ఇద్దరు సజీవ దహనం | Two burnt alive in freak accident | Sakshi
Sakshi News home page

ఇద్దరు సజీవ దహనం

Published Sat, May 14 2016 3:56 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

Two burnt alive in freak accident

చాగల్లు (పశ్చిమగోదావరి జిల్లా) :  చాగల్లు మండలం దారవరం గ్రామంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు వలస కూలీలు సజీవ దహనమయ్యారు. శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి వలస వెళ్లిన శ్రీను (35), రామకృష్ణ (36)లు స్థానికంగా ఓ రైసు మిల్లులో పనిచేస్తున్నారు. శనివారం ధాన్యం బస్తాల లోడింగ్ కోసం గాను లిఫ్ట్‌ను తీసుకొస్తున్న క్రమంలో 11కేవీ విద్యుత్ వైర్లు దానికి తాకాయి. వెంటనే మంటలు లేవడంతో శ్రీను, రామకృష్ణలు ఆ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement