
చాగల్లు/పశ్చిమ గోదావరి జిల్లా: భార్యను భర్త హత్య చేసిన సంఘటన చాగల్లు మండలం బ్రాహ్మణగూడెంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన ఆవిడి త్రినాథ్.. భార్య కుమారి(22)ని కర్రతో తలపై కొట్టడంతో ఆమె మృతి చెందింది. శుక్రవారం భార్యభర్తల మధ్య ఇంట్లో గొడవ జరిగింది. ఆవేశంలో త్రినాథ్ కర్రతో బలంగా కుమారిని కొట్టడంతో తలకు బలమైన గాయమైంది. వెంటనే నిడదవోలు ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది. త్రినాథ్, కుమారిలది ప్రేమ వివాహం.. పెళ్లై సుమారు ఆరు సంవత్సరాలు కావస్తోంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. నిడదవోలు సీఐ స్వామి ఆధ్వర్యంలో చాగల్లు ఎస్సై విష్ణువర్ధన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గోదావరిలో దూకి ఆత్మహత్య
కొవ్వూరు: భద్రాది కొత్తగూడెం జిల్లాకు చెందిన మద్దూకూరి ఉమామహేశ్వరరావు(61) గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆధార్ కార్డుతో పాటు ఇతర వివరాలు రాసిన లేఖను ఒడ్డున ఉంచి శుక్రవారం సాయంత్రం గోష్పాదక్షేత్రంలోని పిండ ప్రదానాల రేవులో దిగారు. స్థానికులు చూస్తుండగానే నది లోపలి వెళ్లి మునిగిపోతుండడంతో రక్షించే ప్రయత్నం చేశారు. ఉమామహేశ్వరరావుని అతికష్టం మీద ఓడ్డుకి చేర్చారు. అప్పటికే ఆయన మృత్యువాత పడ్డారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లేఖలో ఉన్న వివరాల ఆధారంగా ఉమామహేశ్వరరావు అడ్రసుని గుర్తించి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment