thaduvai
-
Medaram Jatara: వన దేవతలకు ‘కోటి’ మొక్కులు
సాక్షి, వరంగల్: వరాలు ఇచ్చే తల్లులు.. వనదేవతలు.. మేడారం సమ్మక్క సారలమ్మ జనజాతర వైభవోపేతంగా జరుగుతోంది. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారులను కోటి మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లకోసారి ఇద్దరు అమ్మవారులు గద్దెలపై రెండురోజుల పాటు కొలువై ఉండడంతో దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో మేడారం జనసంద్రంగా మారి మహానగరాన్ని తలపిస్తుంది. వనదేవతల జనజాతరకు వీఐపీల తాకిడి పెరిగింది. చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించినప్పటి నుంచి నిరంతరాయంగా దర్శనాలు కొనసాగుతున్నాయి. బారులు తీరి అమ్మవారులకు ఎత్తు బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లిస్తున్నారు. గద్దెలపై ప్రాంగణంలో జలప్రవాహంలా భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల రద్దీతో సీఎం కేసీఆర్ మేడారం టూర్ రద్దయింది. సీఎం రాకపోయినప్పటికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు పలువురు సమ్మక్క సారలమ్మ దర్శించుకుని మొక్కులు చెల్లించారు. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు అమ్మవారులకు ఎత్తు బంగారం( బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించారు. సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని వనదేవత లను వేడుకున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. వీఐపీల తాకిడి, భక్తుల రద్దీతో పోలీసులు హడాహుడి చేశారు. భక్తులను ఇబ్బందులకు గురిచేశారు. కేంద్ర మంత్రులు వచ్చిన సమయంలో పోలీసులు మీడియా వారిని నెట్టివేయడంతో జర్నలిస్టులు ఆందోళనకు దిగి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ప్రాణాలు తీసిన ప్రమాదాలు
చాగల్లు/జంగారెడ్డిగూడెం రూరల్ : రోడ్డు ప్రమాదాలు ప్రాణాలను హరిస్తున్నాయి.. నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతూ ఢీకొట్టడం, వాహనాల నుంచి జారిపడటం వంటి ఘటనల్లో ప్రాణాలు పోతున్నాయి. జిల్లాలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. చాగల్లులో మెటల్ రవాణా చేస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందగా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో బైక్‌పై నుంచి పడి తలకు తీవ్రగాయమై మరోవ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. చాగల్లులో ట్రాక్టర్ ఢీకొని.. చాగల్లులో ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి.. చాగల్లుకు చెందిన విజయదుర్గ బ్రిక్స్ పరిశ్రమలో పనులు ముగించుకుని సోమవారం రాత్రి సమయంలో ఇండస్ట్రీ అధినేత కోట కృష్ణ (45) మోటార్ బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో బైక్ గ్రామంలోని ఈదమ్మవారి ఆలయ సమీపంలోకి వచ్చేసరికి వెనుక నుంచి నల్ల కంకర రవాణా చేసే ట్రాక్టర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కృష్ణ తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు నిడదవోలు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరిం చారు. కృష్ణ సోదరుడు సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎం.జయబాబు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కు మార్తెలు. కృష్ణ క్వారీ, బ్రిక్ ఇండస్ట్రీ యా జమానిగా పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో గ్రామంలో మం చి పేరు ఉంది. గ్రామ ప్రముఖులు, చాగల్లులో విజయదుర్గ భవన నిర్మాణ సం ఘం కార్మికులు మంగళవారం ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. వివాహ వేడుకకు వెళ్లి వస్తూ తాడువాయిలో.. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో మంగళవా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. టి.నరసాపురం మండలం బండివారిగూడెం గ్రామానికి చెందిన చింతం శ్రీనివాసరావు (37) అనే వ్యక్తి కొయ్యలగూడెం మండలం డిప్పకాయలపాడులో బంధువుల ఇంట్లో వి వాహ వేడుకకు వెళ్లాడు. తిరిగి మధ్యాహ్న సమయంలో స్వగ్రామానికి మోటారు సైకిల్‌పై బయలుదేరాడు. తాడువాయి సబ్‌స్టేషన్ సమీపంలోకి వచ్చేసరికి శ్రీని వాసరావు మోటారు సైకిల్‌పై నుంచి కిం ద పడ్డాడు. అతడి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెం దాడు. ఘటనా స్థలం వద్ద బంధువుల రోదనలు మిన్నం టాయి. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు. -
తాడువాయిలో ‘ఉచిత కంటి వైద్య శిబిరం
తాడువాయి(మునగాల): మండలంలోని తాడువాయిలో శుక్రవారం రేపాల అక్షర సామాజిక సేవా సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేట లయిన్స్ క్లబ్ సహాకారంతో ఉచిత కంటివైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ జిల్లేపల్లి అరుణ ప్రారంభించారు. ఇందులో భాగంగా 80మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, వీరిలో 19మందికి ఆపరేషన్లు అవసరం ఉన్నట్టుగా నిర్ధారించి, ఆపరేషన్ నిమిత్తం సూర్యాపేటకు తరలించారు. ఈ వైద్య శిబిరంలో లయిన్స్ క్లబ్ వైద్య సిబ్బంది పవన్‌కుమార్, శ్రీనివాసచారి, వెంకటాచారి, గ్రామపెద్దలు ఆర్.వెంకటరెడ్డి, జి.నర్సయ్య, అక్షర సామాజిక సేవాసంఘం అధ్యక్ష, కార్యదర్శులు మాచెర్ల రమేశ్, శొంఠి శ్రీను, సభ్యులు గోపి, సురేష్, నరేష్, ఎం.నర్సయ్య, బి.సాయి, కె.కిరణ్ పాల్గొన్నారు.