నిన్నమొన్నటి దాకా వానలు దంచి కొట్టాయి. విపరీతంగా కురిసిన వానలతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. కాస్త తెరిపిన పడ్డారో లేదో తెలంగాణాలో, హైదరబాద్‌లో మళ్లీ వానలు ఆగమేఘాలమీద దూసుకొచ్చాయి. అసలు వానలు ఎన్నిరకాలు, వాటికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? నమ్మినా నమ్మకపోయినా, వివిధ రకాల వర్షాలు ఉన్నాయి. అవును. అంతేకాదు అన్ని వర్షాలు ఒకేలా ఉండవు!
గాంధారి వాన –కంటికి ఎదురుగా ఉన్నది
కనిపించనంత జోరుగా కురిసే వాన.
మాపుసారి వాన –సాయంత్రం కురిసే వాన
మీసర వాన – మృగశిర కార్తెలో కురిసే వాన
దుబ్బురు వాన – తుప్పర / తుంపర వాన
సానిపి వాన – అలుకు (కళ్లాపి చల్లినంత కురిసే వాన)
సూరునీల్ల వాన – ఇంటి చూరు నుంచి ధార పడేంత వాన
బట్టదడుపు వాన – ఒంటి మీదున్న బట్టలు తడిసేంత వాన
తప్పె వాన – ఒక చిన్న మేఘం నుంచి పడే వాన
సాలు వాన – ఒక నాగలి సాలుకు సరిపడా వాన
ఇలువాలు వాన – రెండుసాల్లకు – విత్తనాలకు సరిపడా వాన
మడికట్టు వాన – బురద పొలం దున్నేటంత వాన
ముంతపోత వాన – ముంతతోటి పోసినంత వాన
కుండపోత వాన – కుండతో కుమ్మరించినంత వాన
ముసురు వాన – విడువకుండా కురిసే వాన
దరోదరి వాన – ఎడతెగకుండా కురిసే వాన
బొయ్య బొయ్య గొట్టే వాన – హోరుగాలితో కూడిన వాన
కోపులు నిండే వాన
రోడ్డు పక్కన గుంతలు నిండేంత వన
రాళ్ల వాన – వడగండ్ల వాన
కప్పదాటు వాన –
అక్కడక్కడా కొంచెం కురిసే వాన
తప్పడతప్పడ వాన –
టపటపా కొంచెంసేపు కురిసే వాన
దొంగ వాన – రాత్రంతా కురిసి తెల్లారి కనిపించని వాన
ఏకార వాన – ఏకధారగా కురిసే వాన
మొదటి వాన – విత్తనాలకు బలమిచ్చే వాన
సాలేటి వాన – భూమి తడిసేంత భారీ వాన
సాలుపెట్టు వాన – దున్నేందుకు సరిపోయేంత వాన
Comments
Please login to add a commentAdd a comment