జిల్లాలో వేర్వేరు చోట్ల చోటుకున్న రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు.
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
Published Mon, Aug 26 2013 4:52 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
వెల్దండ, న్యూస్‌లైన్ : జిల్లాలో వేర్వేరు చోట్ల చోటుకున్న రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. గ్రామస్తుల కథనం ప్రకారం... కల్వకుర్తి మండలం రఘుపతిపేటకు చెందిన ఫాతిమాజుహు (11) కొన్నాళ్లుగా వెల్దండలోని మేనమామ మోహిన్‌పాషా వద్ద ఉంటోంది. ప్రస్తుతం కల్వకుర్తి పట్టణంలోని ఉర్దూ మీడియం ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయమే మేనమామ కుటుంబ సభ్యులతో కలిసి క్రషర్‌మిషన్ సమీపంలోని దర్గా వద్దకు వచ్చింది. అదే సమయంలో రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి కల్వకుర్తికి వేగంగా వెళుతున్న డీసీఎం ఢీకొనడంతో దుర్మరణం చెందింది. ఇది గమనించిన బంధువులు వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ సైదులు పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ మేరకు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బస్సును ఢీకొన్న బైక్ సంఘటనలో...
మానవపాడు : బస్సును బైక్ ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే... కర్నూలు పట్టణం షరీఫ్‌నగర్‌కాలనీకి చెందిన కుమ్మరి నారాయణ (45) కొంతకాలంగా సొంగల వ్యాపారం చేసుకుం టూ వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లో నివాసముంటున్నాడు. ఈయనకు భార్యతోపాటు ఇద్దరు సంతా నం ఉన్నారు. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం సొంగల బ్యాగును బైకుపై పెట్టుకుని చుట్టుపక్కల గ్రామాలకు బయలుదేరాడు. ఇదే క్రమంలో మధ్యాహ్నం తన కూతురు హైదరాబాద్ నుంచి జోగుళాంబ రైల్వే స్టేషన్‌కు వస్తోందని సమాచారం అందడంతో అక్కడికి వెళ్లాడు. అనంతరం ఆమెను ఆటోలో ఎక్కించి అతను మాత్రం తన వాహనంపై తిరు గు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలోని చంద్రశేఖర్‌నగర్ దాటిన తర్వాత ఎదురుగా వస్తున్న గద్వాల్ డిపో బస్సును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది గమనించిన స్థానికులు వెంట నే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ మధుసూదన్‌గౌడ్ పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమితం మృతదేహాన్ని అలంపూర్ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.
రోడ్డు దాటుతుండగా...
మహబూబ్‌నగర్ క్రైం : రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొనడంతో ఓ యువ కుడు దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ పట్టణంలోని మోనప్పగుట్టకు చెందిన ఆగమయ్య (36) స్థానికంగా రోల్డ్‌గోల్డ్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య సుజాతతోపాటు ముగ్గురు సంతానం ఉన్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు అతను ఇంటి నుంచి క్లాక్‌టవర్ వైపు కాలినడకన బయలుదేరాడు. పాతబస్టాండు సమీపంలో రోడ్డు దాటుతుండగా నవాబుపేట వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది గమనించిన స్థాని కులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని టూటౌన్ ఎస్‌ఐ రమేష్ పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం జిల్లా ప్రధాన ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
బైక్‌పై నుంచి పడి...
షాద్‌నగర్ రూరల్ : అదుపుతప్పి బైక్‌పై నుంచి కింద పడి ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తుల ప్రకారం... ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్టకు చెందిన అంబటి వెంకటయ్య (55) వృత్తిరీత్యా వ్యవసాయదారు. ఈయనకు భార్య అంజమ్మతోపాటు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఆదివారం ఉదయం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కవ్వగూడలోని తమ బంధువుల వివాహానికి బైక్‌పై వెళ్లాడు. మధ్యాహ్నం తిరుగు ప్రయాణంలో రామాంజపురం శివారులోని మలుపు వద్దకు చేరుకోగానే అదుపుతప్పి వాహనంపై నుంచి కిందపడటంతో దుర్మరణం పాలయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరుమన్నారు.
Advertisement
Advertisement