్దలు అనే తేడా అందరికీ ఇష్టమైన ఈ మామిడి తాండ్ర తయారీ కొంచెం కష్టమైనా రుచిలో మాత్రం అద్భుతం. ఇక ఆ మామిడితాండ్రకు ప్రసిద్ధి చెందిన చాగల్లు మండలం ఊనగట్ల గ్రామం వెళ్తే సీజన్లో ఎక్కడ చూసినా తాండ్ర తయారు చేస్తూ బిజీగా కనిపిస్తుంటారు. చాపలపై మామిడి రసం పాముతూ తాండ్ర ఎండబెట్టేందుకు శ్రమిస్తుంటారు. వేసవిలో దొరికే మామిడిపళ్ల రుచి అన్ని సీజన్లలోనూ ఆస్వాదించేలా తయారు చేసే మామిడి తాండ్ర సంగతులు తెలుసుకునేందుకు ఒకసారి ఊనగట్ల వెళ్లొద్దాం రండి. ఊనగట్ల గ్రామంలో ఎప్పటి నుంచో ఈ మామిడి తాండ్ర తయారీ కుటీర పరిశ్రమగా కొనసాగుతోంది. కాలం మారేకొద్దీ తయారీ విధానాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. ఏటా మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తాండ్ర తయారీ ముమ్మరంగా సాగుతుంది. మామిడి పండ్ల గుజ్జు నుంచి తాండ్రను తయారు చేస్తారు. గతంలో కాయలను రోళ్లలో వేసి గుజ్జు తీసేవారు. ఇప్పుడు అధునాతమైన యంత్రాల సాయంతో గుజ్జు తీస్తున్నారు. ఆ గుజ్జులో బెల్లం లేదా పంచదార కలిపి తాటాకు చాపలపై పూతగా పెడతారు. ఈ విధంగా ఎండాకాలంలో రోజుకు ఐదు నుంచి ఎనిమిది సార్లు చొప్పున వారం రోజులపాటు పూత పెడితే మామిడితాండ్ర తయారవుతుంది. తాండ్రను ఆరిన తరువాత ముక్కలుగా కోసి పెట్టెల్లో ప్యాక్ చేసి భద్రపరుస్తారు. మామిడికాయల గుజ్జును తీస్తున్న దృశ్యం ఇటీవల తగ్గిన తయారీ కేంద్రాలు మామిడితాండ్రకు కలెక్టర్, రసాలు, బంగినపల్లి వంటి మామిడిపళ్ల రకాలు వినియోగిస్తారు. నిడదవోలు, కొవ్వూరుపాడు, ద్వారకాతిరుమల, తాడేపల్లిగూడెం, నూజివీడు, కొరుకొండ, రాజమండ్రి మార్కెట్ల నుంచి మామిడికాయలను టన్నుల లెక్కన కొనుగోలు చేస్తారు. మామిడితాండ్ర కోసం ఒక్కొక్కరూ రోజూ టన్ను మామిడికాయల వరకు దిగుమతి చేసుకుంటారు. ఇటీవల వాతావరణం అనుకూలించక మామిడి కాపు తగ్గి రేట్లు గణనీయంగా పెరిగాయని తయారీదారులు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం మామిడితాండ్ర తయారీ కేంద్రాలు గతంలో 50 వరకు ఉండగా, ప్రస్తుతం 15 కేంద్రాలకు తగ్గిపోయాయి. ఏటా వేసవిలో ఉపాధి మామిడి తాండ్ర పెద్ద తయారీ కేంద్రాల్లో 25 నుంచి 30.. చిన్న కేంద్రాల్లో 15 నుంచి 20 మంది ఉపాధి పొందుతుంటారు. సీజన్లో గ్రామంలో సుమారు 500 మందికి పైగా ఉపాధి దొరుకుతుంది. మామిడితాండ్ర తయారీ సమయంలో వ్యవసాయ పనులు లేకపోకపోవడంతో ఈ పరిశ్రమ మహిళలకు ఆదాయ వనరు ఉంటోంది. ఈ ప్రాంత ప్రజలకు మామిడితాండ్ర తయారీ చక్కని ఉపాధి అవకాశాలు కలిగిస్తోంది. గత రెండేళ్లుగా సీజన్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో తాండ్ర తయారీ నిర్వాహకులు భయపడ్డారు. భౌతిక దూరం, తగిన జాగ్రత్తలు పాటిస్తూ కూలీలతో పనులు చేసుకోవచ్చని ప్రభుత్వం భరోసా కల్పించడంతో తయారీ దారులు మామిడి కాయలను దిగుమతి చేసుకుని తాండ్ర తయారీ పనులు కొనసాగించారు. హైద్రాబాద్, ముంబై, చెన్నైలకు ఎగుమతి తాండ్రను తగిన సైజుల్లో ముక్కలుగా కోసి 50 కేజీలు చొప్పున పెట్టెలుగా పెట్టి 200 పెట్టెలను లారీకి ఎగుమతి చేస్తుంటారు. మామిడితాండ్ర ధర క్వింటాలు రూ.8 వేలు నుంచి రూ.9 వేల వరకు ఉంటుంది. సుమారు రూ.50 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. హైద్రాబాద్, ముంబై, చెన్నై తదితర ప్రాంతాలకు తాండ్ర ఎగుమతి చేస్తారు. మామిడితాండ్రను సైకిళ్లపై విక్రయిస్తూ మరో వంద మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఏడాది పొడవునా అమ్మకాలు ఎన్నో ఏళ్లుగా మామిడితాండ్ర తయారీ పరిశ్రమ నిర్వహిస్తున్నాం. తాండ్రను కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ ఉంచి ఏడాది పొడవునా అమ్మకాలు చేస్తున్నాం. – బి. శ్రీనివాసరావు, మామిడితాండ్ర తయారీదారుడు తయారీవ్యయంతో ఇబ్బందులు పెరుగుతున్న మామిడి ధరలతో పాటు కూలీల కొరత అధికంగా ఉంటుంది. తాండ్రకు గిట్టుబాటు ధరలు అంతంత మాత్రంగా ఉండటంతో ఇటీవల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. – కొండేపర్తి శ్రీనివాసరావు, మామిడితాండ్ర తయారీదారుడు తాండ్ర తయారీతో మహిళలకు ఉపాధి మామిడితాండ్ర కుటీర పరిశ్రమగా వేసవి కాలంలో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. పనిని బట్టి రోజుకు రూ.200 నుంచి రూ.250 వరకు కూలీ లభిస్తుంది. ఈ ప్రాంత మహిళల అభివృద్ధి తాండ్ర పరిశ్రమ దోహదం చేస్తుంది. – కె. సీతామహాలక్ష్మి, మామిడితాండ్ర తయారీ కూలీ -
ప్రేమ వివాహం.. భార్యను దారుణంగా కొట్టి
చాగల్లు/పశ్చిమ గోదావరి జిల్లా: భార్యను భర్త హత్య చేసిన సంఘటన చాగల్లు మండలం బ్రాహ్మణగూడెంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన ఆవిడి త్రినాథ్.. భార్య కుమారి(22)ని కర్రతో తలపై కొట్టడంతో ఆమె మృతి చెందింది. శుక్రవారం భార్యభర్తల మధ్య ఇంట్లో గొడవ జరిగింది. ఆవేశంలో త్రినాథ్ కర్రతో బలంగా కుమారిని కొట్టడంతో తలకు బలమైన గాయమైంది. వెంటనే నిడదవోలు ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది. త్రినాథ్, కుమారిలది ప్రేమ వివాహం.. పెళ్లై సుమారు ఆరు సంవత్సరాలు కావస్తోంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. నిడదవోలు సీఐ స్వామి ఆధ్వర్యంలో చాగల్లు ఎస్సై విష్ణువర్ధన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోదావరిలో దూకి ఆత్మహత్య కొవ్వూరు: భద్రాది కొత్తగూడెం జిల్లాకు చెందిన మద్దూకూరి ఉమామహేశ్వరరావు(61) గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆధార్ కార్డుతో పాటు ఇతర వివరాలు రాసిన లేఖను ఒడ్డున ఉంచి శుక్రవారం సాయంత్రం గోష్పాదక్షేత్రంలోని పిండ ప్రదానాల రేవులో దిగారు. స్థానికులు చూస్తుండగానే నది లోపలి వెళ్లి మునిగిపోతుండడంతో రక్షించే ప్రయత్నం చేశారు. ఉమామహేశ్వరరావుని అతికష్టం మీద ఓడ్డుకి చేర్చారు. అప్పటికే ఆయన మృత్యువాత పడ్డారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లేఖలో ఉన్న వివరాల ఆధారంగా ఉమామహేశ్వరరావు అడ్రసుని గుర్తించి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. -
దారుణం: పసికందును పీక్కుతున్న కుక్క
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని చాగల్లు మండలం ఊనగట్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు పొదలలో వదిలేయడంతో ఆ పసికందు మృతదేహాన్ని కుక్కలు రోడ్డుమీదకు ఈడ్చుకు వచ్చాయి. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు గ్రామ మహిళా పోలీసు తెలియజేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. విషయం తెలిసిన ఐసీడీఎస్ అధికారులు సైతం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పసికందు మృతదేహం పడి ఉన్న తీరును పరిశీలించిన ఐసీడీఎస్ సీడీపీఓ ఆశా రోహిణి సంఘటనా స్థలాన్ని పరిశీలించడంతో ఆ దగ్గర్లోనే పొదలలో ఎవరో గుర్తు తెలియని మహిళ ప్రసవం జరిగినట్లు గుర్తించారు. ప్రసవం జరిగిన ఆనవాళ్లను కనుగొన్నారు. పొలాల్లోనే ప్రసవించిన మహిళ పసికందును వదిలి వెళ్ళిపోవడంతో పసికందు మృతి చెందిందని తెలిసింది. పొదలో ఉన్న పసికందు మృతదేహాన్ని కుక్క నోటకరచుకొని వస్తుండగా స్థానికులు గమనించి విధించడంతో రోడ్డుపైనే పసికందు మృతదేహాన్ని కుక్క వదిలి వెళ్ళిపోయింది. వెంటనే స్థానికులు గ్రామ మహిళా కానిస్టేబుల్ ద్వారా పోలీసులకు, ఐసిడిఎస్ అధికారులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇటువంటి అవాంఛనీయ గర్భం ధరించిన మహిళలు ఐసీడీఎస్ అధికారులకు తెలియజేస్తే తగు చర్యలు తీసుకుంటామని పిల్లలను సంరక్షించి తామే వేరే వారికి దత్తత ఇవ్వడం జరుగుతుందన్నారు. దయచేసి ఇలాంటి పాపపు పనులు చేయొద్దని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి ఆశా రోహిణి తెలియజేశారు. -
మామిడితాండ్ర C/O ఊనగట్ల
చాగల్లు: పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం ఊనగట్ల గ్రామంలో మామిడి తాండ్ర తయారీ కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందింది. మామిడి పండ్ల గుజ్జు నుంచి తాండ్రను తయారు చేస్తారు. ఏటా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఈ గ్రామంలో మామిడి తాండ్ర తయారీ ముమ్మరంగా జరుగుతుంది. మామిడి పండ్లను గతంలో రోళ్లలో వేసి కుమ్మి గుజ్జు తీసేవారు. ఇప్పుడు అధునాతమైన యంత్రాలు సహాయంతో గుజ్జు తీస్తున్నారు. ఆ గుజ్జులో బెల్లం లేదా పంచదార కలిపి తాటాకు చాపలతో మామిడి గుజ్జును పూతగా పెడతారు. ఈ విధంగా ఎండాకాలంలో రోజుకు ఐదు నుంచి ఎనిమిది సార్లు చొప్పున వారం రోజులపాటు పూత పెడితే మామిడితాండ్ర తయారవుతుంది. చాపల మాదిరిగా ఉన్న తాండ్రను ఆరిన తరువాత వాటిని చిన్నసైజు ముక్కలుగా కోసి 50 కిలోలు చొప్పున పెట్టెల్లో ప్యాక్ చేసి భద్రపరుస్తారు. మామిడి పళ్లకు పెరిగిన గిరాకీ మామిడితాండ్రకు కలెక్టర్, రసాలు, బంగినపల్లి వంటి మామిడిపళ్ల రకాలను వినియోగిస్తారు. ఈ ఏడాది మామిడి పళ్లకు గిరాకీ ఎక్కవగా ఉండటంతో టన్ను రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు మామిడితాండ్ర తయారీదారులు చెబుతున్నారు. నిడదవోలు, కొవ్వూరు పాడు, ద్వారకాతిరుమల, తాడేపల్లిగూడెం, నూజివీడు మార్కెట్ల నుంచి మామిడికాయలను టన్నుల లెక్కన కొనుగోలు చేస్తారు. గత రెండేళ్లుగా వాతావరణం అనుకూలించక మామిడికాయల కాపు తగ్గి రేట్లు గణనీయంగా పెరిగాయని తయారీదారులు చెబుతున్నారు. గ్రామంలో 450 మందికి ఉపాధి మామిడి తాండ్ర తాయారీ కేంద్రాలు పెద్ద కేంద్రాల్లో 25 నుంచి 30 మంది, చిన్న కేంద్రాల్లో 15 నుంచి 20 మంది ఉపాధి పొందుతున్నారు. గ్రామంలో సుమారు 450 మందికి పైగా మహిళలు, పిల్లలు ఉపాధి పొందుతున్నారు. వ్యవసాయ పనులు లేని సమయంలో మామిడితాండ్ర తయారీ సమయం కావడంతో మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు ఆదాయ వనరుగా కూడా ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి దోహదం చేస్తుంది. రైతులకు మామిడికాయలకు గిట్టుబాటు ధర రావడానికి కూడా ఇంది ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ విధంగా ఈ ప్రాంత ప్రజలకు మామిడితాండ్ర తయారీ చక్కని ఉపాధి అవకాశాలను కలిగిస్తోంది. మార్కెట్ లేక తగ్గిన తయారీ కేంద్రాలు మామిడితాండ్ర తయారీ ద్వారా రోజుకు టన్ను మామిడికాయల వరకు దిగుమతి చేసుకుంటారు. మామిడితాండ్రను అందమైన ముక్కలు కోసి 50 కేజీలు చొప్పున పెట్టెలుగా పెట్టి 200 పెట్టెలను లారీకి ఎగుమతి చేస్తుంటారు. టోకున మామిడితాండ్ర ధర క్వింటాలు రూ.7 వేలు నుంచి రూ.8 వేల వరకు ధర ఉంటుంది. ఆ వంతున రూ.50 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. ముంబై, చెన్నై తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి తాండ్ర ఎగుమతి అధికంగా జరిగేది. అయితే గతంలో వ్యాపారస్తులు మామిడితాండ్ర తయారీదారులను మోసగించి డబ్బులు సక్రమంగా చెల్లించకపోవడం వల్ల చాలావరకు ఎగుమతులు తగ్గిపోయాయి. మార్కెటింగ్ లేక ఇబ్బందులు పడుతున్నామని వీరు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం మామిడితాండ్ర తయారీ కేంద్రాలు గత రెండేళ్ల క్రితం 50 వరకు ఉండగా ప్రస్తుతం 10 కేంద్రాలకు పరిమితమయ్యాయి. మామిడితాండ్రను స్థానికంగా అమ్మడానికే తయారీదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తయారీదారులే కాకుండా మామిడితాండ్రను సైకిళ్లపై విక్రయిస్తూ మరో వంద మంది వరకు ఉపాధి పొందుతున్నారు. రుణ సౌకర్యం కల్పించాలి ఎన్నో ఏళ్లుగా మామిడితాండ్ర తయారీ పరిశ్రమ నిర్వహిస్తున్నాం. బ్యాంకులు రుణ సౌకర్యం కల్పిస్తే ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధిక వడ్డీకి రుణాలు తెచ్చుకునే అవకాశం ఉండదు. మామిడికాయల రేట్లు గత రెండేళ్లుగా బాగా పెరగడం, మార్కెటింగ్ సమస్య వల్ల తయారీదారులు తగ్గిపోయారు. రుణ సౌకర్యం కల్పించి ప్రోత్సహించాలి. – కె.శ్రీనివాసరావు, మామిడితాండ్ర తయారీదారుడు, ఊనగట్ల మహిళలకు ఉపాధి మామిడితాండ్రను కుటీర పరిశ్రమగా వేసవికాలంలో మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. పనిని బట్టి రోజుకు రూ.150 నుంచి రూ.200 వరకు కూలి లభిస్తుంది. ఈ ప్రాంత మహిళలకు తాండ్ర పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రభుత్వం మామిడితాండ్ర పరిశ్రమను గుర్తించి పోత్స్రహించాలి. – యాండ్ర మాణిక్యం, మామిడితాండ్ర తయారీ కూలీ, ఊనగట్ల సీజన్లో పనికి వెళతా నేను డిగ్రీ చదివాను. ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వేసవిలో తాండ్ర తయారీ పనులకు వెళుతున్నాను. సీజన్లో ఈ పనులకు వెళ్లడం వల్ల కుటుంబానికి ఆర్థికంగా అసరాగా ఉపయోగపడుతున్నాను. సీజన్లోనే పని ఉంటుంది. ఆ సమయంలో ఎంతో కొంత సంపాదించుకుంటున్నాను. నాలాగే చాలా మంది దీనిపై ఆధారపడ్డాం. – కోడి సతీష్, యువకుడు, ఊనగట్ల -
డైరెక్షన్ అంటే చాలా ఇష్టం
సాక్షి, చాగల్లు: దర్శకుడు అవుదామని చిత్ర పరిశ్రమకు వచ్చి నటుడిని అయ్యానని హీరో, హాస్యనటుడు సప్తగిరి అన్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు తెలగా సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తెలగా సంఘం వినాయకుడి ఆలయంలో పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం సప్తగిరి విలేకరులతో మాట్లాడుతూ తాను పరువు సినిమా ద్వారా చిత్రపరిశ్రమకు పరిచయమయ్యానని.. ఇప్పటివరకు 80 సినిమాల్లో హాస్యనటుడిగా నటించానని చెప్పారు. కమెడియన్‌గా మంచి గుర్తింపు లభించిందన్నారు. పరువు, ఎక్స్‌ప్రెస్ రాజా, ప్రేమకథా చిత్రం, మనం చిత్రాలు మంచి గుర్తింపును తెచ్చాయన్నారు. సప్తగిరి ఎల్ఎల్బీ, సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమాల్లో హీరోగా నటించానన్నారు. తొలుత సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసినట్టు చెప్పారు. ఎ ఫిల్మ్ బై అరవింద్, బొమ్మరిల్లు, పరుగు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశానన్నారు. డైరెక్షన్ అంటే తనకు చాలా ఇష్టమని, డైరెక్టర్ అవుదామనే ఈ పరిశ్రమలోకి వచ్చానని చెప్పారు. నిర్మాత దిల్‌రాజు తననెంతగానో ప్రోత్సహించారన్నారు. ఎక్స్‌ప్రెస్ రాజాలో నటనకు నంది అవార్డు వచ్చిందని చెప్పారు. చిత్ర పరిశ్రమకు రావాలనుకునే యువత బాగా కష్టపడాలని, కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. టాలెంట్ చాలా మందికి ఉంటుందని, అయితే వ్యక్తిత్వం, మంచి గుణాలు ఉన్నవారు తప్పనిసరిగా విజయం సాధిస్తారన్నారు. తన సొంతూరు తిరుపతి అని చెప్పారు. ప్రేక్షకుల ఆదరాభిమానాలే నటులకు నిజమైన గుర్తింపు అన్నారు. చాగల్లులో దర్శకుడు వీవీ వినాయక్ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించగా పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. సప్తగిరిని చూసేందుకు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. మాజీ సర్పంచ్ గండ్రోతు సురేంద్రకుమార్, జుట్టా కొండలరావు, గవర సర్వారాయుడు, తెలగా సంఘం పెద్దలు సప్తగిరి వెంట ఉన్నారు. -
ఆకలి పోరాటం
చాగల్లు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల ఆకలి కేకలు సర్కారును కదిలించలేకపోతున్నాయి. ఫ్యాక్టరీ మూతతో మనోవేదనకు గురై.. అనారోగ్యం పాలై.. సరైన వైద్యం చేయించుకోలేక ఆరుగురు ప్రాణాలొదిలినా.. ఆర్థిక ఇబ్బందులతో 750 కుటుంబాలు సతమతమవుతున్నా.. ప్రభుత్వం, యాజమాన్యం చలించడం లేదు. కార్మికులకు బకాయిలు చెల్లించడం లేదు. ఫ్యాక్టరీని తెరిపించే యత్నమూ చేయడం లేదు. పశ్చిమగోదావరి కొవ్వూరు: చాగల్లు వీవీఎస్ షుగర్స్ (వెలగపూడి వెంకట సుబ్బయ్య షుగర్స్) ఫ్యాక్టరీని ది జైపూర్ షుగర్స్ కంపెనీ లిమిటెడ్ 1961లో స్థాపించింది. జిల్లాలోనే అత్యధిక చెరకు క్రషింగ్ సామర్థ్యం కలిగిన ఫ్యాక్టరీ ఇది. దీనికి అనుబంధంగా చాగల్లు, జంగారెడ్డిగూడెం డిస్టిలరీలు ఉన్నాయి. పోతవరంలో మరో షుగర్ ఫ్యాక్టరీ ఉంది. మొత్తమ్మీద ఈ నాలుగు పరిశ్రమల్లో సుమారు 750 మందికిపైగా కార్మికులు, ఉద్యోగులు పనిచేసేవారు. ఫ్యాక్టరీ అధికారులే గుల్ల చేశారా! గతంలో చాగల్లు షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసిన కొందరు ఫ్యాక్టరీ అధికారులు దీనిని గుల్లచేశారు. 2009లో రైతుల టైఅప్ రుణాల కుంభకోణంలో ఆ సంస్థ యాజమాన్యం వార్తలకెక్కింది. 2010లో ఈ సంస్థలో పనిచేస్తున్న కొందరు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై పంచదార కుంభకోణానికి పాల్పడ్డారు. రూ. 1.13 కోట్ల విలువైన (అప్పటి ధర ప్రకారం) 3,792 క్వింటాళ్ల పంచదారను అక్రమంగా బయటకు తరలించి సొమ్ము చేసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న 16 మందిలో ఏడుగురు సంస్థ అధికారులు ఉన్నారు. తర్వాత మరికొంత మందిని అరెస్ట్ చేశారు. ఇలా ఈ పరిశ్రమను కొంతమంది తమ స్వార్థం కోసం వాడుకున్నారు. బకాయిలు పేరుకుపోయాయి 2014–15, 2015–16 క్రషింగ్ సీజన్‌కి సంబంధించి రైతులకు చెల్లించాల్సిన సుమారు రూ.40 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. రైతులు ఆందోళనకు దిగడంతో ఫ్యాక్టరీలోని పంచదార నిల్వలను విక్రయించి విడతల వారీగా సగం బకాయిలు చెల్లించారు. ఇంకా సుమారు రూ.19 కోట్లు చెల్లించాలి. దీంతో గత ఏడాది క్రషింగ్ ప్రక్రియ నిలిపివేశారు. రెవెన్యూ అధికారులు రైతుల బకాయిలు రాబట్టేందుకు రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది. ఫ్యాక్టరీని వేలం వేసేందుకు అధికారులు మూడు సార్లు యత్నించినా పాటదారులు రాకపోవడంతో ఫ్యాక్టరీని ఈ ఏడాది జనవరి 20న మూసివేశారు. ఆందోళన బాటలో కార్మికులు ప్రస్తుతం ది జైపూర్ షుగర్స్ కంపెనీ లిమిటెడ్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు మూడేళ్ల నుంచి వివిధ రాయితీలు, గత ఏడాది నవంబర్ నుంచి జీతాలు చెల్లించడం లేదు. ఈ అన్ని బకాయిలు కలిపి సుమారు రూ.15 కోట్ల వరకూ ఉంటాయి. దీంతో కార్మికులు ఈ ఏడాది ఆగస్టు 16 నుంచి ఆందోళన బాట పట్టారు. ఫ్యాక్టరీ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. కార్మిక, ఉద్యోగ సంఘం నేతలు కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణను పలుమార్లు కలవడంతో ఇటీవల రెండు నెలలు జీతం మాత్రం విదిల్చారు. ఆరుగురు ప్రాణాలొదిలారు సంస్థ మూతపడడం, జీతాలు, ఇతర బెనిఫిట్స్ నిలిచిపోవడంతో మనోవ్యధకు గురై.. అనారోగ్యం బారిన పడి సకాలంలో సరైన వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేక ఆరుగురు కార్మికులు మరణించారు. ఫీల్డ్ మేన్ నల్లూరి శ్రీని వాసరావు, ఫిట్టర్లు ఆలపాటి వెంకటేశ్వరరావు, వీవీఎల్ఎన్ ఆచార్యులు, క్లర్క్‌లు వల్లభనేని సత్యనారాయణ, ఎం.దుర్గారావు ఆరోగ్య సమస్యలతో ప్రాణాలొదిలారు. రిటైర్ అయిన ఆత్కూరి కృష్ణమూర్తి పీఎఫ్, ఇతర బెనిఫిట్స్ అందకుండానే మరణించారు. పట్టని ప్రభుత్వం కార్మికులు 45 రోజుల నుంచి దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.రెండేళ్లు పూర్తి కావస్తున్నా ఇంత వరకు రైతుల బకాయిలు చెల్లించలేదు. దీంతో రైతులూ కష్టాలు పడుతున్నారు. ఈయన పేరు డి.సువర్ణరాజు. చాగల్లు షుగర్ ఫ్యాక్టరీలో డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇతనిది కర్ణాటకలోని రాయగఢ్. ఉపాధి కోసం నలభై ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చారు. భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు, తల్లి ఉన్నారు. వీరంతా సువర్ణరాజుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఫ్యాక్టరీ మూత పడడంతో 11 నెలల నుంచి జీతాల్లేవు. ఇంతలో షుగర్ వ్యాధి బయటపడింది. వ్యాధి ముదరడంతో ఐదునెలల కిత్రం ఆయన కాలు సగం తొలగించారు. ఇద్దరు కుమార్తెలకూ ఇంకా వివాహాలు కాలేదు. చదువులూ పూర్తి కాలేదు. కుమారుడు సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా చేసి ఖాళీగా ఉంటున్నాడు. ఇప్పుడు సువర్ణరాజు కుటుంబం పుట్టెడు కష్టాల్లో మునిగింది. ఈ చిత్రంలో గోడ మీదున్న ఫొటోలోని వ్యక్తి పేరు వీవీఎల్ఎన్ ఆచార్యులు. చాగల్లు ఫ్యాక్టరీలో ఫిట్టర్‌గా పనిచేసేవారు. ఈ ఏడాది మే 5న గుండెపోటుతో మరణించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు, తల్లి ఉన్నారు. వీరందరికీ ఈయనే ఆధారం. ఫ్యాక్టరీ మూతపడడం, జీతాల్లేకపోవడంతో ఆచార్యులు మానసికంగా కుంగిపోయి తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. ఒత్తిడి ఎక్కువై గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు ఈయన కుటుంబం వీధిన పడింది. ఫ్యాక్టరీ నుంచి అందాల్సిన వేతన బకాయిలు, పీఎఫ్, ఇతర లబ్ధి ఏమీ అందకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇవీ ఈ రెండు కుటుంబాల కన్నీటి గాథలు.. ఇవే కాదు.. చాగల్లు షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులను కదిపి చూస్తే ఇలాంటి విషాద గాథలెన్నో వినబడతాయి. జీతాలు రాక, పీఎఫ్, ఇతర లబ్ధి అందక ఆ కుటుంబాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఫ్యాక్టరీ మూత పడి.. కుటుంబాల జీవనం గగనంగా మారడంతో మానసిక వేదనకు గురై 9 నెలల్లో ఆరుగురు కార్మికులు మరణించారు. అయినా యాజమాన్యంతోపాటు సర్కారులోనూ చలనం లేదు. ఫలితంగా కార్మికులు ఆందోళన బాట పట్టారు. మూడేళ్ల నుంచి ముప్పుతిప్పలు ♦ ఫ్యాక్టరీ సంక్షోభంలో ఉండడంతో మూడేళ్ల నుంచి యాజమాన్యం కార్మికులను ముప్పుతిప్పలు పెడుతోంది. ♦ గత రెండున్నరేళ్ల నుంచి బోనస్‌లు ఇవ్వడం లేదు. ఈ బకాయిలు సుమారు రూ.2 కోట్ల వరకూ ఉంటాయి. ♦ వైద్య ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి ఏడాదికి ఇచ్చే రూ.10వేలను మూడేళ్ల నుంచి చెల్లించడం లేదు. ♦ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ , ఓవర్ టైమ్ వేతనాలను 2014–15 నుంచి చెల్లించడం లేదు. ♦ ఫ్యాక్టరీ నడవని కాలంలో కార్మికులు, ఉద్యోగులకు చెల్లించే రిటర్నింగ్ అలవెన్స్‌లు చెల్లించడం లేదు. ఫీల్డ్ సిబ్బందికి ఆదివారం, సెలవు దినాల్లో చెల్లించే అలవెన్స్లదీ అదే పరిస్థితి. ♦ 2014 మార్చి నుంచి యాజమాన్యం కోటా కింద చెల్లించాల్సిన ప్రావిడెంట్ ఫండ్ కట్టటం లేదు. ఉద్యోగులు, కార్మికుల వాటాగా చెల్లించేది మాత్రం 2016 ఆగస్టు వరకు మాత్రమే చెల్లిస్తూ వచ్చారు. దీంతో రిటైర్డు ఉద్యోగులకు ఫీఎఫ్ రావటం లేదు. ఫ్యాక్టరీ యాజమాన్యం వాటా చెల్లిస్తేగానీ ఫీఎఫ్ సొమ్ము కార్మికులకు అందే వీలు లేదు. ♦ కార్మికులు, ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న కో–ఆపరేటివ్ క్రిడెట్ సోసైటీలో నిల్వలో ఉన్న రూ.80 లక్షలు యాజమాన్యం వినియోగించుకుంది. దీనిపై కార్మిక సంఘం నాయకులు కో–ఆపరేటివ్ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. నెలకు రూ.10 లక్షల చొçప్పున 2016 నవంబర్ నుంచి 2017 నవంబర్‌లోపు ఆ సొమ్ములు తిరిగి జమ చేస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. ఇప్పటివరకూ రూ.10లక్షలు మాత్రమే జమ చేసింది. ఆర్థిక ఇబ్బందులున్న సమయంలో ఈ సొమ్ములు కార్మికులు, ఉద్యోగులు రుణాలు తీసుకునేవారు. యాజమాన్యం తీసుకున్న సొమ్ములు జమ చేయకపోవడంతో ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. -
ప్రాణాలు తీసిన ప్రమాదాలు
చాగల్లు/జంగారెడ్డిగూడెం రూరల్ : రోడ్డు ప్రమాదాలు ప్రాణాలను హరిస్తున్నాయి.. నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతూ ఢీకొట్టడం, వాహనాల నుంచి జారిపడటం వంటి ఘటనల్లో ప్రాణాలు పోతున్నాయి. జిల్లాలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. చాగల్లులో మెటల్ రవాణా చేస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందగా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో బైక్‌పై నుంచి పడి తలకు తీవ్రగాయమై మరోవ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. చాగల్లులో ట్రాక్టర్ ఢీకొని.. చాగల్లులో ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి.. చాగల్లుకు చెందిన విజయదుర్గ బ్రిక్స్ పరిశ్రమలో పనులు ముగించుకుని సోమవారం రాత్రి సమయంలో ఇండస్ట్రీ అధినేత కోట కృష్ణ (45) మోటార్ బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో బైక్ గ్రామంలోని ఈదమ్మవారి ఆలయ సమీపంలోకి వచ్చేసరికి వెనుక నుంచి నల్ల కంకర రవాణా చేసే ట్రాక్టర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కృష్ణ తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు నిడదవోలు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరిం చారు. కృష్ణ సోదరుడు సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎం.జయబాబు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కు మార్తెలు. కృష్ణ క్వారీ, బ్రిక్ ఇండస్ట్రీ యా జమానిగా పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో గ్రామంలో మం చి పేరు ఉంది. గ్రామ ప్రముఖులు, చాగల్లులో విజయదుర్గ భవన నిర్మాణ సం ఘం కార్మికులు మంగళవారం ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. వివాహ వేడుకకు వెళ్లి వస్తూ తాడువాయిలో.. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో మంగళవా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. టి.నరసాపురం మండలం బండివారిగూడెం గ్రామానికి చెందిన చింతం శ్రీనివాసరావు (37) అనే వ్యక్తి కొయ్యలగూడెం మండలం డిప్పకాయలపాడులో బంధువుల ఇంట్లో వి వాహ వేడుకకు వెళ్లాడు. తిరిగి మధ్యాహ్న సమయంలో స్వగ్రామానికి మోటారు సైకిల్‌పై బయలుదేరాడు. తాడువాయి సబ్‌స్టేషన్ సమీపంలోకి వచ్చేసరికి శ్రీని వాసరావు మోటారు సైకిల్‌పై నుంచి కిం ద పడ్డాడు. అతడి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెం దాడు. ఘటనా స్థలం వద్ద బంధువుల రోదనలు మిన్నం టాయి. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు. -
ఛాగల్లులో ఉరివేసుకొని ఇద్దరి ఆత్మహత్య
స్టేషన్ ఘన్పూర్ టౌన్ : మండలంలోని ఛాగల్లు గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పొన్నా రమేష్(38) ఆదివారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఆర్థిక ఇబ్బందులతోనే అతడు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లిదండ్రులు మందలించడంతో.. ఛాగల్లు గ్రామానికి చెందిన మునిగాల యమున(21)కు ఇదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా పెళ్లయిన నాటి నుంచి యమున తన పుట్టిం టి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం భర్త వద్దకు కాపురానికి వెళ్లాలంటూ ఆమెను తల్లిదండ్రులు మందలించారు. ఈనేపథ్యంలో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. -
సమగ్ర యాజమాన్య పద్ధతులతో దిగుబడులు మెండు
చాగల్లు : వరి సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు వై.సాయిలక్ష్మీశ్వరి అన్నారు. పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా మండలంలోని మల్లవరం, చంద్రవరం గ్రామాల్లో మంగళవారం జరిగిన రైతు సదస్సుల్లో ఆమె మాట్లాడారు. రైతులు ఎరువుల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, కాంప్లెక్స్ ఎరువుల వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు ఈపాస్ యంత్రాల ద్వారా ఎరువులు విక్రయిస్తారని, దీనిలో భాగంగా చాగల్లు మండలానికి 19 యంత్రాలు అందించామన్నారు. వ్యవసాయశాఖ ఏడీ∙ఎస్జెవిజే రామోహన్‌రావు మాట్లాడుతూ కలుపు నివారణ, నీటి యాజమాన్యం, తెగుళ్లనివారణ సకాలంలో చేపట్టడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు. మండల వ్యవసాయ అధికారి కె.ఏసుబాబు మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో ఎంటీయూ 1121 వరి వంగడాలను పరిశీలించారు. అధికారులు ఎన్.శ్రీనివాస్, కె.వాణిసర్వశ్రీ పాల్గొన్నారు -
నిందితుడు గోపాలకృష్ణ కోర్టుకు తరలింపు
చాగల్లు: చాగల్లు మండలం నందిగంపాడుకు చెందిన యువకుడిని హత్య చేసిన కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో ఒకరైన మారిశెట్టి గోపాలకృష్ణను పోలీసులు మంగళవారం నిడదవోలు కోర్టుకు తరలించారు. కోర్టు గోపాలకృష్ణకు 15 రోజుల రిమాండ్ విధించినట్టు నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ తెలిపారు. నిందితుడు గోపాలకృష్ణను తమకు అప్పగించాలంటూ సోమవారం చాగల్లు పోలీస్‌స్టేషన్ వద్ద మృతుడి బంధువులు తీవ్రస్థాయిలో ఆందోళన నిర్వహించిన నేపథ్యంలో కోర్టుకు తరలింపు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అస్తికోసం నందిగంపాడు గ్రామానికి చెందిన సొంత బావమరిదైన ఆత్కూరి రాజసాయి మణికంఠపై హత్యాయత్నం చేయడంతో పాటు మణికంఠ పెదనాన్న కొడుకైన ఆత్కూరి రాజేష్‌ను హత్య చేసిన ఘటన తెలిసిందే. ఈ కేసులో ఊనగట్లకు చెందిన మారిశెట్టి వెంకటరత్నంతో పాటు అతని తమ్ముడు గోపాలకృష్ణను నిందితులుగా పోలీసులు గుర్తించారు. సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తును పోలీసులు కూడా వేగవంతం చేశారు. పోలీసుల అదుపులో వెంకటరత్నం? ఈ ఘటనలో ప్రధాన నిందితుడు మారిశెట్టి వెంకటరత్నం పోలీసులకు చిక్కినట్టు తెలిసింది. నిడదవోలు సర్కిల్ ఫరిధిలో ఓ పోలీస్‌స్టేషన్‌లో నిందితుడిని విభిన్న కోణాల్లో పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. వెంకటరత్నంను బుధ, గురువారాల్లో కోర్టుకు హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రెండు గ్రామాల్లో పోలీస్ గస్తీ ఈ కేసుకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నందిగంపాడు, ఊనగట్ల గ్రామాల్లో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. సోమవారం చాగల్లు పోలీస్‌స్టేషన్ వద్ద చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం రాజేష్ మృతదేహానికి నందిగంపాడు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు, సీఐ బాలకృష్ణ గ్రామం వచ్చి పరిస్థితిని సమీక్షించారు. -
ఇద్దరు సజీవ దహనం
చాగల్లు (పశ్చిమగోదావరి జిల్లా) : చాగల్లు మండలం దారవరం గ్రామంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు వలస కూలీలు సజీవ దహనమయ్యారు. శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి వలస వెళ్లిన శ్రీను (35), రామకృష్ణ (36)లు స్థానికంగా ఓ రైసు మిల్లులో పనిచేస్తున్నారు. శనివారం ధాన్యం బస్తాల లోడింగ్ కోసం గాను లిఫ్ట్‌ను తీసుకొస్తున్న క్రమంలో 11కేవీ విద్యుత్ వైర్లు దానికి తాకాయి. వెంటనే మంటలు లేవడంతో శ్రీను, రామకృష్ణలు ఆ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. -
చాగల్లులో భారీ దొంగతనం
చాగల్లు: పశ్చిమ గోదావరి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భారీ దొంగతనం జరిగింది. స్థానిక మెయిన్‌రోడ్డులో ఉంటున్న కటారు రామచంద్రరావు ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమాని కుటుంబసభ్యులతో రాజమండ్రికి వెళ్లారు. ఇదే అదునుగా దుండగులు తాళాలు పగులగొట్టి ఇంటిలోకి ప్రవేశించి బీరువాలో ఉన్న 25 కాసుల బంగారు ఆభరణాలు, మూడు కిలోల వెండి సామగ్రిని ఎత్తుకుపోయారు. ఉదయం తిరిగి వచ్చిన రామచంద్రరావు దొంగతనం విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్‌టీం రప్పించి దర్యాప్తు ప్రారంభించారు. నిడదవోలు సీఐ బాలకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. -
వివి వినాయక్ కు మాతృవియోగం
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి నాగరత్నం(59) మంగళవారం కన్నుమూశారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. వినాయక్ తల్లి మరణం పట్ల సినిమా ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు వినాయక్ స్వస్థలం. ఆయన తండ్రి కృష్ణారావు సినిమా డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. -
చాగల్లులో మహిళ ఆత్మహత్యాయత్నం
చాగల్లు: పశ్చిమగోదావరి జిల్లా చాగల్లులో జన్మభూమి కార్యక్రమంలో శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన ఇంటిపక్కన సెల్ టవర్ నిర్మించవద్దంటూ ఓనగట్లకు చెందిన ఓ మహిళ ఒంటి మీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే స్సందించిన చుట్టుపక్కల వారు ఆ మహిళను కాపాడారు. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. తన ఇంటి పక్కన సెల్ టవర్ నిర్మించవద్దంటూ మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో వేరే దారిలేక బాధితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించిందని స్థానికులు చెబుతున్నారు. -
వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ అవసరం
మార్కొండపాడు (చాగల్లు), న్యూస్‌లైన్: రైతులు వ్యవసాయ సంక్షోభం నుంచి బయట పడాలంటే రాబోయే రోజుల్లో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని అఖిల భారత ఎరువుల తయారీ సమాఖ్య సభ్యుడు సుంకవల్లి వెంకన్న చౌదరి డిమాండ్ చేశారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న ఆయన సమావేశం విశేషాలను సోమవారం మార్కొండపాడులో విలేకరులకు తెలిపారు. పండించిన పంటకు తగిన గిట్టుబాటు ధర లేకపోవడంతో రానున్న రోజుల్లో రైతులు వ్యవసాయానికి దూరం కావడం వల్ల పెరుగుతున్న జనాభాకు తిండిగింజలు కరువై ఆహార సమస్య తలెత్తే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తేనే సాగు చేసేందుకు రైతులు ముందుకు వస్తారని సూచించామన్నారు. సేంద్రీయ ఎరువులను వాడేలా రైతులకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందజేయాలని కోరినట్టు చెప్పారు. ఈ సమావేశానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్, అఖిల భారత ఎరువుల తయారీ సమాఖ్య అధ్యక్షుడు ఆర్జీ రాజన్ పాల్గొన్నట్టు చెప్పారు.