
జగిత్యాల క్రైం: జగిత్యా ల రూరల్ మండలంలని బాలపల్లిలో ఆదివారం మధ్యాహ్నం ఓ యువతిని బెదిరించి, కొట్టి తీసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. బాలపల్లికి చెందిన జక్కుల మధు, రాయికల్ మండలంలోని ఇటిక్యాలకు చెందిన జవ్వాజి అక్షిత గత జూలై 3న ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో ఆమెపై కక్ష పెంచుకున్న తండ్రి భూమయ్య, మేనమామ సుంకశీల సత్తయ్యతోపాటు మరికొందరు రెండు కార్లలో మారణాయుధాలతో ఆదివారం బాలపల్లికి వచ్చారు.
అక్షితపై దాడిచేసి, బలవంతంగా కారులో ఎక్కించారు. అడ్డుకోబోయిన ఆమె అత్త్త, ఆడపడుచులపై దాడి చేయడంతో గాయపడ్డారు. అక్కడికి చేరుకున్న స్థానికులపైనా ఆయుధాలతో వెంట పడటంతో వారు పరుగులు పెట్టారు. అనంతరం యువతిని తీసుకొని, వెళ్లిపోయారు. స్థానికులు జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్‌కు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. అక్షిత భర్త మధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల కోసం రెండు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి, గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment